training programme
-
శిక్షణలో హెడ్మాస్టర్ హఠాన్మరణం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అందిస్తున్న నాయకత్వ, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం (స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–ఎస్ఎల్డీపీ)లో మరో అపశృతి చోటుచేసుకుంది. మూడోదశ శిక్షణలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపా«ద్యాయులకు శిక్షణ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు (52) గత సోమవారం నుంచి పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనను తోటి ఉపాధ్యాయులు వెంటనే సమీపంలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొండకు చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈనెల 6న ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలో శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు వెంకట రత్నకుమార్ ఇదే తరహాలో మరణించగా.. చీరాలలో మరో ప్రధానోపాధ్యాయడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యా రు. ఇలా వరుస ఘటనలపై ఉపాధాయ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.శ్రీనివాసరావు మృతికి నిరసనగా పలు జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులు గురువారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిక్షణ కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు విశాఖపట్నం జోన్–1 ఆర్జేడీ బి.విజయభాస్కర్ మరుపల్లి శిక్షణ కేంద్రానికి వచ్చి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు శాంతించారు. బలవంతపు శిక్షణతో వేధింపులు: వైఎస్సార్టీఏశిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం బాధాకరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధి కారుల్లో చలనం లేదన్నారు. బలవంతపు శిక్షణతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మృతుల కు టుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వోద్యోగం ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.ఇలాంటి శిక్షణలు రద్దుచేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్, ఏపీ పూలే టీచర్స్ ఫెడరేషన్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్.. ఏపీ ఉపాధ్యాయ సంఘం, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. -
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్‌ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
అమెరికాలో ఉద్యోగావకాశాలు.. ఎస్ఎల్యూ నుంచి లెవెల్అప్ ప్రోగ్రాం
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్ఎల్యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్అప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎల్యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్బ్రెక్ట్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ అమెరికా భారీ ప్యాకేజీ
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్య రంగాల్లో మిడిల్ టూ హై స్కిల్డ్ హెచ్1బీ వృత్తుల శిక్షణనకు గాను 150 మిలియన్ డాలర్ల(సుమారు 1,100కోట్ల రూపాయలు) ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో ప్రస్తుత శ్రామిక శక్తితో పాటు, భవిష్యత్ శ్రామిక శక్తిని పెంచడానికి గాను కొత్త తరం కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఈ హెచ్1బీ వర్క్‌ఫోర్స్ గ్రాంట్ ఉపయోగపడుతుందని కార్మిక శాఖ ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కార్మిక మార్కెట్లలో అంతరాయాలను కలిగించడమే కాక, అనేక విద్య, శిక్షణా సంస్థలు, యజమానులు శిక్షణను ఎలా అందించాలో పునరాలోచించవలసిన పరిస్థితులను తీసుకువచ్చింది అని కార్మిక శాఖ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు) ఈ భారీ ప్యాకేజీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో మరింత సమగ్రమైన శ్రామికశక్తి వ్యవస్థను ప్రోత్సహించడానికి.. నిధులు, వనరులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. ఇది దరఖాస్తుదారులకు వినూత్నమైన ట్రైన్రింగ్ ప్రొగ్రాంని అందించడమేకాక, ఆన్‌లైన్‌తో సహా విభిన్న రీతుల్లో ట్రైనింగ్ డెలివరీని అందిస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్థానిక పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. వీరు ఆయా వర్గాలలోని వ్యక్తులకు కీలకమైన పరిశ్రమ రంగాల్లో మిడిల్ టూ హై స్కిల్డ్ హెచ్1బీ వృత్తులలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి శిక్షణనిస్తారు. ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్‌లో విస్తృత శ్రేణి తరగతి గది, ఉద్యోగ శిక్షణ, కస్టమైజ్డ్ ట్రైనింగ్, ప్రస్తుత కార్మికుల శిక్షణ, రిజిస్టర్డ్ అప్రెంటిస్‌షిప్ ప్రొంగ్రాం, పరిశ్రమ-గుర్తింపు పొందిన అప్రెంటిస్‌షిప్ ప్రొంగ్రాం మాడ్యూల్స్ ఉంటాయి. ఈ పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్ కార్యక్రమం ద్వారా ఫెడరల్, స్టేట్, లోకల్ ఫండింగ్ స్ట్రీమ్స్ మాత్రమే కాక ప్రైవేట్ సెక్టార్లో ట్రైనింగ్ కార్యక్రమం, ఉపాధి సేవలు, సహాయక సేవలకు సంబంధించి ఉపాధి అవకాశాలను గరిష్టంగా పొందటానికి అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం
సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్‌కు శిక్షణ తప్పనిసరని ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగియటంతో పదమూడు జిల్లాల్లోని ప్రధాన కౌంటింగ్ సిబ్బందికి సచివాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని సీఈఓ గోపాలక్రిష్ణ ద్వివేదీ ప్రారంభించారు .కౌంటింగ్ ప్రక్రియ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కౌంటింగ్ సిబ్బందికి 24గంటల ముందు మాత్రమే నియోజకవర్గాలను కేటాయించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి రౌండ్లో ఏజెంట్లకు చూపించి సంతకాలు తీసుకోవాలన్నారు. పరిశీలకులు తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు అనుమతించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై వస్తున్న ఫిర్యాదులు 99శాతం నిజం కాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం
-
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
వైఎస్సార్ జిల్లా : కడప గోసుల కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్టా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి తరగతులను ప్రారంభించారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..కడప వాసులు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నారని మీ మీద కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. కడప నగరంలో సుమారు లక్ష ఓట్లు అకారణంగా తీసేశారని తెలిపారు. సాధారణ ఓటరుకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలా చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అధికారం అందుకునే దిశగా మనం ఎదుగుతున్నామని ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న 67 సీట్లు..2019లో 147 కావచ్చునని వ్యాఖ్యానించారు. -
బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
నున్న (గన్నవరం) : నున్న సమీపంలో ఉన్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్ర చీఫ్ భరత్‌జీ దేశ సంస్కృతి, రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాల గురించి వివరించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం, నాయకత్వ నిర్మాణం, సుశిక్షుతులైన నాయకులను తయారు చేయడంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఆర్ రవీంద్రరాజు వివరించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు యుగంధర్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ఇదేం ‘శిక్ష’ణ ?
నీళ్లు పెట్టలేదు..కుర్చిలు వేయలేదు అసౌకర్యాల మధ్య వీటీడీఏ శిక్షణ తరగతులు ఆదిలాబాద్‌రూరల్ : ఇటీవల ఎన్నికైన వీటీడీఏ (విలేజ్ డెవలప్మెంట్ ఏజెన్సీ) సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు మంగళవారం అసౌకర్యాల మధ్య ప్రారంభమయ్యాయి. కనీసం కూర్చునేందుకు కుర్చిలు.. తాగేందుకు నీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇదేం ‘శిక్ష’ణ అని అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ డివిజన్లోని వీటీడీఏ సభ్యులకు దశల వారీగా అవగాహన తరగతులు నిర్వహించేందుకు ఐటీడీఏ పీవో ఆదేశాలు మేరకు ముందస్తుగా తేదీలు ప్రకటించారు. సంబంధిత సభ్యులకు సమాచారం సైతం అందించారు. డివిజన్లోని ఆదిలాబాద్, బజార్హత్నూర్, బేల, బోథ్, గుడిహత్నూర్, జైనథ్, తలమడుగు, తాంసి మండలాల వీటీడీఏ సభ్యులకు పట్టణంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాల ఆవరణలోని యూత్ట్రై నింగ్ సెంటర్లో అవగాహన తరగతులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మండలానికి చెందిన వీటీడీఏ సభ్యులకు రెండురోజులపాటు ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖ అధికారులతో అవగాహన కల్పించాల్సి ఉంది. మంగళవారం తొలి రోజు ఆదిలాబాద్, బజార్హత్నూర్ మండలాల సభ్యులకు ఉదయం 10 గంటల నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించాలి. కానీ అలా జరగలేదు. ఆదిలాబాద్ మండలంలో 117, బజార్హత్నూర్ మండలంలో 141 మంది వీటీడీఏ సభ్యులు ఉన్నారు. వర్షం పడుతున్నా వీరు ఉదయం 10 గంటల కంటే ముందుగానే యూత్ ట్రై నింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. సభ్యులు కూర్చునేందుకు కుర్చిలూ తెప్పించలేదు. అవగాహన తరగతులు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో నిలబడ లేక సభ్యులు ఇబ్బంది పడ్డారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తీరిగ్గా కుర్చిలు తెప్పించారు. ఒంటి గంట ప్రాంతంలో అవగాహన తరగతులు ప్రారంభించారు. శిక్షణ తరగతులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఏర్పాట్ల బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ ఐటీడీఏ వారి ఖాతాల్లో నిధులు జమ చేసింది. అవగాహన తరగతులకు హాజరయ్యే వారికి టీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం వరకు వారికి కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని వీటీడీఏ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయ లోపం వీటీడీఏ సభ్యులకు ఆయా శాఖల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కాని వీటీడీఏ సభ్యులకు శిక్షణ ఉందన్న సమాచారం కూడా తమకు తెలియదని కొన్ని శాఖల అధికారులు చెప్పడం గమనార్హం. బజార్హత్నూర్ మండలానికి చెందిన ఏ ఒక్క అధికారి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సభ్యులకు అవగాహన కల్పించేందుకు ట్రై నింగ్ సెంటర్‌కు రాలేదు. ఆదిలాబాద్ మండల అధికారులతోనే వారికి అవగాహన తరగతులు కొనసాగించారు. ఆర్డీవో ఆగ్రహం వీటీడీఏ సభ్యులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతుల కోసం సకాలంలో ఏర్పాట్లు చేయకపోవడంతో ఆర్డీవో సంజీవరెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే శిక్షణ తరగతులను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎలాంటì అనుమానాలు ఉన్నా అధికారులను అడిగి నివత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వర్ణ, ఎంపీడీవో రవీందర్, ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్, పీఆర్ జేఈ మనోహర్, ఈజీఎస్ ఏపీవో శామ్యూల్, ఈవోపీఆర్డీ సుదర్శన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శులు అనిల్‌కుమార్, ఖలీం, చంద్రశేఖర్, మహేందర్, శ్రీధర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
జయ, మమత, రాజేలకు కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించడం కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని చెప్పారు. దళిత, గిరిజ వధువులకు రూ.51 వేలు ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మీ పథకం దసరా నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు మహిళా ముఖ్యమంత్రులు, కేంద్ర మహిళా మంత్రులను ఆహ్వానించామని చెప్పారు. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు తెలిపారు.