సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలి పారు. ఖమ్మం వైద్య కళాశాల ఏర్పాటు ఉత్తర్వు ప్రతిని గురు వారం సీఎం ప్రగతిభవన్లో పువ్వాడకు అందజేశారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు.
మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించనున్నారని, ఈ మేరకు వంద సీట్లను కేటాయించిందన్నారు. తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్ కళా శాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్ భవనాల సముదా యం, ఆర్‌అండ్‌బీ శాఖల స్థలాన్ని వైద్య కళాశాలకు అప్పగించనున్నట్టు మంత్రి అజయ్ కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment