జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తున్న ఉమ్మారెడ్డి. చిత్రంలో రోశయ్య, అప్పిరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల్లోని పేదప్రజల్లాగా ఈబీసీల్లోని పేదలకు కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. చాలాకాలంగా ఈబీసీలు నష్టపోతున్నా రనే విషయాన్ని గ్రహించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం భారత గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి 17 మందిలో ఒకరు ఈరోజుకు కూడా సంపూర్ణంగా తినలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించాలనే ఆలోచ నతో సీఎం జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన రోజునుంచి సమానత్వం ఏ విధంగా తీసుకుని రావాలి అనే దిశగా ఆలోచిస్తూ పరిపాలిస్తున్నారని తెలిపారు. పేదలకు అవసరమైన ఉపాధి, చదువు, ఆరోగ్యం సమకూర్చాలనే దిశగా పాలన సాగిస్తు న్నారన్నారు. పేదరికానికి స్వస్తి చెప్పాలని సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేయడంతోపాటు, మేనిఫెస్టోలో లేకపోయినా కొన్నింటిని చేశారని చెప్పారు. మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించిన కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య కుటుంబసభ్యులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న సీఎం జగన్.. మాచర్లలో పింగళి కుమార్తెకు ఆర్థికసాయం అందించారని గుర్తుచేశారు. సీఎం జగన్ ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంఘటన తెలియజేస్తోందని ఆయ న చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వైఎస్సార్‌సీపీ నాయ కులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కన కారావు మాదిగ, శేషగిరిరావు, వెంకటరెడ్డి, బొప్పన భవకుమార్, పెదపాటి అమ్మాజీ, జాన్సీ, సుశీలరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో..
తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రిన్సిపల్ సలహా దారు అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవే శారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment