హైదరాబాద్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మరోనేత ఫాయాక్ హుస్సేన్లు స్వార్ధ అవసరాల కోసం టీఆర్ఎస్లో చేరుతున్నారని కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యత, గుర్తింపు లేవంటూ అజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ తక్కువేమీ చేయలేదని తెలిపారు.
తీవ్రకరువుతో అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ తన బాధ్యతను విస్మరించి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ విఫలమైన తీరుకు నిరసనగా ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
'పువ్వాడ అజయ్వి తప్పుడు ఆరోపణలు'
Published Mon, Apr 25 2016 2:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement