ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశం తీవ్ర నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కేబినెట్ భేటీలో ప్రజలకు ఊరట కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.