క్రాస్ రెగ్యులేటర్ గేట్లు తెరచిన ఎమ్మెల్యే
Published Thu, Mar 2 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
అప్రోచ్ చానెల్‌లోని అడ్డుకట్ట పరిశీలన
ముచ్చుమర్రి(పగిడ్యాల): ముచ్చుమర్రి వద్ద కేసీ కాలువలో ఉండే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బుధవారం నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య తెరచి దిగువకు నీటిని విడుదల చేయించారు. పంప్‌హౌస్‌లోని సీపేజీ వాటర్‌ను ఒక మోటర్ ద్వారా కేసీకి తరలిస్తున్నారు. ఈనీరు దిగువ ప్రాంతమైన పగిడ్యాల, పాములపాడు, జూపాడుబంగ్లా మండలాల వైపునకు తరలించకుండా క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బంద్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ముచ్చుమర్రికి చేరుకున్నారు. దీంతో పగిడ్యాల, బీరవోలు, ప్రాతకోట, ముచ్చుమర్రి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ సమస్యను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు.
అనంతరం పంప్‌హౌస్ నుంచి నది లో లెవెల్ నీరు నిలచిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉండే అడ్డుకట్టను పరిశీలించారు. మూడు అడుగుల లోతు వరకు ఉండే బండరాళ్లను తొలగించుకుంటే పుష్కలంగా నీరు పంప్‌హౌస్‌లోకి చేరుకుంటుందని రైతులతో చర్చించారు. గడ్డపారలతో బండరాళ్లను తొలగిద్దామని చెప్పారు. దీనిపై అన్ని గ్రామాలలో దండోరా వేయిస్తామని, తమకు అండగా ఉండాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. రైతుల కోసం ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటానని సీఎం, అధికారులు, టీడీపీ ఇన్‌చార్జిలు మోసగించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రమాదేవి, నాయకులు వెంకటరెడ్డి, బోయ తిరుపాలు, నరసింహులు, పి. మధు పాల్గొన్నారు.
Advertisement
Advertisement