ummareddy venkateshwarlu
-
యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!
ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్ అండ్ పీస్)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.1910లో టాల్‌స్టాయ్ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. అంతకుముందే ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్–ఇరాక్‌ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్‌ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్‌కు గానీ, ఇటు ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్‌కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ కనుక తన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్‌కు మద్దతుగా సూయిజ్ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్‌కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్‌కు మేలు చేసేదే. అయితే, భారత్ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్‌స్టాయ్ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
కోవిడ్‌ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
మానవ తప్పిదాలే విలయ హేతువులు
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
సీఎం జగన్‌కు ప్రజలందరూ ఆశీస్సులివ్వాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదని ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని.. ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ అంటున్నారని.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదని ఉమ్మారెడ్డి అన్నారు. అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముగ్గురు కాదు 30 మంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోందన్నారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. చరిత్ర సృష్టించటం సీఎం జగన్‌కే సాధ్యమని.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘మండలి’లో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని.. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలుచేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అన్ని వర్గాలకూ అండగా సీఎం జగన్.. ఇక వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు ఆయన అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారని.. కానీ, ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని సీఎం జగన్ విజేతగా నిలిచారన్నారు. ఐదేళ్లలో హామీలన్నీ నెరవేర్చారు.. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి సీఎం జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. వాటన్నింటినీ ఎదుర్కొని, తట్టుకుని అధికారం సాధించారన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారని.. ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారని సురేశ్ ప్రశ్నించారు. మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అంతకుముందు.. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు, యువజనులు జైజై నినాదాలతో భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ‘జగన్ అనే నేను’.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటుచేశారు. మంత్రి జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ‘జగన్ అనే నేను..’ ఈ కౌంట్‌డౌన్ బోర్డును ఆవిష్కరించారు. 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేందుకు చిహ్నంగా ఈ బోర్టు పెట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోసారి గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? వైఎస్సార్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పిలుపు సాక్షి, అమరావతి: ‘నేడు మన వైఎస్సార్సీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైఎస్సార్సీపీ. ఇన్నాళ్లూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మంగళవారం పోస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు. -
ఈబీసీ నేస్తంతో పేదలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల్లోని పేదప్రజల్లాగా ఈబీసీల్లోని పేదలకు కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. చాలాకాలంగా ఈబీసీలు నష్టపోతున్నా రనే విషయాన్ని గ్రహించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం భారత గణతంత్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి 17 మందిలో ఒకరు ఈరోజుకు కూడా సంపూర్ణంగా తినలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించాలనే ఆలోచ నతో సీఎం జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన రోజునుంచి సమానత్వం ఏ విధంగా తీసుకుని రావాలి అనే దిశగా ఆలోచిస్తూ పరిపాలిస్తున్నారని తెలిపారు. పేదలకు అవసరమైన ఉపాధి, చదువు, ఆరోగ్యం సమకూర్చాలనే దిశగా పాలన సాగిస్తు న్నారన్నారు. పేదరికానికి స్వస్తి చెప్పాలని సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేయడంతోపాటు, మేనిఫెస్టోలో లేకపోయినా కొన్నింటిని చేశారని చెప్పారు. మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించిన కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య కుటుంబసభ్యులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న సీఎం జగన్.. మాచర్లలో పింగళి కుమార్తెకు ఆర్థికసాయం అందించారని గుర్తుచేశారు. సీఎం జగన్ ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంఘటన తెలియజేస్తోందని ఆయ న చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వైఎస్సార్సీపీ నాయ కులు అంకంరెడ్డి నారాయణమూర్తి, కొమ్మూరి కన కారావు మాదిగ, శేషగిరిరావు, వెంకటరెడ్డి, బొప్పన భవకుమార్, పెదపాటి అమ్మాజీ, జాన్సీ, సుశీలరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో.. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రిన్సిపల్ సలహా దారు అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవే శారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’
సాక్షి, గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రమశిక్షణ గల వ్యక్తి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. తమకు ఆయన ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు -నేడు కార్యక్రమం ఒక యజ్ఞంలా జరుగుతోందని, ఈ పథకం వల్ల సర్కారీ బడులు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. మండలి చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన బాపట్ల మండలం కొండు భొట్లపాలెంలో ఉమ్మారెడ్డి వెంకయ్య-కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన నామకరణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప సభాపతి కోన రఘపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, శ్రీ రంగనాథరాజు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విద్య, వైద్య రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పేదరికంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా 43 లక్షల మంది తల్లులకు సీఎం జగన్ అన్నయ్య అయ్యారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బూట్లు ముఖ్యమంత్రే స్వయంగా సెలక్ట్ చేశారంటే విద్యార్థుల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్ విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వచ్చే పదేళ్లలో రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తారని ఆయన విశ్వసిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఇంటి పెద్దగా ఆలోచిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఓ ఇంటి పెద్దగా పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన అంటే మాకు అత్యంత గౌరవం. ఆయన తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం’’అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇంగ్లీష్ మీడియంపై రాద్దాంతం చేస్తున్న టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన ఆయన, ధనిక వర్గాల పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదవాలా.... పేద వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని ప్రశ్నించారు. అందుకే విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు: ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ’ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలను మార్చేస్తున్నారు. కొండు బొట్లపాలెం లోని జిల్లా పరిషత్ స్కూల్‌ను తన సొంత నిధులతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివృద్ధి చేశారు. సమాజంలో అసమానతలు పోగొట్టాలంటే విద్యే ఏకైక ఆయుధం. అందుకే సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్కూళ్ల మెయింటెనెన్స్ కోసం మాత్రమే నిధులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు మా ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది’’అని పేర్కొన్నారు. -
యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?
సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చీప్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనలు ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్నది సత్యం. ఈ దశలో కూడా గవర్నర్‌ను ప్రతిపక్షనేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏమిటి? యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా' అంటూ ప్రశ్నించారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) 'నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్డీడీయే రద్దు బిల్లులు రెండింటినీ ఆమోదించారు. ఇప్పటికైనా విపక్ష తెలుగుదేశం నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలి. రాజ్యాంగబద్ద నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి' అన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. -
ఇంకా ఎందుకు నవ్వులపాలవుతారు?
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాయడం శోచనీయమని.. దీనినిబట్టి ఆయనకు కనీస పరిజ్ఞానం లేదనేది స్పష్టమవుతోందని.. ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్‌కు యనమల రాసిన లేఖపై ఉమ్మారెడ్డి ఆదివారం తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఏం పేర్కొన్నారంటే.. ► శాసనసభల నిర్వహణ అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందనే కనీస పరిజ్ఞానం యనమలకు లేకపోవడం శోచనీయం. ► రాష్ట్ర శాసనసభ తొలిసారి ఆమోదించిన ఈ రెండు బిల్లులను జనవరి 22న శాసన మండలికి వచ్చినపుడు అక్కడ గ్యాలరీలో కూర్చుని టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడుగా వ్యవహరించారు. ► సైగలు చేసి ఈ బిల్లులను ఆమోదించకుండా సభను నిరవధికంగా వాయిదా వేయించారు. ► శాసనసభ తొలిసారి ఆమోదించిన బిల్లులపై కౌన్సిల్ మూడు నెలలపాటు నిర్ణయం తీసుకోనందున మళ్లీ వాటిని అసెంబ్లీ ఆమోదించి జూన్ 17న మండలికి పంపిస్తే అక్కడ మళ్లీ యనమల వాటికి మోకాలడ్డారు. ► చివరకు ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండా సభను వాయిదా వేయించి ప్రభుత్వోద్యోగులకు జూలై 1న జీతాలు రాకుండా చేశారు. దీనిని బట్టి యనమలకు రాజ్యాంగం అంటే ఏపాటి గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుంది. ► పైగా ఆ రోజు మండలిలో టీడీపీ సృష్టించిన వీరంగం అందరికీ తెలుసు. ఈ పరిస్థితికి యనమల సిగ్గుపడటం లేదా? ► 192 (2) (బి) ప్రకారం తొలుత అసెంబ్లీ పంపిన బిల్లును మూడు నెలల తరువాత కూడా కౌన్సిల్ ఆమోదించకపోతే.. దానిని ఆమోదించనట్లే. ► ఆ తదుపరి రాజ్యాంగం ప్రకారం మళ్లీ రెండోసారి బిల్లును అసెంబ్లీ ఆమోదించి పంపినప్పుడు మండలి ఆమోదించకపోయినట్లయితే ద్రవ్య బిల్లు అయితే 15 రోజులు, సాధారణ బిల్లు అయితే 30 రోజుల తరువాత ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. ► రాష్ట్ర మంత్రివర్గం ఈ రెండు బిల్లులను ఆమోదించి ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపుతారు. ► ఈ మాత్రం కనీస పరిజ్ఞానం యనమలకు లేదా? గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని సూచించడం అంటే యనమల సంకుచితత్వానికి నిదర్శనం. ► ప్రజలు దీనిని చూసి నవ్వుకుంటున్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు అపహాస్యం, అవమానం చేయడమే కాక దానిని పూర్తిగా పక్కనపెట్టారు. ► కేంద్రం నియమించిన కమిటీని పరిగణనలోకి తీసుకోని వారు ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను కేంద్రానికి పంపాలని సలహా ఇస్తారా? మీరేమైనా గవర్నర్‌కు సలహాదారు అనుకుంటున్నారా? ► గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లును ఆమోదించవద్దని చెప్పి ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారు? ► గవర్నర్ ఆమోదం పొంది చట్టాలు రూపొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
ఇక ఆమోదం పొందినట్లే!
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లు కూడా తమ దృష్టిలో శాసనమండలిలో ఆమోదం పొందినట్లేనని మండలిలో అధికార పక్ష నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘14 రోజులు గడిచాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. ఇక దానికి చెల్లు చీటి పడినట్లే’నని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులకు ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పరిశీలన పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడం లాంటి మూడు ప్రత్యామ్నాయాలే ఉంటాయని సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. ‘ఈనెల 22న బిల్లులను మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదు, బిల్లులను మండలి తిరస్కరించలేదు. ఈ నేపధ్యంలో మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్టే’ అని పేర్కొన్నారు. శాసనసభలో, మండలిలోనూ ఆమోదం పొందిన ఈ బిల్లులను తదుపరి చర్యగా గవర్నర్‌కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నిబంధనలను పాటించలేదు.. ‘సెలెక్ట్ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి చైర్మన్ అనుసరించలేదు. 5(9) (5) నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు మండలిలో ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపాలని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఈ రెండు బిల్లుల విషయంలో అది జరగలేదు. మండలి చైర్మన్ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు చైర్మన్ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు’ అని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి తమతో భేటీకి ముందే సెలక్ట్ కమిటీ అంశానికి సంబంధించిన ఫైల్‌ను తిప్పి పంపారని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సస్పెండ్ చేస్తామంటూ అసెంబ్లీ కార్యదర్శిని టీడీపీ నేతలే బెదిరిస్తున్నారని చెప్పారు. ఆరు దశల ప్రక్రియ జరగలేదు... బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మండలి చైర్మన్ దీనిపై మరో ఆరు దశలలో తదుపరి ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి తెలిపారు. – మొదటి దశగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తాను తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమేనా? అని చైర్మన్ సభను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. –రెండోదశగా మూజువాణి ఓటుతోనైనా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి. – అలాంటి సమయంలో ఆ నిర్ణయంపై ఎవరైనా ఓటింగ్ కోరితే నిర్వహించాలి. –సెలెక్ట్ కమిటీకి పంపాలని సభలో నిర్ణయం జరిగితే సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారనే అంశాన్ని సభలోనే వెల్లడించాలి. – ఒకవేళ 8 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్టీల వారీగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలి. – సభలో వివిధ పార్టీల సభాపక్ష నాయకుల నుంచి ఆయా కమిటీలకు ప్రతిపాదించే సభ్యుల పేర్లను సేకరించాలి. ఆ తరువాత సంబంధిత సభ్యుల నుంచి అంగీకారం తీసుకోవాలి. – మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అంశంలో ఇవేమి చేయలేదు. –సెలక్ట్ కమిటీల ఏర్పాటు, సభ్యుల పేర్లను మీడియా ద్వారా ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే. – విచక్షణాధికారం ఉందని మండలి చైర్మన్ ఒకరికి ఉరి వేయమని ప్రకటించి అమలు చేయమంటే అధికారులు పాటించాలా? -
షరీఫ్‌కు చైర్మన్‌గా కొనసాగే అర్హత లేదు : డిప్యూటీ
సాక్షి, అమరావతి : శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తక్షణమే ఆ పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరిచారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభను నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలనన నిర్ణయంపూ ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని, టీడీపీ నాయకులు సంకలు గుద్దు కోవడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు తెలియమని, చట్ట సభలను దారుణంగా అవమానించారని దుయ్యబట్టారు.(‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’) మండలి నిబంధనలను చైర్మన్ ఉల్లఘించారు శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకనప్పుడు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేకశారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమనం ఉన్నప్పుడు వాడాలని, అంతే కాని ఇలా నిబంధనలను అతిక్రమించడానికి విచక్షణను వాడకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను మండలి చైర్మన్ ఉల్లఘించారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఆస్కారమే లేదని, టీడీపీ కార్యకర్తలా చైర్మన్ చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని శ్నించారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్‌కి ఆ స్థానంలో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. చదవండి : సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ మండలికి కళంకం తీసుకు వచ్చారు శాసన మండలి వ్యవస్థను చైర్మన్ నీరు గార్చారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని, శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. మోషన్ మూవ్ చేయకుండానే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపండం సరికాదని సూచించారు. ఇష్టం లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అని పేర్కొన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చైర్మన్‌ని తప్పుదోవ పట్టించి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ చర్యను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు. -
ఆంగ్లంతో తగ్గనున్న అంతరాలు
పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు వినూత్న రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఇచ్చిన ఆదేశాలపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది. వీరి లక్ష్యం ఒక్కటే.. సీఎంగా జగన్మోహన్రెడ్డి ప్రజల మేలుకోసం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గుడ్డిగా వ్యతిరేకించడమే. ప్రతిపక్షనేతగా జగన్ చేపట్టిన చారిత్రక ప్రజాసంకల్ప పాదయాత్రలో అన్ని జిల్లాలకు చెందిన అత్యంత సామాన్య ప్రజలు తమ ఈతిబాధలు చెప్పుకొన్నారు. అందులో ప్రధానమైనది ప్రభుత్వబడుల దీనావస్థ ఒకటి. ప్రభుత్వబడుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్య కాగా.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని డిగ్రీ, పీజీ వరకూ చదువుకొన్నా.. ఇంగ్లిష్ భాషాపరంగా తగిన నైపుణ్యాలు లేక, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడలేక ఉద్యోగాలు పొందలేకపోతున్న వాస్తవాన్ని గ్రామీణ యువత ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు, విద్యుత్, విద్యార్థులకు బల్లలు లాంటి 9 రకాలైన మౌలిక సదుపాయాలను కలుగజేయాలని నిశ్చయించుకున్నారు. సీఎం నిర్ణయంలోని హేతుబద్ధతను గుర్తించకుండా కొందరు ‘భాషాభిమానులం’ అనే పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే.. మత మార్పిడికి దారితీస్తుందనే అనాగరిక, అసమంజసమైన దుష్ప్రచారానికి కూడా ఒడిగడుతున్నారు. నిజానికి, దేశానికి స్వాతంత్య్రం లభించిన గత 7 దశాబ్దాలలో తెలుగునాట విద్యారంగానికి పట్టిన దుర్గతి ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులకు అనుభవమే. దేశంలోని చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా బడుగు, బలహీనవర్గాలు, దళితులు ఏవిధంగానైతే అవమానాలు పడి అన్ని రంగాలో అవకాశాలు కోల్పోయారో.. విద్యారంగంలో ఏర్పడిన ఓ నయా చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల పేదలు, అణగారిన వర్గాలు తీవ్రంగా నష్టపోయారు.. పోతున్నారు కూడా! మరింత విపులంగా చెప్పాలంటే.. ఇప్పటి విద్యావ్యవస్థ 4 రకాల విద్యార్థులను తయారు చేస్తోంది. సంపన్నుల పిల్లలు లక్షల రూపాయల ఫీజులు చెల్లించి.. ఉన్నత బాహ్యప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుకొంటున్నారు. ఎగువ, మధ్యతరగతి వర్గాల వారు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను బోధించే ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఫీజుల భారం తలకుమించిందే అయినా.. తమ పిల్లలకు మంచి భవిష్యత్ లభిస్తుందనే ఆశతోనే ప్రైవేటు కాన్వెంట్లకు పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారుసైతం తమ పిల్లల్ని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాసరే ప్రైవేటు స్కూళ్లకే పంపుతున్నారు. ఇక మూడవ వర్గానికి చెందిన పేదలు, సాధారణ ఆర్థిక పరిస్థితి గలిగిన వారు తమ పిల్లల్ని.. అరకొర మౌలిక సదుపాయాలు గలిగిన తెలుగు మీడియం బోధించే ప్రభుత్వ స్కూళ్లకు పంపుతున్నారు. ఇక 4వ వర్గానికి చెందిన అత్యంత నిరుపేదలు, రోజువారీ కూలీపై ఆధారపడిన వారు, స్థిరనివాసం అనేది లేకుండా సంచార జీవితం గడిపేవారు తమ పిల్లల్ని ఏ పాఠశాలకూ పంపలేకపోతున్నారన్నది ఓ చేదు వాస్తవం. ఈ విధంగా మన విద్యా వ్యవస్థ నాలుగు రకాలైన భావిభారత పౌరుల్ని తయారు చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పోటీ పడినప్పుడు ఈ వర్గాల వారిలో ఎవరు ముందుం టారో.. ఎవరు అవకాశాలను దక్కించుకుంటారో ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేటు విద్యను మొత్తం గంపగుత్తగా ఒకట్రెండు విద్యాసంస్థలకు దఖలు పర్చడానికి లోపాయికారీగా ఉపయోగపడిన వారే ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వం బడుల్లో ప్రవేశపెట్టడం ఓ ఘోరమైన అపరాధంగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి, విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరిగాక కార్పొరేట్ స్కూళ్లలో, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ బడుల్లో చదివేవారికంటే ఎక్కువగా ఉంది. ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నప్పటికీ.. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో, ఇంటిలో మాతృభాషలోనే మాట్లాడతారు. పైగా వారికి తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగు భాషను నేర్పించే ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి. తెలుగు పండిట్ కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలుగు భాషకు ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదు. పైగా, ఆంగ్లభాష ప్రవేశపెట్టడంతో మాతృభాష నేర్చుకోకూడదనే ఆంక్షలు ఎక్కడా ఉండవు. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. బహుభాషలను నేర్చుకోవడం ఓ అనివార్యత. మాతృభాషలో విద్యా బోధన జరిగితేనే పిల్లల్లో మనోవికాసం కలుగుతుందని, ఒకప్పటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లో రాణించిన ప్రముఖులందరూ తెలుగులో చదువుకోవడం వల్లనే ఆ స్థాయికి చేరుకొన్నారని వాదిస్తున్నారు. వారి వాదన నిజమే అయితే, విద్యావ్యాపారాన్ని ప్రోత్స హించడంలో భాగంగా మారుమూల పల్లెల్లో సైతం కాన్వెంట్ బడుల ఏర్పాటునకు ప్రభుత్వాలు అనుమతించినపుడు... ఈ భాషాభిమానులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలుగు రాష్ట్రంలో బోధన తెలుగులోనే జరగాలని ఎందుకు ఉద్యమించలేకపోయారు? ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీకగా తమ పిల్లల్ని ఎల్కేజీ స్థాయి నుండే ఇంగ్లిష్ మాధ్యమంలో ఎందుకు చదివించినట్లు? మాతృభాషలో చదివించి గొప్ప వారిని చేయాలన్న తపన వారిలో లేదా? ఆంగ్ల మాధ్యమంలో చదివించి చవటల్ని చేద్దామనుకొన్నారా? ప్రాథమిక స్థాయిలోనే పిల్లలు పలు భాషలను తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. పునాది స్థాయిలో ఇంగ్లిష్‌ను తగిన విధంగా నేర్చుకోలేని విద్యార్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరకు డాక్టరేట్ పూర్తి చేసినా.. ‘స్పోకెన్ ఇంగ్లిష్’ కోర్సుల్లో చేరడం కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వ బడుల్లో చదివే పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకే ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారన్నది నిర్వివాదాంశం. ఎన్నికలలో ప్రజలు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలకు, ముఖ్యంగా నవరత్నాలకు పట్టం కట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సీఎం బాధ్యత. ఇప్పుడు జరుగుతున్నది అదే! వ్యాసకర్త: డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు. ఈ నేపథ్యంలో గుంటురు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అయిదేళ్లపాటు చంద్రబాబు రాష్ట్రానికి అవతరణ దినోనత్సవం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్షల పోరాటం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్యు చేశారని, రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళ్లు అర్పించే అవకాశాన్ని చంద్రబాబు పోగొట్టారని మండిపడ్డారు. నూతన ప్రభుత్వంగా ఏర్పడిన అనంతరం మళ్లీ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలు జరుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీ రాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #APFormationDay — YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2019 పశ్చిమగోదావరి గణపవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅవతరణ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నర్సాపురం ఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధానికి నాంది పలుకుతూ 20% శాతం దుకాణాలను తొలగించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో ఎంపీ మార్గాని భరత్, కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు : బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాళులు అర్పించారు. అలాగే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర వేడుకల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు..తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ కె.దినేష్ కుమార్ పొట్టిశ్రీరాముల విగ్రహానికి పాలభిషేకం చేసి, నివాళులర్పించారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి క్రిష్ణ రెడ్డి...చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మ్మెల్యే విడదల రజిని పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణాజిల్లా ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పామర్రు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన శ్రీ పొట్టి శ్రీ రాములుకు నెల్లూరులో ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావలిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్య వైశ్య సంఘం మహా సభ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారాకానాథ్ ఆధ్వర్యంలో స్టోన్ హౌస్ పేట లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చరిత్రను భావితరాలకు అందివ్వాలని ఆర్య వైశ్య సంఘం నేతలు సూచించారు. పొట్టి శ్రీరాములు సేవలను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్ర అవతరణను జరపడం హర్షణీయమన్నా ప్రకాశం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, కందుల నాగార్జున రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంపురస్కరించుకొని గుర్ల మండలం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయనగరం రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మజ్జి చిన్న శ్రీను పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరిపారు. అధే విధంగా సాలూరు పట్టణ మెయిన్ రోడ్లో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విశాఖపట్నం గాజువాకలో ఆర్యవ్తెశ్య సంఘం ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కులుకూరి మంగరాజు, కారమూరి మహేష్ పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా రాయచోటిలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ రోడ్డులో పోట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తహశీల్దారు కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గోస్ఫాడు మోడల్ స్కూల్ లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తూరు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి చేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీంఅహ్మద్.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
అవే కథలు.. అదే వంచన
‘‘ఈడబ్ల్యూఎస్‌కు ఉన్న 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు టీడీపీ సర్కారు కల్పించింది నిజమే అయితే మార్చిలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల భర్తీలో కాపులకు ఈ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. 5 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది కాపులకు ఉద్యోగాలు ఇచ్చారో? ఎంతమందికి ఉన్నత విద్యలో సీట్లు ఇప్పించారో బాబు చెప్పాలి. ఒక్క మెడికల్ పీజీ సీటైనా ఈ 5 శాతం రిజర్వేషన్ల ద్వారా కాపులకు ఇచ్చి ఉంటే చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా ప్రకటించాలి’’ అని కాపులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో కాపులను నిలువునా వంచించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్లపాటు ఆ సంగతే మర్చిపోయారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతరూపం దాల్చడం, కాపుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో విధి లేని పరిస్థితుల్లో తూతూమంత్రంగా మంజునాథ కమిషన్‌ను నియమించారు. చివరకు ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే హడావుడిగా నివేదికను తెప్పించుకుని, కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. 2019లో రాజకీయ లబ్ధి కోసం మరోసారి బూటకపు ప్రకటనకు తెరలేపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తామన్నారు. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా మాయమాటలతో మోసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. కాపులను బీసీల్లో తానే చేర్చానని ఒకసారి, కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించానని మరోసారి ప్రకటించి, అసలు కాపులు బీసీలా, ఓసీలా అనే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేయడానికి చంద్రబాబు కారకుడయ్యాడే తప్ప ఆ దిశగా చిత్తశుద్ధితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అధికారం ఉందా? ఇప్పటి వరకూ రిజర్వేషన్లు వర్తించని వారికి (అగ్రవర్ణాలకు) పేదరికమే కొలబద్ధగా, కులాలతో సంబంధం లేకుండా విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేస్తే దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని అందరికీ తెలుసు. ఇక్కడ పేదరికమే ప్రామాణికం తప్ప కులాల వారీగా రిజర్వేషన్లను విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ సంగతి తెలుసు. అయినా ఈ 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు 2019 ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడేమో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లను తాను కాపులకు ఇస్తే వైఎస్సార్సీపీ సర్కారు కాపులకు రిజర్వేషన్లు లేకుండా చేసిందని చంద్రబాబు అండ్ కో తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు. కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటి? పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్‌కు లభించిన 10 శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు అన్నట్లు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానాలు కొట్టేస్తే పరిస్థితి ఏమిటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇది తెలిసి కూడా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చి, ఇప్పుడు ఆ వర్గం వారికి ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తే దాన్ని కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేసినట్లు అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని కాపు సామాజికవర్గం నిలదీస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంతగా దిగజారడం దారుణమని మండిపడుతోంది. కాపులతో సహా ఓసీల్లోని పేదలందరూ ఈ 10 శాతం రిజర్వేషన్లు పొందడానికి అర్హులే. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కాపులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. జనాభా ప్రకారం ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 50 శాతానికి పైగా దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కేంద్రం ప్రశ్నకు జవాబు ఏదీ? ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం మీరు కాపులకు ఇస్తామన్నారు. మరి 2017లో కాపులను బీసీల్లో చేర్చుతూ అసెంబ్లీలో బిల్లు చేసి పంపించారు. మరి కాపులను బీసీల్లో చేర్చాలన్న బిల్లును మీరు ఉపసంహరించుకుంటారా?’’ అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2019 ఏప్రిల్ 4న కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేదు. దీన్నిబట్టి కాపుల సంక్షేమం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు మోసకారి ‘‘చంద్రబాబు కాపులను ఓటు బ్యాంకు మాదిరిగానే వాడుకున్నాడు. 2014 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. మంజునాథ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి, తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అది అతీగతీ లేకుండా పోయింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి కాపులకు ఈబీసీ కోటా అన్నాడు. కేంద్రం ఇస్తామన్న 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇస్తామన్నాడు. అది సాధ్యం కాదని తెలిసినా కాపులను దగా చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే కాపులకు బీసీ రిజర్వేషన్లు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కోటాకు వారిని పరిమితం చేసేలా కుట్ర పన్నాడు. కాపులకు రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు చేసిన తీర్మానాలు సరికాదని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈబీసీ కోటా సంగతిని త్వరగా తేల్చకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్టపోతున్నారని ఏపీ హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఈబీసీ కోటా, చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానాలపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పే శిరోధార్యమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు విద్యార్థులు నష్టపోకుండా, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 10 శాతం ఈబీసీ కోటాలో సూపర్ న్యూమరరీ విధానంలో మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు పెంచుకుని, భర్తీ చేయాలని హైకోర్టు ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ కోటాను అమలు చేయక తప్పలేదు. లేకపోతే కోర్టు ధిక్కార నేరం అవుతుంది’’ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్, వైఎస్సార్సీపీ -
ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శాసనమండలిలో సోమవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిపై అనర్హత వేటు పడనీయకుండా స్పీకర్ పదవికి కళంకం తెచ్చారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి గవర్నర్‌ను కూడా వేలెత్తి చూపే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించలేదన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య విలువలకు మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరే ముందు ఎమ్మెల్సీ పదవికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు టీడీపీ కండువా కప్పారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరితే తమ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది చంద్రబాబేనన్నారు. నిషే«ధిత ప్రాంతంలో నిర్మించిన ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు.. సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘హోదా’పై శాసనమండలిలో చర్చ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాడుతుంటే సీఎం మాత్రం కేంద్రంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు మన అవసరం లేకుండా పోయిందంటూ మాట్లాడటం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, అవంతిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్లు చంద్రబాబు ఏనాడైనా గట్టిగా మాట్లాడారా అని ప్రశ్నించారు. హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే సభలో తలవంచుకుని నిలబడతానంటూ బొత్స సవాల్ చేశారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు మనమూ చేద్దామంటూ తాను టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే అందుకు ఆయన ఒప్పుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని చెప్పారు. హోదా విషయంలో వైఎస్ జగన్ తీరు మొదటి నుంచి ఒకేలా ఉందన్నారు. -
‘10 రోజులైంది; ఇంతలోనే ఇన్ని ఆరోపణలా బాబు’
సాక్షి, విజయవాడ : తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తొలి కేబినెట్ సమావేశం విజయవంతంగా జరిగిందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను తమ కష్టాలు తీర్చే నేతగా జనమంతా భావిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆరోపణలతో వారిని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టి ఎన్నిరోజులైంది? ‘చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాను ఆరోపణలతో ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆపొద్దు అని చంద్రబాబు అన్నారు. అసలు సీఎంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి ఎన్నిరోజులైంది. ఎన్నికల కోడ్ చివరి రోజు దాకా కేబినెట్ మీటింగ్‌లు జరిపి చెల్లింపులు చేసింది మీరు కాదా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు మాత్రమే రివ్యూలు చేసే అవకాశం ఉన్నా.. తుపాను వచ్చిన నాలుగురోజులకు చెల్లింపులు జరిపింది నిజం కాదా? నైతికత వీడి, బాధ్యత మరచి ఇప్పుడు నూతన ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇక సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది... ప్రాజెక్టులను ఆపడం భావ్యం కాదంటూ చంద్రబాబు సూచించారు. అసలు రాయలసీమలో ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్. ఆ తర్వాత జలయఙ్ఞంలో భాగంగా వైఎస్సార్ అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఏనాడు ఒక్క ప్రాజెక్టును ఆరంభించింది లేదు. కానీ వాటి వ్యయ అంచనాలను మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈరోజు సీఎం జగన్ వాటిని సమీక్షిస్తామంటే ఆయనకు రుచించడం లేదు. తన ప్రభుత్వంలోని అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారు. అదేవిధంగా తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన రుణమాఫీ హామీ చివరి రెండు విడతలు కొత్త ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతున్నారు. అది మీ వ్యక్తిగత హామీ. సీఎంగా మీ హద్దు ఐదేళ్లు మాత్రమే. అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సింది. ఆలోపు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడమేంటి? అయినా రూ. 87 వేల కోట్ల రైతు రుణాలను కమిటీల పేరిట 24 వేల కోట్లకు కుదించారు. అవి కూడా సక్రమంగా విడుదల చేయలేదు. అయినా సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి పది రోజులు కూడా కాకముందే ఇన్ని ఆరోపణలు చేస్తారా. మీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా’ అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబు తీరును ఎండగట్టారు. కోడికత్తి అని హేళన చేశారు.. ‘టీడీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయి అని చంద్రబాబు అంటున్నారు. టీడీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలపై ఒక్క విచారణ అయినా జరిపారా? అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అని అవహేళన చేశారు. మ్యానిఫెస్టోలోని నవరత్నాలను సెక్రటేరియట్లో పెట్టించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. కానీ మ్యానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు. విశ్వసనీయత లోపించింది కాబట్టే మ్యానిఫెస్టోని తీసేశారు. పోలవరం పేరు చెబితే ఎందుకు మీకు అంత కలవరం? కాగ్ పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని తేల్చింది. ఐదు సంవత్సరాలలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంది. రివర్స్ టెండరింగ్ అంటే మీకు ఉలుకు ఎందుకు? కరకట్ట దగ్గర అక్రమ కట్టడాలు అని చెప్పిన చంద్రబాబు..జిల్లా కలెక్టర్‌తో అక్కడ వుండే వారికి నోటీసులు ఇచ్చారు. మీ జలవనరుల శాఖ మంత్రి 21 కట్టడాలను తొలగిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు...రూ. 4.3 కోట్లు పెట్టి అక్రమమైన స్థలంలో ప్రజావేదిక కట్టారు. గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 100 కోట్లు జరిమానా వేసినా ఖాతరు చేయలేదు. చివరకు బ్రిటిష్ చట్టాలను సైతం బేఖాతరు చేశారు. కరకట్టను సైతం షిఫ్ట్ చేసే సరిపోతుందని ప్రపోజల్ పెట్టిన వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. సామజిక కార్యకర్తలు మేధా పాట్కర్, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ సైతం పర్యటించి కృష్ణా నది లో ఇసుక తవ్వకాలపై ప్రమాద గంటికలు ఉన్నాయని హెచ్చరించారు. కృష్ణానదిని ఆక్రమించి కొత్త హైలాండ్ నిర్మించాలని కుట్ర చేశారు. చంద్రబాబు. ప్రజావేదికను తనకు కేటాయించమనడం దుస్సాహసమే. అక్రమ కట్టడాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తే మరోసారి ఎన్నికల్లో భంగపాటు తప్పదు’ అని చంద్రబాబు పాలనా తీరుపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. -
రేపు గుంటూరులో సీఎం ఇఫ్తార్ విందు
గుంటూరు వెస్ట్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా సుమారు 4 వేల మంది ముస్లిం పెద్దలను విందుకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే రావాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లిం పెద్దలతో ముచ్చటిస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. మారిన వేదిక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలచిన ఇఫ్తార్ విందుకు సంబంధించి తొలుత అధికారులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు బీఆర్ స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన భారీ గాలులతో కూడిన వర్షానికి బీఆర్ స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుని, వేదికను పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య, పార్టీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నంతో పాటు ఎస్పీ విజయారావు శనివారం సాయంత్రం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లోని ఏర్పాట్లను పరిశీలించారు. -
30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించబోతున్నారు. వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్సీపీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
సామాజిక మార్పు కోసమే మద్య నిషేధం
సాక్షి, గుంటూరు: మద్యం వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని చూసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు సంకల్పించారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరు రూరల్ మండలం పలకలూరులోని విజ్ఞాన్ నిరూల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘దశల వారీగా మద్యపాన నిషేధం–ఆచరణాత్మక అమలు ప్రణాళిక’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని పాడుచేస్తూ.. ప్రజలను మద్యానికి బానిసల్ని చేసిందన్నారు. రాష్ట్ర ఆదాయంలో నాలుగో వంతు మద్యం అమ్మకాల ద్వారానే వస్తోందన్నారు. మద్యపాన నిషేధం ద్వారా కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, కుటుంబ సమస్యలకు మద్యం మూల కారణమన్నారు. కేవలం చట్టాలు తీసుకు రావడం వల్ల మాత్రమే మద్య నిషేధం అమలు కాదన్నారు. ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చీప్ లిక్కర్‌పై తక్కువ పన్నులు ఉన్నాయని, తక్కువ హాని కలిగించే హై బ్రాండ్ మద్యంపై మాత్రం ఎక్కువ పన్నులు విధిస్తున్నారని తెలిపారు. ఎక్కువ హాని కలిగించే మత్తు పదార్థాలపై అత్యధిక ట్యాక్స్‌లు వేసి ప్రజలు వాటిని వాడకుండా చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం వల్ల రాష్ట్రంలో కుటుంబ తలసరి ఆదాయం రూ.600 నుంచి రూ.2,000 వరకూ పెరిగినట్టు నివేదికలు వెల్లడించాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో చుక్కనీరు లేక ప్రజలు విలవిల్లాడుతుంటే.. అదే జిల్లాలో మద్యంపై రూ.244 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందన్నారు. కనీసం ఆ మొత్తాన్ని ప్రజల తాగునీటి అవసరాలకు కూడా వినియోగించని అధ్వాన్న పాలన ఐదేళ్లలో కొనసాగిందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం గతంలో అమలు చేయడం, ఆ తరువాత విఫలం చేయడం అప్పట్లో పెద్ద డ్రామా అని పేర్కొన్నారు. తమ పార్టీ కూడా దశలవారీగా మద్య నిషేధాన్ని మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ మద్యం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను ప్రజలకు వివరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో 15 నెలలు మద్య నిషేధం అమలు కాగా, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయని అన్నారు. అలాంటి మద్య నిషేధాన్ని చంద్రబాబు ఎత్తివేయించారన్నారు. మద్య నిషేధం ఉన్నా గుజరాత్‌కు రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తోందని, మన రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పుష్కలంగా ఉన్నా.. మొత్తం ఆదాయం రూ.65 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. సదస్సులో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి, జనచైతన్య వేదిక ఉపాధ్యక్షుడు విజయసారథి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఓటమి భయంతోనే బాబు రగడ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రతి దానికీ పెద్ద ఎత్తున రగడ చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతలోనే ఎన్నికలు జరిగేలా షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తొలుత తప్పుపట్టారని, ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరగడం వల్ల తమకు మేలు జరిగిందంటూ యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఓడిపోయి, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తోందని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే ప్రతి దానికీ పెద్ద రగడ సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మారెడ్డి ఏం మాట్లాడారంటే... చంద్రబాబు కోపానికి అదే కారణం ‘‘చంద్రబాబు అవకతవకలు, అవినీతి, ఆశ్రితపక్షపాతాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు. అందుకే వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కోపానికి అదే కారణం. ఏ చిన్న అంశం దొరికినా వదలకుండా డ్రామాలాడుతున్నారు. ఏదో విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, వివిధ రాష్ట్రాల నేతలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం హేతుబద్ధంగా లేవు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల సంఘం అనుమతితో నిర్వహించేందుకు వీలుంది. కానీ, చంద్రబాబు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని అగౌరవపర్చాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆపద్ధర్మ సీఎం ఆదేశాలను ఎలా పాటిస్తారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్టు అని, సహ నిందితుడని అభ్యంతరకర పదాలు వాడారు. తాను పిలిచినప్పుడల్లా సీఎస్ రావాలి, తాను చేయమన్నది చేయాలన్నట్లుగా బాబు అహంభావంతో ప్రవర్తిస్తున్నారు. వీవీప్యాట్లు, ఈవీఎంలపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పోలింగ్ రోజు చక్కగా ఓటేసి ఫొటోలకు పోజులిచ్చారు. రెండు గంటల తరువాత మాటమార్చి, తన ఓటు ఎవరికి పడిందో తనకే అర్థం కావడం లేదని నిట్టూర్పు విడిచారు. ఎన్నికలను వాయిదా వేయించాలనే దుష్ట సంకల్పంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’’అని అన్నారు. -
అభద్రతా భావంతోనే బాబు రాద్ధాంతం
సాక్షి, అమరావతి : చంద్రబాబు అసహనంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల రగడ జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్మమంత్రి చంద్రబాబు చేస్తున్న పనులేవీ గతంలో జరుగలేదన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు పెట్టారని చంద్రబాబు ఆరోపించడం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడమేనని మండిపడ్డారు. అవివేకులే ఇలాంటివి చేస్తారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని, సీఎం అవుతారని అర్థమయ్యే చంద్రబాబు ఇటువంటి రగడ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు.. ‘ఎలక్షన్ కమిషన్ ఏడవ షెడ్యూల్ ప్రకారం ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. ఎలక్షన్ కమిషన్ అనుమతితో సీఎం సమీక్షలు చేయొచ్చు. కానీ మిగతా సమయంలో సమీక్షలు చేయకూడదు. కానీ చంద్రబాబు కావాలనే సమీక్షలు అంటూ రాద్దాంతం చేస్తున్నారు. పోలవరం పర్యటనకు చంద్రబాబు వెళ్తే ఆయన వెనక నిబంధనలు ప్రకారం ఏ అధికారులు వెళ్ళలేదు. దాంతో అసహనానికి గురై చంద్రబాబు.. సీఎస్, సీనియర్ అధికారులపై పలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, వైఎస్సార్ సీపీ గెలుస్తుందని చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు. ఆయన అభద్రతా భావంలో కూరుకుపోయారు’ అని చంద్రబాబు తీరును ఉమ్మారెడ్డి ఎండగట్టారు. -
టీడీపీ ఓడిపోతుందని తెలిసి చంద్రబాబు అసహనం
-
శ్రామికుల సంక్షేమమే మేడే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా శ్రామిక జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా మే నెల ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) నిర్వహిస్తారని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మే డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కార్మికుల శ్రేయస్సు కోసం అనేక అంశాలు పొందుపరిచినట్లు వివరించారు. ప్రతి కార్మికుడికీ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నాయకులులు ధర్మాన కృష్ణదాసు, అంకంరెడ్డి నారాయణమూర్తి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బి.సంజీవరావు, పాలెం రఘునాథ్‌రెడ్డి, నాగదేశి రవికుమార్, బి.శ్రీవర్దన్‌రెడ్డి, మాజిద్, కనుమూరి రవిచంద్రారెడ్డి, ఆర్.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 23 తర్వాత కార్మిక పక్షపాత సర్కార్: గౌతమ్‌రెడ్డి రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ తర్వాత కార్మిక పక్షపాత ప్రభుత్వం ఏర్పాటవుతుందని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌టీయూ జెండా ఆవిష్కరించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాలనలో కార్మికుల పొట్టగొట్టే చర్యలు ఎన్నో చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ జెండా, అజెండాలో కార్మికుల సంక్షేమం ఉందని.. పార్టీ మేనిఫెస్టోలో మొదటిగా కార్మికుల సంక్షేమం గురించి పొందుపర్చినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసి కార్మిక ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీ ట్రేడ్ యూనియన్ బందరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మాధు శివరామకృష్ణ, విజయవాడ పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ప్రదీప్, విజయవాడ నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథ్ రవి తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, అమరావతి : ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అనే శీర్షికతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పర్వదినాన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో–2019 విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారు. 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసినవి, తెలుసుకున్న అంశాల ప్రధాన ప్రాతిపదికగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. రాష్ట్రంలోని ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించేలా చేయడానికి ‘నవరత్నాల’తో పాటుగా రాష్ట్రాభివృద్ధికి ఓ సమగ్రమైన ప్రణాళికను ఇందులో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పడిన మేనిఫెస్టో కమిటీ కొద్ది నెలలపాటు కసరత్తు చేసి దీన్ని రూపొందించింది. -
వివేకా లేని లోటు తీర్చలేనిది
-
ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు
-
బాబూ.. మీరెన్ని పశువులను కొన్నారు?
విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, నలుగురు ఎంపీలను ప్రతిపక్ష పార్టీ నుంచి కొనుగోలు చేసిన చంద్రబాబు కోల్‌కతా వెళ్లి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విజయనగరం రింగ్‌రోడ్ సమీపంలో శనివారం సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ఏపీలో ఎంత మంది పశువులను కొన్నారో ప్రజలకు తెలియంది కాదన్నారు. నాలుగున్నరేళ్లలో 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశలతో ఆటలాడుకోవటమే గాకుండా, బరితెగించి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన నాయకుడు చంద్రబాబు తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఓట్ల తొలగింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును దక్కనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా వైఎస్సార్సీపీకి చెందిన 22 వేల ఓట్లు తొలగించి, ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లను చేర్పించారన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎటువంటి నిధులు సాధించుకోలేకపోయారని, ఇందుకు వారి స్వార్థం, అవినీతే కారణమని అశోక్‌గజపతిరాజు, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో చేసిన చెత్త పనులకు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో అంటకాగి ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు రావటంతో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నల్లచొక్కాలు వేసుకుని చంద్రబాబు వేషాలు వేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అధికారంలోకొస్తుంది.. అమరావతే రాజధాని
సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది’.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కూడా పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ సంక్షేమ పథకాలనే తాము స్ఫూర్తిగా తీసుకుంటున్నామని, వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలుచేసేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ విజయవాడ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ మంగళవారం తొలిసారి భేటీ అయింది. అనంతరం సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక వర్గాల సమస్యలు, భౌగోళిక పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారని.. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ప్రతీ పేదకు ‘నవరత్నం’ పేదల ముఖంలో చెరిగిపోని చిరునవ్వులుండాలన్న ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించారని, అన్ని వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించే విధంగా ఇందులో పథకాలు పేర్కొన్నారని, వీటన్నింటినీ మేనిఫెస్టోలో పేర్కొంటామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రతి హామీ నూటికి నూరుపాళ్లు అమలయ్యేలా చూడటమే పార్టీ లక్ష్యమంటూ.. వాటిని మేనిఫెస్టోలో పెట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సూచించినట్లు ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి పలు రకాల అనుబంధ విభాగాలున్నాయని.. వీటితో వచ్చే నెల 3 నుంచి మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఆయా జిల్లాల్లో భేటీ అవుతారని ఉమ్మారెడ్డి తెలిపారు. అదే విధంగా విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తున్నామని, మేనిఫెస్టో కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు.. ఇలా అనేక వర్గాల వారు తమ సమస్యలను ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు ప్రత్యేక సెల్‌కు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల వాళ్లు krishnaysrcpoffice@gmail. com అనే మెయిల్‌కు తమ సూచనలు, సమస్యలను పంపవచ్చన్నారు. వాటిని మేనిఫెస్టో కమిటీ పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, రాజధాని భూబాధితులకు జరిగిన అన్యాయాలనూ మేనిఫెస్టోలో పెడతామన్నారు. మేనిఫెస్టోలో హోదాకు చోటు విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, పాడి పరిశ్రమ అంశాలపై సబ్ కమిటీని ఏర్పాటుచేసి సమాచారం సేకరిస్తామన్నారు. మహిళా సంక్షేమం, వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించి, తుదిరూపం ఇవ్వాలనుకుంటున్నట్టు ఉమ్మారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పీడిక రాజన్నదొర, షేక్ అంజద్‌బాషా, పాముల పుష్పశ్రీవాణి, ఆదిమూలపు సురేష్, తమ్మినేని సీతారాం, జంగా కృష్ణమూర్తి, ఆళ్ళూరు సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, షేక్ మహ్మద్ ఇక్బాల్, ముదునూరు ప్రసాద్‌రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, ఎంవీఎస్ నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట విద్య, ఉపాధి రంగాలు తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్గించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ పథకాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా చదువు పూర్తయిన వారికి వృత్తి నైపుణ్యం అందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టరేట్‌ను పెట్టాలని భావిస్తున్నామన్నారు. అలాగే, పేదలకు అత్యంత ప్రధానమైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను మరింత మెరుగుగా ప్రజలకు అందించే అంశంపై చర్చించి, దాన్ని మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ సైనికోద్యోగుల సమస్యలు కూడా సమీక్షిస్తున్నామన్నారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం తన వాళ్లకే ఇళ్లిచ్చి పేదలకు అన్యాయం చేస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి ఇల్లు అందేలా చూస్తామని చెప్పారు. అంతేకాక, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ప్రవాస భారతీయుల సమస్యలూ పరిగణలోనికి తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా మెరుగుపర్చుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా పెంచుకునే దిశగా కూడా మేనిఫెస్టో కమిటీ దృష్టి పెట్టిందని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. -
సంక్షేమం, అభివృద్ధే మా ఎన్నికల అజెండా!
సాక్షి, అమరావతి : ఎన్నికల మేనిఫెస్టో అంటే తప్పుడు వాగ్దానాలతో ఓట్లు దండుకోవడం కాదని.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఐదేళ్ల కాలంలో అమలుచేయడమే మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నూటికి నూరు శాతం అమలుచేసే వాగ్దానాలనే తమ పార్టీ చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26న విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుందనే అంశాలపై ఆ సమావేశంలో ప్రణాళికను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 31 మందితో కమిటీని ప్రకటించారని, తొలి సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనలో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించాలన్న దానిపై తమ అధినేత నిర్ధిష్టమైన సూచనలు ఇచ్చారని, వాటి ప్రాతిపదికగా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. అలాగే, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను ఇందుకు స్ఫూర్తిగా తీసుకుంటామని ఉమ్మారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో వైఎస్సార్ సమతుల్యత పాటించారని వివరించారు. జలవనరుల అభివృద్ధి, వ్యవసాయం పండుగ, అన్ని వర్గాల సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా ఆయన చేపట్టిన కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపర్చేలా చూడాలని జగన్ సూచించారన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలు నూటికి నూరుపాళ్లు అమలుచేస్తామనే భరోసా ప్రజలకు ఇచ్చేలా ఉండాలని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన ‘నవరత్నాలు’ అమలుచేస్తామని.. వీటితో వివిధ వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని ఉమ్మారెడ్డి చెప్పారు. అలాగే, ప్రజాసంకల్ప యాత్రలో జగన్ దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపకల్పన ఉంటుందని చెబుతూ మేనిఫెస్టోలో పొందుపరిచే నవరత్నాలను వివరించారు. అవి.. - నిరుపేద విద్యార్థుల బతుకులు మార్చిన ఫీజు రీయిుంబర్స్‌మెంట్, వైఎస్సార్ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ, రైతుకు అండగా నిలబడే వైఎస్సార్ రైతు భరోసా అంశాలకు అందులో ప్రాధాన్యత ఇస్తామన్నారు. - అలాగే, జలయజ్ఞం పథకం కింద రైతు సంక్షేమం కోసం వనరులన్నీ ఒడిసిపట్టి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని వివరించారు. - గతంలో ప్రభుత్వాలు అమలుచేయలేని మద్యం నిషేధాన్ని దశల వారీగా నిషేధించేలా చూస్తామని.. మహిళల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని దీనిని ఒక ప్రధాన అంశంగా తీసుకొస్తామన్నారు. - అమ్మ ఒడి కార్యక్రమం కింద పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివిస్తామన్నారు. - అలాగే, నిరుపేద వృద్ధులకు ఒక భరోసా కల్పించేలా వైఎస్సార్ ఆసరా పథకం ఉంటుందన్నారు. - పేదవారికి పక్కా ఇళ్లు ఉండాలి.. పూరి గుడిసె కనిపించకూడదు అనే నినాదంతో పేదలందరికీ ఇళ్లు అనే ప్రధాన అంశం తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టబోతున్నామని చెప్పారు. - ఎప్పుడో ఇచ్చిన పెన్షన్లు కాకుండా, ఆ మొత్తాన్ని పెంచడం, పెన్షన్ల అర్హత వయస్సును తగ్గించడం, చేతి వృత్తుల వారికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపడతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇచ్చే పథకం కూడా ఇందులో ఉంటుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. ప్రతి రూపాయికీ లెక్క చెబుతాం ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించడంతోపాటు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతి పైసానూ దుబారా చేయకుండా.. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఖర్చుచేస్తామని ఆయన వివరించారు. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా తీసుకువెళ్తామని ఉమ్మారెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, మేనిఫెస్టో కమిటీ ఒకటి ప్రభుత్వంలోనూ ఏర్పాటుచేస్తామన్నారు. పరిపాలన ప్రజల కోసమేగానీ నాయకుల కోసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో మాదిరిగా జన్మభూమి కమిటీలు వేసి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయకూడదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
గవర్నర్ ప్రసంగం అబద్దాలతో కూడుకున్నది
-
కాపు రిజర్వేషన్ల పేరుతో బాబు కుట్ర
సాక్షి, అమరావతి బ్యూరో: సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందని, పార్లమెంటు ఉభయసభలు దీనిని ఆమోదించాయని తెలిపారు. రాష్ట్రాలు ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించాలని, సగం రాష్ట్రాలు ఆమోదిస్తే చాలని అన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు వివాదానికి తెరలేపుతున్నారని, బిల్లు విత్ ఇన్ ది బిల్ పేరుతో రాష్ట్రంలో ఒక బిల్లు చొప్పించి, కాపులకు రిజర్వేషన్లు ఈబీసీల కోటాలో కేటాయిస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న ఈబీసీ రిజర్వేషన్లను బాబు రాజకీయ ప్రయోజనాల కోసం, కాపులను మోసగించడానికి వాడుకుంటున్నారని చెప్పారు. ఈబీసీ 10 శాతం కోటాలో 5 శాతం కాపులకు ఇస్తామంటూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని, ఎస్సీ వర్గీకరణ పేరుతోనూ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టారని వివరించారు. వాస్తవానికి ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు అనేవి చంద్రబాబు చేతుల్లో లేవని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాలు కేవలం ఆమోదించిందీ లేనిదీ మాత్రమే వెల్లడించాల్సి ఉందన్నారు. సవరణ ప్రతిపాదించే హక్కు మాత్రం లేదన్నారు. పార్లమెంటు జరుగుతున్నప్పుడే దాన్ని పొందుపరచమని అడగొచ్చని, బాబు అలా చేయలేదని వివరించారు. టీడీపీ ముసుగు తొలిగింది పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ముస్లింమైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పొందుపర్చాలని కోరారని, అయితే ఆ రిజర్వేషన్లు ఓబీసీలకేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పార్లమెంట్లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండని టీడీపీ సభ్యులెవరూ నోరుమెదపలేదని తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ‘ఏపీ నుంచి కాపు రిజర్వేషన్ ప్రతిపాదన వచ్చింది.. అది ఎంతవరకొచ్చింది’ అని ప్రశ్నించగా, సాక్షుత్తు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ‘ఏపీ నుంచి అటువంటి ప్రతిపాదన రాలేదు.. అలాంటప్పుడు అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదు’ అని చెప్పడంతోనే టీడీపీ ముసుగు తొలగిందన్నారు. కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టినందుకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు సీఎంకు అభినందనలు తెలిపారని, ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసి కూడా ఇలా చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పుడు ఈబీసీలకు, కాపులకు మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తనవేనని చెప్పబోతున్న చంద్రబాబు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు వచ్చిన ప్రజా స్పందన చూసి మతిభ్రమించిన బాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక ఇప్పటికే కొన్ని నవరత్నాలను దొంగలించారని ఎద్దేవా చేశారు. రత్నాల దొంగలు రాజకీయాల్లోకి వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. 2017లో జగన్ గుంటూరు ప్లీనరీ సభల్లోనే పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని చెప్పారని, ఇప్పుడు బాబు నిద్ర లేచి తాను కొత్తగా ఇచ్చినట్టు చెబుతున్నారని విమర్శించారు. రైతురక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను దొంగలించి.. అవి తనవేనని బాబు చెప్పబోతున్నారని చెప్పారు. కోల్‌కతాలో చంద్రబాబు కర్ణాటకలో ఫిరాయింపులపై మాట్లాడటంపై అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి.. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల పేర్లు ఇప్పటికీ అసెంబ్లీ గెజిట్‌లో వైఎస్సార్సీపీ జాబితాలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ.1252 కోట్లు బకాయిలున్నాయని, దీంతో విద్యార్థుల చదువులు ముగిసినా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు నిలిచిపోయాయని, ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ నాయకత్వ ప్రమేయం వైఎస్ జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ నాయకత్వ ప్రమేయం, కుట్ర కోణం దాగి ఉన్నాయని ఉమ్మారెడ్డి అన్నారు. లేకుంటే ఎన్ఐఏ దర్యాప్తునకు సహకరించకపోగా ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, హైకోర్టులో స్టే కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రమేయం లేదంటే ఎన్ఐఏకు సహకరించి రికార్డులు అప్పగించాలని సూచించారు. పొత్తుల కోసం ఆరాటపడేది టీడీపీయేనని.. వైఎస్ జగన్ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మారెడ్డి వివరించారు. -
బెడిసి కొట్టిన రాజకీయ క్రీడ
సందర్భం ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో విలక్షత కన్పించింది ఒక్క తెలంగాణలోనే. తక్కిన 4 రాష్ట్రాలలో ఓటర్లు మార్పును ఆశించారు, ఆహ్వానించారు. తెలంగాణ ఓటరు మాత్రం తమకు ఆ అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజా కూటమి పేరుతో సిద్ధాంతరాహిత్యంతో ఒక్కటై పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం, టీజెఎస్, సీపీఐలకు ఎదురైంది ఓటమి అనేకంటే ఘోరపరాభవం అనడం సముచితం. బలం లేకున్నా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయి బీజేపీ తన పరువు తానే తీసుకొంది. కుల పార్టీలతో కలిసి ‘బహుజన లెఫ్ట్ పార్టీ’గా సీపీఎం జనం ముందుకెళ్లినా లభించింది సున్నాయే! సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్ఎస్ : కేసీఆర్ పాలనలో ఎన్నదగినది ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయడం. బడ్జెట్ నిధుల్లో 39% మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొక్కుబడిగా కాకుండా నిజాయితీగా, చిత్తశుద్ధితో తమ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు కృషి చేయడాన్ని వేరొకరు కాకుండా ఆయా వర్గాలు గ్రహించగలిగాయి. విశిష్ట పథకాలుగా కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ, పండుగలకు పేదలకు అభివృద్ధి కానుకల పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూవ్ు ఇళ్ల నిర్మాణం మొదలైన పథకాలు సామాన్యులను ప్రభావితం చేశాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొదలైనవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటికన్నా మిన్నగా రైతు భీమా, వ్యవసాయ పెట్టుబడి రాయితీలు, సాగునీటి పథకాలు, హామీ మేరకు వ్యవసాయ రుణమాఫీ లాంటివి రైతాంగంలో ఎనలేని భరోసా కల్గించగలిగాయి. పైగా, గొర్రెల పంపిణీ, పాల పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ లాంటివి సామాన్యుని మనో ధైర్యాన్ని పెంచాయి. కనుకనే ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా, వాటిని చెవికెక్కించుకోకుండా ప్రజలు తమ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చాటుకున్నారు. ప్రజా కూటమి విఫలం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పార్టీ తొలి రోజు నుండి టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాట నిజమే. అయితే, 2014లో ఎదురైన ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ఆధిపత్య ధోరణులు తగ్గలేదు. దానికితోడు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత, ఎక్కువ పెత్తనం అప్పజెప్పడం చాలామందికి మింగుడు పడలేదు. పీసీసీ అధ్య క్షుడ్ని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడ్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తులపరంగా అధికార పార్టీని విమర్శించడంలో కాంగ్రెస్ నేతలు ముందున్నప్పటికీ, ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించలేకపోయారు.మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తన సహజలక్షణాలను విడిచిపెట్టలేదు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలపడలేదు. ఇక, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో జతకట్టడం ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశమైంది. నిర్మాణం గానీ, నాయకులు గానీ లేని కోదండరావ్ పార్టీని కలుపుకోవడం కాంగ్రెస్ చేసిన మరో తప్పిదం. సీపీఐను కలుపుకోవడం వల్ల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంతమేర లాభం చేకూరింది. మొత్తం మీద ‘ప్రజాకూటమి’ ఏర్పాటు అన్నది సహజ రాజకీయ ప్రక్రియగా జరగలేదు. తెలంగాణ ఉద్యమం ఆసాంతం నడిచింది ఆత్మగౌరవ నినాదాంతోనే. అటువంటిది ప్రజా కూటమి గెలిస్తే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తిరిగి పెత్తనం సాగించ గలడన్న భయాందోళనలు తెలంగాణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కన్పించాయి. చంద్రబాబు పదేళ్ల పాలనలో ‘పల్లెకన్నీరు’ పెట్టింది. రైతాంగం, చేనేతలు, కులవత్తులవారి ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెలంగాణ పల్లెల్లో మత్యు ఘోష విన్పించింది. ఫలితంగానే, టీఆర్ఎస్కు ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చి ప్రజాకూటమిని మట్టి కరిపించారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అనుభవాన్ని దష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా వెళ్దామని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొంటే.. దండిగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుతాయన్న ఆశ కొందరిలో బలంగా ఉంది. డబ్బుతో కొన్ని సీట్లయినా గెలవచ్చునని కొందరు కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ‘టీ’ అంటే తినడం; ‘డీ’ అంటే దోచుకో వడం; ‘పీ’ అంటే పంచుకోవడంగా టీడీపీ తయారైందని, చంద్రబాబు రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ కార్యకర్తలకు పాఠాలు బోధించింది. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్లు ఏ పార్టీనైతే నాలుగున్నరేళ్లుగా విమర్శిస్తూ వస్తున్నారో.. ఆ పార్టీతో జాతీయస్థాయిలో, తెలంగాణలో చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పొత్తును సమర్థించుకోవడానికి చూపగల హేతుబద్ధమైన కారణం ఏదీ రాష్ట్ర కాంగ్రెస్ వద్ద లేదు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష, జ్ఞానభేరి మొదలైన కార్యక్రమాలను ప్రజాధనంతో నిర్వహిస్తూ.. ఆ వేదికల నుండి తను ఎందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నారు. తమ కలయికకు నైతికత ఆపాదించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర విభజన సహేతుకంగా చేయని ‘పాపి’ కాంగ్రెస్ పార్టీ అని తిట్టిన చంద్రబాబునాయుడు ఆ ‘పాపి’ తోనే చేతులు కలపడాన్ని ఆంధ్ర ప్రజానీకం హర్షిస్తుందా? ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణలో తెలుగుదేశం ఓటమికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడమే కారణమని సొంత మీడియాలో కథనాలు రాయించుకొని పరువు నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం తాపత్రయ పడుతున్నది. మరోపక్క తెలుగుదేశం వల్ల ఓటమి ఎదురైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోలో పల మధనపడుతున్నది కానీ, బాహాటంగా చెప్పడానికి ధైర్యం చేయలేకపోతోంది. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను, ప్రధాని మోదీని గద్దె దించడం ప్రజాస్వామ్య అనివార్యతగా తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది. అవినీతికి పాల్పడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ దేశానికి ప్రమాదకారిగా చంద్రబాబునాయుడు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల అంశంగా అవినీతిని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కావడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివస్తే.. ఆ రెంటి విషయంలో మోదీ ప్రభుత్వం కంటే చంద్రబాబు సర్కార్ అందనంత ఎత్తులో ఉంది. ఈ లెక్కన చంద్రబాబు సర్కార్‌ను ఓడించడం ప్రజాస్వామ్యరీత్యానే కాదు.. రాజ్యాంగరీత్యా, ప్రజా ప్రయోజనాలరీత్యా అనివార్యం! తెలంగాణ ఎన్నికలో చంద్రబాబు సాగించిన రాజకీయ క్రీడ బెడిసికొట్టింది. ఇక మిగిలిందల్లా.. ఏపీ ఎన్నికలే. వ్యాసకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి -
‘పోరాడితే కేసులా.. మరి హోదా సాధించని బాబు సంగతి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీ వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు. ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది?’ అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదు: ఎంపీ రమేష్ ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. -
ప్రజాహితానికి నాంది పలకాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రానున్న ఎన్నికల్లో గద్దెనెక్కించడం ద్వారా ప్రజాహితానికి నాంది పలకాలని ఆ పార్టీ సీనియర్ నేతలు పిలుపునిచ్చారు. జగన్‌ను ప్రజలు ఆశీర్వదించి ఈ దఫా ముఖ్యమంత్రిని చేస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడంలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిపోతారని వారు విజ్ఞప్తి చేశారు. జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో భారీ కేక్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కట్ చేశారు. అలాగే, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఏపీ అసెంబ్లీలోనూ వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్‌ను ఒక్కసారి ఆశీర్వదించాలి కేంద్ర కార్యాలయంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ ప్రజాహితం కోరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అలాగే, జగన్ కూడా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన తండ్రిని మించిపోతారని విశ్వాసం వ్యక్తంచేశారు. అందుకే ప్రజలు ఒక్కసారి జగన్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నానని మేకపాటి విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ రోజురోజుకూ ప్రజల హృదయాల్లో తన స్థానం పదిలం చేసుకుంటున్నారన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి జగన్‌కు ఓ అవకాశం ఇవ్వండి అని ఏపీ ఓటర్లకు సవినయంగా విజ్ఞప్తి చేద్దామని ఆయన కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌పై ఎన్ని కుట్రలు జరిగినా ఆయన అన్నింటినీ ఛేదించుకుని జనం హృదయాల్లో నిలిచిపోతారన్నారు. మంచి నాయకత్వ లక్షణాలున్న జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే జన్మదిన వేడుకలను జగన్ ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటారని ఐపీఏస్ మాజీ అధికారి, విజయవాడ పార్లమెంటు జిల్లా సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ ఆకాంక్షించారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎన్. పద్మజ, కొండా రాఘవరెడ్డి, బి.రాజశేఖరరెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్ల తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో.. కాగా, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి తదితర పార్టీ నేతలు భారీ కేక్ కట్ చేశారు. పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. పార్థసారథి, లక్ష్మీపార్వతి, సినీనటుడు పృథ్వీ, వెలంపల్లి, మల్లాది విష్ణు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో విజయ్‌చందర్, గౌతంరెడ్డి, కాలే పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. ఏపీ అసెంబ్లీలోని వైఎస్ జగన్ చాంబర్లోనూ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కేక్ కట్‌చేశారు. పలువురు కార్యాలయ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పాల్గొని కేక్ కట్‌చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ స్థూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వేడుకల్లో పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లాలో మెగా జాబ్‌మేళా వైఎస్సార్ జిల్లాలోనూ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప, పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. కడపలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 72 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డిలు కూడా వేడుకలు నిర్వహించారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు.. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. అనేకచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కోన రఘుపతి, సత్తెనపల్లి సమన్వయకర్త అంబటి రాంబాబు, ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేమూరుకు చెందిన షేక్ సలీమ్ శుక్రవారం మక్కాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కడపలో జరిగిన జాబ్‌మేళాలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులు విశాఖ జిల్లాలో గీతం, ఏయూ వర్సిటీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో బైకులు, కారుల్లో యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ నేతృత్వంలో 20 కేజీల భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూడి ముత్యానాయుడు కేక్ కట్‌చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు హుషారుగా వేడుకలు నిర్వహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. అనిల్‌కుమార్ రాజన్న పారిశుద్ధ్య చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించి ఆటోలను సమకూర్చారు. తడలో తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాదరావు జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఉరవకొండ, మడకశిరలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, తిప్పేస్వామి కేక్‌కట్ చేశారు. శింగనమలలో భారీఎత్తున క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి కేకు కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర కేక్ కట్‌చేశారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి కేక్ కట్‌చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్ కోసం సర్వమత ప్రార్థనలతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని కేక్ కట్‌చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు ఇతర నేతలు ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. -
రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోనే 43 వేల డూప్లికేట్ ఓట్లున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాత్కాలిక సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాను కలిసి గురజాల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దొంగ ఓట్లు చేర్పించడంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది అందెవేసిన చేయి అని ఆరోపించారు. గురజాలలో డూప్లికేట్ ఓటర్ల పూర్తి వివరాలు తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఫారం నంబర్ 7లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఆర్డీవో పట్టించుకోలేదన్నారు. యరపతినేని ఒత్తిళ్లు తట్టుకోలేక మాచవరం తహసీల్దార్ సెలవులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు చూసిన తరువాత పరిశీలించి వారు కూడా అన్యాయం అంటున్నారని, కానీ చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అధికారం ఉన్నవాడి చేతుల్లో విచ్చలవిడితనం మంచిది కాదన్నారు. గురజాల నియోజకవర్గంలో 13 వేల దొంగ, నకిలీ ఓట్లున్నట్లు గుర్తించామన్నారు. సెప్టెంబర్ 30లోపే ఆర్డీవోకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఈసీకి ఆధారాలతో సహా అందజేశామన్నారు. 2004లో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 96 లక్షల దొంగ ఓట్లున్నాయని ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించి తొలగించిందని గుర్తు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టుకు వెళ్తామన్నారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, రూరల్ మండలాల్లోనే 8 వేల దొంగ ఓట్లున్నాయని వీటన్నింటినీ తొలగించాలని కోరినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటాం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినందున తప్పకుండా విచారించి చర్యలు తీసుకుంటామని ఈసీ సిసోడియా వైఎస్సార్సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్‌రెడ్డిలకు హామీ ఇచ్చారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ హార్డ్‌కాపీలు కూడా తీసుకున్నారు. డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
‘ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి రాహుల్ గాంధీకి కప్పారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నటుడు పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి చంద్రబాబు రాహుల్ గాంధీకి కప్పారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం నందమూరి సుహాసినిని బాబు బలిపశువుని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గాలి 30 ఏళ్ల పాటు ప్రజలకు అందాలని ఆకాక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘మా అధినేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు జాతి గర్వించే నాయకుడు వైఎస్ జగన్. ఆయనను త్వరలో సీఎంగా చూడబోతున్నాం. వైఎస్ జగన్‌ను రాష్ట్ర భవిష్యత్‌గా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయ’ని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. కృష్ణా జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహబూబ్ షేక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కంటి, షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 47 కిలోల భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయచందర్, గౌతమ్ రెడ్డి, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, అడపా శేషు, ఎంవీఆర్ చౌదరి, తోట శ్రీనివాస్, కాలే పుల్లారావు, వెంకటేశ్వర శర్మ, అవుతు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆసిఫ్ వేడుకల్లో పాల్గొన్నారు. -
చిత్తూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం
-
తుపాను బాధితులను జగన్ ఆదుకుంటారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బాధితులందరినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తప్పకుండా ఆదుకుంటారని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలను పరిశీలించేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి, రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తదితరులతో కలిసి మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. బాధితులంతా తాగునీరు, తిండిలేక ఆకలి కేకలు వేస్తుంటే సీఎం చంద్రబాబు ప్రచారార్భాటం, ఫొటోల కోసమే పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారుల సమయమంతా సీఎం, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయడానికే సరిపోతోందని వారు విమర్శించారు. తోటలు, పంట నష్టాల గుర్తింపులో అనేక ఆంక్షలు విధిస్తున్నారని.. ఏదో ఒకలా విస్తీర్ణం తగ్గించేసి తూతూమంత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు కానీ, నీటి ట్యాంకర్లు కానీ కనిపించట్లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. దాదాపు 400 గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక, చంటిపిల్లలకు పాలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కానీ, సీఎం మాత్రం తాను ఇచ్చిన జాబితాలో పేరున్న వారికే నీరు ఇవ్వండని చెప్పడం దారుణమన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో టెక్నాలజీ ఏమైందని చంద్రబాబును పార్థసారధి ప్రశ్నించారు. న్యాయబద్ధంగా పరిహారాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నేతలు కొలుసు పార్ధసారథి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, సీడీసీ మాజీ చైర్మన్ నెరుసు సతీష్‌లు తుపాను బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా.. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను వచ్చి రోజులు గడుస్తున్నా బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం కాకపోవడం, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని.. నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న ప్రజలు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వారం రోజులు గడిచినా విద్యుత్ సరఫరా చేయరా అంటూ సాయిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో వైఎస్ జగన్ రాక బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తుపాను బాధితులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. వారికి భరోసా ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను ఆదేశించారన్నారు. త్వరలోనే ప్రతీఒక్క బాధిత కుటుంబాన్నీ ఆయన కలుస్తారన్నారు. ప్రభుత్వం నుంచి తగిన రీతిలో పరిహారం అందేవరకూ తమ పార్టీ పోరాడుతుందని ఆయన అభయం ఇచ్చారు. తుపాను బాధితులపట్ల మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఎవరికి ఓటేశారో వారినే పరిహారాలు అడగండని అవహేళన చేయడం సిగ్గుచేటన్నారు. -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలి
హైదరాబాద్/విజయవాడ సిటీ: స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వీరుల చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘72 ఏళ్ల స్వాతంత్య్రంలో మనం 74 శాతం మాత్రమే అక్షరాస్యత సాధించాం. అక్షరాస్యత ఉన్నచోట ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఆ విషయాన్ని దివంగత సీఎం వైఎస్సార్ గుర్తించి ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని ఆకాంక్షించారు. త్వరలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని, దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించే వ్యక్తిగా తయారవుతారని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, రెహమాన్, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతీ, నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కన్న కలలను సాకారం చేయడానికి వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కృషి చేస్తోందన్నారు. -
జన హృదయాల్లో చెరగని ముద్ర
సాక్షి నెట్వర్క్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 69వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జరిగిన కార్యక్రమంలో శాసనమండలి సభాపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరపురాని పాలనతో ప్రజల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. నెల్లూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న పార్టీ నాయకులు - ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. - నెల్లూరు జిల్లా కేంద్రం సహా వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. - పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్టీ నేతలు కేక్ కట్‌చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. - తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నేతృత్వంలో ‘రాజన్న పుట్టిన రోజు–రైతన్న పండుగ రోజు పేరిట వినూత్నంగా నిర్వహించారు. వేదికపై ఆశీనులైన వారందరూ రైతులే. - విశాఖ జిల్లా, సిటీ వ్యాప్తంగా పార్టీలకతీతంగా వైఎస్సార్ జయంతి నిర్వహించారు. - విజయనగరం పట్టణంలో ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలు, పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. - శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. - చిత్తూరు జిల్లాలో పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. - వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆటో కార్మికులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో భారీ ఆటోర్యాలీ నిర్వహించారు. - అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహానేత జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. - కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కలలు సాకారం కావాలంటే జననేత వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకుందామని పలువురు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ చార్జిషీట్
-
చంద్రబాబు నయవంచకుడు
నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా విషయంలో అడుగడుగునా రాష్ట్ర ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దిమ్మ తిరిగేలా వచ్చే ఎన్నికల్లో జవాబు చెప్పాలని నెల్లూరు నగరంలో శనివారం జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అనుభవజ్ఞుడినని చెప్పుకుని అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. తనను మోదీ మోసం చేశారని మాయమాటలు చెబుతూ ముందుకు వస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరాదని గర్జన వేదికగా నేతలు కోరారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మోసపూరిత విధానాలకు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో శనివారం రెండో విడతగా ‘వంచనపై గర్జన’ ఒక రోజు నిరాహారదీక్ష జరిగింది. ఈ దీక్షలో ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉ.9 గంటలకు నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన నేతల దీక్ష సా. 5గంటలకు ముగిసింది. నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసినప్పటికీ నేతలు తమ ప్రసంగాలను కొనసాగించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు కదలకుండా ప్రసంగాలను ఆలకించారు. దీక్ష ప్రారంభం అయ్యేటప్పటికే వేదిక ప్రాంగణంలోకి పెద్ద సంఖ్యలో వచ్చిన జనం తమ నేతల దీక్షకు సంఘీభావం పలికారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను ఎండగట్టినపుడల్లా వారు హర్షధ్వానాలతో స్వాగతించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి కాగా, చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలలోని డొల్లతనాన్ని నాయకులు ఎలుగెత్తి చాటారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణదొక్కాలని చూసిన చంద్రబాబు ఇపుడు హోదా కావాలని మాట మార్చడంపై ముందుగా క్షమాపణ చెప్పాలని వక్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో హోదా బాట పట్టి దొంగదీక్షలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచీ ఏనాడూ చంద్రబాబు హోదా కావాలని కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదని.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచమని మాత్రమే ఎప్పుడూ కోరారన్నారు. హోదాను సమాధి చేయాలని చంద్రబాబు చూస్తే.. దానిని నాలుగేళ్లుగా సజీవంగా ఉంచింది జగన్ అని నేతలు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ.. విభజన చట్టంలోని హామీల అమలులోనూ మోసగాడు నెం 1 ప్రధాని మోదీ అయితే.. మోసగాడు నెంబర్ 2 చంద్రబాబు అని ఓ నేత అన్నప్పుడు దీక్షలో చప్పట్లు మార్మోగాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీతో సంబంధాలు అంటగట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవానికి మోదీతో పోరాటం అంటూనే లోపాయికారీగా లాలూచీ పడుతున్నది చంద్రబాబేనన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత తనపై కేంద్రం దాడిచేస్తుందని, అందరూ తనకు రక్షణగా నిలవాలని బెంబేలెత్తిపోయిన చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దాడి జరుగలేదంటే లోపాయికారీగా వారితో లాలూచీ పడినట్లు కాదా అని అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తొలుత విమర్శించిన బీజేపీ నేతలు ఆయనపై ఇంకా విచారణ ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని కొందరు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో సోనియాను ఇటలీ దయ్యం అన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె దేవత అయ్యిందా? అని కొందరు వ్యంగ్యోక్తులు విసిరారు. కర్ణాటకలో రాహుల్‌గాంధీ వీపుపై దువ్వారంటేనే ఆయన ఎంతటి కుటిలనీతిని ప్రదర్శిస్తున్నారో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయినట్లుగా ఉందని, పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను చిత్తుగా ఓడించవచ్చని వక్తలు పేర్కొన్నారు. బీజేపీ చేతిలో మోసపోయానంటున్న చంద్రబాబు తన నలభై ఏళ్ల అనుభవం ఎందుకు పనికొచ్చింది? అని వక్తలు సూటిగా ప్రశ్నించినపుడు దీక్షలో ఈలలు, చప్పట్లు మోగాయి. ప్రస్తుతం 20 మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని హోదా సాధించలేని చంద్రబాబు.. ఇప్పుడు తనకు 25 ఎంపీలను గెలిపించి ఇస్తే హోదా తెస్తాననడం ప్రజలను మోసం చేయడమేనని, ఆయన్ను నమ్మొద్దని నేతలందరూ ముక్తకంఠంతో ప్రజలను కోరారు. మోదీ, బాబు ‘జాయింట్ వంచన’: ఉమ్మారెడ్డి మోదీ, చంద్రబాబు కలసి జాయింట్‌గా రాష్ట్ర ప్రజలను వంచనకు గురిచేశారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకురావడంలో బాబు విఫలమయ్యారన్నారు. నవనిర్మాణ దీక్షలకు జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.2.30 లక్షల కోట్ల అప్పులు చేసిన బాబు అమరావతి కోసం మరో రూ.2 వేల కోట్లు బాండ్ల రూపంలో దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెడచెవిన పెట్టారు: ఎంపీ వరప్రసాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం 13 సార్లు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి హోదా రాకపోవటానికి కారణం 40 శాతం మోదీ అయితే, 60 శాతం బాబు అని విమర్శించారు. అన్ని వర్గాలకు అన్యాయం: మేరుగ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. బాబు కల్లబొల్లి మాటలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు నష్టపోయారన్నారు. హోదా బ్రాండ్ అంబాసిడర్ జగన్: పెద్దిరెడ్డి ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్‌గా వైఎస్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే నేడు ఆ పార్టీతో కలిసిపోయే విధంగా బాబు ప్రణాళిక రూపొందించారన్నారు. కాగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన సొంత ఊరు నారావారిపల్లిలో అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీడీపీ జెండాను మోస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. కూకటివేళ్లతో పెకలించాలి: భూమన రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ను కూకటివేళ్లతో పెకలించాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దగాకోరు మంత్రులతో రూ.3.50 లక్షల కోట్లు లూటీ చేసి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతుల పొలాలను, ప్రభుత్వ భూములను స్వాహా చేశారన్నారు. బాబు, మోదీల రహస్య ఒప్పందం మేరకే హోదా రాలేదన్నారు. జగన్‌ను చూసి 40ఏళ్ల అనుభవం భయపడుతోంది: పృథ్వీరాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు నలభై ఏళ్ల అనుభవం ఉందని ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పదవులను త్యాగం చేసిన తమ ఐదుగురు ఎంపీలు హీరోలే అని పేర్కొన్నారు. మోదీ, బాబుల లాలూచీ: అంబటి బీజేపీ, టీడీపీలు బయట ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా లోపల మాత్రం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మధ్య లాలూచీలు జరుగుతూనే ఉన్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మోదీ తనను మోసం చేశారని చెబుతున్న బాబు.. 40ఏళ్ల అనుభవం ఉండి ఎలా మోసపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చీల్చింది బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలని, రానున్న రోజుల్లో వీటిని తరిమికొట్టాలని ప్రజలకు అంబటి పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రెండు పార్టీల దగా: వైవీ పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దగా చేశాయన్నారు. కేంద్రం తీరని అన్యాయం చేసింది కాబట్టే తమ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబులు కలిసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాలుగేళ్లు వెన్ను పోటు పొడిచారన్నారు. హోదా ఇచ్చే వారికే మా మద్దతు: సజ్జల రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తారో వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని పేర్కొన్నారు. బాబు అనుభవంతో ఉపయోగంలేదు: ఎంపీ అవినాశ్ ప్రత్యేక హోదా రాకపోవడంలో మొదటి ముద్దాయి బీజేపీ అయితే రెండో ముద్దాయి టీడీపీ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధ్యంకాదని అరుణ్‌జైట్లీ చెప్పినప్పుడు చంద్రబాబు ఎదురుతిరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పైగా ఆయనకు సన్మానం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన చంద్రబాబు ఏపీకి సాధించింది ఏమీలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎంపీలు విజయసాయిరెడ్డి అస్వస్థత కారణంగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విదేశాలకు వెళ్లినందున, వ్యక్తిగత పనులతో మిథున్‌రెడ్డి గర్జన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఉమ్మారెడ్డికి అస్వస్థత సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం అస్వస్థతకు గురయ్యారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌తో ఒక్కసారిగా నీరసించిపోయి కళ్లు తిరగడంతో హుటాహుటిన ఆయనను నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం
-
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
వైఎస్సార్ జిల్లా : కడప గోసుల కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్టా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి తరగతులను ప్రారంభించారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..కడప వాసులు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నారని మీ మీద కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. కడప నగరంలో సుమారు లక్ష ఓట్లు అకారణంగా తీసేశారని తెలిపారు. సాధారణ ఓటరుకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలా చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అధికారం అందుకునే దిశగా మనం ఎదుగుతున్నామని ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న 67 సీట్లు..2019లో 147 కావచ్చునని వ్యాఖ్యానించారు. -
యూటర్న్‌లతో ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు!
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు సైతం ఇచ్చిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను నెరవేరుస్తామని కేబినెట్ లో తీర్మానం చేశారని తెలిపారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం హోదా కంటే ప్యాకేజే కావాలని తీర్మానం చేసిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజి మంజూరు చేయడంపై అసెంబ్లీలో ధన్యవాదాలు చెప్తూ తీర్మానాలు చేసి.. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం చంద్రబాబు అభినందించి వచ్చారని తెలిపారు. విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా అబివృద్ధి చెందాయా అంటూ ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు పేర్కొన్నారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని, దీంతో అసెంబ్లీలో సభ్యులందరూ తీర్మానంచేసి ఆమోదించినా.. దానిని చంద్రబాబు కేంద్రానికి పంపలేదని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు ప్యాకేజికి అంగీకరించి అసెంబ్లీని సైతం అవమానించారని మండిపడ్డారు. ‘చంద్రబాబు తీరుతో ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ తిరుగులేని పోరాటం చేశారు. మండల స్థాయినుంచి జిల్లా స్థాయివరకు ప్రతి జిల్లాలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఉద్యమించారు. ఈ సమయంలో చంద్రబాబు హోదా ఏమన్నా సంజీవనా అని ప్రశ్నించడమే కాదు హోదా కావాలన్న ప్రతి ఒక్కరినీ హేళన చేస్తూ మాట్లాడారు’ అని చంద్రబాబు తీరుపై ఉమ్మారెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ లో ఆఖరి బడ్జెట్ సెషన్ వచ్చాక ఎన్నికల సంవత్సరం కావడంతో తాము కూడా పోరాటం చేస్తామంటూ చంద్రబాబు నాటకాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. హోదా ఇవ్వనందుకు వైఎస్ జగన్ కేంద్రంపై అవిశ్వాసం పెడతామంటే ముందు అనవసరం లేదని, ఆ తర్వాత మద్దతు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. కొన్ని గంటలే మళ్లీ మాట మార్చి.. తామే అవిశ్వాసం పెడతామని ప్రకటించారని, ఇలా తన రాజకీయ అవసరాల కోసం గంటకో మాటమార్చుతూ.. యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ రాజీనామా చేయించినా.. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా చంద్రబాబు సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరించాని విమర్శించారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే అదుపుచేయలేని కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఏకంగా దేశచరిత్రలో ఎన్నడూలేనివిధంగా వైఎస్సార్సీపీ ఎంపీలు నిరహారదీక్ష చేశారని గుర్తుచేశారు. దీంతో నేనేం తక్కువ తిన్నానా అంటూ చంద్రబాబు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టి ధర్మదీక్ష చేశారని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని అవమానించి ముతక సామెతలు చెప్పి మరీ హేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని యూటర్న్లు తీసుకొని ప్రజలను వంచిస్తున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. -
బాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాబు ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అధికారాల్లో 10 మాత్రమే ఇచ్చారన్నారు. పంచాయతీ వ్యవస్థలకు రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. -
పంచాయితీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లేదు
-
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని, ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేస్తున్న వారిని అరెస్టు చేయించడమే అందుకు నిదర్శనమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాల కోసం బంద్‌ను నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు సహకరించక పోగా వ్యతిరేకంగా పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేయించారని, గతంలో కూడా ఇలాగే హోదా కోసం గళమెత్తిన విద్యార్థి, యువకులపైన పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కావాలన్న కాంక్షతో సోమవారం రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిందని ఉమ్మారెడ్డి అన్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు విపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి, కేసులు పెట్టి పలువురిని అరెస్టు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేశారన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కలిసి రాకుండా విడిగా ఈ నెల 20న నిరాహారదీక్ష చేయడం దేనికి? ఎవరిని మభ్య పెట్టడం కోసం? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
చంద్రబాబు ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మొదట అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చి కొత్త డ్రామాలకు తెరతీశారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ భవన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోయారని గుర్తుచేశారు. హోదా విషయంలో వైఎస్ జగన్ సంధించిన ఏడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి...
సాక్షి, అమరావతి: ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటీషన్లపై రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటే ఈ నెల 6 నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పీకర్‌కు వివరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వారు ఆదివారం గుంటూరులో స్పీకర్ కోడెలను కలిసిన అనంతరం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘స్పీకర్‌కు రెండు వినతిపత్రాలు అందజేశాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లను వెంటనే పరిష్కరించాలని కోరాం. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గెలిచిన దెందులూరు అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు నోటిఫై చేయాలని విన్నవించాం’’అని చెప్పారు. ‘లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు 2013 జులై 10న వెలువరించిన తీర్పులోని పేరా 17లో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీకి కోర్టు శిక్ష ఖరారు చేస్తే అతడు పదవిని కోల్పోతాడని స్పష్టంగా ఉంది. ’’అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చాకే స్పందిస్తాం.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానన్న థర్డ్ ఫ్రంట్‌పై స్పష్టత లేదని, పూర్తి స్పష్టత వచ్చాక ఈ అంశంపై తమ పార్టీ స్పందిస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు విజయసాయిరెడ్డి జవాబిచ్చారు. -
'తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు'
ఏలూరు: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేత ఆళ్ల నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా తాను చేసిన తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. బెల్టు షాపులను తొలగిస్తామని తొలి సంతకం చేసిన తర్వాత నాలుగు వేల మద్యం షాపులు, 40 వేల బెల్టు షాపులు పెరిగాయన్నారు. దశలవారీగా మద్య నిషేధమని సంతకం చేసి గతంలో మద్యం ఆదాయాన్ని రూ.10వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు పెంచుకున్నారని, రుణమాఫీ సంతకమంటూ కోటయ్య కమిటీకి సంతకం చేశారన్నారు. రూ.86 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.9వేల కోట్లే మాఫీ చేసి మోసం చేశారని వారు తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు దౌర్బ్యాగపు పరిపాలనే కారణమన్నారు. ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం చేసి చంద్రబాబు ముస్లింలను అవమానపరిచారని, నారోడ్లు, నా పెన్షన్ అంటూ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడతున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలు, గిరిజనులకు కేబినెట్లో ప్రాతినిధ్య లేకుండా చేశారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని గవర్నర్, స్పీకర్ వ్యవస్ధలను అపహాస్యం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం అంచనాలు పెంచి దోపిడీకి తెగబడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో పశ్చిమలో 15 అసెంబ్లీ స్ధానాలు వైఎస్సార్సీపీవేనని ఉమ్మారెడ్డి, నాని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ధన ప్రభావంపై చర్చ జరగాలి
‘బ్యాలెట్ ద్వారా ఎన్నికలు’ వాదన సరికాదు: ఎంపీ వినోద్ ట్యాంపరింగ్‌కు తావు లేకుండా మెరుగుపర్చాలి: ఉమ్మారెడ్డి ఈవీఎంల వివాదంపై ఢిల్లీలో ఈసీ చర్చ సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై 2010లో జరిగిన చర్చలోనే ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)’ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారని... అందువల్ల బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే వాదన సరికాదని ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంల వివాదంపై శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ తరఫున ఎంపీ మాల్యాద్రి పాల్గొని.. అభిప్రాయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను టీఆర్ఎస్ స్వాగతిస్తోందని, దేశంలో ఎన్నికల సంఘం తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమర్థవంతమైన ఈవీఎంలను రూపొందించుకోవాలని సూచించారు. ఈవీఎంలో ఏడు సెకన్లుగా ఉన్న ఓటు సమయాన్ని కొద్దిగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేవలం ఏడు సెకన్లు అంటే ఓటరు ఆందోళన చెందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావం, నగదు పంపిణీపై చర్చ జరగాల్సి ఉందని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రలోభపెట్టడం అంటే ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యలు రాకుండా ఈవీఎంలను సరిదిద్దాలి: ఉమ్మారెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయంటూ తిరిగి బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలన్న వాదన సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశంలో స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ట్యాంపరింగ్‌కు తావులేని విధంగా మెరుగుపర్చాలని చెప్పారు. తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తే అపోహలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఫిరాయింపులపై చర్యలు తీసుకునే బాధ్యతలను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాం: టీడీపీ ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నామని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కోరారు. ఎన్నికల సంఘం ఎంత పటిష్టంగా నిర్వహించాలనుకున్నా.. కింది స్థాయిలో సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. -
'ఇలాంటి కేబినెట్ భేటీని ఎన్నడూ చూడలేదు'
-
'ఇలాంటి కేబినెట్ భేటీని ఎన్నడూ చూడలేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశం తీవ్ర నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కేబినెట్ భేటీలో ప్రజలకు ఊరట కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్ఆర్సీపీ తరఫున అభినందనలు తెలిపారు. సింధుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించడం సంతోషకరమన్నారు. కానీ సింధుకు ప్రోత్సాహం ప్రకటించడం, టీటీడీకి, ఓ ప్రైవేటు కంపెనీకి భూములు కేటాయించడం మినహా కేబినెట్లో ప్రజా సమస్యలపై చర్చించకపోవడం, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇలాంటి కేబినెట్ భేటీ గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి కేబినెట్ భేటీలో చర్చించకపోవడం దురదృష్టకరం. ప్రధాన సమస్యల గురించి మాట మాత్రమైన మాట్లాడలేదు. ప్రజలు ఎంతోగానో కోరుతున్న ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఆశ వదులుకున్నారా? ప్రత్యేక హోదాపై బాబు మౌనముద్ర దాల్చారు పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రత్యేక హోదా గురించి ప్రధానితో చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగ భృతిపై కేబినెట్ భేటీలో కనీస ప్రస్తావన చేయలేదు భూముల కేటాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంలో లేదు ప్రభుత్వం ఇష్టరాజ్యంగా భూములు కేటాయిస్తున్నది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ. 4.67 లక్షల కోట్ల మేర పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కానీ వాటి పరిస్థితి ఏమిటో తెలియదు. రాష్ట్రంలో 40లక్షల హెక్టార్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఉంటే.. అందులో 50శాతం కూడా సాగుకు నోచుకోలేదు . ఓవైపు వర్షాభావం, మరోవైపు రుణాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరువు పొంచి ఉంది. అయినా కేబినెట్ భేటీలో ఏ ఒక్క అంశం కూడా చర్చకు రాలేదు. పరిస్థితి విషమంగా ఉన్నా ఏ ఒక్క అంశంపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదు. పోలవరం అంశంపైనా కేబినెట్ చర్చించలేదు. -
కరవు పరిస్థితులపై వైఎస్సార్ సీపీ పోరుబాట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కరవు పరిస్థితులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, తహశీల్దార్ల కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉమ్మారెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారన్నారు. 90 శాతం గ్రామాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాల్లో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దుస్థితిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి
ఎన్నికల సంస్కరణ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల సంస్కరణలపై శ నివారం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరపున సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని సలహాలు ఇచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఫిరాయింపుల అంశం తీవ్ర సమస్యగా మారిందని దీనిపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇదొక అనారోగ్యకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ఫిరాయింపులపై పార్టీలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై ఆయన నొక్కి చెప్పారు. ఇలాంటి రాజకీయాలు సరికాదు: రోజా అంశంపై ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘శాసనసభలో, పార్లమెంటులో మేమూ ఉంటూ వచ్చాం. కానీ ఈ విధమైన రాజకీయాలు ఉండకూడదు. పాలకపక్షం, ప్రతిపక్షం అని తేడా చూపకుండా దూకుడుగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చినట్టుగా ఉండేది. కానీ నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఏడాది పాటు సస్పెండ్ చేశారు.దీనిపై సుప్రీం కోర్టు కూడా అసహనం వ్యక్తంచేసింది.’ అని అన్నారు. -
మంత్రుల జవాబులు నిర్లక్ష్యంగా ఉన్నాయి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెబుతున్న జవాబులు హస్యాస్పదంగా, నిర్లక్ష్య దోరణితో ఉంటున్నాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలిలో పార్టీపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ అమలుపై సభ లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన జవాబు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ముద్రగడ దీక్ష పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష ఉప నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ముద్రగడ పెట్టిన డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించి దీక్ష విరమింపచేసేలా చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. కాపులను బీసీలో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ్డ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఈ దీక్ష కు మద్దతు ఇస్తున్నారన్న కారణంతో గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలను కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. తుని ఘటన లో పులివెందులకు చెందిన అరాచక శక్తులు విధ్వంసం సృష్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రజావ్యతిరేకమైన చర్యలతో చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ డిమాండ్లన్నీ వెంటనే పరిష్కరించి ఆయన దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో తీర్మానం పెట్టండి
♦ ‘కాపు రిజర్వేషన్ల’పై ఉమ్మారెడ్డి డిమాండ్ ♦ వైఎస్సార్సీపీ సంపూర్ణంగా మద్దతిస్తుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కాపు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టాలని, అందుకు తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్రంలో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంట్‌లోనూ కాపు రిజర్వేషన్లపై తీర్మానం ఆమోదింపజేయాలని కోరారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో బీసీలను 9వ షెడ్యూల్లో చే ర్పించి రిజర్వేషన్లను 69% వరకూ ఎలా పెంచుకోగలిగారో... కర్ణాటకలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో... ఏపీలోనూ అలాగే చేయాలని సూచించారు. కాపులకు రాజ్యాంగపరమైన హక్కుగా రిజర్వేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ కాపులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోందంటూ టీడీపీ విమర్శలు చేయడం అర్థరహితమని ఉమ్మారెడ్డి అన్నారు. కాపు గర్జన జరిగితే టీడీపీయే అస్తిత్వం కోల్పోతుందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌లు కాపులను రెచ్చగొడుతున్నాయని, అధికారం కోసం వైసీపీ గుంటకాడ నక్కలాగా కాచుకుని కూర్చు ందని ప్రభుత్వ సమాచార సలహాదారు పత్రికా ప్రకటనను విడుదల చేయడంపై ఉమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పకపోవడం అభ్యంతకరమన్నారు. దీన్ని బట్టి బాబే ఓవైపు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెబుతూ మరోవైపు అవి అమలు జరగకుండా అడ్డుకుంటున్నట్లుగా ఉందని ఆరోపించారు. కాపుల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా జరగనున్న ఈ సభకు వైఎస్సార్సీపీలోని కాపులతోపాటు అందరూ తరలి రావాలన్నారు. -
'వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి'
విజయవాడ: వీఆర్ఏలు నెలన్నరగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తక్షణమే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హత ఉన్న చోట పూర్తి స్థాయి ఉద్యోగులుగా వీఆర్ఏలను నియమించాలన్నారు. -
జీవో 97ను ఉపసంహరించుకోవాలి
♦ మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి డిమాండ్ ♦ బాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించింది నిజమా? కాదా? అని నిలదీత సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని 1,220 హెక్టార్లభూమిలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జారీచేసిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో జారీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ 2011, డిసెంబర్ 24న అప్పటి గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారని ఆయన గుర్తుచేస్తూ.. ఈ విషయం వాస్తవమో కాదో స్పష్టం చేయాలన్నారు. అధికారంలోకొచ్చాక బాక్సైట్ తవ్వకాలకు అనుమతివ్వటంలోని ఆంతర్యం, గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో మార్పుకు దారితీసిన పరిస్థితులను వివరించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని అధికారంలోకొచ్చాక అందుకు విరుద్ధంగా జీవో జారీచేయటం ఆత్మవంచనతోపాటు గిరిజనులను వంచించటమేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. -
అమరావతి అత్యాశాపూరిత నిర్మాణం
-
రాజధాని పేరుతో విధ్వంసం
♦ అమరావతి అత్యాశాపూరిత నిర్మాణం.. బీబీసీ కథనం ♦ ఎన్జీటీ అభ్యంతరాలు బేఖాతరు చేస్తున్నసర్కారు ♦ ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో నిర్మాణాలు ♦ కోటికి పైగా వృక్షాలను నరికివేయాల్సి వస్తుందని ఆందోళన సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపమే తప్ప వరం కాదని ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ చానల్ (బీబీసీ)వెబ్ సైట్లో సంచలన కథనం ప్రచురించింది. భారతదేశం గర్వపడేలా, ప్రపంచం అసూయపడేలా రాజధాని నిర్మిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని నిర్ణయించే ముందు తప్పనిసరిగా జరపాల్సిన పర్యావరణ మదింపు జరపలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆక్షేపించింది. అమరావతి నిర్మాణానికి ఈనెల 22వ తేదీ విజయదశమి రోజున ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయగా 24వ తేదీన బీబీసీ ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఈ కథనంలోని వివరాలిలా ఉన్నాయి... అత్యాశాపూరిత నిర్మాణం... రాష్ట్ర విభజనలో హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నూతన రాజధాని అమరావతి కోసం వేసిన ప్రణాళికలు అత్యాశాపూరితంగా ఉన్నాయని బీబీసీ కథనంలో పేర్కొంది. రాజధాని నిర్మాణంకోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూసేకరణ బిల్లు ప్రయోగించకుండా వివాదాస్పదంగా భూసమీకరణ చేపట్టారు. రానున్న పదేళ్లలో 7,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దేశంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామన్నారు. అందుకోసం సింగపూర్ సహాయం తీసుకుంటామని చెప్పారు. అయితే రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తుందంటున్న సింగపూర్ నగరంకంటే అమరావతి పదిరెట్లు పెద్దదనే విషయం గుర్తించాలని కథనంలో ప్రస్తావించారు. రాజధాని నిర్మాణాన్ని చాలామంది సవాలుగా భావిస్తే, తానొక మంచి అవకాశంగా భావించానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ... అందుకోసం ఆయన అనుసరిస్తున్న చర్యలపై చాలామంది సంతృప్తిగా లేరని బీబీసీ వ్యాఖ్యానించింది. ఏకపక్ష వైఖరిపై రైతుల ఆగ్రహం అమరావతి పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని బీబీసీ కథనంలో స్పష్టంగా పేర్కొంది. ‘‘చంద్రబాబు మా జీవితాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు, వ్యాపారవేత్తలకు మేలు చేయాలని చూస్తున్నారు. అందుకోసం దేశంలో అత్యంత సారవంతమైన, ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ముఖ్యమంత్రి తన పాత వైఖరిలోనే కొందరికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని రైతు నాయకుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానికోసం తమ భూములిచ్చేలా తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని పలువురు రైతులు కూడా పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించి ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని వారు ఆరోపించారు. అయితే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, కొందరు అభివృద్ధి నిరోధకులు రాజకీయ కారణాలతోనే విమర్శిస్తున్నారని ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టివేసినట్లు బీబీసీ పేర్కొంది. పర్యావరణానికి చేటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారీ స్థాయిలో తలపెట్టిన అమరావతి నగర నిర్మాణం పర్యావరణం పాలిట పెనువిపత్తుగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు బీబీసీ కథనంలో పేర్కొంది. ఇంత భారీస్థాయిలో నిర్మాణాలు తలపెట్టినప్పుడు పర్యావరణపరంగా తీసుకోవాల్సిన ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని పర్యావరణవేత్తలు తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని 20వేల హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంపట్ల వారు మరింత ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం అందుకు అనుమతినిస్తే రాష్ట్ర ప్రభుత్వం రానున్న కొద్ది నెలల్లో కోటికి పైగా వృక్షాలను నరికివేయనుందని, ఇది పర్యావరణం పాలిట శాపంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తాము తీసుకున్న భూమికి రెట్టింపు... అంటే 40 వేల హెక్టార్లలో అడవులను పెంచాల్సి ఉంటుంది. అలాగే తాము నరికిన చెట్లకు రెట్టింపు స్థాయిలో వృక్షాలను పెంచాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అది అటవీ పరిరక్షణ చట్టాన్ని అతిక్రమించడమే’’నని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అటవీ అధికారి చెప్పారు. ‘‘అడవులను వెంటనే నరికేస్తారు. కానీ మొక్కలను వృక్షాలుగా పెంచాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాగే అడవుల్లోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి... టేకు, యూకలిప్టస్, వేప, ఎర్రచందనంలాంటి మొక్కలను నాటుతారు. అప్పుడు అడవులను నమ్ముకుని జీవించే జంతువులు, పక్షులు, కీటకాల పరిస్థితి ఏమి టి? నీటివనరులు, చిన్న చిన్న చెట్లు, మొక్కలు ఎలా బతుకుతాయి?’’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ‘‘మేము అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ అందుకోసం అనుసరిస్తున్న అన్యాయ మార్గానికి వ్యతిరేకం. ఇది ప్రజారాజధాని కాదు, కాంట్రాక్టర్ల రాజధాని’’ అని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించినట్లు బీబీసీ కథనంలో పేర్కొంది. -
వరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కేవలం రూ. 10 మాత్రమే పెంచిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టేట్ బోనస్‌ను ప్రకటించాలని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇంత తక్కువగా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాలు వరి ధాన్యం మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ. 200 నుంచి రూ. 250 వరకూ బోనస్ ప్రకటించాయని, ఏపీలో కూడా అలాగే ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూ తుళ్లూరులో తాత్కాలికంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి రూ.కోట్లు ఖర్చు చేయడం ఎందుకని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా వెళ్లి పిలుస్తానన్నారే.: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును రాజధాని శంకుస్థాపనకు తానే వ్యక్తిగతంగా ఈ నెల 18న వెళ్లి ఆహ్వానిస్తానన్న సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని తానే వ్యక్తిగతంగా ఆహ్వానిస్తానని ఎందుకు చెప్పలేదని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోమని జగన్ ప్రకటించిన తరువాత కూడా ఆయన్ను ఆహ్వానించడానికి మంత్రులను పంపుతున్నారన్నారు. ఏడు రోజుల నిరాహారదీక్ష తరువాత జగన్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారనే విషయాన్ని తమ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా వెల్లడించారన్నారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనపై ఇప్పటికీ ప్రతిపక్ష నేతకు సమాచారమే అందజేయలేదని చెప్పారు. -
నేడు ఉమ్మారెడ్డి అభినందన సభ
పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో అభినందన సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. అభినందన కార్యక్రమానికి పార్టీనేతలు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, సామినేని ఉదయభానుతో పాటుగా పలు ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని విభాగాల నేతలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికకు పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి ని ఘనంగా సత్కరించేందుకు ప్రతిఒక్కరూ కదలి రావాలన్నారు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
శక్తివంచన లేకుండా కృషిచేస్తా!
♦ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ♦ ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న ఉమ్మారెడ్డి గుంటూరు ఈస్ట్ : పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఏ విశ్వాసంతో నిలబెట్టారో, దానిని సాకారం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ ఉమ్మారెడ్డి జేసీ-1 సీహెచ్ శ్రీధర్ నుంచి ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము)లతో పాటు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ తాను ఎకగ్రీవంగా ఎన్నిక కావడానికి జిల్లాలో సహకరించిన పార్టీ ఎమ్యెల్యేలు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.జిల్లాలో అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు కష్టించి పని చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి శాసన మండలిలో ఉండడం వలన ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ విలువలు నశించిన నేటి రాజకీయాలలో ఉమ్మారెడ్డి వంటి విలువలు కలిగిన నేతలు ప్రజా ప్రతినిధులవడం హర్షణీయమన్నారు. నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మారెడ్డి ఎన్నికవడం మంచి పరిణామమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ ఉమ్మారెడ్డి అనుభవం ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), పలు విభాగాల నేతలు కావటి మనోహర్‌నాయుడు, మెట్టు వెంకటప్పారెడ్డి, కిలారి రోశయ్య, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, బండారు సాయిబాబు, పానుగంటి చైతన్య, నగర యువత అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మారెడ్డికి అభినందనల వెల్లువ పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిక జేసీ-1 శ్రీధర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఎస్టీ, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు మొగిలి మధు, కొత్తా చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో గజమాల, పూలకిరీటంతో ఉమ్మారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, కిలారి రోశయ్య, సయ్యద్‌మాబు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మండేపూడి పురుషోత్తం, యనమాల ప్రకాష్, ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉమ్మారెడ్డికి అభినందన సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక గ్రీవంగా విజయం సాధించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈ నెల 21న అభినందన సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి రాజశేఖర్ తెలిపారు. అరండల్ పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగే అభినందన సభా కార్యక్రమానికి పార్టీ నేతలు, అన్ని విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. -
ఉమ్మారెడ్డి ఎన్నిక లాంఛనమే !
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నిక లాంఛనమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో కేవలం జిల్లా నుంచి ఉమ్మారెడ్డి, మరో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నామినేషన్ ధాఖలు చేశారన్నారు. వైఎస్సార్సీపీకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల మద్దతు 570కి పైగా ఉందని తెలిపారు. దీనితో ఏకగ్రీవం తథ్యమని, ఎన్నిక పక్రియ లాంఛనంగా జరుగుతుందని తెలిపారు. అపార అనుభవం ఉన్న రాజకీయ భీష్ముడు ఉమ్మారెడ్డి ఎన్నికవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు రావి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డి అనుభవం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పార్టీ నేతలు ఉమ్మారెడ్డికి పుష్ఫగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మిఠాయిలు పంపిణీ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), సంయుక్త కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, కిలారి రోశయ్య, డైమండ్‌బాబు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏడాది తిరక్కుండానే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట
వ్యవస్థలను, ప్రతిపక్షాలను గౌరవించని ఫలితమే ఇది డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శ తెనాలి : రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను, ప్రతిపక్షాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయోగాల ఫలితంగానే ఏడాది తిరక్కముందే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు, గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన వంటి పార్టీల కూటమిగా పోటీచేసిన టీడీపీ కేవలం 1.94 శాతం ఓట్ల ఆధిక్యతతో అధికారం చేజిక్కించుకున్నట్టు గుర్తుచేశారు. తాజా సర్వేలో టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ట 11 శాతం పడిపోయిందని, ఇంత వేగంగా గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు హక్కులు, బాధ్యతలు 72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించాయేగానీ రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి ఓడినవారిని అందలమెక్కిస్తూ స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని రాజకీయపక్షాలను గౌరవించటమే ప్రజాజ్వామ్యంగా చెబుతూ, బాబు సీఎం అయ్యాక ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా గెలిచిన ప్రజాప్రతినిధులను తమ పార్టీ వ్యక్తులుగా ప్రకటించటం మరో తప్పిదమంటూ నెల్లూరు జిల్లా పరిషత్ వ్యవహారాన్ని సోదాహరణంగా వివరించారు. ఎన్నికల కోసం రుణాలను మాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా, చేనేతలకు చంద్రబాబు హామీలనిచ్చి, ఆర్బీఐ, బ్యాంకులు, కేంద్రప్రభుత్వం సహకరించటం లేదని, తాజాగా అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలంటున్నారని చెప్పారు. సరైన చర్య కాదనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదన్నారు. తనకున్న అపార రాజకీయ అనుభవంతో హామీలు నెరవేరుస్తానని ఎన్నికల కమిషన్‌కు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన చర్యలతో బ్యాంకింగ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. గత మార్చినాటికి రూ.97,975 కోట్లుగా ఉన్న బ్యాంకుల రుణబకాయిలు, వడ్డీతోసహా రూ.లక్ష కోట్లు దాటిపోయి ఉంటాయన్నారు. దీని ఫలితం దశాబ్దాలుగా ఉంటున్నారు. కొల్లిపర జడ్పీటీసీ భట్టిప్రోలు వెంకటలక్ష్మి, తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత తాడిబోయిన రమేష్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు జంగా శివనాగిరెడ్డి వేదికపై ఉన్నారు. -
అధినేత ఆదేశం మేరకు ఎమ్మెల్సీగా పోటీ..
వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి కర్లపాలెం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బాపట్ల నుంచి విజయవాడ వెళ్తూ కర్లపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తనను పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేశానని ఆయన తెలిపారు. అలాగే, జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో తనకున్న పరిచయాలు, పార్టీ అభ్యర్థిత్వం తన గెలుపునకు దోహదపడతాయని చెప్పారు. టీడీపీ అధికారం చేపట్టి ఏడాది కాలమైనా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యాన ప్రజల పక్షాన జరిగే పోరాటంలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆట్ల బ్ర హ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, మండల ఉపాధ్యక్షుడు పందరబోయిన సుబ్బారావు, నాయకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, మందపాటి పరమానందకుమార్, బన్నారావూరి శ్రీనివాసరావు, కూచిపూడి శ్యామ్యూల్ జాన్, తాజుద్దీన్, గోవతోటి సుబ్బారావు, డి.మాధవరెడ్డి, కత్తిదానియేలు, ఎం.కృష్ణమూర్తిరాజు, అక్కల శ్రీనివాసరెడ్డి, నందిపాటి సుబ్బారావు, ఖాజామొహిద్దీన్, దొంతిరెడ్డి నందారెడ్డి, ఏడుకొండలు తదితరులు ఉన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ సమావేశం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం సోమవారం గుంటూరు నగరంలో జరగనుంది. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమరదీక్ష, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర సీనియర్లు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. నేడు దీక్షా స్థలి పరిశీలన.. మంగళగిరి : ఏడాదికాలంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోరెడ్డి జిల్లాలో జూన్ 03, 04 తేదీల్లో సమరదీక్ష చేపట్టనున్నారు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి సమీపంలో ఎంపిక చేసిన సమరదీక్షా స్థలాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పరిశీలనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
అసలీ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటీ..?
-
'కమిటీల పేరుతో కాలయాపన చెయ్యొద్దు'
-
'స్థానికంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళతాం'
-
'టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది'