కలెక్టర్‌తో చర్చిస్తున్న ఎమ్మెల్యే, నాయకులు
కేసీ ఆయకట్టు పంటలను కాపాడండి
Published Tue, Aug 30 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
– ముచ్చమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయాలి
– కలెక్టర్‌ను కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే
– సానుకూలంగా స్పందించిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ రైతు విభాగం ప్రతినిధులు, రైతులతో వచ్చి కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. కేసి కెనాల్‌కు నీటి విడుదలపై చర్చించారు. కేసీ కెనాల్ కింద 75 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, నీరివ్వకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 2016 జూలై 30 నాటికే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే పనులు ఇప్పటికి పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన 2.5 టీఎంసీల నీరుSనెలకు కూడా సరిపోదన్నారు. గత ఏడాది కూడా నీరు విడుదల చేయకపోవడంతో పూర్తిగా నష్టపోయామని, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...15 రోజుల్లో మల్యాల లిప్ట్ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రెండు పైపులు మంజూరు చేస్తామని, వాటిని 15రోజుల్లోగా అమర్చి నీటిని విడుదల చేస్తామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం పట్ల ఎమ్మెల్యే సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement