LIFT IRRIGATION
-
కాళేశ్వరం సేప్టీ అధికారులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, భద్రత వంటి అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న బహిరంగ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ బహిరంగ విచారణలో ఆన్లైన్లో డ్యామ్ స్టేఫీ అధికారి మురళీకృష్ణపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఫైరయ్యిందిఆన్లైన్లో డ్యామ్ సేప్టీ అధికారి మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా మూడు బ్యారేజీల సేఫ్టీపై ఆరా తీసింది. డ్యామ్ సేప్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని గుర్తించింది. దీంతో సేప్టీ అధికారులపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
కృష్ణాపై తెలంగాణ మరో అక్రమ ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మరో అక్రమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, పర్యావరణ అనుమతి తీసుకోకుండా అచ్చంపేట ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలను తరలించి అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా రూ.1,061.39 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు.. ఈ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విఫలమయ్యారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనంగా 5 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించి, వాటిని ఎదుల రిజర్వాయర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి ఉమామహేశ్వర రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఎత్తిపోతల కింద కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలోకి తరలించేలా తెలంగాణ నూతన ప్రాజెక్టు చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతి, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. ఈ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలో పిటిషన్ వేయనుంది. -
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో ఆదివారం రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్డీ రంగారెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ధర్మాన ప్రతిపాదనలకు సీఎం జగన్ సానుకూలం
సాక్షి, శ్రీకాకుళం: నేరడి.. జిల్లా ప్రజల చిరకాల కల. వైఎస్సార్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శతవిధాలా కృషి చేశారు. అడ్డంకులు అన్నీ తొలగినా పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగి నీరు అందేందుకు కాస్త సమయ పడుతుంది. ఈ లోగానే ఖరీఫ్‌లో 2.50 లక్ష లు, రబీలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు, ఉద్దానం ప్రాజెక్టుకు తాగునీరు అందించేందుకు మరో ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ఇరిగేషన్లో నిపుణులైన ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కి లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివరించారు. దానిపై మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఇరిగేషన్ శాఖ సమీక్షలో సీఎం సానుకూలంగా స్పందించారు. ధర్మాన ప్రతిపాదించిన లేఖ మంత్రిగా ఉన్న సమయంలో ధర్మాన ప్రసాదరావు జిల్లా రైతుల శ్రేయస్సు కోసం తన ప్రతిపాదనలను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైఎస్సార్ వంశధార స్టేజ్–2, ఫేజ్– 2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87, ప్యాకేజీ–88, హిరమండలం రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. నేరడి మాత్రం ఎప్పటి నుంచో కలగానే మిగిలిపోయింది. హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీ ఎంసీల నీటిని నింపి జిల్లా రైతులకు మేలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.600 కోట్లు అవసరం. వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఒడిశా అభ్యంతరాల వల్ల జాప్యం జరుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే తప్ప రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీరు నింపే పరిస్థితి లేదు. వంశధార రిజర్వాయర్ దీంతో నిష్ణాతులైన ఇంజినీర్ల ఆలోచనతో గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, దానితో హిర మండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని డంప్ చేసే ప్రతిపాదనను శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీ సమావేశాల సమయంలో లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ లిఫ్ట్ పనులకు సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. హిరమండలం రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు సాగునీరుతో పాటు, ఉద్దానంకు తాగునీరు, భావనపాడు ఫిషింగ్ హార్బర్‌కి పుష్కలంగా నీరిచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదనకు సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ ఇంజినీర్లతో తాడేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష స మావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు సర్వే, తదితర చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒకే సీజన్లో పూర్తి.. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ఎంతకాలమో పట్టదు. ఒకే సీజన్లో పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఖరీఫ్‌లో 2.50లక్షల ఎకరాలకు, రబీలో 1.50లక్షల ఎకరాలకు నీరు అందించడానికి అవకాశం ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్‌కు చేసే ఖర్చును నాలుగేళ్లలో వెనక్కి తెచ్చుకోవచ్చు. రైతులకు అందించే నీటితో పండే పంట ద్వారా ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి వస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరసన నిలబడేందుకు ఈ లిఫ్ట్ పనులు ఎంతో దోహదపడతాయి. లిఫ్ట్ పథకం జిల్లా ప్రజలకు వరం వెనుకబడిన ప్రాంతంగా శ్రీకాకుళంకు పేరుంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఉన్న వనరులను ప్ర భుత్వాలు సమర్థంగా వాడు కోవాలి. అందులో భాగంగానే వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు అందించారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1600 కోట్లు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావాల్సిందే. కానీ ఒడిశా అభ్యంతరాలు చెబుతూనే ఉంది. దీనికి బ్రేక్ వేయాలనే ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. అందుకు ఆయన సా నుకూలంగా స్పందించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కొన్నా ళ్లు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని నిర్మాణానికి కూడా నాలుగైదు సీజన్లు పడుతుంది. అందుకే తక్షణం రైతులకు ఉపయోగపడేలా హిర మండలం రిజర్వాయర్‌లో 19.5 టీఎంసీల నీటిని నింపేందుకు తగిన సలహాలు, సూచనలు వంశధార ఇంజినీర్లను అడిగాం. జేఈ నుంచి చీ ఫ్ ఇంజనీర్ వరకు అందరి నోటా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గమనే సూచన వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ విషయాన్ని సీఎంకు వివరించాం. గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి హిరమండలం రిజర్వాయర్‌లోకి 19.5 టీఎంసీల నీటిని నింపవచ్చన్న విషయాన్ని చెప్పాం. దీనికి రూ.300 కోట్లు అవసరమని దీని వల్ల ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలు, రబీలో 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు చేసేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరంగా తెలియ జేశాం. సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. లిఫ్ట్ పనులు పూర్తయితే జిల్లా రూ పురేఖలు మారిపోతాయి. ఖరీఫ్, రబీలో వరితో పాటు వాణిజ్య పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతుల కోసం ఖర్చు చేయడం ధర్మమే. సీఎం సానుకూల స్పందనతో వచ్చే రబీ నాటికే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకుండా కరువు వంటి పరిస్థితులు వచ్చినా హిరమండలం రిజర్వాయర్‌లో నీటిని ఆయకట్టుకి ఇ చ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కొ త్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లా లో ఉండే 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ప్రజలకు అ«ధికంగా ఉపయోగపడుతుంది. – ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే -
జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం పంటలకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా జలాల లభ్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరి నారుమళ్లకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా బ్యారేజీలు, రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా నీటి విడుదలకు కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా గోదావరి బేసిన్ పరిధిలో వరి సాగు మొదలైన నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటినందించే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి ప్రాణహిత నదిలో ప్రవాహాలు మొదలుకానున్న నేపథ్యంలో జూలై నుంచి ఆయకట్టు అవసరాల మేరకు నీటిని నింపాలని భావిస్తోంది. దీనిపై మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లభ్యత పెంచేలా ఎత్తిపోతలు రాష్ట్రంలో గత ఏడాది వానాకాలం, యాసంగి పంటల సాగుకు గణనీయంగా నీటిని వినియోగించడంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ నింపుతూ కాల్వల ద్వారా చెరువులు నింపుతూ ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. సాధారణంగా ప్రాణహితలో జూన్ 15 తర్వాత ప్రవాహాలు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది మరో వారం ఆలస్యంగా ప్రవాహాలు మొదలవుతాయనే అంచనా ఉంది. ఆ తర్వాత అవి పుంజుకునేందుకు మరో వారం పడుతుంది. అంటే జూలై మొదటి వారానికి ప్రవాహాలు పెరిగితే.. వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ బ్యారేజీలు, రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీలకు కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉండగా, అన్నారంలో 10.87 టీఎంసీలకు 4 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. ఈ మూడు బ్యారేజీలు నింపుతూ దిగువన ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరుకు జలాలను తరలించాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 9.52 టీఎంసీలు, మిడ్‌మానేరులో 27.50 టీఎంసీలకు 12 టీఎంసీలు, లోయర్‌మానేరులో 24 టీఎంసీలగాను 10 టీఎంసీల లభ్యత ఉంది. వీటిలో ఎల్లప్పుడూ నీటిని నిండుగా నింపి ఉంచాలని, అవసరాలకు తగ్గట్లు ఇటు కొండపోచమ్మ సాగర్ వరకు అటు తుంగతుర్తి పరిధిలోని ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టు వరకు నీటిని పారించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో వచ్చే ప్రవాహాలతోనే వీటన్నింటినీ నింపనున్నారు. నిజాంసాగర్‌కు ప్రవాహాలు లేకపోతే.. ఇక ఇప్పటికే హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీరందించే కాల్వల పనులు పూర్తయి, ఒకదశ నీటి విడుదల సైతం జరిగింది. నిజాంసాగర్‌కు ప్రవాహాలు కరువైన పక్షంలో కొండపోచమ్మ సాగర్‌లో లభ్యతగా ఉన్న జలాలను హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు విడుదల చేయనున్నారు. మరోపక్క ఎస్సారెస్పీలో ప్రస్తుతం 90 టీఎంసీలకుగాను 18 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటితో కేవలం తాగునీటి అవసరాలు మాత్రమే తీరతాయి. సాధారణంగా ఎస్సారెస్పీకి ఆగస్టు, సెప్టెంబర్‌లోనే వరదలు ఉంటాయి. అప్పుడు మాత్రమే ప్రాజెక్టు నిండుతుంది. అయితే ఈమారు ఆయకట్టుకు నీటి లభ్యత పెంచేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా పంపింగ్ చేసి అవసరమైతే ఎస్సారెస్పీని నింపేలా ఇప్పటికే పనులన్నీ పూర్తిచేశారు. వీటికింద నీటి విడుదల ఎలా ఉండాలి, ఎప్పటినుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టాలన్న దానిపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా జలాల విడుదలపై కార్యాచరణ రూపొందించనున్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2006 పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంతకన్నా కాదు. జలాశయం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టును విస్తరించడం లేదా ఆధునీకరించడం చేయడం లేదు. గ్రావిటీ నుంచి పంపింగ్‌కు మారడాన్ని పర్యావరణ అనుమతుల మార్పుగా పరిగణించడం సాధ్యం కాదు. తనకు కేటాయించిన నీటినే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నంత వరకు పర్యావరణ అనుమతుల ప్రసక్తే తలెత్తదు –ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర పర్యావరణ శాఖ సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నోటిఫికేషన్ పరిధిలోకి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ రాదని, అందువల్ల దీనికి పర్యావరణ అనుమతులేవీ అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెప్పింది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీకి నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణశాఖ తన వైఖరిని స్పష్టంగా తెలియచేసింది. అన్ని విషయాలు పరిగణించాకే... ► తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడికాలువలకు 1994 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్లో నీటి సరఫరాను పంపింగ్ ద్వారా చేస్తారా? గ్రావిటీ ద్వారా చేస్తారా? అనే ప్రస్తావన లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి ఈఐఏ పర్యావరణ అనుమతుల్లో 38 టీఎంసీల నీటి సరఫరా ప్రస్తావన ఉంది. ► తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి వేర్వేరు సమయాల్లో ఏర్పాటయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు. ► ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్ వ్యాలీ, హైడ్రో ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ జూలై 29న సమావేశమై చర్చించింది. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం చర్చలు జరిగాయి. ► అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రాథమిక ఆధారాలనుబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ సర్కారు అభ్యంతరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, దీనివల్ల పలు ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీన్ని హరిత ట్రిబ్యునల్ శుక్రవారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాదులు దొంతిరెడ్డి మాధురిరెడ్డి, తుషారా జేమ్స్‌లు విచారణకు హాజరవగా, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్, పిటిషనర్ తరఫున కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను ట్రిబ్యునల్ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అదేరోజు ఏపీ వాదన వింటామని తెలిపింది. -
ఎత్తిపోతలు షురూ!
సాక్షి, హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టుల నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ మొదలైంది. స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో ప్రవాహాలు కొనసాగు తుండటంతో జూరాల మీద ఉన్న నెట్టెంపాడు నుంచి తొలి ఎత్తిపోతలు మొదలుపెట్టగా, భీమా, కోయిల్ సాగర్ ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధంచేశారు. ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపనున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పుంజుకున్నాక పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోత స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు గడిచిన మూడు నాలుగు రోజులుగా 5వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఆదివారం సైతం ప్రాజెక్టు లోకి 5,703 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరిం ది. దీంతో ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 2.70 టీఎంసీల కొత్త నీరు రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం 9.66 టీఎంసీలకు గానూ 7.04 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు కొనసా గితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువన ఆల్మట్టి లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా యి. దీనిలోకి ప్రస్తుతం 9,359 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 74 టీఎంసీలకు చేరింది. ఇక్కడ గరిష్టంగా మరో 50 టీఎంసీలు చేరగానే దిగువకు నీటి విడుదల మొదలుకానుంది. ఒక్కసారి దిగువకు వరద మొదలైతే కొనసాగుతూనే ఉంటుంది. అప్పటికే జూరాల నిండి ఉంటే నీరంతా దాని దిగువన ఉన్న శ్రీశైలానికి వెళుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూరాలకు వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోయాలని నిర్ణయించారు. వరద మొదలైతే ఆయకట్టుకు నీరు శనివారం రాత్రి నుంచి ప్రభుత్వ ఆదేశాలతో నెట్టెంపాడు మోటార్‌ను ఆన్‌చేసి 448 క్యూసెక్కుల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. నేడో, రేపో భీమా, కోయిల్‌సాగర్‌లో ఒకట్రెండు పంపులను నడిపించి రిజర్వాయర్లు నింపనున్నారు. ఈ మూడు లిఫ్టులను పూర్తిస్థాయిలో నడిపిస్తే రోజుకు 4వేల క్యూసెక్కుల మేర నీటిని తరలించే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద మొదలయ్యాక ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ చెరువులు నింపనున్నారు. బీమా కింద 2లక్షలు, నెట్టెంపాడు కింద 2లక్షలు, జూరాల కాల్వల కింద లక్ష, కోయిల్‌సాగర్ కింద 30వేల ఎకరాలకు నీరివ్వాలని భావిస్తున్నారు. బీమా కింద 248 చెరువులు, కోయిల్‌సాగర్ కింద 37, జూరాల కింద 185, నెట్టెంపాడు కింద 100, ఆర్డీస్ కింద 5 చెరువులు నింపేలా ప్రణాళిక ఉంది. గత ఏడాది వరద ఉధృతంగా ఉండటంతో 90 శాతం చెరువులు నింపగలిగారు. ఈ ఏడాది సైతం జూలై 15 తర్వాత వరద ఉంటుందని, అప్పట్నుంచి చెరువులు పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి యంత్రాంగం యోచిస్తోంది. -
ఒక రిజర్వాయర్..రెండు లిఫ్టులు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్లైన్ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. -
వైఎస్సార్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ల ఏర్పాటు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: దివంగ త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ లు ఏర్పాటు చేశామని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. సోమవా రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మోసపురితమైన పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అవినీతి, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి తాహెర్‌బిన్‌హుందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్, నగర అధ్యక్షుడు కేశవేణు, తదితరులున్నారు. -
లిఫ్ట్ ఇరిగేషన్ వలన సమస్యలు పరిష్కారం కావు
-
మరోపోరాటం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాడేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇప్పటివరకూ గ్రామాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రైతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోగా.. కోర్టులకు వెళ్లలేని వారు ప్రభుత్వం చెల్లించిన అరకొర నష్టపరి హారం వల్ల నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ఇకపై దశల వారీగా ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతులు చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు రైతుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి.. ఈ నెల 24న తెడ్లం గ్రామంలో సమావేశమయ్యారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ద్వారా ఉన్న హక్కులు, వారికి రావాలి్సన పరిహారం విషయంలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాల్లో అతికించాలని నిర్ణయించారు. కాలం చెల్లిన జీఓ ఆధారంగా ఉద్యాన పంటలకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువల ఆధారంగా పరిహారం పొందేందుకు హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేయాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు ఇచ్చే విధంగా అధికారులతో చర్చలు జరపడంతోపాటు కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న భూములు, నివాస యోగ్యమైన స్థలాలు, వాణిజ్యపరమైన స్థలాలకు అదనపు విలువలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో కోర్టులను ఆశ్రయించాలని తీర్మానించారు. అసైన్డ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ అంశాలపై త్వరలో మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. -
గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో డొల్ల
-
చింతలపూడేనా!
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పథకం పనులు 28 శాతం మాత్రమే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. భూసేకరణ, నష్టపరిహారంపై అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా రైతులతో కలెక్టర్ జరిపిన చర్చలు బెడిసికొట్టడంతో పథకం ఎప్పటికి పూర్తవుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొవ్వూరు : చింతలపూడి ఎత్తిపోతలు.. మూడేళ్ల క్రితం పూర్తి కావాల్సిన మెట్ట రైతుల ఆశా పథకం ఇదీ.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి పథకం పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా మంత్రి పీతల సుజాత ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మెట్ట రైతులను మభ్యపెట్టె ప్రయత్నమేననే అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 మార్చి నాటికే ఈ పథకం 25 శాతం పనులు పూర్తయిపోయాయి. దీనికి రూ.344 కోట్లు ఖర్చయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 నెలల కాలంలో మూడు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటి వరకు భూసేకరణతో కలిపి కేవలం రూ.714కోట్ల విలువైన పనులే పూర్తయ్యాయి. వీటిలో సగానికిపైగా పనులు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయి. 2009 ఫ్రిబవరిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం మంజూరైంది. రూ.1,701 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తికావాలనేది అప్పటి లక్ష్యం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తగిన చొరవ చూపక పోవడంతో మెట్ట రైతుల ఆశలు నెరవేరలేదు. పనుల్లో ఏదీ పురోగతి ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో జనవరి నెలాఖరు నాటికి 230 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 107లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వారు. ప్రధాన కాలువపైన మార్గమధ్యలో 110 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. వీటిలో 18 మాత్రమే పూర్తి చేశారు. మరో ఐదు స్ట్రక్చర్లు పురోగతిలో ఉన్నాయి. ప్ర«ధాన కాలువలో 97.5ల„ýక్ష ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేయాల్సి ఉండగా 66.6లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు చేశారు. పిల్ల కాలువలకు సంబంధించి ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉంటే కేవలం పదివేల క్యూబిక్ మీటర్లు మట్టి పనులు మాత్రమే చేశారు. రెండో ప్యాకేజీలో 60 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉండగా 29.84 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు.ఈ ప్యాకేజీలో 84 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా ఒక్కటీ పూర్తి కాలేదు. కేవలం ఆరు నిర్మాణాలు మాత్రం పురోగతిలో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రూ.714 కోట్లు ఖర్చు చేస్తే దీనిలో రూ.525.34 కోట్లు విలువైన నిర్మాణ పనులు, రూ.188.93 కోట్లు భూసేకరణ వెచ్చించారు. మొదటి ప్యాకేజీ పనులు 31శాతం, రెండో ప్యాకేజీ పనులు 20 శాతం పూర్తి చేశారు. కొలిక్కిరాని భూ సేకరణ పథకం నిర్మాణానికి 17,042.61 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 7,725 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. ఇంకా 9,317 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి, 2,634 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. భూసేకరణలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారంగా ఒక్కోచోట ఒక్కో ధర నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా శనివారం రైతులతో కలెక్టర్ జరిపిన చర్యలు బెడిసి కొట్టడంతో పనుల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేజ్–2 ప్రకటనలతో సరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్–2 ప్రకటనలకే పరిమితమైంది. జిల్లాలో 2.68 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఇది కార్యరూపు దాల్చడం లేదు.రూ.3.208 కోట్ల రివైజ్డ్ అంచనాలతో మొత్తం ప్రాజెక్టు విలువను రూ.1,701 కోట్ల నుంచి రూ.4,909 కోట్లకు పెంచారు. దీనికి పరిపాలనా ఆమోదం లభించినా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఎర్రకాలువ పరిధిలో 27వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో 24 వేల ఎకరాలు, కొవ్వాడ ప్రాజెక్టు పరిధిలో 17వేల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు జల్లేరు జలాశయం సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల పరిధిలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పరిపాలనా ఆమోదం లభించినా టెండర్ల ప్రక్రియకు నోచుకోవడం లేదు. ఫేజ్–1లో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం అంచనాలు రూపొందించారు. అప్పటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్లు ఖరారు చేశారు. అదే రేట్లను అనుసరించి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్–2లో ప్రస్తుత లెక్కల ప్రకారం టెండర్లు పిలిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఫేజ్–1లో పనులకూ ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలన్న వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
చంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయం
– గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తి చేయాలి – ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ పుణ్యమే! – ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత బీవై రామయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శించారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని గౌరు చరిత పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడంతో ముచ్చుమర్రి లిఫ్ట్ ప్రాజెక్టుకు వైఎస్ హామీ ఇచ్చారని, జీవో 196 జారీ చేసి, 2007లోనే రూ. 125 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. 2014, ఆగస్టు 15న సీఎం జిల్లాకు ఇచ్చిన హామీల్లో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కూడా ఉందన్నారు. రైతులకు, కర్నూలు నగర తాగునీటి సమస్యకు ఇది ఎంతో ఉపయోగకరమని, సత్వరమే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. హంద్రీ–నీవా ఫీల్డ్ఛానల్స్ కూడా పూర్తి చేయకపోవడం విచారకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిందేనని తెలిపారు. మూడేళ్లుగా వర్షాలు, ధరలు లేక రైతులు విలవిలలాడిపోతున్నారని, కరువు మండలాలపై నివేదికలే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని విమర్శించారు. సీఎం పర్యటన ఖర్చులో 10 శాతం కూడా లేదు: బి.వై.రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు 15 సార్లు వచ్చారని, అందుకు రూ. 75 కోట్లు ఖర్చయిందని, ఆయన పర్యటన ఖర్చులో 10 శాతం కూడా రైతులకు ఉపయోగించలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శిఽంచారు. ముచ్చుమర్రి పథకాన్ని వైఎస్ దూరదృష్టితో రూపొందించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఉంటే తప్ప పోత్తిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరందవని, హంద్రీనీవాకు 840 అడుగులుంటే తప్ప నీళ్లు రావని పేర్కొన్నారు. వైఎస్ఆర్ నిపుణులతో ఆలోచించి 790 అడుగుల మట్టానికే ముచ్చుమర్రి పథకం పనిచేసేలా రూపొందించారని తెలిపారు. రాయలసీమకు 45 టీఎంసీల నీళ్లు అందిస్తానంటూ చంద్రబాబు పట్టిసీమ కట్టించినా రైతులు ఒక్క టీఎంసీని కూడా వాడలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి పథకం ప్రారంభానికి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి వైఎస్ పేరు పెట్టి పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చక వారిని నట్టేటా ముంచారన్నారు. అనేకమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 4వ తేదీన జిల్లాకు వస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయండి: వంగాల భరత్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ప్రాజెక్టులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేశాకే ముచ్చుమర్రి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. గతంలో రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి కేసీ, పోతిరెడ్డిపాడులకు ఒక్కరూపాయి వెచ్చించలేదన్నారు. కరవు మండలాలకు సంబంధించిన నివేదిక నత్తనడకన సాగుతోందన్నారు. రెండో ఫేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలి: పీజీ నరసింహులు యాదవ్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండో ఫేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఉందని పార్టీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల్ని మభ్యపెట్టే సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు సురేష్, నాయకులు ప్రహ్లాద్ ఆచారి, సాంబ, అశోక్, బసవరాజు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అమీతుమీ
చింతలపూడి : ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులు సిద్ధమవుతున్నారు. గత ఉగాది సంబరాలకు విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం కామవరపుకోటలో జిల్లా రైతు సదస్సు తలపెట్టారు. సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డితో పాటు రాష్ట్ర, రైతు సంఘం నాయకులు, జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, రైతులు పెద్ద ఎత్తున సదస్సుకు తరలిరానున్నారు. సదస్సులో రాజకీయాలకతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడేలా పోరాటానికి నిర్ణయం తీసుకోనున్నారు. రెండో దశ మంజూరుతో ఆందోళన మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడం జిల్లా రైతుల్లో ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏడేళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. పరిహారం విషయంలో రైతుల అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణ సమస్యగా మారింది. రైతులు గత మే నెలలో ఆందోళనకు దిగి కాలువ తవ్వకం పనులను అడ్డుకోవడంతో 8 నెలలుగా పనులు నిలిచిపోయాయి. పరిహారంలో వ్యత్యాసం జిల్లాలో పట్టిసీమ పథకం కాలువకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువకు మరోలా నష్టపరిహారం అందజేయడంతో రైతులు భూసేకరణకు అడ్డుపడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాలువ కింద రైతులకు ఎకరానికి రూ.30 లక్షలకు పైగా చెల్లించగా ఇక్కడ మాత్రం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
‘ఎత్తిపోతల’ భూసేకరణపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం కోసం చేపడు తున్న భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక ప్రభావ అంచనా చేపట్టకుండానే ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని రైతులు కె.వెంకట్రామ్ రెడ్డి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భూముల మార్కెట్ ధరలను సవరించకుండానే ప్రభుత్వం భూములు తీసుకుంటోందని పిటిషనర్లు వివరించారు. భూ సేకరణ నోటిఫికేషన్ జారీ అయినందున, 60 రోజుల్లో భూములు అప్పగించాలని.. లేనిపక్షంలో పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి స్వాధీనం చేసుకుంటామని అధి కారులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. భూ సేకరణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థించారు. మరోవైపు జగిత్యాల మండలాన్ని జగిత్యాల, జగిత్యాల రూరల్‌గా విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 363ను సవాలు చేస్తూ ధరూర్ గ్రామ సర్పంచ్ జలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఎత్తిపోతల ఖర్చు తగ్గిద్దాం
నీటిపారుదల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఇందుకు ఇకపై ‘ఎనర్జీ ఆడిటింగ్’ నిర్వహించాలని, ఎత్తిపోతల పథకాల్లోని మోటార్లకు కచ్చితంగా కెపాసిటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. పంపులు నడవని సమయంలో కూడా డిస్కమ్‌లు భారీగా బిల్లులు వడ్డిస్తున్నారుు. దీంతో అలాంటి ఎత్తిపోతల పథకాలకు మినహారుుంపు అంశంపై డిస్కమ్‌లతో ఓ అవగాహనకు రావాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దేవాదుల, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, ఎల్లంపల్లి, అలీసాగర్ గుత్ప వంటి ఎత్తిపోతల పథకాలకు 1,378 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటోంది. యూనిట్ ఖర్చు రూ.5 మేర ఉన్నా విద్యుత్ వినియోగానికి గానూ రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న 287 ఎత్తిపోతల పథకాలకు ఏటా 40 నుంచి 50 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. రూ.50 కోట్లు చెల్లిస్తున్నారు. నీళ్లు లేని సందర్భాల్లో పంపులు నడవకున్నా డిస్కమ్‌లు లోడ్ చార్జీల పేరిట డిస్కంలు భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారుు. నిజానికి ఎత్తిపోతల పథకాలు కేవలం 3 నుంచి 4 నెలలు పాటే పనిచేస్తారుు. మిగతా సమయంలో అవి పనిచేయకున్నా కనీస చార్జీల పేరిట డిస్కమ్‌లు బిల్లు వసూలు చేస్తున్నారుు. ఈ చార్జీలను తొలగించాలని ట్రాన్సకోను కోరగా.. అది తమ పరిధిలో లేదని ఈఆర్సీ తేల్చాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈఆర్సీ సమావేశం ఉన్నందున అంతకుముందే ఈఆర్సీకి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. బోర్డులో చర్చ: సోమవారం ఐడీసీ చైర్మన్ ఆద శంకర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో ఎత్తిపోతల పథకాల్లో నిర్వహణ ఖర్చును తగ్గించుకునే అంశంపై చర్చ జరిగింది. -
పోలవరం ప్రాజెక్ట్‌కు సమాధి
-
ఎత్తిపోతల పథకాలపై దృష్టిసారించాలి
మఠంపల్లి : పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మట్టపల్లి వద్ద కృష్ణానది వరద ముంపును, బాధితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన కృష్ణానదిపై బల్లకట్టులో ఆవలిభాగం ఒడ్డు వరకు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్టె ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ముఖ్యంగా పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా వందల కోట్ల రూపాయలతో నిర్మించిన వెల్లటూరు, బుగ్గమాదారం, మట్టపల్లి, పెదవీడు, అమరవరం ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. మట్టపల్లిలో పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరారు. మట్టపల్లి దేవస్థానం, గ్రామం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆయన వెంట భూక్యామంజీనాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజారెడ్డి, ఎండి.నిజాముద్దీన్, యరగాని నాగన్న గౌడ్, ఎం.ఎం.యాదవ్, బచ్చలకూరి బాబు, భాస్కర్‌రెడ్డి, యల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరావు, బుజ్జి భీముడు, పిచ్చిరెడ్డి, రవినాయక్, బాబునాయక్, హనుమ, సక్రు,వెంకటరమణ,రామయ్య,నారాయణస్వామి,శ్రీనివాసరెడ్డి,సైదిరెడ్డి తదితరులున్నారు. -
సొరంగానికి మంగళం
–ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకం –నిర్మాణ వ్యయం రూ.200కోట్ల అంచనా –నాలుగు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక –అవుకు అనుభవంతో తాజా నిర్ణయం బి.కొత్తకోట: హంద్రీ–నీవా రెండోదశ ప్రాజెక్టు ద్వారా రెండుజిల్లాలకు నీటిని అందించేందుకు అడ్డంకిగా మారుతున్న సొరంగం పనులను వదిలేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండుసార్లు టెండర్లు నిర్వహించినా∙కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. సొరంగం పనులు చేపట్టినా మరిన్ని ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొవడం అటుంచితే కాలయాపన తప్పదన్న భావంతో ఎత్తిపోతల ప«థకానికి పథక రచన చేసింది. సొరంగం అడ్డంకిగా మారిని నేపథ్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యామ్నాయ పథకం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇచ్చిన ఆదేశాలతో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అంచనా అమాంతం పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గంలో కష్టతరమైన 2.1కిలోమీటర్ల పనికి మొదటిసారి నిర్వహించిన టెండర్లకు మ్యాక్స్ ఇన్ఫ్రా ఒక్కటే టెండర్ వేయడం దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరగ్గా, రెండోసారి టెండర్లకు ఒక్కరూ పాల్గొనలేదు. కర్నూలుజిల్లాలో అవుకు సొరంగం పనుల అనుభవంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అవుకులో ఇప్పటికీ 140మీటర్ల సొరంగం పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడి పరిస్థితే ఇక్కడి టన్నల్‌లో కనిపిస్తున్న కారణంగానే ఎత్తిపోతల ప£ý కంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రూ.200కోట్ల అంచనాతో ఎత్తిపోతలు ప్రధానకాలువపై 506 కిలో మీటరు నుంచి 511 కిలోమీటరు మధ్యలో 5.1సొరంగం పనులు చేయాలి. ఇందులో సమస్యాత్మకంగా మారిన సొరంగం పని 506కిమీ వద్ద ప్రారంభౖమవుతుంది. ఇక్కడినుంచి 2.1కిలోమీటర్ల పనులు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా 506కిమీ వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడ భూమి సముద్రమట్టానికి 30మీటర్ల ఎత్తుంది. ఎత్తిపోతల పథకం నుంచి 508.5కిలోమీటరు వరకు 2.5 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభమై 511కిలోమీటరు వద్ద ఇప్పటికే పూర్తయిన కాలువలో పైప్‌లైన్ కలుస్తుంది. ఈ కాలువనుంచి నీరు వైఎస్సార్‌జిల్లాలోని శ్రీనివాసపురం, జిల్లాలోని అడవిపల్లె రిజర్వాయర్లకు వెళ్తుంది. ఈ పనిచేపట్టేందుకు తాత్కాలిక అంచనా ప్రకారంరూ.200కోట్లు అవుతుందని నిర్ణయించారు. మోటార్లు, పంపులు, ౖపైప్‌లైన్ పనులు, మట్టి, కాంక్రీట్ పనులు కలుపుకొని అంచనాలు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జనవరిలోగా పూర్తిచేసేలా .. వచ్చే జనవరి నాటికి ఎత్తిపోతల పథకం సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తే మోటార్ల విషయంలో అదనంగా అందుబాటులోని వాటిని వినియోగించుకోవచ్చని ఆలోచన. ప్రధాన కాలువపైనున్న ఎం–1, ఎం–2, ఎం–3 ఎత్తిపోతల పథకాలకు అదనపు మోటార్లున్నాయి, వీటిలో ఒక్కొక్కటి చొప్పున మూడింటిని తీసుకొచ్చి పెద్దమండ్యం ఎత్తిపోతల పథకానికి అమర్చి నీటిని ఎత్తిపోయాలని చూస్తోంది. అంచనాల ప్రతిపాదన, ప్రభుత్వ ఆమోదం, టెండర్ల నిర్వహణ చర్యలను వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. రూ.28కోట్ల నుంచి పెరుగుతూ.. వాస్తవంగా 20ప్యాకేజీలోని 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్కోస్టల్కు అప్పగించారు. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులతో చేతులుదులుపుకొంది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించగా రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి వదిలేసింది. మిగిలిన 3.5కిలోమీటర్ల సొరంగం పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. -
కేసీ ఆయకట్టు పంటలను కాపాడండి
– ముచ్చమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయాలి – కలెక్టర్‌ను కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే – సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ రైతు విభాగం ప్రతినిధులు, రైతులతో వచ్చి కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. కేసి కెనాల్‌కు నీటి విడుదలపై చర్చించారు. కేసీ కెనాల్ కింద 75 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, నీరివ్వకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 2016 జూలై 30 నాటికే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే పనులు ఇప్పటికి పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన 2.5 టీఎంసీల నీరుSనెలకు కూడా సరిపోదన్నారు. గత ఏడాది కూడా నీరు విడుదల చేయకపోవడంతో పూర్తిగా నష్టపోయామని, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...15 రోజుల్లో మల్యాల లిప్ట్ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రెండు పైపులు మంజూరు చేస్తామని, వాటిని 15రోజుల్లోగా అమర్చి నీటిని విడుదల చేస్తామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం పట్ల ఎమ్మెల్యే సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎండిన ఏరు.. పారని నీరు
– ఎత్తిపోతలను ప్రారంభించిన టీజీ – ఏం సాధించారంటూ రైతుల్లో గుసగుసలు ఎమ్మిగనూరు: అధికార పార్టీ నేతల ఆర్భాటం.. హంగామాతో నాగలదిన్నె గ్రామస్తులు నివ్వెరపోయారు. ఒక్క పక్క తుంగభద్రనది ఎండిపోయి పంటలన్నీ వాడిపోయాయి. రైతులు సాగునీటి కోసం పరితపిస్తుంటే అధికార పార్టీ నేతలు సోమవారం హడావుడి చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ..చుక్కనీరు కూడా పారని నాగలదిన్నె ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి తమ ప్రభుత్వం గొప్పగా ఉందని వర్ణించారు. అయితే వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాకమునుపే నాగలదిన్నె ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. రూ. 6 కోట్లలలో 6400 ఎకరాలకు -
ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
పరకాల : మండలంలోని కంఠాత్మకూరులో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం, విద్యుత్ సబ్ స్టేషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పథకానికి నిధులు మంజూరు కావడంతో శుక్రవారం జడ్పీటీసీ పాడి కల్పనాదేవి– ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సక్కపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కంఠాత్మకూరు మాటుపై ఎత్తిపోతల పథకం నిర్మాణంతో దమ్మయ్యకుంట, రెడ్డి చెరువు, పచ్చర్లకుంట, రాయపర్తిలోని ఊర చెరువు, మల్లక్కపేట చెరువులు నింపే అవకాశం ఉంటుందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో రైతులకు కరెంటు కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగ కొమురమ్మ, టీఆర్ఎస్ నాయకులు వరికెల దేవరావు, తిప్పార్తి సాంబశివరెడ్డి, బైరెడ్డి రాజిరెడ్డి, బాషబోయిన కొమురయ్య, పాడి వివేక్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికార దర్పం!
–అనధికార నెహ్రూనగర్ పుష్కర ఘాట్ నిర్మాణానికి ఎత్తిపోతల పథకం కంకర సరఫరా –శరవేగంగా నిర్మాణ పనులు నెహ్రూనగర్(పగిడ్యాల): అనధికారికంగా నిర్మిస్తున్న నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌లో అడుగడుగునా అధికార దర్పం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగంతో పాటు ఇంజినీరింగ్ శాఖ అధికారులు కూడా పరోక్షంగా ఘాట్ నిర్మాణంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఇది అధికారిక ఘాట్ కాదని సొంతంగానే నిర్మిస్తున్నామని మాండ్ర ప్రకటించినప్పటికి దీని వెనుక జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే నెహ్రూనగర్ ఘాట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మెగా ఇంజినీరింగ్ కంపెనీ సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర సరఫరా చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు 200 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు ఉండే ప్రదేశంలో సిమెంట్ బెడ్ వేసే పనులను బుధవారం ఉదయం ప్రారంభయ్యాయి. అనధికారికంగా జరుగుతున్న ఈ ఘట్ పనులను మాండ్ర ముఖ్య వర్గీయులు నందికొట్కూరు మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ ప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ, వైస్‌చైర్మన్ మునాఫ్‌లు ప్రత్యేక పూజలు చేశారు. బ్యాక్‌వాటర్‌కు అతిసమీపంలో జరుగుతున్నా ఈ పనులు నీటి ప్రవాహం పెరిగితే మునిగిపోయే అవకాశం ఉందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఘాట్ నిర్మాణానికి ఉపయోగించిన కంకర మిశ్రమంపై ఎత్తిపోతల పథకం మెగా ఇంజినీరింగ్ కంపెనీ సైట్ మేనేజర్ రాముడును సాక్షి వివరణ కోరగా తాను కొన్ని చెప్పేవి ఉంటాయి.. మరికొన్ని చెప్పడానికి వీలుండదన్నారు. కావాలంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి కనుక్కోండని పేర్కొనడం గమనార్హం. -
ఎత్తిపోతల పునరుద్ధరణకు రూ.43కోట్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెనుబల్లి : ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ జిల్లాకు రూ.43కోట్లు మంజూరు చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బయ్యన్నగూడెంలో సుమారు రూ.కోటి వ్యయంతో 240 ఎకరాలకు, టేకులపల్లిలో రూ.1.65కోట్లతో పునరుద్ధరించనున్న ఎత్తిపోతల పథకాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ కాలువపై కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితమైన ఎత్తిపోతల పథకాలను అప్పటి సీఎం ఎన్టీఆర్ గుర్తించి.. వి.వెంకటాయపాలెం నుంచి వేంసూరు మండలం గూడూరు వరకు అనేక ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీరు అందించారని తెలిపారు. కానీ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎత్తిపోతల పథకాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయన్నారు. కొత్త రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.30కోట్లతో ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. బేతుపల్లి హైలెవల్ కాలువ ద్వారా వేంసూరు మండలంలో 10వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్లలో పూర్తవుతుందని, దీని ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మహిళలకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి, వాటిని పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ హరితహారం లాంటి పథకాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం సరికాదన్నారు. డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మాట్లాడుతూ 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలు, గ్రీన్ హౌస్, ఫాలీ హౌస్ వంటి పథకాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టేకులపల్లిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, ఐడీసీ ఈఈ విద్యాసాగర్, ఎంపీడీఓ ఆర్వీ.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఆర్ వెంకటలక్ష్మి, ఎంపీపీ చీకటి బేబీ శకుంతల, జెడ్పీటీసీ వాంకుడోతు రజిత, వైస్ ఎంపీపీ చెక్కిలాల లక్ష్మణరావు, ఎంపీటీసీలు నరుకుళ్ల ఉష, బీమిరెడ్డి చందన, సర్పంచ్‌లు మోడె సోమ్లా, రాజిన్ని రమణ, గాయం రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మంత్రివర్యా.. దయ చూపండి!
♦ పెండింగ్‌లో ‘చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి’ ♦ ఎత్తిపోతల చివరిదశ పనులు ♦ ఇంకా మొదలుకాని పెద్దవాగు ♦ చెక్‌డ్యాంల నిర్మాణాలు మోర్తాడ్: మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం చివరి దశ పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. చివరి దశ పనులు పూర్తయితే ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినా పనులు ఆశాజనకంగా సాగడం లేదు. ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించే అధికారులు బదిలీ కావడం, కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తులు సరిగా స్పందించకపోవడంతో చివరి దశ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఎత్తిపోతల పథకంలో చేర్చిన రామన్నపేట్‌కు నీరు అందించడానికి కాలువలను తవ్వాల్సి ఉంది. అంతేకాక చౌట్పల్లి నుంచి అమీర్‌నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ గ్రామాలకు కూడా పైప్‌లైన్ పనులు చేపట్టాల్సి ఉంది. సుంకెట్‌కు నీరు అందించడానికి దోన్పాల్ నుంచి కాలువ తవ్వకం చేపట్టాల్సి ఉంది. అటవీశాఖకు సంబంధించిన భూములు ఉండటంతో అటవీశాఖ అనుమతి పొందిన తరువాతనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి కేటాయించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2కోట్లు బడ్జెట్లో కేటాయించారు. నిధులను కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఎత్తిపోతల పథకంను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా పనులు అసంపూర్తిగా నిలచిపోవడంతో ట్రయల్న్ ్రదశలోనే పథకం ఆగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలం ఆశించిన స్థాయిలో నీరు వస్తే వచ్చే రబీ సీజనులో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించవచ్చు. కాని ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించేనా...? వరదల వల్ల పెద్దవాగులో చేరే నీటిని భూగర్భంలో అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించిన చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు అయినా ఇంకా పనులు మొదలు కాలేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటనతోనైనా చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా అని రైతాంగం ఆశతో ఎదురుచూస్తోంది. మోర్తాడ్ మండలంలోని దొన్కల్, గాండ్లపేట్ల శివారులో ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మించడానికి రూ.4.84 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వేల్పూర్, రామన్నపేట్ల మధ్య ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.14 కోట్లు, గోనుగొప్పుల వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.3.53 కోట్లు, భీమ్‌గల్ వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.95 కోట్లు మంజూరు అయ్యాయి. నాలుగు చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం కోసం రూ.17.56 కోట్లు మంజూరు అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు అయినా పనులు ఇంతవరకు మొదలుకాలేదు. వర్షాలు కురువకముందు చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి అయితే వర్షపు నీరు వాగులో ఇంకి భూగర్బ జలాలు అభివృద్ధి చెందుతాయి. నీటిపారుదల శాఖకు సొంత భవనాల కొరత... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపాదుల శాఖకు సొంత భవనాల కొరత వేధిస్తోంది. తొమ్మిది సబ్ డివిజన్ కార్యాలయాకు గాను నాలుగు చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాలలో ఏఈఈ, జేఈ ఇతర సిబ్బంది ఉండటానికి సెక్షన్ కార్యాలయాలను నిర్మించాల్సి ఉంది. సెక్షన్ కార్యాలయాలకు స్థలాలు చూపకపోవడంతో నిధులు ఉన్నా సొంత భవనాల నిర్మాణం మొదలు కాలేదు. కొన్నిచోట్ల గతంలో నిర్మించిన భవనాల్లో సెక్షన్ కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు జిల్లా పర్యటనలో ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
జాతీయ ప్రాజెక్టుగా ‘కాళేశ్వరం’!
► ప్రస్తుత ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక తయారీకి సీఎం ఆదేశం ► ఆగమేఘాలపై సీఎస్‌కు నీటిపారుదలశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేస్తూ కొత్తగా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జాతీయ హోదా దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫిబ్రవరి రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తుండటం, ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరడంతో ప్రస్తుత డీపీఆర్‌తోపాటు ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై కదిలిన ఉన్నతాధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఈ నివేదికను అందజేశారు. ఇక మిగిలింది చర్చలే ఇప్పటికే సిద్ధమైన కాళేశ్వరం డీపీఆర్ ప్రకారం మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి అక్కడ్నుంచి గోదావరి నదీ మార్గం ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో 19 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు నిర్మించాలని ప్రణాళిక వేశారు. మొత్తంగా బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం రూ. 10,200 కోట్లతో అంచనాలు సిద్ధమవగా ఎల్లంపల్లి దిగువన సైతం పలు రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు, పలుచోట్ల తగ్గింపునకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేవలం మేడిగడ్డ ముంపునకు సంబంధించి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర చర్చలు, ఒప్పందాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇవి కొలిక్కి వస్తే కాళేశ్వరానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగినట్లే. అదీగాక ముఖ్యమైన పర్యావరణ, అటవీ, గిరిజన సలహా మండలి ఆమోదం కాళేశ్వరానికి అవసరం లేదు. గోదావరి నదీ ప్రవాహాన్ని వాడుకుంటూనే మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నీటి తరలింపు ఉండటం, ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే అవసరమైన అనుమతులు ఉండటంతో కొత్త అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని ప్రధానికి మరోసారి నివేదించాలని నిర్ణయించింది. -
ఉత్తిపోతలు
ఏలూరు : మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 2.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. అయితే, కేవలం 1.30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. 700 ఎకరాల భూసేకరణ ప్రధాన సమస్యగా ఉండటంతో 70వేల ఎకరాలకు నీరందించే విషయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. భూములివ్వాల్సిన రైతుల నష్టపరిహారం పెంచాలని కోరగా, ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదు. ఫలితంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఇదిలావుంటే.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని 7వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2003లో శంకుస్థాపన చేసిన గిరమ్మ ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. పుష్కర కాలమైనా పనులు పూర్తి కాలేదు. దీనికి రూ.8 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరందించలేని దుస్థితి నెల కొంది. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలం వెంకటాపురం, తూర్పుయడవల్లి గ్రామాలకు గిరమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరివ్వాలి. కామవరపుకోటలో భూమిలో పైప్లైన్లు వేశారు. దొరసానిపాడులోనూ అదేవిధంగా పైప్లైన్లు వేయాలని ఇక్కడి రైతులిద్దరు కోర్టును ఆశ్రయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తికాగా, 2010 ఆగస్టులో ట్రయల్ రన్ వేసి వదిలేశారు. కాలువలు తవ్వి, భూమిలో పైప్లైన్లు వేస్తే ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. చిక్కుల నడుమ చింతలపూడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట మండలాల్లో 230 గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీని నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,701 కోట్ల నిధులు కేటాయించారు. 2008 అక్టోబర్ 30న ఈ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకానికి 2,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 500 ఎకరాలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. దీనికోసం పట్టిసీమ వద్ద 25,560 హార్స్పవర్ గల పంప్‌హౌస్, కాలువల తవ్వకం పనులు కొంతమేర చేపట్టారు. 12 టీఎంసీల నీటిని 28 కిలోమీటర్ల మేర దిగువకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రధానమైన పనులేమీ ప్రారంభించలేదు. అక్కడక్కడా 40,588 ఎకరాలకు.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 28 చిన్నపాటి ఎత్తిపోతల పథకాల ద్వారా 40,588 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇందులో బుట్టాయగూడెం మండలంలో గాడిదబోరు-1, గాడిదబోరు-2 పంపుహౌస్‌ల నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. వీటితోపాటు శిరగాలపల్లి-1, శిరగాలపల్లి-2, మైప, పిప్పర, కేశవరం, కొప్పర్రు గ్రామాల్లో చిన్నపాటి ఎత్తిపోతల పథకాలతో 16,128 ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు. -
'పాలమూరు'కు కేసీఆర్ శంకుస్థాపన
-
పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతులు!
-
ఎత్తిపోతల ప్రారంభమెన్నడో?
న్యాల్కల్,న్యూస్‌లైన్: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. పథకం పనులు పూర్తయి 15 సంవత్సరాలు దాటింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదని రైతలు ఆరోపిస్తున్నారు.పథకంలో వినియోగించిన సామగ్రి తుప్పుపడుతోంది. మరికొంత సామగ్రి దొంగల పాలవుతోంది.రైతులు ఈ పథకం కోసం ఎదురుచూసి దానిని మరచిపోయారు. పథకం పూర్తయి వినియోగంలోకి వస్తుందనే ఆశ వారిలో నశించిపోయింది. పథకం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మాజీ మంత్రి గీతారెడ్డి ఆదేశించినా అధికారుల్లో చలనం రాలేదంటే వారి పని తీరుకు అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ము ఖర్చయినా ఆశయం మాత్రం నెరవేరడం లేదు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారులో మంజీరా నది తీరంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగా 1993లో అప్పటి నారాయణఖేడ్ శాసన సభ్యుడు కిష్టారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు.పథకం నిర్మాణం కోసం నాబార్డు కింద రూ. 1.30కోట్లు మంజూరు చే యించారు. పథకం పనులు ప్రారంభించే సమయంలో శాసన సభకు ఎన్నిలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వ మారడంతో పనులు ప్రారంభం కా లేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిన ఎన్నికల్లో తిరిగి కిష్టారెడ్డి శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు.1999లో ఎమ్మె ల్యే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నిధులు సరి పోక పోవడంతో పనులు నిలిచిపోయాయి. నాబార్డు ఆర్ఐడీఎఫ్ పేజ్-3లో రూ.88.80లక్షలు మంజూరు చేయించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయించారు.ఈపథకం ద్వారా 21మంది ఎస్సీలకు సంబంధించిన 49.36హెక్టార్లు,31మంది బీసీలకు చెందిన 114.03హెక్టార్లు,ఇతర వర్గాలకు చెందిన 331.01హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలనేది పథకం ఉద్దేశం. పంపుహౌస్ ఏర్పాటు ఈపథకం ద్వారా పొలాలకు నీరందించేందుకు మం జీర నది తీరంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు.అం దుకు అవసరమయ్యే విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లును కూడా ఏర్పాటు చేశారు.పంపుహౌస్ నుంచి పొలాలకు పైపులైన్ వేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసిన అధికారులు దానిని ప్రారంభించడం మరిచారు.అప్పట్లో పనులు కూడా నాసిరకంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ఎత్తి పోతల పథకానికి విద్యుత్ సరఫరా చాలా రోజులుగా నిలిచిపోయిందని రైతులు తెలిపారు.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోవడం వలన ఈసమస్య ఉత్పన్నమయిందన్నారు. 15ఏళ్లు దాటినా ప్రారంభం కాని పథకం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 15ఏళ్లు దాటినా ఇప్పటికి ప్రారంభం కాలేదు.దీంతో పథకం నిరూపయోగం గా మారింది. పథకం వినియోగంలోకి వస్తే బీడు భూములు సాగవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎప్పుడు ఫలి స్తాయో? పంపుహౌస్ నుంచి పంట పొలాలకు నీరందించేందు గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి కాల్వల ద్వారా నీరందించాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల అధిక శాతం నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల పంట పొలాలకు నీరు సక్రమంగా అందించాడానికి అవకాశం లేకపోవడంతో పంట పొలాలల వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అందుకోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.నాలుగేళ్ల క్రితం పైప్‌లైన్ కోసం రూ:42లక్షలు మంజూరయ్యాయి.పైప్‌లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తి చేసినప్పటికి సంప్హోస్ నుంచి వచ్చే మెయిన్ పైప్‌లైన్ పలు ప్రాంతాల్లో లీకేజీవుతుంది. దీంతో నీరు పంట పోలాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని పనులు త్వరిగతిన పూర్తి చేయించి పథకాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు పథకం గురించి పట్టించుకోవడం లేదు.పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.మెయిన్‌లైన్ నుంచి పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ పలు ప్రాంతాల్లో లీకేజీ అవుతోంది. ప్రతి ఏడాది పొలం పనులు ప్రారంభమయ్యే ముందు వచ్చి పనులు చేస్తామంటారు.అప్పుడు రైతులు ఒప్పుకోరు. ఇప్పుడేమోరారు. పనులు పూర్తి చేయరు. ప్రతి ఏడాది ఈదే విధంగా జరుగుతోంది. కలెక్టర్ ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలి. -మేత్రి శరణప్ప, రైతు,అమీరాబాద్ గ్రామం త్వరలో పథకం వినియోగంలోకి.. పనులలు పూర్తయ్యాయి.టెస్టింగ్ చేయాల్సిఉంది.అది పూర్తి కాగానే పథకం వినియోగంలోకి వస్తుంది. -సౌరాజ్,ఏపీఎస్ఐడీసీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్