
వైఎస్సార్ జిల్లా : కడప గోసుల కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్టా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి తరగతులను ప్రారంభించారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..కడప వాసులు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నారని మీ మీద కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
కడప నగరంలో సుమారు లక్ష ఓట్లు అకారణంగా తీసేశారని తెలిపారు. సాధారణ ఓటరుకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలా చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అధికారం అందుకునే దిశగా మనం ఎదుగుతున్నామని ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న 67 సీట్లు..2019లో 147 కావచ్చునని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment