YSR EBC Nestham
-
ఏడాదికి రూ.15,000..అక్క చెల్లెమ్మలకు వరం
-
మూడు పార్టీలు.. మళ్లీ అవే మాయమాటలు
మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు గుప్పిస్తున్నారు. వారి మోసాలు, దగాను గమనించాలని కోరుతున్నా.చంద్రబాబు పేరు చెబితే వంచన, దత్తపుత్రుడి పేరు చెబితే ఐదేళ్లకోసారి కారును మార్చినట్టుగా భార్యను మార్చే ఓ మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు! ఒకరికి విశ్వసనీయత లేదు.. ఇంకొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి. పొరపాటు చేయవద్దని, అందరూ బాగా ఆలోచన చేయాలని కోరుతున్నా. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పేదరికానికి కులం ఉండదని, పేదవాడు ఎక్కడున్నా వారికి తోడుగా నిలిచే మనసు ప్రభుత్వ పెద్దలకు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలను ఆదుకునే గుణం, వారికి తోడుగా ఉండాలనే ఆరాటం పాలకులకు ఉండాలన్నారు. ‘నిజానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు మన మేనిఫెస్టోలో లేవు. అయినప్పటికీ అగ్రవర్ణ పేదలకు సైతం అండగా ఉండాలని, వారు పేదరికంతో ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డదే’ అని చెప్పారు. అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న 4.19 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.629 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మూడేళ్లలో మూడు దఫాల్లో 4,95,269 మందికి రూ.1,877 కోట్ల మేర లబ్ధిని చేకూర్చారు. బనగానపల్లెలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని సభా ప్రాంగణం నుంచే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. 42.74 లక్షల మందికి మంచి చేశాం ‘చేయూత’ ద్వారా 33.15 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి చేస్తూ 58 నెలలుగా అడుగులు వేశాం. కాపు నేస్తం ద్వారా 4.64 లక్షల మందికి మేలు చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ఇలా మొత్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసున్న 42.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో పాటు చివరకు ఇళ్ల పట్టాలను కూడా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇళ్లు సైతం కట్టిస్తున్నాం.పిల్లలు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో అమలు చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల డబ్బులు కూడా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనే వేస్తున్నాం. అక్క చెల్లెమ్మలు బాగుంటే వారి కుటుంబాలూ బాగుంటాయి, పిల్లల భవిష్యత్తూ బాగుంటుందని ధృఢంగా విశ్వసించాం. ఎక్కడా కులమతాలు, ప్రాంతాలు, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడలేదు. అర్హత ఉంటే చాలు వారికి తోడు ఉంటూ పారదర్శకంగా మేలు చేస్తూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇది. అవ్వాతాతలు, రైతన్నలతో పాటు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికీ గుమ్మం వద్దకే పథకాలను, సంక్షేమాన్ని చేరవేస్తున్నాం. మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం.. గత 58 నెలలుగా మన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధికి మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం. మీరంతా ఒక్కసారి బ్యాంకులకు వెళ్లి గత పదేళ్లుగా మీ ఖాతాల స్టేట్మెంట్ ఇవ్వమని మేనేజర్లను కోరండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదేళ్ల డేటాను పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయైనా మీ ఖాతాకు పంపించారా? అని అడుగుతున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల రూపాయలు మీ చేతికి వచ్చాయో మీకే కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరుగుతోంది. నాడు ఏ పథకం ఎప్పుడిస్తారో? అసలు ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఇప్పుడు మన గ్రామంలోనే ఓ సచివాలయ వ్యవస్థ వచ్చింది. అందులో మన ఊరి పిల్లలే వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. అది ఆదివారమైనా, సెలవు రోజైనా వలంటీర్ మీ ఇంటి వద్దకే వచ్చి మీ మనవడిగా, మనవరాలిగా తోడుగా ఉంటూ లంచాలు, వివక్ష లేకుండా సేవలు అందిస్తున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మ ఇవన్నీ గమనించాలని కోరుతున్నా. మీరే చూడండంటూ గడప గడపకూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2.70 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను మీ బిడ్డ అమలు చేశాడు. మీ ఇంటికి వచ్చి మేనిఫెస్టో చూపించి గత ఎన్నికలప్పుడు జగనన్న ఏం చెప్పాడు? ఈ 58 నెలల్లో ఎన్ని చేశాడు? మీరే టిక్ పెట్టండి అని ధైర్యంగా గడప తొక్కే పరిస్థితి ఏ పార్టీకైనా ఉందా? అది ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు.. ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఆ తర్వాత చెత్తబుట్టలో పడేసి మోసం చేయడం అనే సంప్రదాయాన్ని మార్చి విశ్వసనీయత అనే పదానికి అర్థం తేవడం కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే వంచన గుర్తుకొస్తుంది. పొదుపు మహిళలకు ఆయన చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి పనిగానీ పథకంగానీ గుర్తురాదు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక మోసగాడు, ఐదేళ్లకోసారి కారును మార్చినట్టు భార్యను మార్చే మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకు కాదు.. పేదవాడి భవిష్యత్‌పై యుద్ధానికి వస్తున్నాయి. మోసగాళ్లకు బుద్ధి చెప్పండి.. మీ బిడ్డకు, చంద్రబాబు ప్రభుత్వానికి తేడాను గమనించాలని అందరినీ కోరుతున్నా. 99 శాతం హామీలను నెరవేర్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్న మీబిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున దగాకోర్లు, పచ్చి మోసగాళ్లు, మాయ మాంత్రికులున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. మీ బిడ్డ మిమ్మల్ని కోరేది ఒక్కటే! మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అనేది మాత్రమే ఆలోచించండి. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీరే సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా మీ బిడ్డకు అండగా నిలవండి. మోసగాళ్లకు ఓటు అనే దివ్యాస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. 2014 హామీలను బాబు నెరవేర్చారా? ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి 2014లో కూడా ఇప్పటి మాదిరిగానే మోసపూరిత హామీలిచ్చారు. ముగ్గురూ ఒక్కటై వేదికపై కూర్చున్నారు. కూటమిగా ఏర్పడ్డారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోపై సంతకం పెట్టి మరీ ప్రతీ ఇంటికి పంపించారు. రైతులకు రుణమాఫీపై తొలి సంతకం చేస్తామన్నారు. రూ.85,612 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారు. పొదుపు సంఘాల మహిళలకు రూ.14,205 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని నమ్మించి విజయవాడ నడిబొడ్డున కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపారు. ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నారు. మరి ఒక్కరికైనా ఖాతాల్లో డిపాజిట్ చేశారా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చారా? కరపత్రాలు చూపించి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్‌సిటీ నిర్మిస్తానన్నారు. 2014 మేనిఫెస్టో పేజీ నెంబర్ 16, 17లో అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల్లో మచ్చుకు 9 మాత్రమే మీతో పంచుకుంటున్నా. వాటిల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా? ఇంత దారుణంగా మోసం చేస్తున్న వ్యక్తులు మరోసారి రంగు రంగుల హామీలతో వంచనకు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఒక విన్నపం.. ‘మీ అందరికీ ఒక విన్నపం! ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. అందువల్ల బటన్ నొక్కటం పూర్తి చేస్తున్నాం. డబ్బులు వచ్చే కార్యక్రమం కాస్త అటూ ఇటుగా జరుగుతుంది. ఎవరూ ఆందోళన పడొద్దు. త్వరలోనే డబ్బులు పడతాయి. ఈ రెండు వారాల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దు. ఏబీఎన్, టీవీ–5 చూడొద్దు. చెడిపోయిన మీడియా వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. మంచి జరిగితే దాన్ని కూడా వక్రీకరించే చెడిపోయిన, కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏటా రూ.15 వేలు చొప్పున మూడు దఫాలుగా.. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేసేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ ఏటా రూ.15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసి తోడుగా ఉంటున్నాం. ఈ ఏడాది కొత్తగా ఆర్థిక సాయం పొందుతున్నవారు 65,618 మంది కాగా రెండు దఫాలు తీసుకున్న వారు 1,07,824 మంది ఉన్నారు. మూడో విడతలో 3,21,827 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి బటన్ నొక్కడం ఈ విడతతో ఆపేస్తున్నాం. మళ్లీ మీకు మరింత మంచి చేసేలా దేవుడు, మీరు ఆశీర్వదించాలని కోరుతున్నా. అదనపు ఆదాయం సమకూరేలా.. చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం. కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా నిలిచి ఆర్థిక సహకారం అందిస్తున్నాం. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాల్లోని అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలుస్తున్నామని సంతోషంగా చెబుతున్నా. ఈ డబ్బులతో వారు వివిధ వ్యాపారాలు నిర్వహించుకోవడం ద్వారా ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.10 వేలు అదనంగా ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశంతో అడుగులు వేగంగా ముందుకు వేశాం. 2014లో చంద్రబాబు ‘నవ’ మోసాలివీ.. ► మద్యం బెల్ట్‌షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ ► పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ ► పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీలకు రూ.10 వేలు ఆర్థిక సాయం ► పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు ► ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ. ఐదేళ్లలో మొత్తం రూ.6 వేలు సబ్సిడీ ► బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ ► కుటీరలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు. -
సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఫొటోలు
-
ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్
-
ఈ స్కీము 2019 మేనిఫెస్టో లో పెట్టకపోయినా...నా అక్క చెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన
-
ముగిసిన సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు పర్యటన
Updates.. ముగిసిన సీఎం జగన్ నంద్యాల పర్యటన బటన్ నొక్కి వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్ మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం జగన్ పవన్, బాబులపై పంచులు.. సీఎం జగన్ ఫుల్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి ముగిసిన సీఎం జగన్ ప్రసంగం ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు ఓటు బటన్ నొక్కేప్పుడు పొరపాటు జరిగితే.. పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. రామిరెడ్డి గెలిస్తే.. జగనన్న ప్రభుత్వం వస్తుంది ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నవిన్నపం చేసిన సీఎం జగన్ ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా మాయల మాంత్రికులపై ‘ఓటు’ అనే దివ్యాస్త్రం ప్రయోగించండి 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి చంద్రబాబు 2014లో ఎగనామం పెట్టాడు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? చంద్రబాబు, దత్తపుత్రుడ్ని పేర్లు చెబితే.. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు సీఎం జగన్ ప్రసంగం.. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం సీఎం జగన్ ప్రసంగం.. పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమం పాల్గొని ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం విడుదల వైఎస్సార్ ఈబీసీ నేస్తంపై స్పెషల్ ఈవీ ప్రదర్శన మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేయనున్న సీఎం జగన్ వైఎస్సార్ ఈబీసీ పథకం.. కార్యక్రమం ప్రారంభం బనగానపల్లె వేదిక వద్దకు సీఎం జగన్ సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, స్థానిక నేతలు, అధికారులు బనగానపల్లె చేరుకున్న సీఎం జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధుల జమ కార్యక్రమం బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకు ముందు.. బహిరంగ సభలో లబ్ధిదారుల్ని ఉద్దేశించి ప్రసంగం లా వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నా లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించాం ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఎపి లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నా కర్నూల్లో.. లా యూనివర్సిటీ పనులు ప్రారంభం జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.. మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ కర్నూల్ చేరుకున్న సీఎం జగన్ ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు శివారుల్లొని జగన్నాథగట్టుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో పయనం మరికాసేపట్లో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన.. భూమి పూజ ►కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పర్యటన సాగేది ఇలా.. ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రసంగం ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ఈ రెండు జిల్లాల పర్యటనలోనే.. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ ఆయన కాసేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. -
గతంలో మా వైశ్య కులాలకు ఎలాంటి పథకాలు లేవు. మమ్మల్ని గుర్తించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంతో ఆర్థిక సాయం..!
-
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
-
అక్కచెల్లెమ్మలకు సెల్యూట్
మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం గత 46 నెలల కాలంలో అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు మొదలు 60–100 ఏళ్ల వయస్సులో ఉన్న అవ్వల వరకు అందరికీ మంచి చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్య పోషణతో మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్ వరకు అన్ని విధాలా మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ముందుకెళ్తున్నాం. రాజకీయంగా నా అక్కచెల్లెమ్మలు పైకి రావాలని, సామాజికంగా, విద్యాపరంగా కూడా సాధికారతను సాధించాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సన్మానాలు అందుకునే వాళ్లు మాత్రమే గొప్ప వాళ్లు కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. వారి జీవితాలను మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వారందరి బాగు కోసం నిత్యం చిరునవ్వుతో, గొప్ప బాధ్యతతో శ్రమించే ప్రతి అక్క, చెల్లెమ్మ కూడా గొప్ప వాళ్లే. అందుకే వారందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆయా కుటుంబాలు బాగుంటాయని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 4,39,068 మంది అక్క చెల్లెమ్మలకు రూ.658.60 కోట్లు లబ్ధి చేకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత బరువు బాధ్యతలు భుజాన వేసుకున్న 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే ప్రతి రూపాయి తమ కుటుంబం బాగోగుల కోసమే ఖర్చు పెడతారని దృఢంగా నమ్ముతున్నామన్నారు. అందుకే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలా తోడుగా నిలిచామని తెలిపారు. ‘ఇప్పటికే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. అంతటితో ఆగిపోకుండా కాపు అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభించాం. వీరందరితో పాటు ఓసీ వర్గాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు మంచి చేయడం కోసం ఈబీసీ నేస్తం పథకానికీ శ్రీకారం చుట్టాం’ అని చెప్పారు. ఈ రెండేళ్లలోనే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు రూ.1,258 కోట్లు వాళ్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రెడ్లు, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, వెలమలు, బ్రాహ్మణులు తదితర ఓసీ కులాల్లో ఉన్నపేద అక్కచెల్లెమ్మలకూ ఇలా మేలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టక పోయినా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఏం చెప్పారంటే.. అన్ని విధాలా అండగా నిలిచాం ► ఈ 46 నెలల మీ బిడ్డ ప్రభుత్వంలో అమ్మ ఒడి మొదలు వైఎస్సార్ ఆసరా.. వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, షాదీతోఫా, కళ్యాణమస్తు.. విదేశీ విద్యా దీవెన వంటి అనేక పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. ► అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు రూ.2 లక్షల 7 వేల కోట్ల లబ్ధి చేకూర్చాం. ఇందులో రూ.లక్షా 42 వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయని చెప్పడానికి గర్వపడుతున్నాను. ► వైఎస్సార్ చేయూత ద్వారా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41.77 లక్షల మందికి రూ.40,094 కోట్లు, అమ్మ ఒడి కింద 44 లక్షల 48 వేల మందికి రూ.19,674 కోట్లు జమ చేశాం. ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారా మాత్రమే 78 లక్షల 75 వేల మందికి ఇప్పటికే రూ.19,178 కోట్లు వాళ్ల ఖాతాల్లో వేశాం. ► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుంది. మొత్తంగా 30 లక్షల మందికి మంచి చేస్తూ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి నా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. పొదుపు సంఘాల్లో ఉన్న 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చాం. మార్కాపురానికి వరాల జల్లు మీ బిడ్డ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. రెండో టన్నెల్ ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో పూర్తి కాగానే మళ్లీ వచ్చి ప్రారంభిస్తాను. గతంలో నాన్న గారు 36 కిలోమీటర్ల ఈ సొరంగాలను 20 కిలో మీటర్లు పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ఐదు కిలోమీటర్లు కూడా చేయలేదు. మీ బిడ్డ అధికారంలోకొచ్చాక యుద్ధప్రాతిపదికన ఆ మిగిలిపోయిన 11 కిలోమీటర్లు పూర్తి చేసి, ప్రాజెక్టును అక్టోబర్‌లో ప్రారంభించనున్నం. మార్కాపురం నియోజకవర్గానికి సంబందించి నా సోదరుడు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి నా దృష్టికి తెచ్చిన వాటికి ఇప్పుడే ఇక్కడే శంకుస్థాపన చేశాం. ఎన్ఎస్పీ కెనాల్ నుంచి పొదిలి దాకా అంటే 17 కి.మీ. పైపులైను ద్వారా పొదిలికి తాగునీరు అందించే కార్యక్రమానికి రూ.50 కోట్లతో పునాది వేశాం. మార్కాపురం మున్సిపాలిటీలో నీటి పనులకు రూ.5.20 కోట్లతో శ్రీకారం చుట్టాం. మెడికల్ కాలేజీ కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన 13 ఎకరాల అభివృద్ధికి సంబంధించి ఎకరాకు మరో రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం. పొదిలి మెయిన్‌రోడ్డు, పొదిలిలో డ్రెయిన్‌కు రూ.13 కోట్లు మంజూరు చేస్తాం. రూ.2 కోట్లతో షాదీఖానా, అంబేడ్కర్ భవనం, బీసీ భవనం మంజూరు చేస్తున్నాం. మన ఇంటి నుంచే ఆధునిక భారతీయ మహిళ ► విద్యా దీవెన, వసతి దీవెన కింద పిల్లల చదువుల కోసం రూ.13,351 కోట్లు ఖర్చు చేయగలిగాం. సంపూర్ణ పోషణ ద్వారా 35 లక్షల మంది బాలింతలు, గర్భిణులకు.. 6 నుంచి 72 నెలల చిన్నారులకు మంచి చేస్తూ రూ.6,131 కోట్లు ఖర్చు చేశాం. ► అక్కచెల్లెమ్మలకు భద్రత పరంగా ‘దిశ’ ద్వారా అండగా నిలిచాం. కోటి 17 లక్షల మంది దిశ యాప్ వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ ద్వారా ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలని తపన పడుతూ పాలన సాగిస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
పేదవారి సొంతింటి కల నెరవేర్చారన్న..
-
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: సీఎం జగన్ మార్కాపురం పర్యటన (ఫొటోలు)
-
అక్క చెల్లెమ్మలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం: సీఎం జగన్
-
4,39,068 మంది లబ్దిదారులకు రూ.658.60 కోట్ల సాయం
-
ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్ళలో రూ.45 వేల ఆర్థికసాయం
-
YSR ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో సీఎం జగన్ ముచ్చట్లు
-
ఇదీ చాలెంజ్ : సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అయ్యా.. చంద్రబాబూ.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదు.. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా ప్రతి పేద ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలి. అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నప్పుడు తీసుకునే ఫొటోను సెల్ఫీ అంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో, నాలుగేళ్ల తమ ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతానికి, గ్రామానికి, ప్రతి సామాజిక వర్గానికి జరిగిన మేలు గురించి బేరీజు వేసుకునే సత్తా మీకు ఉందా.. ఇదీ ఛాలెంజ్ అని చంద్రబాబుకు సవాలు విసురుతూ నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. అలా వదిలేసిన ఇళ్లను మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టిన చోటుకు, వేగంగా పనులు జరుగుతున్న ఇళ్ల వద్దకు వెళ్లి ఈ 75 ఏళ్ల ముసలాయన నాలుగు ఫేక్ ఫొటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నాడు’ అని ఎద్దేవా చేశారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదన్నారు. బాబు బృందాన్ని ఇలా నిలదీయండి ► ఈ నిజాలు ప్రజలందరికీ తెలుసు. అయినా చంద్రబాబు, ఎల్లోమీడియా నిందలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు దిక్కుమాలిన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి అబద్ధాల బ్యాచ్‌ని నమ్మకండి. వారిని నిలదీయండి. ► గత ఐదేళ్లలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని మీరు.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. అందులో కట్టిస్తున్న ఇళ్ల వద్ద సెల్ఫీ దిగే ధైర్యం, స్టిక్కర్ అంటించే దమ్ము ఉందా అని నిలబెట్టి అడగండి. ► మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిందని చెబుతూ.. మీరేం చేశారని ప్రశ్నించండి. ► 53 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా నాలుగేళ్లుగా ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసాగా అందిందని చెప్పండి. గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎందుకు మోసం చేశావని చంద్రబాబును అడగండి. ► అయ్యా.. చంద్రబాబూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశావు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపించి ఇంటికి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశావు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగురగొట్టావ్.. మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావ్.. అలాంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్ అంటించే అర్హత ఉందా.. అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ గట్టిగా నిలబెట్టి అడగండి. ► వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు.. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో ఎక్కడికి పోయాయి.. ఎవరు తిన్నారు.. అని 45–60 ఏళ్ల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలు చంద్రబాబును అడగండి. ► ప్రభుత్వ బడి గురించి, మధ్యాహ్న భోజనం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌లో డిజిటల్æ బోర్డ్, ఇంగ్లిష్ మీడియం.. సీబీఎస్సీ సిలబస్, బైలింగ్వల్ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా తట్టాయా అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. ► మీ పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ముష్టి ఇచ్చినట్లు రూ.వెయ్యి పింఛన్ ఎందుకిచ్చావని ఇప్పుడు రూ.2,750 పెన్షన్ తీసుకుంటున్న నా అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగ అక్కచెల్లెమ్మలు నిలదీయండి. పింఛన్ మూడు వేలు కాబోతోందని చెప్పండి. ఇంత మేలు చేసిన మా బిడ్డతో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతాము అని ప్రశ్నించండి. ► ఇంటింటికీ మంచి చేయడం అభివృద్ధా.. లేక రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ–5 ఇంటికి.. చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు ఇళ్లకు.. మూటలు పంపడం అభివృద్ధా.. అని గట్టిగా అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా...లేక చంద్రబాబు బృందం భోజనం చేయడమా అని ప్రశ్నించండి. ► భక్తి ఉంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయడమా... మైనార్టీల మీద దేశ ద్రోహం కేసులు పెట్టడమా.. అని కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా.. లేక ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చంద్రబాబు బృందాన్ని అడగండి. ► చంద్రబాబుకు సీఎం పదవి అంటే.. అరడజన్ దొంగలు.. గజదొంగలుగా దోచుకోవడం.. పంచుకోవడం... తినడం. అదే మీ బిడ్డ జగన్‌కు సీఎం పదవి ఇవ్వడమంటే.. ఇంటింటా అభివృద్ధి అని చెప్పండి. అన్నీ గుర్తు పెట్టుకోండి.. ► గతంలో 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోగానే దానిని చెత్తబుట్టలో పడేశాడు. అక్కచెల్లెమ్మలు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఆ మేనిఫెస్టో వాళ్ల వెబ్సైట్లో కూడా కనబడని పరిస్థితి. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్.. ఒక ఖురాన్.. ఒక భగవద్గీత. ప్రతిరోజూ, ప్రతిక్షణం ఆ మేనిఫెస్టో కోసం తపించిన మీ బిడ్డ పాలన ఎలాంటిదో ఆలోచించమని కోరుతున్నా. ► రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. చాలా చాలా అబద్ధాలు వింటాం. వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉంది. తోడుగా వాళ్ల దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కానీ మీ బిడ్డకు ఇవేమీ లేవు. మీ బిడ్డ వీళ్ల మాదిరి గజ దొంగల ముఠాను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకుంది ఆ దేవుడి దయను, మిమ్ముల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మద్దతుగా నిలవండి. తేడా మీరే చెప్పండి.. ► ఈ నాలుగేళ్ల మనందరి ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా డీబీటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇంటింటికీ ఎంత మంచి చేశామో మీ అందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో 2014–2019 మధ్య ఒక ముసలాయన సీఎంగా ఉండేవాడు. అప్పట్లో ఈ పథకాలు ఉండేవా? ఈ బటన్ నొక్కే డీబీటీ పద్ధతి ఉండేదా? ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ). ► 2 లక్షల 7 వేల కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వంలో మన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ అయింది. గత చంద్రబాబు పాలనలో ఈ డబ్బును ఎవరు దోచుకున్నారు? ► గత చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? (లేదు లేదు అని మహిళలు చేతులు పైకెత్తి చెప్పారు). ఇవాళ ఏ పథకం తీసుకున్నా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. గతంలో జరగనిది.. మీ బిడ్డ జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నాడో రాష్ట్రంలోని ప్రతి అన్నను, తమ్ముడ్ని.. ప్రతి అక్కను, చెల్లెమ్మను.. మొత్తంగా 1.56 కోట్ల కుటుంబాలను ఆలోచించాలని కోరుతున్నా. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది అన్నా.. నా భర్త చిన్న ఉద్యోగస్తుడు. ఓసీల్లోని పేదలను గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు. ఈ డబ్బుకు మరికొంత కలుపుకుని కిరాణా షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మఒడి సాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు–నేడు ద్వారా మా పిల్లలు చదువుకునే పాఠశాలను బాగు చేశారు. 8వ తరగతి చదువుతున్న మా పాపకు ట్యాబ్ ఇచ్చారు. మా అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పమంది. సొంతింటి కలను కూడా నిజం చేస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి పాలన అందిస్తున్న మీరు కలకాలం చల్లగా ఉండాలి. – కాసుల వెంకట అరుణ, పదో వార్డు, మార్కాపురం చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! మీ మేలు ఎవరూ మరచిపోరు మహిళలంతా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మీ మేలును అక్కచెల్లెమ్మలు ఎవరూ మరచి పోరు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నారీ లోకమంతా మిమ్మల్ని దీవిస్తోంది. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాయి. పంటలు బాగా పండాయి. దిగుబడులు బాగా వచ్చాయి. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని మీరు తపస్సు చేస్తున్నారు. ముందు తరాలకు కూడా భరోసా ఇచ్చేలా పాలన అందిస్తున్న మీకు అన్ని వర్గాల వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి -
YSR EBC Nestham: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం: ►ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్ ►అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నాం ►చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు ►అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా ►అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం ►అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం ►ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం ►పేదరికానికి కులం, మతం ఉండదు ►మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం ►దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు ►రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ ►ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం ►46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం ►మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం ►మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ►ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు ►ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు ►ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం ►అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్ ►ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు ►ఇలాంటి యాప్ దేశంలో ఎక్కడైనా ఉందా? ►మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం ►మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి ►గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా? ►గతంలో డీపీటీ పథకం ఉండేది ►గతంలో దోచుకో, పంచుకో, తినుకో ►మా ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసింది ►చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా? ►ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయ్యిందా? ►ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు? ►ఎవరు దోచుకున్నారు,ఎవరు తిన్నారు ఆలోచన చేయండి ►టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటా? ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదు బాబు.. ►సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి ►ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి.. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ►సీఎం జగన్ పాలనలో మహిళలంతా పండగ చేసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి కోసమే ఆలోచిస్తారన్నారు. ►ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాల్లోని పేదలకు సీఎం అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. 40 ఏళ్ల కల పొదిలి పెద్దచెరువుకు రూ.50 కోట్లు సీఎం కేటాయించారు. 14 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా రెండో ఫేజ్ అభివృద్ధి పనులకు సీఎం నిధులు సమకూర్చారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ మొదలుపెట్టిన వెలికొండ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ పూర్తిచేస్తారని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ►వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు. మార్కాపురం చేరుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురం చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 4,39,068 మంది అగ్రవర్ణ పేదలకు రూ.658.60 కోట్లు అందించనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ►10.15 గంటల నుంచి మ.12.05 వరకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబి్ధదారులకు నగదు జమచేస్తారు. కార్యక్రమం అనంతరం మ.12.40కు అక్కడి నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు. ►రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు. ►ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం. మూడేళ్లలో మొత్తం రూ.45వేలు.. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ►ఇక నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000. అలాగే, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ కలిపి) -
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: సీఎం జగన్ మార్కాపురం పర్యటన షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(బుధవారం)ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు సీఎం జగన్. 10.15- 12.05 గంటలకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. ►ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000. ►వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ) అక్కచెల్లెమ్మలకు ఉద్యోగ, రాజకీయ సాధికారత ►వలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే ►రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్పర్సన్లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు అక్కచెల్లెమ్మలకే ►శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ►జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే ►అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వల వరకు, అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం ►గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ ►మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మార్చిన ప్రభుత్వ బడులు ►స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ ►మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ►వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా ద్వారా ఆర్ధిక సాయం ►అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ►జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్ధిక సాయం ►వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా అక్కచెల్లెమ్మలకు, మహిళలకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. చదవండి: ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా -
జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లవుతోంది.. మనది హామీలను నెరవేర్చే ప్రభుత్వమని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చి తనది ప్రజా ప్రభుత్వమని చాటారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా, ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ జగన్.. దాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో పక్కాగా అడుగులు వేశారు. దాంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమందించే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు గతానికి ఇప్పటికి వున్న తేడాను స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో! పేద కుటుంబాలను పేదరికాన్నించి బైట పడేయాలనేది అసలైన లక్ష్యం.. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ పథకాలన్నీ ప్రజాసంకల్ప పాదయాత్ర అనుభవాలతో రూపొందినవే.. వాటిలో చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలున్నాయి. నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తే వారు ఆ డబ్బుతో కుటుంబ ఆదాయాలను పెంచుకుంటారని తద్వారా వారు పేదరికాన్నించి బైటపడాలని ఈ పథకాలను తయారు చేశారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చెరుకు రసం విక్రయిస్తు కుటుంబాన్ని నడిపిస్తోంది అనసూరి వెంకటలక్ష్మీ. వెంకటలక్ష్మీ, అప్పారావు దంపతులకు నలుగురు పిల్లలున్నప్పటికీ వారు ఉపాధి కోసం ఇతర ఊళ్ళకు వెళ్లిపోయారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు పడ్డామని అలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ఆదుకున్నదని వీరు అంటున్నారు. చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అందుతున్న 18,750 రూపాయలతో వీరు ఈ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి దంపతులకు సొంత ఇళ్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీరికి ఇళ్ల స్థలం లభించేలా చూశారు. చేయూతతోపాటు పలు పథకాలు వెంకటలక్ష్మి అప్పారావులాంటివారికి అందుబాటులోకి వచ్చి వీరి కష్టాలను తీరుస్తున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తే వారు నిలదొక్కుకుంటారనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. అందుకోసం తయారు చేసిన పథకాలే చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం. వీటిలో చేయూతను ఉపయోగించుకున్నవారిలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన మల్లేశ్వరి కూడా వున్నారు. ఈమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. నలుగురు పిల్లలుంటే వారికి వివాహాలైపోయి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ద్వారా లభిస్తున్న డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం చేసి కొంతమేరకు ఆదాయం పొందుతున్నట్టు మల్లేశ్వరి అంటున్నారు. చదవండి: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు చేయూత ఉపయోగపడుతోంది. అయితే అదే సమయంలో అగ్రవర్ణ పేద కుటుంబాల మాటేమిటి? వారిని కూడా ఆదుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి.. దీనికి సమాధానంగా కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకొచ్చారు.. వీటిలో కాపునేస్తాన్ని ఉపయోగించుకొని కొంతమేరకు ఉపశమనం పొందిన వారిలో జగత జ్యోతి వున్నారు. ఈమె రెండు దశాబ్దాల క్రితమే భర్తను కోల్పోయారు. ఒక కుమార్తె వుంటే ఆమెకు వివాహమై వెళ్లిపోయిందని.. తాను మాత్రం నాలుగైదు ఇళ్లలో ఇంటి పనులు చేసుకొని బతుకుతున్నానని జ్యోతి చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె కాపులు పేరుకే అగ్రవర్ణమని కాపుల్లో తనలాంటి పేదలు చాలా మంది వున్నారని అంటున్నారు. అగ్రవర్ణాల పేద కుటుంబాల్లో కాపులనే కాకుండా ఇతర అగ్రవర్ణాల పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈబీసీ నేస్తం రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో మనం చూస్తున్న ఈ బ్రాహ్మణ కులానికి చెందిని శివరామజోగి శర్మ దంపతులున్నారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన శివరామజోగిశర్మ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయామని ఈ మధ్యనే ఈబీసీ పథకం అందిందని వీరు చెబుతున్నారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం...ఈ మూడు పథకాలు నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్యన వయస్సున్న పేద కుటుంబాల మహిళలకు వర్తించే పథకాలు. అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛను వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు వున్న పేద కుటుంబాల మహిళల్ని ఆదుకుంటే అది వారి కుటుంబాల కష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఈ ఆలోచన మూడు మానవీయ పథకాలుగా రూపొంది ఈ మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని శనగపప్పు బజార్లో దాసరి కిషోర్.. కుటుంబం నివసిస్తోంది. భార్య సత్య భారతి గృహిణి.. వీరికి పూజిత అనే కూతురు.. గతంలో లారీ యజమాని అయిన దాసరి కిషోర్ వ్యాపారంలో నష్టం రావడంతో దానిని అమ్మేసి ఆటో కొనుక్కున్నారు. ప్రతి రోజూ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాసరి కిషోర్ కుటుంబానికి మొత్తం నాలుగు పథకాలు అందుతున్నాయి. తనకు వాహనమిత్ర, కూతురుకు అమ్మ ఒడి, తండ్రికి వైఎస్సార్ పింఛన్ కానుక, భార్యకు కాపునేస్తం పథకాలు వస్తున్నాయని.. ఇలా అందించే ప్రభుత్వం లభించడం సంతోషంగా వుందని అంటున్నాడు. కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలపాటు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దాసరి కిషోర్ స్పందిస్తున్నారు. అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అంతే తప్ప ఒక కుటుంబానికి ఒక పథకం అందిస్తే సరిపోతుందిలే అని చేతులు దులుపుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సామాన్య కుటుంబాలు తగిన విధంగా ఆర్ధిక అండదండలు పొందుతున్నాయి. ఇక ఇదే ఏలూరులో మరో ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సాక్షి టీవీ పలకరించింది.. ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అన్నయ్య దివ్యాంగుడు.. తల్లికేమో వయస్సు మీద పడి తన పని చేసుకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ కష్టాలను తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకొని కుంగిపోలేదు. జీవితం.. తాను అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా లేదని అదే పనిగా ఆందోళన చెందలేదు. కష్టమైన పనయినా సరే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆటో డ్రైవర్ పని చేపట్టింది. ఏలూరు నగరంలోని 43వ డివిజన్ ఏకే సెంటర్లో ఆటో డ్రైవర్ ఊట అంబిక కుటుంబం నివసిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆటో డ్రైవర్ గా మారి ఇంటికి అండగా నిలిచింది.. ఈ పని కష్టమైనదైనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డ ఈ పని చేస్తోందని..డిగ్రవీరకూ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఈ పెద్దామె భావిస్తోంది. ప్రస్తుతం అంబికకు వాహనమిత్ర పథకం, అంబిక తల్లి ఊట నూకరత్నానికి వృద్ధాప్య పింఛన్, అంబిక అన్నయ్యకు దివ్యాంగుల పింఛన్ పథకాలు అందుతున్నాయి ఇలాంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లందరిదీ దాదాపుగా ఒకటే పరిస్థితి...బండి తిరిగితేనే బతుకు బండి నడుస్తుంది. ఆటో మీటరు తిరిగితేనే...ఇంటిల్లిపాదీ భోజనం చేయగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల గాధలగురించి పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ అదే సమయంలోనే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాత ఆటో , ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా వుంటానని భరోసానిచ్చారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి తన పాలన ప్రారంభమైన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ ఈ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
ఈబీసీ నేస్తంతో పేదలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల్లోని పేదప్రజల్లాగా ఈబీసీల్లోని పేదలకు కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. చాలాకాలంగా ఈబీసీలు నష్టపోతున్నా రనే విషయాన్ని గ్రహించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం భారత గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి 17 మందిలో ఒకరు ఈరోజుకు కూడా సంపూర్ణంగా తినలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించాలనే ఆలోచ నతో సీఎం జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన రోజునుంచి సమానత్వం ఏ విధంగా తీసుకుని రావాలి అనే దిశగా ఆలోచిస్తూ పరిపాలిస్తున్నారని తెలిపారు. పేదలకు అవసరమైన ఉపాధి, చదువు, ఆరోగ్యం సమకూర్చాలనే దిశగా పాలన సాగిస్తు న్నారన్నారు. పేదరికానికి స్వస్తి చెప్పాలని సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేయడంతోపాటు, మేనిఫెస్టోలో లేకపోయినా కొన్నింటిని చేశారని చెప్పారు. మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించిన కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య కుటుంబసభ్యులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న సీఎం జగన్.. మాచర్లలో పింగళి కుమార్తెకు ఆర్థికసాయం అందించారని గుర్తుచేశారు. సీఎం జగన్ ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంఘటన తెలియజేస్తోందని ఆయ న చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వైఎస్సార్సీపీ నాయ కులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కన కారావు మాదిగ, శేషగిరిరావు, వెంకటరెడ్డి, బొప్పన భవకుమార్, పెదపాటి అమ్మాజీ, జాన్సీ, సుశీలరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో.. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రిన్సిపల్ సలహా దారు అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవే శారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’తో మహిళలకు ఎంతో మేలు
సాక్షి, అమరావతి/సీతమ్మధార (విశాఖ ఉత్తర)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం అగ్రవర్ణాల పేదలైన లక్షలాది మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్, ఏపీ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజశ్వనిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అందుకో ‘నేస్తం’ ఆత్మగౌరవంతో
ఇది ఎన్నికల వాగ్దానం కాదు... మేనిఫెస్టోలోనూ చెప్పలేదు. అయినప్పటికీ ఈబీసీ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేదలు వారిలో కూడా ఉన్నారు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నాం. ఆర్ధిక, రాజకీయ, విద్యా సాధికారతకు మద్దతు పలుకుతూ ఒక అన్నగా, తమ్ముడిగా మంచి చేయాలనే ఈ బాధ్యత తీసుకుంటున్నా. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు. ప్రతి అక్కచెల్లెమ్మ జీవిత చరిత్ర కూడా గొప్పదే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవం ఇనుమడించేలా ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వకపోయినా, పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరచనప్పటికీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, వారి మోములో సంతోషం వెల్లివిరిస్తేనే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తితో రెండున్నరేళ్లుగా ప్రతి అడుగు ముందుకేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు అందచేస్తాం. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందనే సంకల్పంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా.. ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందచేస్తున్నాం. అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, మహీంద్రా, యూనిలీవర్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించి వారికి అండగా నిలిచాం. వైఎస్సార్ కాపు నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ 3.27 లక్షల మంది ఆర్ధిక స్వావలంబనకు తోడుగా నిలిచిన ప్రభుత్వం కూడా ఇదే. 60 ఏళ్లు పైబడిన వారికి వైఎస్సార్ పెన్షన్ కానుక అమల్లో ఉంది. దీనివల్ల ప్రతి నెలా రూ.2,500 చొప్పున ఏటా రూ.30 వేలు అందుతాయి. జగనన్న కాలనీలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. తద్వారా ఆయా కుటుంబాల్లో 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు జరుగుతోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. మొత్తం రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.2,354 కోట్లు అందచేసి వారికి తోడుగా నిలిచాం. విద్యా, వసతి దీవెన జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువుల ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 18.81లక్షల మంది తల్లులకు ఈ రెండేళ్లలో రూ.6,258 కోట్లు అందించాం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, ఐటీఐకి రూ.10 వేలు, డిగ్రీ చదివే వారికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.2,267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే అందచేశాం. ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణిలు, 6 నుంచి 72 నెలలున్న చిన్నారులకు ప్రయోజనం చేకూరుతోంది. గతంలో రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనే పరిస్థితుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లుల ఆరోగ్యాలను మనసులో పెట్టుకుని ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 77 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మరింత మేలు జరగాలని గిరిజన మహిళలకు సంపూర్ణ పోషణ ప్లస్ తీసుకొచ్చాం. రాజకీయ సాధికారిత రాజకీయంగా మహిళా సాధికారితకు కూడా అత్యంత ప్రాధాన్యం కల్పించాం. శాసన మండలి తొలి మహిళా వైస్ ఛైర్మన్‌గా సోదరి జకియా ఖానమ్, తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆమె రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇవన్నీ మన ప్రభుత్వంలో వేసిన ముందడుగులు. నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51 శాతం ఇచ్చేందుకు ఏకంగా చట్టమే తీసుకొచ్చాం. మొత్తం నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు 202 కాగా 102 మహిళలకే ఇచ్చాం. 1,154 డైరెక్టర్ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వగా అక్కచెల్లెమ్మలకు 586 కేటాయించాం. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు కలిపి 1,356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్ధలకు సంబంధించి చైర్మన్, మేయర్ల పదవుల్లో సగానికి పైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులే ఇవ్వాల్సినా అంతకంటే ఎక్కువగా 52 చైర్మన్ల పదవులు వారికిచ్చాం. 60.47 శాతం మంది అక్కచెల్లెమ్మలే మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నగర పంచాయతీల్లో ఉన్నారు. 202 వ్యవసాయ మార్కెట్ కమిటీ ౖచైర్మన్ పదవుల్లో 101 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మకంగా 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఏడుగురు అక్కచెల్లెమ్మలే ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి 26 పోస్టుల్లో 15 మంది మహిళలే ఉన్నారు. మహిళల రక్షణకు ‘దిశ’ దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు 1,01,19,642 మంది ఫోన్లలో దిశ యాప్ ఉంది. అక్కచెల్లెమ్మలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకుని తోడుగా నిలుస్తారు. అలాంటి గొప్ప వ్యవస్ధను రాష్ట్రంలో తెచ్చాం. గతంలో బెల్ట్ షాపులు గుడి పక్కన, బడి పక్కన కనిపించేవి. ఇవాళ అవి ఎక్కడా లేకుండా కట్టడి చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం. అమ్మ ఒడితో తల్లులకు రూ.13,023 కోట్లు రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మకు మేలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మంది తల్లులు, 85 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా రూ.6,500 కోట్లు అందిస్తున్నాం. ఇలా రెండేళ్లలో రెండు దఫాలుగా ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 61.73 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా వారిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలకు మంచి జరిగేలా ప్రతినెలా రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు ఇస్తూ తోడుగా నిలబడగలిగాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసగించగా, ఇప్పుడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు నేరుగా అందించాం. ఫలితంగా నిరర్థక ఆస్తులు, అవుట్ స్టాండింగ్ ఖాతాలు 0.73 శాతానికి తగ్గిపోయాయి.