Dharmana Prasad Rao
-
పెన్షన్లు పేదలకు దూరం చేసిన పాపం చంద్రబాబుదే : ధర్మాన
-
సగర్వంగా ఎగిరిన సామాజిక జెండా
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ, 25 లోక్‌సభ మొత్తం 200 స్థానాలకుగాను సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సామాజిక న్యాయ పతాకాన్ని ఎగరేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. గత ఎన్నికల తరహాలోనే శనివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్.. మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ లతో ఒకేసారి 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటింపజేశారు. సామాజిక మహా విప్లవం ► నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆ వర్గాలను అక్కున చేర్చుకుంటూ వారి సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్.. సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకుగాను 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. మొత్తం 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. ఇందులో 7 స్థానాల్లో మైనార్టీలకు, మొత్తంగా మహిళలకు 19 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 స్థానాలు వెరసి ఆ వర్గాలకు 77 స్థానాలను కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు 7 స్థానాలు అధికంగా ఆ వర్గాలకు కేటాయించారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు మహిళలకు అదనంగా 4 స్థానాలు, మైనార్టీలకు అదనంగా 2 స్థానాలు కేటాయించారు. ► 25 ఎంపీ స్థానాలకుగాను 4 స్థానాల్లో ఎస్సీ, ఒక స్థానంలో ఎస్టీ, 11 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అంటే.. మొత్తం 16 లోక్‌సభ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు ఏడు వెరసి 12 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు ఆ వర్గాలకు అదనంగా 4 స్థానాలు కేటాయించారు. గత ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థినులుగా 4 చోట్ల మహిళలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 5 స్థానాలను కేటాయించారు. చంద్రబాబు, పవన్ సామాజిక ద్రోహం సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడి జనసేనతో జట్టుకట్టారు. అయినా ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అవినీతి కేసుల నుంచి బయటపడొచ్చనే వ్యూహంతో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి వార్టితో పొత్తు పెట్టుకుని జనసేనకు 21, బీజేపీకి పది శాసనసభ స్థానాలు కేటాయించారు. 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా లెక్క తేల్చారు. ఈ కూటమి ఇప్పటిదాకా 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో బీసీలు కేవలం 25 (టీడీపీ 24, జనసేన 1) మంది, మైనార్టీలు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. ఆ మూడు పార్టీలు ఖరారు చేయాల్సిన స్థానాలు ఇంకా 40 మాత్రమే మిగిలాయి. వాటిలో ఒకట్రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు, పవన్ మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచి, ఆ వర్గాలకు ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ఇచ్చిన తరహాలోనే.. మంత్రివర్గం కూర్పుతోనే సామాజిక న్యాయానికి నాంది పలికిన సీఎం జగన్.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు పెద్దపీట వేసి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. నా నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు పదవులు, పనులు ఇచ్చారు. ఇప్పుడు 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలు కలిపి 200 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 శాతం కేటాయించి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గాలకు ఊతం.. అందుకే గెలుపు ఖాయం గత 58 నెలలుగా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్లు.. వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. అందులో 2.13 లక్షల ఉద్యోగులను గత 58 నెలల్లోనే నియమించారు. గత 58 నెలల పాలనలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కని్పస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ వినమ్రంగా కోరుతూ సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ సమర భేరి మోగించారు. ఇందులో భాగంగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి విజయవంతమయ్యాయి. టీడీపీ–జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లా్లప్ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మారిటైజ్ వంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో జగన్ ఎగరేసిన సామాజిక న్యాయ పతాకం రెపరెపలాడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. -
వైఎస్సార్సీపీ జాబితాలో BCలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట
-
మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
-
సాధికార నినాదంతో మురిసిన మహేంద్ర తనయ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సాధికార నినాదంతో మహేంద్ర తనయ నది మురిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ సంకేతాలతో మెరిసింది. మహేంద్ర తనయ తీరంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బడుగు, బలహీనవర్గాలతో పాతపట్నం కిటకిటలాడింది. యాత్రకు దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. బూరగాం నుంచి పాతపట్నంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చే సరికి జనాలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలకు జనం జేజేలు పలికారు. పేదల సంక్షేమంలో సీఎం జగన్ నంబర్ వన్ : మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమాన్ని అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు అందజేశారని తెలిపారు. ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొని మరీ 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని వివరించారు. నాడు–నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజల జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పారు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో కొట్లాటలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని చెప్పారు. చంద్రబాబు పధ్నాలుగేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. బాబు అధికారంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను వేధించారని తెలిపారు. పైసా అవినీతి జరగలేదు: స్పీకర్ తమ్మినేని సీతారాం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా లక్షల కోట్లు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పైసా అవినీతి లేకుండా పాలన జరుగుతోందని, అవినీతి జరిగినట్లు రుజువు చేస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్ బడుగుల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ ఆశయాల సాధన: ఎమ్మెల్యే కళావతి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చారని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాలకొండ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. వంశధార నిర్వాసితుల నోటి ముందున్న కూడును కూడా టీడీపీ నేతలు లాక్కున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే వంశధార నిర్వాసితులకు రూ. 216 కోట్లు అదనపు పరిహారం అందించారని తెలిపారు. రూ.750 కోట్లతో వైఎస్సార్ శుద్ధ జలం ప్రాజెక్టును చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. -
ఎల్లోమీడియా ఏది రాస్తే అది నమ్మే పరిస్థితి ఎప్పుడో పోయింది: ధర్మాన
-
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని నిలిపింది సీఎం జగనే: ధర్మాన
-
‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’
సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్‌గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్ స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
చంద్రబాబుపై ఉన్న కేసులను ముందు ఐటీ, ఈడీ సంస్థలే దర్యాప్తు చేశాయి
-
అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్‌ది సాహసోపేత నిర్ణయం: మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు. 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు.. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు. రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు. చదవండి: తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా! -
మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
చంద్రబాబు మాయమాటలు నమ్మితే అంతే సంగతులు
-
రాజకీయాల కోసం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందేలా సాగుతున్న పాలన: మంత్రి ధర్మాన
-
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
ప్రతి సచివాలయం ఒక రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు, సచివాలయం ఒక రిజిస్ట్రార్ కార్యాలయంగా మారబోతోందని, తద్వారా మరింత పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి, సత్ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని సాహసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. వీటి ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్ధవంతమైన, వివాదరహితమైన సేవలు అందుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే) ద్వారా అనేక భూముల వివాదాలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కోస్తాంధ్ర జిల్లాల రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతల్లో చూపించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రజల ముంగిటకే పారదర్శక పాలన తెచ్చారని, దీన్ని ప్రజలు ఎంతగానో స్వాగతిస్తున్నారని చెప్పారు. అసైన్డ్ భూములపై అధ్యయనానికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల రీసర్వేలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల చొరవ అభినందనీయమని అన్నారు. భూ వివాదాలు పరిష్కారమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలవారికి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే), ఇళ్ల పట్టాల పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాదాలు, సాదా బైనమా, ఆర్వోఆర్, ఆర్వోఎస్ఆర్ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణ, అనాధీన భూములు, ఈ–పంట తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించనున్నట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖకు జవసత్వాలను తీసుకొచ్చి సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చాలనే ఏకైక లక్ష్యంగా పనిచేద్దామన్నారు. వెబ్‌ల్యాండ్ ఎంట్రీలపై గతంలో కొన్ని విమర్శలు వచ్చేవని, రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటోమ్యుటేషన్ చేసి విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, తర్వాతి సదస్సు విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే ఎలా?
-
ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి
తిరుపతి అర్బన్/తిరుచానూరు: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో బుధవారం ఉమ్మడి రాయలసీమ జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన మంత్రి ధర్మాన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీనవర్గాల వారికి మంచి చేయాలనే సంకల్పంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడున్నరేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేశారని గుర్తుచేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటిపట్టాలు ఇవ్వడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత మొత్తంలో ఇళ్ల పంపిణీ ఇదే తొలిసారన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూసర్వేతో ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. 90 శాతం గ్రామాల్లో సమస్యలు పరిష్కారమై ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. అధికారులకు అండగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలుంటే వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. అవినీతి రహిత పాలనకు సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను విజయవంతం చేయడానికి రెవెన్యూ విభాగం ఎంతో కీలకమైనదన్నారు. ఇందుకోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. కాలక్రమంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. ఓ వ్యక్తి పుట్టినప్పటి నుంచి జీవించినంతకాలం, చివరికి అంత్యక్రియల వరకు రెవెన్యూ విభాగంతో ముడిపడి ఉండే బంధాలను ఆయన వివరించారు. ఈ సదస్సులో సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, అదనపు సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, డైరెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు. -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదన్నారు. గవర్నమెంట్‌కు రెవెన్యూ వ్యవస్థ అనేది నాడీ వ్యవస్థ లాంటిదని చెప్పారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఉద్యోగులపై విశ్వాసం ఉండడం వల్లే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చారిత్రాత్మకమైన సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి నుంచి కలగా మిగిలిపోయిన వాటిని చక్కదిద్దేపనిలో నిమగ్నమయ్యారు. ఎలాంటి లిటికేషన్లు, అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 71వేల ఎకరాలు పేదలకు పంచడం అంటే ఊహలకు కూడా అందని అంశం అని పేర్కొన్నారు. 'మూడున్నరేళ్ల పాలనలో కరోనా రెండేళ్లు ఇబ్బంది పెట్టింది. పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టేజ్‌కి వచ్చాయి. సీఎం జగన్ ఏం చేసినా ఎంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అనేదే ఆలోచిస్తారు. టీమ్ స్పిరిట్‌కి బేస్ క్రీడలు మాత్రమే. ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేలా క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!) -
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్‌తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్‌గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
‘అసైన్డ్’ బదలాయింపులో ప్రజలకు మేలు జరగాలి
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్మెంట్దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, సీసీఎల్ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తాము: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండేందుకు విశాఖను ఒక రాజధానిగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బార్ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం సహించబోమని చెప్పారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడూ రాజధానికి దూరంగానే ఉన్నారని, ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ అవసరాన్ని ఆ కమిటీ సూచించిందన్నారు. పెద్ద క్యాపిటల్ ఈ రాష్ట్రానికి పనికిరాదని చెప్పిందన్నారు. చంద్రబాబు అందుకు భిన్నంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కమిటీ నివేదికల ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. srikaరాజధాని ఏర్పాటుకు ముందు చంద్రబాబు దొనకొండ, నూజివీడు అంటూ రోజుకో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలకు అనుగుణంగా రాజధాని ప్రకటన చేశారని తెలిపారు. ఆ రోజు జీ టు జీ ఒప్పందం జరిగిందని చెప్పారని, కానీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అది నిజం కాదని చెప్పారని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫల్గుణరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వాసుదేవరావు, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఎమ్మెస్ వినయ్ భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
-
అది సినిమాల్లో సాధ్యం.. నిజ జీవితంలో సాధ్యమా: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం: హీరోలు ఫొటోలకు ఫోజులు ఇస్తే చాలని, కానీ రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులు వేరేగా ఉంటాయని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం లింగాలవలసలో సోమ వారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ హీరో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. నిజ జీవితం వేరు, సినిమా వేరు అనే విషయాన్ని పవన్ గ్రహించాలన్నారు. తాను 45 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నానని, తనకు ఇప్పుడు 64 ఏళ్లని, తనతో మూడు కిలోమీటర్లయినా పవర్ నడవగలరా అని ప్రశ్నించారు. సినిమాల్లో హీరో చేయి ఊపితే ముగ్గురు పడిపోతారని, నిజ జీవితంలో సాధ్యమవుతుందా అని అడిగారు. వాస్తవం తెలుసుకోవాలన్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు
-
Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక
సాక్షి, శ్రీకాకుళం: ఐదుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల మంత్రివర్గంలో కీలక పదవులు. ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. సుదీర్ఘ అనుభవానికి సరైన సమయంలో గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ వైఎస్సార్ తనయుడి కేబినెట్లో పనిచేయాలన్న కోరిక నెరవేరింది. ప్రత్యేకమైన నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఓ ప్రత్యేకమైన నాయకుడు లోతైన విషయ పరిజ్ఞానం, విషయాన్ని సుస్పష్టంగా చెప్పగల నేర్పు, ఇరిగేషన్ అంశాలపై విశేషమైన అవగాహన, రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయన సొంతం. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా వారి ఆవేదనను కళ్లకు కట్టినట్టు ప్రసంగించే నేర్పరి కావడంతో ఆయనకు స్థానికంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ధర్మానకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినవారు ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తున్నారు. నేపథ్యమిదీ.. పేరు: ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గం: శ్రీకాకుళం అర్బన్ స్వస్థలం: మబగం తల్లిదండ్రులు: సావిత్రమ్మ (లేట్), రామలింగంనాయుడు (లేట్) పుట్టినతేదీ: మే 21, 1958 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ సతీమణి: గజలక్ష్మి సంతానం: కుమారుడు రామమనోహరనాయుడు జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజాజీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. చదవండి: (ఆ అంశాలే ఆదిమూలపు సురేష్‌కు మరో అవకాశం కల్పించాయి..) -
ఎమ్మెల్యే ధర్మాన ప్రతిపాదనలకు సీఎం జగన్ సానుకూలం
సాక్షి, శ్రీకాకుళం: నేరడి.. జిల్లా ప్రజల చిరకాల కల. వైఎస్సార్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శతవిధాలా కృషి చేశారు. అడ్డంకులు అన్నీ తొలగినా పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగి నీరు అందేందుకు కాస్త సమయ పడుతుంది. ఈ లోగానే ఖరీఫ్‌లో 2.50 లక్ష లు, రబీలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు, ఉద్దానం ప్రాజెక్టుకు తాగునీరు అందించేందుకు మరో ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ఇరిగేషన్లో నిపుణులైన ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కి లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివరించారు. దానిపై మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఇరిగేషన్ శాఖ సమీక్షలో సీఎం సానుకూలంగా స్పందించారు. ధర్మాన ప్రతిపాదించిన లేఖ మంత్రిగా ఉన్న సమయంలో ధర్మాన ప్రసాదరావు జిల్లా రైతుల శ్రేయస్సు కోసం తన ప్రతిపాదనలను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైఎస్సార్ వంశధార స్టేజ్–2, ఫేజ్– 2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87, ప్యాకేజీ–88, హిరమండలం రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. నేరడి మాత్రం ఎప్పటి నుంచో కలగానే మిగిలిపోయింది. హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీ ఎంసీల నీటిని నింపి జిల్లా రైతులకు మేలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.600 కోట్లు అవసరం. వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఒడిశా అభ్యంతరాల వల్ల జాప్యం జరుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే తప్ప రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీరు నింపే పరిస్థితి లేదు. వంశధార రిజర్వాయర్ దీంతో నిష్ణాతులైన ఇంజినీర్ల ఆలోచనతో గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, దానితో హిర మండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని డంప్ చేసే ప్రతిపాదనను శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీ సమావేశాల సమయంలో లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ లిఫ్ట్ పనులకు సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. హిరమండలం రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు సాగునీరుతో పాటు, ఉద్దానంకు తాగునీరు, భావనపాడు ఫిషింగ్ హార్బర్‌కి పుష్కలంగా నీరిచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదనకు సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ ఇంజినీర్లతో తాడేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష స మావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు సర్వే, తదితర చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒకే సీజన్లో పూర్తి.. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ఎంతకాలమో పట్టదు. ఒకే సీజన్లో పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఖరీఫ్‌లో 2.50లక్షల ఎకరాలకు, రబీలో 1.50లక్షల ఎకరాలకు నీరు అందించడానికి అవకాశం ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్‌కు చేసే ఖర్చును నాలుగేళ్లలో వెనక్కి తెచ్చుకోవచ్చు. రైతులకు అందించే నీటితో పండే పంట ద్వారా ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి వస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరసన నిలబడేందుకు ఈ లిఫ్ట్ పనులు ఎంతో దోహదపడతాయి. లిఫ్ట్ పథకం జిల్లా ప్రజలకు వరం వెనుకబడిన ప్రాంతంగా శ్రీకాకుళంకు పేరుంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఉన్న వనరులను ప్ర భుత్వాలు సమర్థంగా వాడు కోవాలి. అందులో భాగంగానే వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు అందించారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1600 కోట్లు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావాల్సిందే. కానీ ఒడిశా అభ్యంతరాలు చెబుతూనే ఉంది. దీనికి బ్రేక్ వేయాలనే ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. అందుకు ఆయన సా నుకూలంగా స్పందించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కొన్నా ళ్లు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని నిర్మాణానికి కూడా నాలుగైదు సీజన్లు పడుతుంది. అందుకే తక్షణం రైతులకు ఉపయోగపడేలా హిర మండలం రిజర్వాయర్‌లో 19.5 టీఎంసీల నీటిని నింపేందుకు తగిన సలహాలు, సూచనలు వంశధార ఇంజినీర్లను అడిగాం. జేఈ నుంచి చీ ఫ్ ఇంజనీర్ వరకు అందరి నోటా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గమనే సూచన వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ విషయాన్ని సీఎంకు వివరించాం. గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని నింపవచ్చన్న విషయాన్ని చెప్పాం. దీనికి రూ.300 కోట్లు అవసరమని దీని వల్ల ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలు, రబీలో 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు చేసేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరంగా తెలియ జేశాం. సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. లిఫ్ట్ పనులు పూర్తయితే జిల్లా రూ పురేఖలు మారిపోతాయి. ఖరీఫ్, రబీలో వరితో పాటు వాణిజ్య పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతుల కోసం ఖర్చు చేయడం ధర్మమే. సీఎం సానుకూల స్పందనతో వచ్చే రబీ నాటికే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకుండా కరువు వంటి పరిస్థితులు వచ్చినా హిరమండలం రిజర్వాయర్‌లో నీటిని ఆయకట్టుకి ఇ చ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కొ త్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లా లో ఉండే 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ప్రజలకు అ«ధికంగా ఉపయోగపడుతుంది. – ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే -
శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం: ధర్మాన
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని, కానీ, ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నాం పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు ప్రసంగించారు. ‘‘ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించాను. ఆపైనే సభానాయకుడికి ఓ లేఖ రాశాను. దీనిపై సభలో చర్చించాల్సిన అవకశ్యత ఉందని భావిస్తున్నా. చర్చించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ సీతారాంలకు ధన్యవాదాలు తెలిపారు ధర్మాన. న్యాయవ్యవస్థల ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏమాత్రం లేదని, కానీ, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం మాత్రమే తాను వ్యక్తం చేస్తున్నానని ప్రసంగం సందర్భంగా చెప్పుకొచ్చారాయన. ఇలాంటి సమయంలో కోర్టు వ్యాఖ్యలపై చర్చాసమీక్షలకు శాసన సభకు హక్కు ఉంటుందా? అనే విషయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ►రాజరిక వ్యవస్థలో రాజే శాసనం. ఒకరి చేతుల్లో ఉండడం వల్ల ప్రజా వ్యతిరేకత పుట్టుకొచ్చింది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యం పుట్టుకొచ్చింది. రాజ్యాంగం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. వ్యవస్థల పరిధి, విధులు ఎంటన్న దానిపై స్పష్టత ఉండాలి. లేకుంటే వ్యవస్థల్లో నెలకొనే అవకాశం ఉంది. సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించింది. అంతేకానీ జ్యుడీషియిల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే.. ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారు. అంతేకానీ, కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. అంతేకాదు.. ఎంత నిగ్రహంగా కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీం కోర్టు వివరించింది. ► శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గం.. వేటికవే వ్యవహరించాలి. ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయి. న్యాయవ్యవస్థ, కోర్టులంటే గౌరవం ఉంది. విధి నిర్వహణలో ఒకదానిని మరొకటి పల్చన చేస్తే.. పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదని చెప్పారాయన. అందుకే ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చుకుండా అడ్డుపడొద్దని ధర్మాన సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను చదివి వినిపించారు ఆయన. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదేనని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ► రాజ్యాంగ బద్దమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకానీ, శాసనం చేసే సమయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఆ హక్కు కేవలం రాజ్యాంగం కేవలం చట్ట సభలకు మాత్రమే కల్పించిందని గుర్తు చేశారాయన. ‘కోర్టులు న్యాయం మాత్రమే చెప్పాలి. శాసనకర్త పాత్రలను కోర్టులు పోషించకూడదని సుప్రీం చెప్పింది. లేని అధికారాలను పోషించకూడదని, ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు’ అని అత్యున్నత న్యాయస్థానమే పేర్కొంది అని గుర్తు చేశారు ధర్మాన. ► ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా.. అని ధర్మాన గుర్తు చేశారు. ఆ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వాలు మార్చిన సంగతి గుర్తు చేశారాయన. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును తర్వాతి ప్రభుత్వాలు చేయలేదా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పాలసీతో నాటి సీఎం వైఎస్ఆర్ ఎంతమంది ప్రాణాలు కాపాడలేదు, విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఎన్ని అభ్యంతరాలున్నా..ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా? శాసన సభ అధికారాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ఎందుకు?. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం అని అన్నారాయన. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. వ్యవస్థల్ని రక్షించే పనిని అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ప్రసంగం ముగించారు ఎమ్మెల్యే ధర్మాన. -
శ్రీకాకుళం జిల్లా క్రిష్ణప్పపేటలో ధర్మాన ప్రసాదరావు పర్యటన
-
‘ఆ విషయం తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాం’
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. శ్రీకాకుళంలో శనివారం నాడు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక ఎకరం భూమి కొని పేదవాడికి ఒక సెంటు భూమిని ఇండ్ల స్థలం కోసం ఇచ్చాడా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 100 కోట్లు వెచ్చించి పేదల ఇండ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికి చంద్రబాబు తమ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పేదవాడి కన్నీరు తుడిచారు, అది వైఫల్యమా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మహిళలు, రైతులు, యువతకు అనేక పధకాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని ధర్మాన తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర తరువాత సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి మార్పు జరిగిందో తెలుసుకోవడానికే పాదయాత్రల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని ఆయన చెప్పారు. చదవండి: రైతులు రోడ్డున పడటానికి బాబే కారణం: సీపీఎం -
పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్థి
-
బలహీన వర్గాలకు ఛాన్స్ ఇచ్చారు
-
అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం లేఖ రాశారు. రాజ్యాంగం సూచించిన సూత్రాల మేరకు పరిపాలన వ్యవహారాలు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయించడంతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించిందన్నారు. అయితే గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా వారి పార్టీ నాయకులతో కమిటీని వేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీ–ఆర్గనైజేషన్ యాక్ట్–14 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో అధికారికంగా గెజిట్ ద్వారా నోటిఫై చేయలేదని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పనిచేయలేదని, వాటిని వేరే చోటుకు మార్చేశారని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సైతం ఒకేచోట పెద్ద పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం కంటే వికేంద్రీకరణను సూచించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధాని ఒకేచోట ఏర్పాటు చేయాలనుకున్నా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొన్నా దానిని తుంగలో తొక్కారన్నారు. వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, మరో ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు. -
వికేంద్రీకరణే ఉత్తమం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించేలా చూశారని.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేయతలపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందని ఆరోపించారు. రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షాలతో కనీసం సంప్రదించకుండా రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విరుచుకుపడ్డారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడంవల్ల రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని ఆయన గుర్తుచేశారు. కానీ.. చంద్రబాబు అదేమీ పట్టించుకోకుండా అమరావతిపైనే దృష్టిపెట్టారన్నారు. అంతేకాక.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి గురించి కూడా ఏమాత్రం ఆలోచించలేదన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన 23 ఉన్నత సంస్థల్లో ఒక్కటైనా సరే శ్రీకాకుళం జిల్లాకు ఎందుకు కేటాయించలేదని చంద్రబాబును ధర్మాన నిలదీశారు. దాదాపు 2 లక్షల మంది శ్రీకాకుళం జిల్లా వాసులు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్న దీనస్థితిని ఆయన ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ సిఫార్సులు పట్టించుకోలేదు కాగా, సాగు భూములకు భంగం కలిగించవద్దని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అభివృద్ధిని కేంద్రీకరించవద్దని, ప్రకృతి వైపరీత్యాల ముప్పును పరిగణనలోకి తీసుకోవాలని, నిర్మాణ వ్యయం కనీస స్థాయిలో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందని ధర్మాన గుర్తుచేశారు. కానీ, వాటిలో ఏ ఒక్కటీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు రాజధానిని నిర్ణయించారని తీవ్రంగా మండిపడ్డారు. లోక కల్యాణమా.. లోకేశ్ కల్యాణమా.. సింగపూర్ కంపెనీతో ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకుని వారికి రూ.16వేల కోట్ల విలువైన 1,600 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించడం కంటే బరితెగింపు మరొకటి ఉంటుందా అని ధర్మాన ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో నిర్మించిన రాజధానులన్నీ కూడా 115 చదరపు.కి.మీ. నుంచి 425 చ.కి.మీ. పరిధిలోనే ఉంటే.. చంద్రబాబు మాత్రం ఏకంగా 8,603 చ.కి.మీ. మేర భూమిని సమీకరించడం ఏమిటన్నారు. సీఆర్డీఏకు చంద్రబాబు చైర్మన్‌గా ఉంటూ చేసిన నిర్ణయాలను ఆయన అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా లోక కల్యాణం కోసమా లేక లోకేశ్ కల్యాణం కోసమా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతి పేరుతో జరిగిన దోపిడీకి తెరదించి అభివృద్ధిని రాష్ట్రమంతటా వికేంద్రీకరించాలని సీఎం వైఎస్ జగన్‌ను ధర్మాన కోరారు. కాగా, సీఎంగా వైఎస్ జగన్ తొలిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చి కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి ఓ భారీ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని ధర్మాన కొనియాడారు. ధర్మాన సంధించిన ప్రశ్నలు.. ►వేలకు వేల ఎకరాలు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ►ఎన్ని సంవత్సరాలకు ప్రణాళిక వేశారు.. 53 వేల ఎకరాల్లో మీరు తాపత్రయపడి ఖర్చుపెట్టింది ఎంత.. ఐదు వేల కోట్లు.. ఏమిటిది? ►ఐదేళ్లలో ఐదు వేల కోట్లే పెట్టారంటే.. మీరు చూపించిన రాజధానిని ఎన్ని సంవత్సరాల్లో కడతారు? ►ఆచరణలో సాధ్యం కాని అంశాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది కాదని మీరు చెప్పగలారా? ►ఇక్కడ రాజధానికే డబ్బంతా పెట్టేస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ విషయం ఆలోచించలేదా? ►అమరావతినే అభివృద్ధి చేసి, దాని ద్వారా ప్రయోజనం పొందాలనేది తప్ప ఏముంది ఇందులో? ►రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని మీకు తెలియదా? ►అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి కనీస అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ►రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా ఎందుకు ఆగలేకపోయారు? ►రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 10 ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని ఆ కమిటీకి చెప్పి ఎందుకు సహాయ నిరాకరణ చేశారు? ►ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే.. విభజన జరిగినా మనకు ఆవేదన ఉండేది కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? -
రాజధాని కాదు... రియల్ ఎస్టేట్
-
‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’
సాక్షి, అమరావతి : భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని చెప్పారు. కౌలు రైతుల రక్షణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... భూ యనమానుల హక్కులకు నష్టం కలగకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టం రుపొందించామని తెలిపారు. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందన్నారు. గతంలోని కౌలుదారి చట్టం వలన భూ యజమానులకు అభద్రతాభావం ఏర్పడిందని, అందుకే కౌలు రైతులను యజమానులు నమ్మలేదన్నారు. తాము తెచ్చిన నూతన చట్టం వలన ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. భూ రికార్టుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదన్నారు. పంటరుణం తప్ప మిగిన రుణాలన్ని భూ యజమాని తీసుకోవచ్చని తెలిపారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమై చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుతుంది : ధర్మాన పంటసాగుదారుల రక్షణ చట్టం తేవడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ చట్టం ద్వారా అన్ని సబ్సిడీలు కౌలు రైతుకు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందజేసే సహాయం నిజమైన రైతులకు అందేలా చట్టం తీసుకొచ్చారని ప్రశంసించారు. సమాజంలో కలిసిపోయిన నాయకుడే ఇలాంటి చట్టాలు తీసుకురాగలరని అన్నారు. పీవోటీ యాక్ట్ పరిధిలోని భూములను సాగుచేస్తున్న రైతులు కూడా లాభపడేలా ఈ చట్టంలో సవరణ తీసుకురావాలని కోరారు. రైతులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ : సామినేని పంటసాగుదారుల రక్షణ చట్టంతో యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను అన్నారు. కౌలు రైతులకు కార్డులే కాకుండా హక్కులు కూడా కల్పించడం శుభపరిణామమన్నారు. ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందేలా చట్టబద్ధత కల్పించామన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం జగన్ రైతుకు అండగా నిలిచారని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. -
‘బాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, శ్రీకాకుళం : సీఎస్ అంటే సీఎం చెప్పిందల్లా చేయడం కాదనే విషయం చంద్రబాబు గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు ప్రధానిని పొగుడుతూ.. చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే మాత్రం సీఎస్ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత శాఖలపై సమీక్ష చేసే అధికారం చేసే సీఎస్‌కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తీరు చూస్తుంటే 40 ఏళ్ల అనుభవంలో ఆయన ఏం గ్రహించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అంటే ఐ అగ్రీ సార్ కాదు.. ‘సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సమర్థవంతంగా పనిచేసే అధికారి అని గుర్తింపు ఉంది. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఐఏఎస్ అంటే ఐ అగ్రీ సార్ కాదు. సీఎస్ నిందించడం ద్వారా చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ ఆధ్వర్యంలోనే అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. స్పీకర్ వ్యవస్థను అభాసుపాలు చేశారు. ఫిరాయింపుల చట్టం అమలుకాకుండా చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు నిబంధనలు కాదని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇన్ని చేసి జూన్ దాకా నేనే సీఎం అని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని చంద్రబాబు తీరుపై ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు...
-
నర్తు రామారావుకు ఎమ్మెల్సీ
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావుకు శాసనమండలిలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. రామారావు 2014 ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అనంతరం ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ ఎన్నికల్లో రామారావుకు పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయనకు బదులు పిరియా సాయిరాజ్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రామారావుకు సముచిత స్థానం కల్పించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ధర్మాన ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు. రామారావుకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వలేక పోయినందున.. ఎన్నికల అనంతరం ఏర్పడబోయే శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని జగన్ తనకు చెప్పారన్నారు. దీంతో ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న రామారావుకు న్యాయం జరిగినట్టయిందని చెప్పారు. నియోజకవర్గంలో అందరూ ఐక్యంగా పనిచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి సాయిరాజ్ గెలుపునకు కృషి చేయాలని ధర్మాన కోరారు. కవిటి మండలం కొత్తపుట్టుగ గ్రామానికి చెందిన రామారావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుండడంతో జిల్లాలోని యాదవ సామాజిక వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
మహిళా సాధికారత సాధించుకుందాం..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఒకప్పుడు వైఎస్సార్ మహిళా సాధికారత కోసం కృషి చేశారని, ఇప్పుడు జగన్ అండగా మనమందరం మళ్లీ ఆ సాధికారతను సాధించుకుందామని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో మహిళలతో ఆత్మీయ సమావేశం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ పద్మావతి అధ్యక్షతన వైఎస్సార్సీపీ మహిళా బూత్ కమిటీ సభ్యులు 5వేల మందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గురుగుబెల్లి లోకనాధం చంద్రబాబు, ఎమ్మెల్యే వైఫల్యాలను మహిళలకు వివరించారు. జగన్ చేపట్టబోయే కార్యక్రమాలను తెలిపారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు మాఫీమాయలపై దుమ్మెత్తిపోశారు. పసుపు కుంకుమ పేరుతో జరుగుతున్న అన్యాయాలను వివరించారు. ప్లాన్ ప్రకారం మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. నిత్యావసరాలు పెరిగి అక్కచెల్లెళ్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రగతి కంటే ప్రచారమే ఎక్కువగా ఉందని చురకలు అంటించారు. ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కేంద్రం ఇచ్చిన సంస్థల్లో ఒక్కటి కూడా శ్రీకాకుళంలో ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. అనంతరం పార్టీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి మహిళలంటే చిన్నచూపు అన్నాడు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం జగన్ మహత్తర పథకాలు రూపొందించారని వివరించారు. తమ పిల్లలకు బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.15వేలు ఇస్తానన్న జగన్ హామీ మహిళల్లో ఎంతో ఉత్తేజానిచ్చిందన్నారు. మద్యపాన నిషేధం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అనంతరం ఎంవీ పద్మావతి మాట్లాడుతూ మహిళలు వ్యక్తులు కాదు సమాజాన్ని అభివృద్ధి వైపుగా నడిపించే శక్తులన్నారు. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. అన్ని సంక్షేమ పథకాల్లోనూ జన్మభూమి కమిటీలు దండుకున్నాయని ఆరోపించారు. తర్వాత ధర్మాన సుశ్రీ మాట్లాడుతూ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటారో అభివృద్ధి చేసే నాయుకుడుకి పట్టం కట్టేందుకు వినియోగిస్తారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు చల్లా అలివేలు, మూకళ్ల సుగుణ, అంబటి అంబిక, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, కుందేటి ఉమామహేశ్వరి, గుంట జ్వోతి, చల్లా మంజుల, ఎస్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు -
అభిమాన గణం సమేతంగా..ధర్మాన..
శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ధర్మాన ప్రసాదరావు... సోమవారం నాడు నగరమంతా ఈ పేరు మార్మోగిపోయింది. వైఎస్సార్సీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మె ల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్లగా.. శ్రీ కాకుళం మొత్తం ఆయన వెంటే నడిచింది. గార మండలంలోని మారుమూల పల్లెల నుంచి కా ర్పొరేషన్ పరిధిలోని వార్డుల వరకు అన్ని వర్గాల వారు ధర్మాన నామినేషన్‌కు తరలివచ్చి వైఎస్సార్సీపీ సత్తా చూపించారు. ముందుగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం సోమవారం టౌన్‌హాల్ వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ ర్యాలీ ప్రారంభించారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలు, ధర్మాన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించిన ర్యాలీ చిన్నబరాటం వీధి గుండా పొట్టి శ్రీరాములు కూడలి నుంచి కిన్నెర థియేటర్ మీదుగా జిల్లాపరిషత్ మార్గం గుండా వేలాది మందితో ముందు కు కొనసాగింది. అటు అరసవల్లి రోడ్డు మీదుగా 80 అడుగుల రోడ్డు నుంచి ఇటు పొన్నాడ వంతెన నుంచి ఇటు పాతవంతెన మీదుగా అన్నివైపులా జనాలు శ్రీకాకుళం కలెక్టరేట్ వైపే అడుగులు వేశా రు. అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టిం చినా జనం ధర్మాన వెనుకే నడిచారు. ఈ సందర్భంగా నగరంలో సంతోషిమాత గుడి భారీ బహిరంగ నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాక్షస పాలనకు చరమగీతం పాడి అందుకు తీర్పునివ్వడానికి మరో 15రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఐదేళ్లుగా టీడీపీ ఆగడాలను భరిస్తూ వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నారాయణ కాలేజీ అధినేత చంద్రబాబు పెట్టుబడిదారుడు నారాయణ కాలేజీలో డబ్బులతో అడ్డంగా దొరికిపోయారని వారిని పోలీసులు తీసుకెళ్లారన్నారు. ప్రతి చోటా వారు డబ్బు సంచీలతో రెడీ అవుతున్నారని తెలిపారు. వృద్ధులకు రూ.3వేలు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ముందు చెబుతుం డడం విడ్డూరంగా ఉందన్నారు. నమ్మినంతకాలం మోసగించడమే చంద్రబాబు నైజమన్నారు. 15 రోజులు ఎన్నికల యుద్ధంలో సైనికుల్లా పనిచేసినవారంతా రెండు ఓట్లు ధర్మాన, దువ్వాడలకు వేయాలని కోరారు. సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి పేరాడ తిలక్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంవీ పద్మావతి, అంధవరపు వరం, వైవీ సూర్యానారాయణ, శిమ్మ రాజశేఖర్, కేఎల్ ప్రసాద్, ఎన్ని ధనుంజయరావు, హనుమంతు కిరణ్‌కుమార్, చల్లా రవికుమార్, మూకళ్ల తాతబాబు, అంబటి శ్రీనివాస్, ఎంవీ స్వరూప్, డీసీఎంఎస్ గొండు కృష్ణ, గురుగుబెల్లి లోకనాధం, పొన్నాడ రుషి, పైడి మహేశ్వరరావు, గొండు రఘురాం, పీస శ్రీహరి, మార్పు ధర్మారావు, పీస గోపి, పిఎసిఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మండవల్లి రవి, కోణార్క్ శ్రీను, కోరాడ రమేష్, నక్క రామరాజు, ఆర్ఆర్మూర్తి, టి.కామేశ్వరి, చల్లా మంజుల, పి. సుగుణారెడ్డిలతో పాటు శ్రీకాకుళం నగరం, రూరల్‌మండలం, గార మండలాల నుంచి భారీగా జనం పాల్గొన్నారు. నామినేషన్‌కు ‘మండలం’ తరలివచ్చింది గార: వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు నామినేషన్‌కు గార మండలమంతా తరలివచ్చింది. సోమవారం ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేస్తానని పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వాహనాలతో జనం తరలివచ్చారు. గార మండలం నుంచి దాదాపు 15 వేల మంది ప్రజలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని అంచనా. మత్స్యకార పంచాయతీలైన పోర్టు కళింగపట్నం, బందరువానిపేట, కొమరవానిపేట, మొగదాలపాడు, వత్సవలస, శ్రీకూర్మం, బలరాంపురం నుంచి మత్స్యకారులు స్వచ్ఛందంగా పాల్గొనడం వైఎస్సార్సీపీకి బలాన్నిస్తుందని స్థానికులంటున్నారు. శ్రీకూర్మం నుంచి సుమారు 450 బైక్‌లతో మాజీ సర్పంచ్ బరాటం రామశేషు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. -
టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు ఇండికేషన్ వచ్చింది
-
ఐదుకోట్ల మంది.. ఆంధ్రులకు తలవంపులు
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అవినీతిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అలా ప్రవర్తించి ఐదుకోట్ల మంది ఆంధ్రులకు చంద్రబాబు తలవంపులు తెచ్చారని వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సీఎం ప్రెస్‌మీట్ పెట్టి ఐదేళ్లు తన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పాల్సింది పోయి పనికిరాని కాకమ్మ కబుర్లు చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తానని ఇతరులతో జతకట్టనని ఎప్పుడో చెప్పారన్నారు. ఇతరులతో కలిసి పోటీ చేయడం గెలవడం..నాలుగేళ్ల పాటు కలిసి ఉండడం తరువాత వదిలేయడం చంద్రబాబుకు పరిపాటని విమర్శించారు. టీడీపికి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో బాబు జతకట్టవచ్చు గానీ కేసీఆర్, మోడీలతో మాట్లాడితే లేనిపోని అభాండాలు వేసి ఇష్టం వచ్చినట్లు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత పిచ్చికూతలు కూయించడం చంద్రబాబుకు అలవాటన్నారు. భ్రమ నుంచి బయటపడాలి టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకం, మోసం, దోపిడీ తప్ప మరే విధంగా అభివృద్ధి జరగలేదని పాలన అంతా వైఫల్యాలమయంగా మిగిలిపోయిందని 29రాష్ట్రాల్లో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ఏదో ఒక విధంగా మళ్లీ అధికారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజల ఎదుట మొసలికన్నీరు కారిస్తే ఓట్లు వేస్తారన్న భ్రమ నుంచి చంద్రబాబు బయటికి రావాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపు అన్యాయం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చి ప్రజాదరణను చూసి ఓర్వలేక..ఏం చేయాలో తోచక వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అవస్థల పలు చేయడం వంటివి చంద్రబాబుకు తగదన్నారు. ఇటువంటి కుళ్లు రాజకీయాలు చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించరని జోస్యం చెప్పారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న బాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. విహార యాత్రలతో కాలక్షేపం ఐదేళ్లలో రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు విమానయాత్రలు, బోటు షికార్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. దీంతో విసుగెత్తిన ప్రజలు ‘నిన్నునమ్మం బాబూ’ అని చెప్పకనే చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో నాలుగున్నరేళ్లు గుర్తుకురాని సంక్షేమ పథకాలన్నింటినీ చివరి రెండు నెలల్లో ఇష్టం వచ్చినట్లు పంచిపెడితే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల దోపిడీ కేంద్రప్రభుత్వం విడుదల చేసిన కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన నీరు–చెట్టు, సిమెంట్ రోడ్ల పనుల పేరుతో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు దోచుకున్నారని ఆరోపించారు. మోసకారి చంద్రబాబుకు జిల్లా ప్రజలు ఓట్లు వేయరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. -
చంద్రబాబు ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు
-
‘ఆ విషయం పవన్ కల్యాణే చెప్పాడు’
సాక్షి, అమరావతి : రానున్న ఎన్నికల్లో డబ్బు గుమ్మరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు దించారంటూ పవన్ కల్యాణే చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఏపీలోనే చూస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే వైఎస్సార్ సీపీకి వేసినట్లేనంటూ బాబు ఊదరగొట్టారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసినట్లేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు చేసేందుకే రూ. 400కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఈ ఐదేళ్లలో రైతులకు సహాయం చేయని బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హామీలు గుమ్మరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికలు వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యానించారు. డబ్బు పట్టుకుని ఎవరు వచ్చినా పోలీసులకు అప్పగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
విజయం వరించే వరకు విశ్రమించొద్దు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పార్టీ ముఖ్యులు విశ్రమించకుండా సైనికుల్లా పనిచేస్తే విజయం సొంతమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో మంగళవారం శిమ్మ రాజశేఖర్ అధ్యక్షతన పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నవరత్నాలు ప్రకటించడంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, చెల్లని చెక్కులు ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత హామీలను నాలుగున్నరేళ్లు విస్మరించి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులను మళ్లీ మోసం చేసేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. బాబు, లోకేష్‌లు రాజధాని భూములతో రియల్ వ్యాపారం చేసుకుని సంపాదించిన డబ్బులతో జనం ఓట్ల కొనేందుకు ఇప్పటికే రూ.5వేలు కోట్లు సిద్ధం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పటికే రూ1.25 లక్షల కోట్లు అప్పు చేసిందని, వెనుకబడిన జిల్లాకు అప్పులో భాగంగా రూ.15 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అందరి సూచనలతో ముందడుగు వేస్తా.. సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నందున పార్టీ బలోపేతానికి చేయాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ధర్మాన పిలుపునిచ్చారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి.. ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే సలహాలు, సూచనలు చెబితే అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. పార్టీలో చేరాలనుకునేవారిని హృదయపూర్వకంగా స్వాగతిద్దామని, ఎక్కడా అడ్డు తగలవద్దని కోరారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే అన్నివర్గాల ప్రజలను కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో 50 రోజుల పాటు రోజుకి 150 ఇళ్లు చొప్పున నగరంలో ఓ కార్యక్రమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వై.వి.సూర్యనారాయణ, పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు సమక్షంలో కమిటీలు వేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆర్ట్ఆఫ్లివింగ్ సభ్యుడు డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు యోగాతో కలిగే లాభాలను పార్టీ శ్రేణులకు వివరించారు. సమావేశంలో అంధవరపు వరం, ఎం.వి పద్మావతి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, గొండు కృష్ణమూర్తి (పీఏసీఎస్), కోణార్క్ శ్రీను, కె.ఎల్ ప్రసాద్, శ్రీనివాస పట్నాయక్, డాక్టర్ పైడి మహేశ్వరరావు, చిట్టి రవికుమార్, గొండు కృష్ణమూర్తి (డీసీఎంఎస్), సాధు వైకుంఠరావు, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డిలతో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘డ్వాక్రా సంఘాలను బాబు నిర్వీర్యం చేశాడు’
-
‘మంత్రి ఉమా కుట్రలు ఇక చెల్లవ్’
సాక్షి, విజయవాడ : డ్వాక్రా సంఘాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ మైలవరం సమన్వయ కర్త వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు పూర్తిగా కుదేలయిపోయారని ధర్మాన ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ బ్రోకర్లు మరోసారి ప్రజలకు మోసగించడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో బూత్ కమిటీల అవసరం కీలకమని, విధిగా తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. మంత్రి ఉమా కుట్రలు ఇక చెల్లవ్ : వసంత కృష్ణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం చూసి మంత్రి ఉమా మహేశ్వరరావు వణికి పోతున్నారని ఆ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి ఉమా కుట్రలు ఇక చెల్లవన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
‘విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం’
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయని, అయినా తాను భయపడనని అన్నారు. వాటిని తామేం పట్టించుకోవడంలేదని, రెవెన్యూలో పనిచేసిన వారందరికీ తెలుసునని, రెవిన్యూ మంత్రి ఈ వ్యవహరాలు చూడరని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు. ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు. బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల తరపున నిలదీస్తున్నానని, వైఎస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వాటికి నేను భయపడను. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంద’ని వ్యాఖ్యానించారు. ‘నిభందనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దంటే నీవు(చంద్రబాబు) సీఆర్డీఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్దతే అనుసరించారు. అనుభవం తెచ్చిన పాలనలాగా ఇది లేదు. తప్పులు ఉంటే సరిదిద్దాలి. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఫైల్ వేగంగా ఎలా కదిలింది. 500ఎకరాల సేకరణ వెనక పెద్దవాళ్లఎవరు? ఎంతమెత్తం చేతులుమారింది. వీటిని తేల్చలేదు. ప్రతిపాదించిన11 రోజుల వ్యవధిలోనే జీఓ ఎలా బయటకువచ్చింది. సిట్ దర్యాప్తు ఈ విధంగా సాగితే నిజాలు బయటకు వస్తాయా? సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి? మీరు చేసిందేమిటి? మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా? నిజానికి ఎన్టీఆర్ సీఎంగా మీరు(చంద్రబాబు) రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు1994,నవంబర్‌లో జారీ అయిన జీఓ ప్రకారమే ఇది జరిగింది. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల భూములకు సంబంధించి ఆ జీఓ మీ ఆదేశాలమేరకు జారీ అయింది. 1977లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు. సిట్ రిపోర్ట్ లో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్ద ఎవరో ఎందుకు తేల్చలేద’ని పలు ప్రశ్నలు ధర్మాన లేవనెత్తారు. -
తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవాలి
-
తిత్లీ బాధితులందరికీ న్యాయం చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను, అనంతరం వచ్చిన వంశధార వరదలతో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించడంతోపాటు శాశ్వత పునరావాసం కల్పిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని కోరారు. పార్టీకి చెందిన పలువురు నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ని ఆయన చాంబర్లో కలిశారు. బాధితుల పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత పరిష్కారాలపై మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలైన అగ్నికుల క్షత్రియ, కండ్ర, జాలరి, కేవేటి, బెంతులు, సొండి, దమ్మలి, బెంతు ఒరియాలు, పొందరి, నగర కులాల వారు పూర్తిగా నిరాశ్రయులై దుర్భర జీవి తాన్ని గడుపుతున్నారని... వీరిని తక్షణమే ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారం లేదు జిల్లాను తుపాన్లు తరచూ తాకుతున్నాయని.. దీంతో భారీ నష్టం వాటిల్లుతున్నాప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. జిల్లాను సైక్లోన్ జోన్‌గా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేస్తే గానీ శాశ్వత పరిష్కారం లభించదన్నారు. సముద్రతీరం ఇసుకతో నిండి ఉంటుండడంతో ఏమాత్రం గాలి వీచినా విద్యుత్ స్తంభాలు పడిపోయి భారీగా నష్టం వాటిల్లుతోందని ధర్మాన అన్నారు. శాశ్వత పరిష్కారం దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిహారం అందజేయాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో ప్రధాన పంట కొబ్బరి అని.. తరతరాల నుంచి ఈ పంటపైనే ప్రజలు ఆధార పడి జీవిస్తున్నారన్నారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ఇంత వరకూ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందన్నారు. పడిపోయిన కొబ్బరిచెట్లను ప్రభుత్వమే తొలగించాలని, కొబ్బరి వ్యవసాయానికి సరిపడేటట్లు భూమిని చదును చేసి తుపాన్లను తట్టుకునే సామర్యం గల పొట్టిరకం, అధిక దిగుబడినిచ్చే తక్కువ కాలంలో పంట వచ్చే కొబ్బరిచెట్లు నాటి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 'వరి పంట నాశనం’ ♦ తుపానుతో జిల్లాలో ప్రధాన పంట అయిన వరికి తీవ్ర నష్టం వాటిల్లిందని ధర్మాన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తుపానుతో రెండు లక్షల ఎకరాలు, అనంతరం వచ్చిన వరదలతో మరో లక్ష ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతో, తరువాత తెగుళ్లు సోకి ఉన్న పంట పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకూ అందేటట్లు చేయాలన్నారు. గతంలో తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేసి మరలా వ్యవసాయం చేసుకునేందుకు కొత్త రుణాలు అందివ్వాలని కోరారు. డ్వాక్రా మహిళలకు కూడా తుపానుతో నష్టం వాట్లల్లిందని.. వారికి కూడా రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు అందించాలని, రానున్న నాలుగు సంవత్సరాల వరకూ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. రోడ్లను బాగుచేయాలి తుపాను కారణంగా గ్రామీణ రోడ్లతోపాటు ప్రధాన మార్గాలు, డ్రైనేజీలు పూర్తిగా నాశనమైన నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రోడ్లను మరమ్మతుచేయించి ప్రజలకు అంబాటులోకి తేవాలని ప్రసా దరావు కోరారు. అలాగే తీరప్రాంతంలోని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని.. వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. అలాగే వలలు, బోట్లు, ఐస్ బాక్స్‌లు సరఫరా చేయాలన్నారు. వేలాది ఇళ్లు నేలమట్టం తుపానుతో సుమారు 50 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయయని కలెక్టర్‌కు ధర్మాన వివరించారు. గడచిన నాలుగున్నరేళ్లలో పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని.. నష్టం భారీగా వాటిల్లిందన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గతంలో వచ్చిన హుద్‌హుద్ తుపాను బాధితులతోపాటు.. తాజాగా వచ్చిన తిత్లీ తుపాను బాధితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గిరిజనులకు వాటిల్లిన నష్టాన్ని పూరించాలి: ఎమ్మెల్యే కళావతి సీతంపేట ఐటీడీఏ పరిధిలోగల ఎస్టీలకు తుపానుతో భారీ నష్టం వాటిల్లిందని.. వారిని ఆదుకోని నష్టాన్ని పూరించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కలెక్టర్ ధనంజయరెడ్డికి విజ్ఞప్తి చేవారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టా లేదన్న కారణంతో బాధితులుగా గుర్తించకపోవడం తగదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ప్రభుత్వ నిబంధనల మేరకే పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు పంటలను నష్టపోయారు. విద్య, వైద్య ఖర్చులను భరించాలి: పిరియా విజయ ♦ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిరియా విజయ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు వైద్యం, విద్యకు అయ్యే ఖర్చులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరించాలని కలెక్టర్‌ను కోరారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు మెస్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరించడంతోపాటు రానున్న నాలుగేళ్లకు దీనిని వర్తింపజేయాలని కలెక్టర్‌ను కోరారు. దొంగలను తయారు చేసిన్ సర్కార్ ♦ కలెక్టర్‌ని కలిసిన అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గడచిన నాలుగున్నరేళ్లలో ప్రజాధనం ఏవిధంగా వచ్చినా దోపిడీ చేసే దొంగలను సర్కార్ తయారు చేసిందని వ్యాఖ్యానించారు. తుపాను నష్టపరిహారం విషయంలో కూడా ఆ దొంగల స్వైరవిహారం చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ప్రజలు ఉండాలన్నారు. నష్టపరిహారం జాబితాలో అనర్హులను చేర్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులను జడిపించి, బెదిరించి వారిచే తప్పుడు రికార్డులు చేయించే పనిలో టీడీపీ నాయకులు ఉన్నారని వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ♦ కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, నాయకులు అంబటి శ్రీనివాసరావు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, పీస శ్రీహరి, గొండు రఘురాం, టి కామేశ్వరి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, ఎంవీ స్వరూప్, సాధు వైకుంఠం, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, హనుమంతు కిరణ్‌కుమార్, మార్పు మన్మథరావు, ప.పద్మలోచనరావు పాల్గొన్నారు. -
అంతా పథకం ప్రకారమే..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఎంతమాత్రం చిన్నది కానే కాదని, ఆయన్ను అంతమొందించడానికి ఒక పథకం ప్రకారం పక్కాగా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం దీనిని చిన్నగా చేసి చూపుతోందని అభ్యంతరం తెలిపారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ హత్యాయత్నంపై నిష్పాక్షిక విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. మేకపాటి మాట్లాడుతూ జగన్ తనపై హత్యాయత్నం తానే చేయించుకున్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ఇక టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏకంగా తాము కావాలంటే జగన్‌ను కైమా కింద ముక్కలు చేస్తామంటున్నారని, ఇదెంత దారుణమైన మాట అని తప్పుపట్టారు. వాస్తవానికి జగన్‌పై జరిగిన దాడి చిన్నది కాదని, ఆ కత్తి ఎంతో పదునుగా ఉంటుందని, అది కనుక తగలరాని చోట తగిలితే ప్రాణాపాయం కలిగేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు చాలా చిన్న కుటుంబానికి చెందినవాడని, అతనికి అంత తెగింపు ఉండదని, ఎవరో ప్రేరేపించి ఉంటారు కాబట్టే అన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. హత్యాయత్నాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా డీజీపీ ఎలా చెబుతారని, టీడీపీ ఎంపీలు అంత దారుణంగా ఎలా మాట్లాడతారని మేకపాటి దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన్ను అంతం చేసేందుకు పథకం ప్రకారం చేసిందంటూ.. దీన్ని చిన్నదిగా చేసి చూపడం దారుణమన్నారు. ఈ ఘటనకు ఇతరులను బాధ్యులుగా చేయడం, వారిపైనే నిందలు వేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రతిపక్ష నేతను పరామర్శించిన వారినీ విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని ప్రజలంతా గమనించాలని, ఇలాంటి పోకడలను సమర్థిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని అనేక సమస్యలొస్తాయని చెప్పారు. థర్డ్‌పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయించాలి.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంలో తననే ముద్దాయిగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు అంటున్నారని, అయితే దీన్నుంచి బయటపడాలంటే.. రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేని ఏజెన్సీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికను ప్రజల ముందుంచితే సరిపోతుందని ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఈ ఘటనతో సీఎంకు సంబంధం లేదని చెప్పడం నిజమే అయితే అది దర్యాప్తులో తేలుతుంది కదా? మీకెందుకంత కలవరం? అని ప్రశ్నించారు. థర్డ్ పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయిస్తే అన్నీ తేటతెల్లమవుతాయన్నారు. డీజీపీ ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయం చెప్పారని, కానీ సీఎం పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌ను) ఏర్పాటు చేస్తానన్నారని, డీజీపీ అభిప్రాయం చెప్పాక దానికి భిన్నంగా సిట్ నివేదికిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అంటే దాదాపుగా మీ(సీఎం) హోదా కలిగినవారని, అలాంటివ్యక్తిపై హత్యాయత్నం జరిగితే ఇలా వ్యవహరిస్తారా? అని విస్మయం వెలిబుచ్చారు. ఘటన జరిగిన గంటలోపే డీజీపీ తన అభిప్రాయం ఎలా చెబుతారు.. ఆయన అసలు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. డీజీపీ చెప్పిందే నిజమని ప్రజల్ని నమ్మించేయత్నం పథకం ప్రకారం జరుగుతోందన్నారు. గవర్నర్‌ను తప్పుపట్టడమేంటి? గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి అని, ఈ హత్యాయత్నంపై డీజీపీతో ఆయన మాట్లాడటాన్ని ఎలా తప్పుపడతారు? వాస్తవానికి రాష్ట్రంలో గవర్నర్ పేరుమీదుగానే కదా పాలన జరిగేది? అని ధర్మాన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి ఎవరు? ప్రభుత్వ నిర్ణయాలు ఎవరిపేరిట వెలువడతాయి? అసలు మంత్రిమండలిని నియమించేది ఎవరని నిలదీశారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఏకంగా కలెక్టర్ల సదస్సులోనే మాట్లాడారని, ఒక ముఖ్యమంత్రిగా అలా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. ఎవరి అజమాయిషీలో పనిచేస్తున్నారో ఆయననే అవమానపరుస్తూ మాట్లాడ్డం చూస్తే చంద్రబాబు గతి తప్పుతున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీలో గంభీరంగా మాట్లాడారని, దేశంలో రాజ్యాంగవ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోయాయని ప్రసంగించారని, కానీ అక్కడివారికి ఇక్కడ(ఏపీలో) ఏం జరుగుతోందో తెలియదని ధర్మాన అన్నారు. ఏకంగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేగాక వారిని అనర్హులుగా చేయకుండా స్పీకర్‌పై ఒత్తిడి చేసింది నిజం కాదా? అలాంటి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతోందని మాట్లాడతారా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్నదానికి భిన్నంగా ఢిల్లీ వీధుల్లో గగ్గోలు పెడుతున్నారని, మీపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరపకూడదా? మీరేమైనా అతీతులా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు కనుక విచారణకు ఆహ్వానిస్తారనుకున్నామని, తనను తాను రక్షించుకోవడానికి మాట్లాడారేతప్ప మరేమీ లేదన్నారు. అందుకే తాము థర్డ్‌పార్టీ విచారణనుగానీ, సీబీఐ దర్యాప్తునుగానీ కోరుతున్నామన్నారు. జగన్ తమ దయాదాక్షిణ్యాలమీదనే బతుకుతున్నాడని, తాము అనుకుంటే కైమా చేసేవాళ్లమన్న టీడీపీ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
తుపాను బాధితులను జగన్ కలుస్తారు
సాక్షి, విజయనగరం: శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పది పదిహేను రోజుల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బాధితులను స్వయంగా కలుస్తారని చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రెండు కమిటీలు రూపొందించిన నివేదికలను వైఎస్ జగన్‌కు అందించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ... తుపాను నష్టం గురించి అన్ని వివరాలను జగన్ తెలుసుకున్నారని తెలిపారు. తుపాను కారణంగా రూ. 3,464 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు కరెంట్, నీరు అందించాలని కోరారు. పార్టీలకు అతీతంగా బాధితులకు సహాయం అందించాలని, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతల చేతివాటం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. మీరు ఇవ్వకపోతే మేమిస్తాం: భూమన తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులందరినీ కలిసి నష్టం అంచనాలు వేస్తున్నామని తెలిపారు. సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆరు నెలల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మొత్తం నష్టం రూ. 3,464 కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి తప్పా చేతల సీఎం కాదని విమర్శించారు. -
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు
-
‘తిత్లీ’ బాధితులకు అండగా ఉంటాం
వజ్రపుకొత్తూరు రూరల్: తిత్లీ తుపాను బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను ప్రభావిత గ్రామాలైన చినవంక, డోకులపాడు, బాతుపురం, పల్లెసారథిలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క బాధితునికీ నష్ట పరిహారం అందించేందుకు వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపడుతోంది తప్ప పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఆయా గ్రామాల్లో వీధివీధిలో పర్యటిస్తూ బాధితుల సమస్యలను వింటూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గురయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి తమ్మినేని శాంతారావు, శ్రీనివాసరావు, ధర్మారావు తదితరులు ఉన్నారు. సీఎం తీరును నిరసిస్తూ ప్రభుత్వ వాహనాల అడ్డగింత... తిత్లీ తుపాను నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు తమ గ్రామానికి రాకపోవడంపై వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం, పెదవంక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత అక్కుపల్లికి వచ్చిన సీఎం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న బాతుపురం, పెదవంక గ్రామాల్లో దిగకపోవడంపై బాధితులు మండపడ్డారు. ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా సీఎం కాన్వాయ్ వెళ్లిన వెంటనే మిగిలిన ప్రభుత్వ వాహనాలు వెళ్లకుండా పెద్ద పెద్ద దుంగలు, చెట్లు కొమ్మలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కనీసం తాము ఎలా ఉన్నామో తెలుసుకోకుండా, వాహనం దిగకుండా వెళ్లిపోవడం తగదన్నారు. అదే సమయంలో దర్మాన ప్రసాదరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పలాస నియోజకవర్గ కన్వీనర్ సీదిరి అప్పలరాజు వచ్చి బాధితులను ఓదార్చారు. అనంతరం అడ్డంగా ఉన్న దుంగలను, చెట్ల కొమ్మలను నాయకులే స్వయంగా తొలగించారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. తుపాను నష్టంపై ధర్మాన నేతృత్వంలో కమిటీ సాక్షి, హైదరాబాద్: తిత్లీ తుపాను వల్ల దెబ్బ తిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. భూమన కరుణాకరరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ నేతలు రెడ్డి శాంతి, రఘురామ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి, జరిగిన నష్టాన్ని ఈ కమిటీ అంచనా వేసి పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పిస్తుంది. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పర్యటన: ధర్మాన
శ్రీకాకుళం: తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఈ రోజు, నర్సన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో రేపు వైఎస్సార్సీపీ నాయకుల పర్యటన ఉంటుందని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళంలో విలేకరులతో ధర్మాన మాట్లాడుతూ.. తుపాను తీవ్రతను ప్రజలకు ప్రభుత్వం చెప్పలేకపోయిందని విమర్శించారు. తీవ్రతను అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్స్యకారులు విపరీతంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో వరి, జీడిమామిడి, కొబ్బరి, మామిడి పంటలకు నష్టం జరిగి భారీగా ఆస్తి నష్టం ఏర్పడిందన్నారు. హుద్‌హుద్ సహాయమే ఇంకా రైతులకు అందలేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధమే లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లేవని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా రాలేదని తెలిపారు. మూడు రోజులుగా తుపాను హెచ్చరికలు ఉన్నా, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ లేదని తెలిపారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి ఉంది తప్పితే.. బాధితులకు సహాయం చేయడంలో శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. విపత్తుల్లో ఉన్నా చంద్రబాబు ఆదుకోరని ప్రజలకు అర్ధమైందన్నారు. అత్యవసర పనుల్లో వినియోగించే వారికి చెల్లింపులు కూడా సరిగ్గా చేయకపోవడంతో ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. తిత్లీ తుపాను నష్టంపై ధర్మాన నేతృత్వంలో కమిటీ తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షులు రఘురాం సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేపటి నుంచి తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి నష్టం నివేదికను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు అందజేస్తారు. -
అడుగులో అడుగేస్తూ..
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మంగళవారం పాదయాత్ర చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా గార మండలంలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పాద యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను రూపకల్పనచేసి వన్నెతెచ్చినది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ప్రాజెక్టులను నేనే తెచ్చానని.. నేనే పూర్తి చేయగలనని డబ్బాలు కొట్టుకుని తిరగడం చంద్రబాబుకి తగదన్నారు. అన్ని ప్రాజెక్టుల పనులు రాజశేఖరరెడ్డిహయాంలోనే 70 శాతానికి పైగా పూర్తయ్యావన్నారు. అయితే కమీషన్ల కక్కుర్తికి అంచనాలు పెంచేసి ఉన్న కొద్దిపాటి పనులను కూడా చంద్రబాబు నేటికీ పూర్తిచేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నీరుపారించే సత్తాఉన్న నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేగిందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం శాస్త్రులపేట నుండి సరుబుజ్జిలి జంక్షన్ వరకు శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై జనం విసిగెత్తి ఉన్నారన్నారు. త్వరలోనే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎంపీపీ కె.సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి ఎస్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పరిధి పోలాకి మండలంలోని రాజారాంపురం నుంచి గుప్పడిపేట వరకూ పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర చేశారు. అధికసంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ నవరత్నాలతో తమ పార్టీ అందరినీ ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో ధర్మాన రామదాస్, ధర్మాన కృష్ణ చైతన్య , కరిమి రాజేశ్వరరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సమస్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదగా కొరసవాడ గ్రామం వరకూ పాదయాత్ర చేశారు. కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల పార్టీ కన్వీనర్లు సారిపల్లి ప్రసాదరావు, అల్లు శంకరరావు, కిల్లారి త్రినాథరావులు పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గం పరిధి భామిని మండలం ఘనసరలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సంఘీభావ యాత్ర చేశారు. మహిళలు భారీగా పాల్గొన్నారు. పార్టీ మండల కన్వీనర్ పి.సింహచలం, పాలకొండ మండల నాయకులు రణస్థలం రాంబాబు, రామచంద్ర నాయుడు పాల్గొన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాలి జోగులు మారేడుబాక నుంచి బొద్దాం జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం బొద్దాంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్ పాదయాత్రకు వస్తున్న జనస్పందన చూసి టీడీపీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం నుంచి ఈదుపురం గ్రామం వరకు సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, జెడ్పీటీసీ సభ్యురాలు జామి జయ పాల్గొన్నారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామం నుంచి పెద్దసాన, రాధావల్లభాపురం, పోలవరం గ్రామాల మీదుగా లింగాలవలస గ్రామం వరకు నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాల పథకాలే పార్టీ విజయానికి పునాదులన్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధి తెప్ప రేవు నుంచి బొంతలకోడూరు వరకు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ పది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మొక్కలు నాటి పాదయాత్ర ప్రారంభించారు. అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. పలాస నియోజకవర్గం పరిధి మందస మండలంలో సమన్వయకర్త సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేశారు. కొత్తపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అప్పలరాజు కొత్తపల్లి నుంచి ముకుందపురం, బాలాజీపురం, సొండిపూడి, సిద్ధిగాం, శ్రీరాంపురం, శ్రీరాంపురం, హొన్నాళి, బెల్లుపటియా, మహదేవుపురం, సిరిపురం, పొత్తంగి వరకు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుత్తు ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శులు మెట్ట కుమారస్వామి, డొక్కరి దానయ్య, బల్ల గిరిబాబు పాల్గొన్నారు. -
జగనన్నకు అండగా..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, ఆలయాల్లో పూజలను పార్టీ శ్రేణులు సోమవారం నిర్వహించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను దోపిడీ చేయడంతోపాటు చట్టాలను ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని మించిన ఘనుడు మరొకరు లేరన్నారు. శాసన సభలో అధికారపక్షం పాత్ర ఎంత ఉంటుందో.. అంతేస్థాయిలో ప్రతిపక్షాల పాత్ర ఉంటుందన్నారు. ప్రతిపక్షానికి అన్నిరకాల ఆర్థిక వ్యవహారాలు చేసే అధికారం ఉందన్నారు. సంక్షేమ పథకాలు, ఆర్థిక వ్యవహారాల్లో అవినీతిని, అరాచకాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చంద్రబాబు తన స్థాయిని మరిచిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నపుడు మైక్ కట్ చేయడం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన వారిని బెదిరిచండం వంటివి చేయడం సరికాదన్నారు. అధికారం కోసం మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక అబద్ధపు హామీలిచ్చి.. అధికారం చేపట్టాక వారందరినీ నిలువునా మోసం చేసిన మహానుభావుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరాచకాలను అడ్డుకట్ట వేసేందుకు, టీడీపీ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరంగా తెలియజేసేందుకు పాదయాత్రె? శరణ్యమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు ఎన్నో కుయుక్తులు చేస్తున్నారన్నారు. టీడీపీ మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉందని.. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. ఎప్పుడు తగిన గుణపాఠం చెబుదామాని ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికలకు అనుకూలంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, నాయకులు సాధు వైకుంఠరావు, పొన్నాడ రుషి, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, మండవిల్లి రవి, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, కోరాడ రమేష్, జీవరత్నం, కెఎల్ ప్రసాద్, కోణార్క్ శ్రీను, రఫీ, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దనరావు, గొండు రఘురాం, గొండు కృష్ణ, సిజారుద్దిన్, ఉమామహేశ్వరి, టి.కామేశ్వరి, చల్లా అలివేలుమంగ, నల్లబారికి శ్రీను, జి.అప్పలాచారి పాల్గొన్నారు. తొలుత పార్టీ శ్రేణులు ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చరిత్రలో నిలిచి పోతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కష్ణదాస్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు దాటి సందర్భంగా నరసన్నపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పైడితల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కట్ చేశారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు జగన్మోహనరావు, టంకాల అచ్చెన్నాయుడు, ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల పార్టీ కన్వీనర్లు, యూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండల పరిధిలో సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో జగన్‌కు సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బల్లిపుట్టుగ నుంచి మండల కేంద్రం కవిటి వరకు ర్యాలీ సాగింది. కాశీబుగ్గ లోని పార్టీ పలాస సమన్వయకర్త సీదరి అప్పలరాజు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్ పాల్గొన్నారు. పాలకొండలో పార్టీ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోటదుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. -
బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తాం
-
‘టీడీపీ ఎంపీలు దోషులుగా మిగులుతారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్ బాషా అన్నారు. హోదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తే, టీడీపీ దుష్ప్రచారం చేసిందని ధర్మాన మండిపడ్డారు. హోదా కోసం ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు హోదాతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎంపీ పదవులను త్యాగం చేయడం ఆషామాషీ కాదని అంజాద్ బాషా అన్నారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో తమ ఎంపీలు చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలని బాషా డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారు
-
బాబూ.. నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. జీవితమంతా ప్రజాస్వామ్య విలువలను కాలరాసి, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. కర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాలని చంద్రబాబు కోరడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధర్మాన ధ్వజమెత్తారు. చంద్రబాబు ట్వీట్, పలుచోట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై ధర్మాన శుక్రవారం రాత్రి స్పందించారు. కర్ణాటక పరిణామాలతో దేశంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు ఆంధ్ర రాష్ట్రంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన నలుగురిని ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ఒక్కొక్కరికి రూ.40 కోట్లకుపైగా ముట్టజెప్పి సంతలో పశువుల్లా కొనుగోలు చేసి బాబు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి సీఎం అయ్యావు 40 ఏళ్లు నిప్పులాంటి రాజకీయాలు చేశానని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ ఎదుగుదలంతా అనైతిక వ్యవహారాలతోనే నడిచిందని ధర్మాన దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యిందే ప్రజాస్వామ్యాన్ని కాలరాచి అని, గవర్నర్, స్పీకర్ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని విమర్శించారు. 1995లో సొంతమామైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను వైశ్రాయ్ హోటల్లో దాచి సీఎం పీఠాన్ని లాక్కుని ఆయన్ను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. ఆ సమయంలో గవర్నర్, స్పీకర్లను అప్రజాస్వామికంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుని సీఎం పీఠం ఎక్కారన్నారు. బాబు రాజకీయ పునాదే ప్రజాస్వామ్య విరుద్ధమని, ఆయన ప్రతి అడుగూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వేసిందేనన్నారు. దేశంలోనే అప్రజాస్వామిక నేత బాబు కోర్టుల్లో తనమీద ఉన్న అవినీతి కేసులపై విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకున్న ఘనత కూడా చంద్రబాబుదేనని ధర్మాన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల్లో చంద్రబాబుదే అగ్రస్థానమని, ప్రజాస్వామ్య విలువల గురించి ఆయన వల్లె వేయడం దారుణమన్నారు. గోవా, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు ఏర్పడినప్పుడు బాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. -
‘అలా చెప్పడం చంద్రబాబుకే చెల్లింది’
సాక్షి, గుంటూరు : బ్రిటిష్ వారితో పోరాడాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఏం చెప్పిన జనం నమ్ముతారులే అనే నియంతృత్వ పోకడలతో చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. బ్రిటిష్ వారితో టీడిపీ యుద్దం చేసిందని చెప్పటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. జీతభత్యాలు లేకుండా స్వచ్ఛంగా పనిచేసే కార్యకర్తే నిజమైన ప్రజాసేవకుడని తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. పంచాయితీ ఎన్నికలకు వచ్చినంత పోలింగ్ శాతం, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చేలా చూడాలని, బూత్ స్థాయిలో జరిగే అన్ని రాజకీయ పరిణామాలను పైస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. తన అద్భుతమైన పరిపాలన, పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చురగొన్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేవలం తన పార్టీ వారికి తప్ప మరెవరికీ ప్రభుత్వ పథకాలు అందించట్లేదని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం
-
వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
వైఎస్సార్ జిల్లా : కడప గోసుల కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సజ్జల రామకృష్టా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేసి తరగతులను ప్రారంభించారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..కడప వాసులు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నారని మీ మీద కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. కడప నగరంలో సుమారు లక్ష ఓట్లు అకారణంగా తీసేశారని తెలిపారు. సాధారణ ఓటరుకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలా చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అధికారం అందుకునే దిశగా మనం ఎదుగుతున్నామని ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న 67 సీట్లు..2019లో 147 కావచ్చునని వ్యాఖ్యానించారు. -
నల్లజెండాలతో పాదయాత్ర
విజయవాడ: ప్రజలను వంచించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని, ఏప్రిల్ 30న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు పట్టుకుని, నల్లబాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ఏపీకి జరిగిన అన్యాయాన్ని నల్లజెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామని వివరించారు. మరో వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు.హోదాకు వంచన చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీని వంచన దినంగా పాటిస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.విశాఖలో ఏప్రిల్ 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని వివరించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసన ద్వారా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. -
నటన మానితే మంచిది!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : నటించే కార్యక్రమాలు మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా పనిచేస్తేనే రాష్ట్రానికి, ఆయనకూ మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రత్యేక హోదా అవసరం ఏమిటో తొలి నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గళం వినిపిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అమలు కోసం పోరును తమ పార్టీ తారస్థాయికి చేర్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు, తర్వాత ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామాలు, ఢిల్లీలో ఉద్యమం, రాష్ట్రంలో ఆందోళనలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. శనివారం శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి వద్ద పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇటీవల రాజీనామాలు చేసిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు, తనతో సహా తొమ్మిది మంది రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొననున్నట్లు చెప్పారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వడమనే ప్రక్రియ ఇంతకుముందే పూర్తయ్యిందన్నారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పునరుద్ఘాటించారు. దీన్ని డిమాండ్ చేసి సాధించాల్సిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పరపతిని కోల్పోయారని విమర్శించారు. టీడీపీ భాగస్వామిగా ఉన్నా కేంద్రాన్ని ఒప్పించి సాధించే అవకాశం ఉండేదన్నారు. కానీ ఆ అవకాశాన్ని చంద్రబాబు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు వ్యవహరించిన ధోరణి, మాట తీరును చూసే అతని పరిస్థితిని గమనించిందన్నారు. తాను చెప్పిన మాటకే అతను కట్టుబడి ఉండరని, సీరియస్‌నెస్ లేదనే విషయాన్ని కేంద్రం గ్రహించిందని ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు స్వార్థపూరిత వ్యవహార శైలి వల్లే కేంద్రం వద్ద పరపతి కోల్పోయారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించగలరనే విశ్వాసం ప్రజల్లో నెలకొందని ప్రస్తావించారు. కేంద్రంతో ఆయన నిర్విరామ పోరాటం చేస్తున్నారన్నారు. అందుకే ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కీలకమైందని చెప్పారు. దీన్ని అమలు చేయడానికి సిద్ధమైనప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ పొత్తుకు సిద్ధమవ్వాలని జాతీయ పార్టీలు ఆలోచించే పరిస్థితి జగన్ పోరాటం వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయడానికి సిద్ధమయ్యే పార్టీతోనే పొత్తు ఉంటుందని ఆయన తొలి నుంచే ఒక్కటే మాట చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీలు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సంప్రదింపులు జరపాలంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సాధించుకున్న ప్రత్యేక హోదాను అమలుచేయడానికి సిద్ధంకావాలన్న సంకేతాలు వెళ్లాయని చెప్పారు. ఇలాంటి వాతావరణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నప్పుడు ఇంకా చంద్రబాబు చిల్లర వేషాలు, నటించే కార్యక్రమాలు, అసత్య ప్రచారాలను ఆయుధాలుగా చేసుకొని బయటపడాలనుకోవడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు. -
కమీషన్ల కోసం రాష్ట్రానికి అన్యాయం: ధర్మాన
సాక్షి, కర్నూలు : మహానేత వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రసంగించారు. జలయఙ్ఞంతో రైతులకు మేలు : ధర్మాన ప్రసాద్ దేశానికి వెన్నెముక వంటి రైతు ప్రయోజనాలను రక్షించడానికి దీక్ష పూనింది వైఎస్సారేనని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన మహానేతను స్మరించుకోవడానికి వైఎస్సార్ గంగా హారతి ద్వారా అవకాశం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రోజూ రైతులు చనిపోతున్నారని, వారికి మేలు చేయాలని ఆనాడు వైఎస్సార్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ‘వ్యవసాయం దండగ’ అంటూ రైతులను అవమానించిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 70 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్ సదుపాయం కల్పించారన్నారు. జలయఙ్ఞం చేపట్టి రైతు కష్టాలను తీర్చడం కోసం వైఎస్సార్ కృషి చేశారన్నారు. సీఎం అంటే వైఎస్సార్‌లా ఉండాలనే పేరు పొందిన మహనీయ వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్రప్రయెజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. డబ్బులకు ఆశపడే కొందరు టీడీపీలో చేరారని, వారందరి భరతం పట్టే కార్యక్రమం దగ్గర్లోనే ఉందంటూ ధర్మాన ఫిరాయింపు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వైఎస్సార్ మేలు ఎవరూ మరువరు : శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కృషితోనే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధ్యమైందని శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. రాయలసీమకు మహానేత చేసిన మేలును ఎవరూ మరవరన్నారు. వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు : నాగిరెడ్డి అపార పాలనానుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జలయఙ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టి.. వాటి కోసం నిధులు కేటాయించింది వైఎస్సారేనని గుర్తుచేశారు. -
అవిశ్వాసం వేళ ‘అఖిలపక్షం’ డ్రామా
సాక్షి, హైదరాబాద్: మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పుట్టి మునగకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధర్మాన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార టీడీపీ దారుణంగా విఫలమైందన్నారు. చంద్రబాబు సాగిస్తున్న అఖిలపక్ష చర్చల డ్రామాలతో సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, మళ్లీ ప్రజా తీర్పు కోరుతామని స్పష్టం చేశారు. సీఎంకు హోదా ఇప్పుడే గుర్తొచ్చిందా? ‘‘రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని అంగీకరించిన రోజే చంద్రబాబు ప్రజల పక్షాన నాయకత్వం వహించే అర్హత కోల్పోయారు. ఇంతకాలం ప్యాకేజీ అద్భుతమంటూ పాట పాడిన చంద్రబాబుకు ఇప్పుడే హోదా గుర్తొచ్చిందా? లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు వచ్చే సమయంలో చంద్రబాబు ఇక్కడ అఖిలపక్షం అంటున్నారు. రాజధాని విషయంలో ఒక్కరోజైనా ప్రతిపక్షాన్ని సంప్రదించారా? ప్రజాసంఘాలతో చర్చించారా? రాజధానిని చంద్రబాబు తన కుటుంబ వ్యవహారంగానే చూశారు. పోలవరం విషయంలో ఏనాడైనా అఖిలపక్షాన్ని సంప్రదించారా?’’ అని ధర్మాన నిలదీశారు. రాష్ట్రం చెడిపోవడానికి బాబే కారణం ‘‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. సింగపూర్ తరహాలో ప్రతిపక్షం ఉండకూడదన్నదనే తన ఆకాంక్ష అని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పాలకుల తప్పులను, అవినీతిని బహిర్గతం చేస్తున్న ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బు, పదవులు ఎరవేసి కొనుగోలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజాగ్రహానికి తట్టుకోలేకే టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పాలక పక్షం విఫలం కావడం వల్లే ఆ బాధ్యతను ప్రతిపక్ష వెఎస్సార్సీపీ భుజానకెత్తుకుంది. ఇప్పుడు కావాల్సింది అఖిలపక్షం భేటీ కాదు, టీడీపీ ఎంపీల రాజీనామా. రాష్ట్రం చెడిపోవడానికి, అవినీతి పెరగడానికి చంద్రబాబే కారణం. ఇలాంటి వ్యక్తితో కలిసి చర్చించడంలో అర్థం ఉందా?’’ అని ధర్మాన ప్రశ్నించారు. -
‘అఖిలపక్షం’ డ్రామా
సాక్షి, హైదరాబాద్: మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీకి తీరని అన్యా యం చేసిన సీఎం చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసా దరావు చెప్పారు. టీడీపీ పుట్టి మునగకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశమంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధర్మాన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాబు సాగిస్తున్న అఖిలపక్ష చర్చల డ్రామాలతో సాధించేదేమీ ఉండదన్నారు. హోదాపై కేంద్రం స్పందించక పోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, మళ్లీ ప్రజా తీర్పు కోరుతామన్నారు. ఇప్పుడు కావాల్సింది అఖిలపక్షం భేటీ కాదు, టీడీపీ ఎంపీల రాజీనామా ’’ అని ధర్మాన అన్నారు. -
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
-
ఎన్నికల సమరానికి సర్వసన్నద్ధం కావాలి
రావులపాలెం (కొత్తపేట) : ఎన్నికల సమరానికి ఎంతో సమయం లేదని, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్సీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, ప్రతి 100 మందికి ఒక బూత్ సభ్యుడు ఉండేలా కన్వీనర్లు నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇందుకు ఉత్సాహవంతులు, పార్టీ కోసం పని చేసేవారిని తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నాయకులకు వివరించి, పరిష్కరించడం ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు వారథులుగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల సూక్ష్మస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, అతడితో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా, చంద్రబాబు అదే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తూ, 53 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. తమ అనుకూల ఎల్లో మీడియాలో పదేపదే రాజధాని ఊహాచిత్రాలను చూపిస్తూ ప్రజలను మ«భ్యపెడుతున్నారని, వాస్తవంగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు ఓడించడానికి జన్మ«భూమి కమిటీలనే ఒక్క కారణం చాలని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసినా, స్పీకర్ ఇంతవరకూ వారిపై అనర్హత వేటు వేయకపోవడం, వారిలో నలుగురితో మంత్రులుగా సాక్షాత్తూ గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలను అందించారని, కానీ చంద్రబాబు తమకు ఓటు వేస్తేనే లబ్ధి చేకూరుస్తామనే నీచమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గడచిన 70 ఏళ్లలో ఇంత అన్యాయమైన పాలన ఏనాడూ చూడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కమీషన్లపై కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందని ధర్మాన అన్నారు. మరో ముఖ్య అతిథి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లేని పోల్ మేనేజ్మెంట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అనే రెండు కొత్త స్కీములు అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, రెండేసి ఓట్లు ఎలా వేయాలో పోల్ మేనేజ్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే.. చేసిన దూబరా ఖర్చులను కప్పిపుచ్చడానికి ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయాన్ని వ్యాపారం, నేరమయంగా మార్చేశారన్నారు. మాజీ మంత్రి, అమలాపురం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి గొల్ల పల్లి డేవిడ్‌రాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రొఫెసర్లు రవికుమార్, నారాయణరెడ్డిలు పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, సామాజిక మాధ్యమాలు, వర్తమాన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ఆవిర్భావం, ఆదర్శవాదం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం ధర్మాన, బోస్ తదితర నాయకులను జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. -
ఢిల్లీలో భజన... లీకుల్లో గర్జన
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో భజన చేస్తూ...లీకుల్లో మాత్రం గర్జనలు చేయడం తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్న చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఏ కోశానా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం, బీజేపీ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాలను తూర్పారబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే సమస్యలకు పరిష్కారమని వైఎస్సార్సీపీ భావిస్తుండగా.. టీడీపీ మాత్రం తమ స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఢిల్లీలో భజన చేస్తూ, రాష్ట్రంలో మాత్రం బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు హైడ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులైనా సీఎం కన్పించడం లేదని, మరోవైపు ఆయన పార్టీ కార్యాలయం లీకుల మీద లీకులిస్తోందని ధర్మాన ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు గారు బడ్జెట్‌పై నోరు విప్పండి
-
భర్త ఇచ్చిన ఇంటినే... ఎమ్మెల్యే కూల్చేయడమా?
శ్రీకాకుళం రూరల్: హిందూ సంప్రదాయం తెలిస్తే గ్రహణం రోజున కొన్ని కుటుంబాలను రోడ్డున నిలబెట్టేందుకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెగిస్తారా? అని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చిన ఇంటినే ఇప్పుడు కూల్చేయడానికి ఆమె అధికారులను పురమాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకు ళం నగరం శివారు చాపరం పంచాయతీ పరిధిలోని విశాఖ–బి కాలనీలో వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన భవంతిని కూల్చేయడానికి పంచాయతీ సిబ్బంది వెళ్లారు. అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలంటూ హడావుడి చేశారు. గ్రహణం పూట వచ్చి ఇలా రోడ్డుపైకి వెళ్లమంటే ఎలాగంటూ ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ధర్మాన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, తహసీల్దారు మురళీకృష్ణతో మాట్లాడారు. ఇది ఎమ్మెల్యేకు తగునా? శ్రీకాకుళం నగరంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ధర్మాన తప్పుపట్టారు. పట్టా తీసుకొని కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవంతిని ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 1996లో తంగి ఈశ్వరరావుకు అప్పటి ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన భార్య మాత్రం ఇప్పుడా విషయం తెలియకుండా కేవలం కక్ష సాధింపు కోసం భవనాలను కూల్చివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కళ్లెదుట బడ్జెట్ హోటల్ పక్కన భారీ కన్వెన్షన్ హాల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మిస్తున్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా? అని ప్రశ్నించారు. దేవాదాయ భూముల్లోనే అక్రమాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తాము వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు కన్వెన్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చి వేయండని సవాల్ విసిరారు.