గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం | 25 AC Electric TSRTC Buses Started In Gachibowli, Hyderabad | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం

Published Wed, Sep 20 2023 5:01 PM | Last Updated on Wed, Sep 20 2023 6:53 PM

25 AC Electric TSRTC Buses Started In Gachibowli, Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 

'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. 

కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. 

ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement