
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాబు ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
ఆయన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అధికారాల్లో 10 మాత్రమే ఇచ్చారన్నారు. పంచాయతీ వ్యవస్థలకు రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment