కడప గోసుల కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్టా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి తరగతులను ప్రారంభించారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..కడప వాసులు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నారని మీ మీద కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.