‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’ | Polavaram project may be completed by 2025, says tdp mp jc diwakar reddy | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’

Published Thu, Apr 6 2017 7:35 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’ - Sakshi

‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని, దానికి అదనంగా నాలుగైదేళ్లు పడుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ దివాకర్‌ రెడ్డి గురువారమిక్కడ మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేయడం తప్పుకాదన్నారు.

కాలానుగుణంగా పరిస్థితులు మారుతుంటాయని, ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని, పార్టీలు మారడం, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం తప్పుకాదని చెప్పుకొచ్చారు. ఒకపార్టీలో ఇమడలేక ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో తప్పు లేదని, ఈ విషయంలో పార్టీ ఫిరాయించిన వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని  జేసీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement