
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలయ్యాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖల చేశారు.
గత విచారణలో స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం హైకోర్టుకు లేదన్న ఏజీ.. గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎర్రబెల్లి దాఖలు చేసిన పిటీషన్ పై తీర్పు ఇవ్వడానికి ఇదే కోర్టు నిరాకరించిందని ఏజీ గుర్తు చేశారు.
చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు స్పీకర్ పరిధిలోకి వస్తాయన్న ఏజీ.. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. నేడు మరోసారి పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment