
రాష్ట్రపతి ప్రణబ్‌కి వైఎస్ జగన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ను కలిసింది.
వైఎస్ జగన్ ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతి దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు ఉన్నారు. కాగా వైఎస్‌ఆర్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురుకి ఏపీ సీఎం చంద్రబాబు...మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే.