
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీతో భేటీ కానున్నారు.
వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి ఈ సందర్భంగా వైఎస్ జగన్ వివరించనున్నారు.