
సాక్షి, అమరావతి : ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అనే శీర్షికతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది పర్వదినాన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో–2019 విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారు. 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసినవి, తెలుసుకున్న అంశాల ప్రధాన ప్రాతిపదికగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు.
రాష్ట్రంలోని ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించేలా చేయడానికి ‘నవరత్నాల’తో పాటుగా రాష్ట్రాభివృద్ధికి ఓ సమగ్రమైన ప్రణాళికను ఇందులో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పడిన మేనిఫెస్టో కమిటీ కొద్ది నెలలపాటు కసరత్తు చేసి దీన్ని రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment