ముచ్చుమర్రి నుంచి రబీకి నీరు
ముచ్చుమర్రి నుంచి రబీకి నీరు
Published Fri, Sep 23 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
నందికొట్కూరు: కేసీ కెనాల్‌కు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పైపుల ద్వారా రబీకి సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15వ తేదీలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు మూడు పంపుల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యలు ఉన్నా రైతులతో చర్చించి పరిష్కరించామన్నరు. డిసెంబర్ లోపు విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కేసీకి అందించేందుకు రెండు పైపులైన్ల పనులు పూర్తి చేసి ట్రై యిల్‌రన్ చేసినట్లు తెలిపారు. మరో రెండు పైపులైన్ల పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయని.. 20 రోజులలోపు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. సిద్ధాపురం, గురురాఘవేంద్ర, పులికనుమ పనులు డిసెంబర్‌లోపు పూర్తి చేసి రబీకి సాగునీరు ఇవ్వనునట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement