సాక్షి, శ్రీకాకుళం: నేరడి.. జిల్లా ప్రజల చిరకాల కల. వైఎస్సార్ నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శతవిధాలా కృషి చేశారు. అడ్డంకులు అన్నీ తొలగినా పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగి నీరు అందేందుకు కాస్త సమయ పడుతుంది. ఈ లోగానే ఖరీఫ్‌లో 2.50 లక్ష లు, రబీలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు, ఉద్దానం ప్రాజెక్టుకు తాగునీరు అందించేందుకు మరో ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ఇరిగేషన్‌లో నిపుణులైన ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివరించారు. దానిపై మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఇరిగేషన్ శాఖ సమీక్షలో సీఎం సానుకూలంగా స్పందించారు.
ధర్మాన ప్రతిపాదించిన లేఖ
మంత్రిగా ఉన్న సమయంలో ధర్మాన ప్రసాదరావు జిల్లా రైతుల శ్రేయస్సు కోసం తన ప్రతిపాదనలను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైఎస్సార్ వంశధార స్టేజ్–2, ఫేజ్– 2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87, ప్యాకేజీ–88, హిరమండలం రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. నేరడి మాత్రం ఎప్పటి నుంచో కలగానే మిగిలిపోయింది. హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీ ఎంసీల నీటిని నింపి జిల్లా రైతులకు మేలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.600 కోట్లు అవసరం. వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఒడిశా అభ్యంతరాల వల్ల జాప్యం జరుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే తప్ప రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీరు నింపే పరిస్థితి లేదు.
వంశధార రిజర్వాయర్
దీంతో నిష్ణాతులైన ఇంజినీర్ల ఆలోచనతో గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, దానితో హిర మండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని డంప్ చేసే ప్రతిపాదనను శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ సమావేశాల సమయంలో లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ లిఫ్ట్ పనులకు సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. హిరమండలం రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు సాగునీరుతో పాటు, ఉద్దానంకు తాగునీరు, భావనపాడు ఫిషింగ్ హార్బర్‌కి పుష్కలంగా నీరిచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదనకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ ఇంజినీర్లతో తాడేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష స మావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు సర్వే, తదితర చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఒకే సీజన్‌లో పూర్తి..
లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ఎంతకాలమో పట్టదు. ఒకే సీజన్‌లో పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఖరీఫ్‌లో 2.50లక్షల ఎకరాలకు, రబీలో 1.50లక్షల ఎకరాలకు నీరు అందించడానికి అవకాశం ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్‌కు చేసే ఖర్చును నాలుగేళ్లలో వెనక్కి తెచ్చుకోవచ్చు. రైతులకు అందించే నీటితో పండే పంట ద్వారా ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి వస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరసన నిలబడేందుకు ఈ లిఫ్ట్ పనులు ఎంతో దోహదపడతాయి.
లిఫ్ట్ పథకం జిల్లా ప్రజలకు వరం
వెనుకబడిన ప్రాంతంగా శ్రీకాకుళంకు పేరుంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఉన్న వనరులను ప్ర భుత్వాలు సమర్థంగా వాడు కోవాలి. అందులో భాగంగానే వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు అందించారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1600 కోట్లు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావాల్సిందే. కానీ ఒడిశా అభ్యంతరాలు చెబుతూనే ఉంది. దీనికి బ్రేక్ వేయాలనే ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. అందుకు ఆయన సా నుకూలంగా స్పందించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కొన్నా ళ్లు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని నిర్మాణానికి కూడా నాలుగైదు సీజన్లు పడుతుంది.
అందుకే తక్షణం రైతులకు ఉపయోగపడేలా హిర మండలం రిజర్వాయర్‌లో 19.5 టీఎంసీల నీటిని నింపేందుకు తగిన సలహాలు, సూచనలు వంశధార ఇంజినీర్లను అడిగాం. జేఈ నుంచి చీ ఫ్ ఇంజనీర్ వరకు అందరి నోటా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గమనే సూచన వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ విషయాన్ని సీఎంకు వివరించాం. గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని నింపవచ్చన్న విషయాన్ని చెప్పాం. దీనికి రూ.300 కోట్లు అవసరమని దీని వల్ల ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలు, రబీలో 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు చేసేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరంగా తెలియ జేశాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. లిఫ్ట్ పనులు పూర్తయితే జిల్లా రూ పురేఖలు మారిపోతాయి.
ఖరీఫ్, రబీలో వరితో పాటు వాణిజ్య పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతుల కోసం ఖర్చు చేయడం ధర్మమే. సీఎం సానుకూల స్పందనతో వచ్చే రబీ నాటికే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకుండా కరువు వంటి పరిస్థితులు వచ్చినా హిరమండలం రిజర్వాయర్‌లో నీటిని ఆయకట్టుకి ఇ చ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కొ త్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లా లో ఉండే 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ప్రజలకు అ«ధికంగా ఉపయోగపడుతుంది.
– ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment