కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల | 500cuces water relese to kc cenal | Sakshi
Sakshi News home page

కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల

Published Tue, Jan 24 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల

కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల

జూపాడుబంగ్లా: కర్నూలు–కడప కాల్వకు 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగు చేసిన పంటలకు మరో తడి నీరు అందితేనే పండుతాయని రైతుల విజ్ఞప్తి మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా  ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  కృష్ణాబోర్డు  కేసీకి 3 టీఎంసీల నీటి విడుదలకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నీరు వచ్చే వరకు   తొందరపడి వరినాట్లు వేసుకోవద్దని  మెట్టపంటలను మాత్రమే సాగు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement