puvvada ajay
-
తుమ్మల చెప్పినట్టు చేస్తే రేవంత్‌రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేయాలి : పువ్వాడ
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తుమ్మల చెప్పినట్లు చేస్తే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో వేసిన నామినేషన్ రద్దు చేయాలన్నారు. ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని, తుమ్మలకు అధర్మ పోరాటం అలవాటని పువ్వాడ విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పువ్వాడ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నా నామినేషన్‌ను తిరస్కరించాలని ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల ఫిర్యాదుకు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పగానే నా నామినేషన్ తిరస్కరిస్తారా. తుమ్మల చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు. అఫిడవిట్లో తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని అధికారులు సమాధానం ఇచ్చారు. డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు.. ఇప్పుడు పెళ్లయింది. అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్‌లో అతని నామినేషన్లో ఏడు కాలాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా చెయ్యాలంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాలి. రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే కోర్టుకు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి. మీకు సలహా ఇచ్చింది ఎవరో. మీ సమయం, నా సమయం వృథా చేశారు. అధర్మం పోరాటం కాదు ధర్మ పోరాటం చెయ్యాలి. అబద్దపు ప్రచారం చెయ్యకండి, నలభై ఏళ్ల పాటు మీరు చేసింది ఇదే. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇది మా కర్మ అనుకుంటున్నాం’ అని అజయ్ అన్నారు. ఇదీచదవండి.. పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా: తుమ్మల -
పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా : తుమ్మల
సాక్షి,ఖమ్మం : బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అఫిడవిట్‌కు సంబంధించి ఫార్మాట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ఖమ్మంలో తుమ్మల ఈ విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పువ్వాడ అఫిడవిట్ ఫార్మాట్ మార్పుపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోని రిటర్నింగ్ అధికారి తీరుపై కోర్టుకు వెళతానని తెలిపారు. పువ్వాడ తన అఫిడవిట్లో డిపెండెంట్ కాలమ్ మార్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకపోతే నిల్ అని రాయాల్సి ఉంది. కానీ అలా రాయలేదు. పువ్వాడ నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులున్నాయి. ఈసీ ఫార్మాట్లో అఫిడవిట్ లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగా. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదు. ఆ అధికారిపై పై న్యాయ పోరాటం చేస్తా’అని తుమ్మల తెలిపారు. రాష్ట్రమంతా ఓ పక్క...ఖమ్మం ఓ పక్క మీడియా సమావేశం అనంతరం తుమ్మల ఖమ్మం నియోజకవర్గ కాంగగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా రాజకీయ జీవితంలో ఇంత రసవత్తర పోటీ, ఇంత కసి, పట్టుదల ఉన్నఎన్నికలు చూడలేదు. రాష్ట్రమంత ఓ పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క. పొరుగు రాష్ట్రం భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు. పందాలు మంచి సంస్కృతి కాదు. కానీ వందల కోట్ల పందాలు కాస్తున్నారంటేనే బీఆర్ఎస్ పనైపోయిందని అర్థమవుతోంది. ఖమ్మం ,పాలేరుపై వందల కోట్లు కుమ్మరించి నాయకులను అధికార పార్టీ కొనుగోలు చేస్తోంది. నన్ను, పొంగులేటిని ఓడించాలని అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారు. మీ అరాచకాలన్నింటికీ చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తాం. ఖమ్మం పౌరుషాల గడ్డ...40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ పరువు ప్రతిష్ట కోసం పనిచేశా. మత విద్వేషాలు లేకుండా భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలి. నాకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్య వాదాలు. బీఆర్ఎస్ అభ్యర్థులు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వర్కింగ్ ప్రెసిడెంట్‌కి తెలుసు’ అని తుమ్మల అన్నారు. ఇదీ చదవండి..మెదక్‌లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్ మైనంపల్లి -
తుమ్మల వర్సెస్ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు. సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని తుమ్మల కోరారు. తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!
పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు. అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్ సులువుగా నడిచేలా.. చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్‌ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు. ♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. -
ముస్లింలకు అండగా నిలబడతా..
ఖమ్మం మయూరిసెంటర్: కొందరికి పదవులు రాలేదనో, రావనో లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. ఖమ్మంలో బీజేపీని పుట్టించాలని చూస్తున్నా రని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని షాదీఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ‘మత తత్వ పార్టీలకు ఖమ్మం వేదిక కాదని గుర్తుపెట్టుకోండి.. తస్మాత్ జాగ్రత్త’ అని సూచించారు. ప్రభుత్వంలో ఇద్దరు ముస్లింలు మంత్రులుగా ఉంటే అందులో ఒకరు మహమూద్ అలీ, రెండో వ్యక్తి అజయ్‌ఖాన్ అని పేర్కొన్నారు. తనకు ఆత్మీయు లైన ముస్లిం మైనార్టీలతో మొదటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పువ్వాడ తెలిపారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పటి మాదిరిగానే భవిష్యత్‌లోనూ ముస్లింలకు అండగా నిలబడతానని వెల్లడించారు. మతతత్వ శక్తులపట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉంటూ బీఆర్ఎస్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఎక్కువ శాతం మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ను నమ్ముతున్నారన్నారు. సెక్యులరిజాన్ని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని నమ్మిన ముస్లిం మైనారిటీలు ఈ పార్టీని వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ఖమ్మంలో ఇంత అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అందడానికి తనకు వ్యక్తిగతంగా సాధ్యం కాలేదని, ప్రభుత్వం వల్లే ఇంత చేయగలిగామని తెలిపారు. వేలాది మంది కార్యకర్తలు ఉండగా, అందరికీ పదవులు ఇవ్వలేమని.. పది, పదిహేను మందికే ఇవ్వగలమన్నారు. చాలామందికి పదవులు రాకపోయినా బాధ్యతతో వ్యవహరిస్తుండగా... కొందరికి పదవులు వచ్చినా కడుపునొప్పి ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. -
ఖమ్మంలో వైద్య కళాశాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలి పారు. ఖమ్మం వైద్య కళాశాల ఏర్పాటు ఉత్తర్వు ప్రతిని గురు వారం సీఎం ప్రగతిభవన్‌లో పువ్వాడకు అందజేశారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించనున్నారని, ఈ మేరకు వంద సీట్లను కేటాయించిందన్నారు. తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్ కళా శాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదా యం, ఆర్అండ్బీ శాఖల స్థలాన్ని వైద్య కళాశాలకు అప్పగించనున్నట్టు మంత్రి అజయ్ కుమార్ చెప్పారు. -
అనుమతుల ప్రకారమే పోలవరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం. భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్‌కు హితవు పలికారు. హైదరాబాద్‌ను కలిపేస్తారా? విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్‌ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు. పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి: బొత్స
అమరావతి: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. 'ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్ ఏమన్నారంటే? టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని గుర్తు చేశారు. ఇదీ చదవండి: ‘కేసీఆర్‌కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా?’ -
రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: మమత వైద్య కళాశాలలో పీజీ మెడికల్ సీట్ల దందా జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలో 20 ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. తన కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్లు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే.. కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేని పక్షంలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతాయని, అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. చదవండి👉🏾 జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు నా ఆరోపణల్లో తప్పుంటే తప్పుకుంటా: రేవంత్ సాక్షి, హైదరాబాద్: మంత్రులకు చెందిన మెడికల్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల విషయంలో తాను చేసే ఆరోపణల్లో వీసమెత్తు తప్పున్నా ఏ శిక్షకైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తన ఆరోపణలపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రేవంత్ సవాల్ విసిరారు. ‘మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్‌తో ఒకే రోజు విచారణ జరిపించాలి. అవకతవకలు జరగలేదని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ ఒక్క పరీక్షకు నిజాయితీగా నిలబడండి. అన్నీ దొంగ పనులు చేసి వేషాలు వేస్తున్నారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో ప్రగతిభవన్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని రాజీవ్ చౌరస్తా వద్దే అదుపులోకి తీసుకుని గోషామహల్‌కు తరలించారు. చదవండి👉 నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్ -
పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులతోపాటు ఖమ్మం సీపీ, ఖమ్మం మూడవ పట్టణ ఎస్‌హెచ్‌వో, సీబీఐ డైరెక్టర్, టీఆర్ఎస్ నేత ప్రసన్న క్రిష్ణ, సీఐ సర్వయ్యలకూ నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. సాయిగణేశ్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది కె. క్రిష్ణయ్య (గతంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నేత) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో విచారించింది. సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు తెలుస్తాయి: పిటిషనర్ పోలీసుల వేధింపులతోనే సాయిగణేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభినవ్ క్రిష్ణ నివేదించారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు సాయిపై 10 కేసులు బనాయించారని, రౌడీషీట్ తెరిచారన్నారు. తన చావుకు మంత్రి కారణమంటూ గణేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చినా పువ్వాడపై పోలీసులు కేసు నమోదు చేయలేదని గుర్తుచేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయట్లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత మృతుడి తల్లికి రూ.50 లక్షలు, కారు ఇస్తామని ప్రలోభపెడుతున్నారన్నారు. ఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. -
సాయిగణేష్ సూసైడ్ కేస్: మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్వవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గడువిచ్చింది ఉన్నత న్యాయస్థానం. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆపై విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే.. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. చదవండి: అలాంటి పోలీసులను వదిలిపెట్టం.. బండి సంజయ్ వార్నింగ్ -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
బస్సులకిక బయటి ఇంధనమే!
ఖమ్మం మయూరి సెంటర్: ఆర్టీసీకి ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా చేసే క్రమంలో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో బయటి బంకుల్లోనే డీజిల్ పోయించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీన్ని పేరు చెప్పడానికి అంగీకరించని ఓ ఆర్టీసీ అధికారి ధ్రువీకరించారు. ట్యాక్స్‌లు ఇతరత్రా తేడాలతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర లీటర్‌గా రూ.97గా ఉంటోంది. కానీ, బయటి బంకుల్లో రూ.94.71గా ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంక్‌ల యజమానుల నుంచి కొటేషన్లు స్వీకరించగా, శ్రీశ్రీ హెచ్‌పీ బంక్ యజమాన్యం లీటర్ డీజిల్‌ను రూ.94.53కు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం నుంచి బస్సులన్నింటినీ బంక్‌కు పంపించగా రాత్రి 11 గంటల వరకు బారులు తీరి కనిపించాయి. కాగా, విధులు ముగించుకుని 9.30 గంటల తర్వాత వచ్చిన డ్రైవర్లు బస్సులతో బంక్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మళ్లీ ఉదయమే డ్యూటీకి వెళ్లాల్సిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని డ్రైవర్లు వాపోయారు. ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల బస్సుల్లో బుధవారం నుంచి బయటి బంకుల్లో డీజిల్ పోయించనున్నట్లు తెలిసింది. -
‘సీతారామ’ ప్రాజెక్ట్ పరిశీలనకు సీఎం కేసీఆర్?
సాక్షి, కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్–1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది. ఇక తాజాగా దుమ్ముగూడెం వద్ద రూ.3,400 కోట్లతో మరో ఆనకట్ట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటి కొరత లేకుండా 30 టీఎంసీలా నీరు నిల్వ ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. గోదావరిలో ప్రతిఏటా వస్తున్న వరద నీరంతా వృథాగా సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు గత వేసవిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో రెండురోజుల పాటు ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం హైడల్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో ఆనకట్ట నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు. రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్.. ఏజెన్సీ ఏరియాలో సాగునీటి కోసం రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 21న నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మణుగూరు సబ్‌డివిజన్‌లో పర్యటించారు. 30వ తేదీన మంత్రి అజయ్‌కుమార్ పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యటించిన సీఎం.. సీతారామ ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అలాగే జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడంతో పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సీఎం పర్యటన ఖాయమైనట్లే పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొదట పినపాక నియోజకవర్గంలో ఉండేలా కృషి చేశాను. సీఎం అంగీకారంతో ఇది సాధ్యమవుతోంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్ అంగీకరించారు. సీఎం పర్యటన తరువాత ఈ సమస్య కొలిక్కి వస్తుంది. – రేగా కాంతారావు, ప్రభుత్వ విప్ -
సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లపై మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడి కార్మికుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శోభ డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే పీఎస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరించారు. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. బస్ భవన్ వద్ద కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ -
ఆర్టీసీ సమ్మెపై రేపు ఉన్నతస్థాయి సమీక్ష
-
కాళేశ్వర నిర్మాణం.. చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఖమ్మం : కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం ఓ చరిత్రాత్మక ఘట్టమని టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయ్యటం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనం అన్నారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా.. చిత్తశుద్ధితో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే అని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోకండి : పువ్వాడ అజయ్ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. కాళేశ్వరం మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని.. ప్రాజెక్ట్‌లను అడ్డుకునే పద్దతిని విడనాడలని తెలిపారు. -
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
-
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీ-పాస్ చర్చ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు స్పీకర్ మైక్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. పార్టీ మారిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. పువ్వాడ అజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ శాసనసభ సభ్యుడిగా అజయ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలపగా, మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ స్పీకర్ వ్యాఖ్యలను సమర్థించారు. స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. 2004-14 వరకూ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్లే మాట్లాడాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ జరిగితే ప్రశ్నిస్తామని అన్నారు. అధికారం ఉందికదా అని ఏమైనా చేస్తామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభ్యులను స్పీకర్ కంట్రోల్ చేయాలని అన్నారు. మరోవైపు పువ్వాడ అజయ్ మాట్లాడుతూ సభ్యుడిగా తన హక్కులను కాలరాయడం సరికాదన్నారు. తాను మాట్లాడే అవకాశం అడిగితే స్పీకర్ అనుమతి ఇచ్చారని, ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. -
'పువ్వాడ అజయ్‌వి తప్పుడు ఆరోపణలు'
హైదరాబాద్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మరోనేత ఫాయాక్ హుస్సేన్‌లు స్వార్ధ అవసరాల కోసం టీఆర్ఎస్లో చేరుతున్నారని కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యత, గుర్తింపు లేవంటూ అజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ తక్కువేమీ చేయలేదని తెలిపారు. తీవ్రకరువుతో అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ తన బాధ్యతను విస్మరించి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ విఫలమైన తీరుకు నిరసనగా ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. -
టీఆర్ఎస్లోకి పువ్వాడ అజయ్
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటన కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానన్నారు. అంపశయ్యపై ఉన్న పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పార్టీలోని పలువురు నాయకులు అడ్డుకున్నారని అజయ్ ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకాల్లోనూ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. పార్టీ కోసం కాకుండా రాజకీయాలు చేసేవారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి పనులను అడ్డుకోవాలని, వాటికి వ్యతిరేకంగా విమర్శలు చేయాలని పార్టీ నాయకులు సూచించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై సీఎం చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించి తప్పు చేశామన్నారు. ఇలా ప్రతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం, నిధులు రాకుండా హడ్కోకు ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం తన అనుచరులతో హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్ నాయకులు తన వెంట రావాలని కోరారు. -
కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పీకర్ మధుసూదనాచారి టీ విరామం కోసం పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం ఈ వాగ్వాదం జరిగింది. ముంపు మండలాల అంశంపై చర్చ సందర్భంగా హరీశ్ రావు చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఇంకా పట్టుబట్టడం సరికాదని అన్నారు. అలా అయితే మీకే ఇబ్బంది అంటూ పువ్వాడ అజయ్‌తో హరీశ్ రావు అనగా, కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే అని ...అజయ్ గుర్తు చేశారు.