సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
అంతేకాదు.. ఈ వ్వవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గడువిచ్చింది ఉన్నత న్యాయస్థానం. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆపై విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే.. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
చదవండి: అలాంటి పోలీసులను వదిలిపెట్టం.. బండి సంజయ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment