
విజయనగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
సాక్షి నెట్‌వర్క్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 69వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జరిగిన కార్యక్రమంలో శాసనమండలి సభాపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరపురాని పాలనతో ప్రజల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు.
నెల్లూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న పార్టీ నాయకులు
- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- నెల్లూరు జిల్లా కేంద్రం సహా వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్టీ నేతలు కేక్ కట్‌చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
- తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నేతృత్వంలో ‘రాజన్న పుట్టిన రోజు–రైతన్న పండుగ రోజు పేరిట వినూత్నంగా నిర్వహించారు. వేదికపై ఆశీనులైన వారందరూ రైతులే.
- విశాఖ జిల్లా, సిటీ వ్యాప్తంగా పార్టీలకతీతంగా వైఎస్సార్ జయంతి నిర్వహించారు.
- విజయనగరం పట్టణంలో ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలు, పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
- శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
- చిత్తూరు జిల్లాలో పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు.
- వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆటో కార్మికులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో భారీ ఆటోర్యాలీ నిర్వహించారు.
- అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహానేత జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కలలు సాకారం కావాలంటే జననేత వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకుందామని పలువురు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment