
సాక్షి, అమరావతి/సీతమ్మధార (విశాఖ ఉత్తర)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం అగ్రవర్ణాల పేదలైన లక్షలాది మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్, ఏపీ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజశ్వనిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.