
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మొదట అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చి కొత్త డ్రామాలకు తెరతీశారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ భవన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోయారని గుర్తుచేశారు. హోదా విషయంలో వైఎస్ జగన్ సంధించిన ఏడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment