muchumarri
-
ముచ్చుమర్రి ఘటన ముమ్మాటికీ బాబు సర్కార్ వైఫల్యమే: వైఎస్సార్సీపీ
సాక్షి, నంద్యాల జిల్లా: ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు.బాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదు: విరూపాక్షిముచ్చుమర్రి బాలిక ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మహిళలపై అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు. ముచ్చుమర్రి బాలిక ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ విరుపాక్షి ప్రశ్నించారు.హోంమంత్రికి ఈ ఘటనలు కనబడవా?: ఇషాక్ బాషాముచ్చుమర్రి బాలిక లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని.. నాలుగు నెలలు గడిచిన ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు బెయిల్ వచ్చింది. రాష్ట్ర హోంమంత్రికి ఈ ఘటనలు కనబడుతున్నాయా?. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని ఇషాక్ బాషా చెప్పారు. -
ముచ్చుమర్రి ఘటన: ‘వాళ్లు మా కళ్ల ముందే తిరుగుతున్నారు’
నంద్యాల, సాక్షి: ప్రతీకార రాజకీయంతో దాడులు, ఆడపడుచులపై అఘాయిత్యాలు.. చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలు.. ఏపీలో నాలుగు నెలలుగా అసలేం జరుగుతోంది?. పైగా బాధితులకు న్యాయం జరగకపోగా.. నిందితులు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యచార ఘటన కేసులో న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నిందితులకు బెయిల్ లభించడంతో వాళ్లు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిణామంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.‘‘121 రోజులైంది. మాపాప ఆచూకీ ఇంత వరకు దొరకకపోవడం ఏమిటి?. అసలేం జరుగుతోంది. నిందితులు బెయిల్ వచ్చి స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మేం బిడ్డను దూరం చేసుకుని శిక్ష అనుభవించాలా?. వాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేస్తేనే మా కూతురి విషయం న్యాయం జరిగినట్లు’’ అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేసు నేపథ్యం ఇలా..నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికను జూలై 7న అదేగ్రామానికి చెందిన 15, 14, 9 వయసున్న ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వాళ్లకు సహకరించిన మరో ముగ్గురు పెద్దలను సైతం పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయ్యింది.అయితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, నిందితులు వెల్లడించిన వివరాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నవే. నేరం జరిగి 90 రోజులు గడవడంతో పోలీసులు ప్రిలిమనరీ చార్జిషీట్ ఫైల్ చేశారు. క్రైం నంబర్ 69/2024లో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కర్నూలు పోక్సో కోర్టు ఏ4 కాటం యోహాన్, ఏ5 బొల్లెద్దుల సద్గురు అలియాస్ సద్గురుడు, ఏ6 అంబటి ప్రబేష్కు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కేసులో కొద్ది రోజుల క్రితం ముగ్గురు మైనర్ నిందితుల్లో ఇద్దరికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. చైల్డ్ ఇన్ కాంఫ్లిట్ విత్ లా(సీసీఎల్2)14 ఏళ్ల బాలుడు, సీసీఎల్3 అయిన తొమ్మిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరైంది. అయితే.. సీసీఎల్1 అయిన పదిహేనేళ్ల బాలుడు మాత్రం ప్రస్తుతం జువైనల్ జస్టిస్ హోంలో ఉన్నాడు.ఇదెక్కడి న్యాయం?ఈ కేసులో పోలీసుల అలసత్వంపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిన రోజున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాల ఒత్తిడితో రెండు రోజుల తర్వాత నుంచి విచారణ ప్రారంభించారు. జులై 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చిన్నారిని రేప్ చేసి చంపేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు బాలిక శవాన్ని మాయం చేయడంతో గుర్తించడంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని బాధితులు చెబుతున్నారు. అలాగే.. ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆ టైంలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూల ద్వారా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటుపై ఈ కేసును ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. సుమారు 121 రోజులు గడుస్తున్న ఇంకా పాప ఆచూకీ దొరకలేదన్న బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు న్యాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. -
టైమ్ కి బస్సు రాలేదని.. ముచ్చుమర్రి లో ఆసక్తికర ఘటన
-
అత్తారింటికి ఆర్టీసీ బస్సు.. నంద్యాలలో సూపర్ ట్విస్ట్
నంద్యాల, సాక్షి: సంచలన ఉదంతంతో ఈ మధ్య పేపర్లలో పతాక శీర్షికల్లో కనిపించిన ముచ్చుమర్రి గ్రామం.. ఈసారి చిత్రమైన ఘటనతో వార్తల్లోకి ఎక్కింది. అత్తారింటికి దర్జాగా ఆర్టీసీ బస్సు వేసుకెళ్లిన అల్లుడు.. తన అవసరం తీరాక ఆ బస్సును నేరుగా పోలీసులకే అప్పగించాడు. వెంటాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య.. ముచ్చుమర్రిలోని తన అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆత్మకూరులో బస్సు కోసం ఎంతసేపు ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో విసుగుచెందిన అతను పక్కనే పెట్రోల బంక్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేసుకుని వెళ్లిపోయాడు. అయితే గ్రామస్తులు.. బంధువులు వారించడంతో కేసు అవుతుందని భయపడ్డాడో ఏమో.. అక్కడి నుంచి బస్సును పీఎస్‌కు తీసుకెళ్లాడు. తాను ఏ పరిస్థితుల్లో బస్సును తీసుకుని రావాల్సి వచ్చిందో పోలీసులకు వివరించాడు. అది ఆర్టీసీ హైక్ చేసుకున్న ప్రైవేట్ బస్సు కావడం, బస్సు పోయిందని ఫిర్యాదు ఏమీ రాకపోవడంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. దుర్గయ్యను మందలించి.. బస్సును ఆత్మకూరు డిపోకు తరలించారు. -
ముచ్చుమర్రి కేసు.. లాకప్ డెత్ ఎందుకు జరిగింది?: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాలిక కేసును చేధించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చంద్రబాబు ఎందుకు వాయిదా వేశారు. రషీద్ కుటంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎందకు పరామర్శకు వెళ్లలేదు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. టీడీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును దగ్ధం చేశారు. టీడీపీ నేతలే దాడి చేసి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీసీ నేతలపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంజాయిని అడ్డుకోలేక మాపై నిందలు వేస్తున్నారు. శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారో చెప్పాలి. ఈకేసులో నిందితుడిని, దళిత వ్యక్తిని లాకప్‌లో పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను చనిపోయాడు. ఇది లాకప్ డెత్.. ప్రభుత్వ హత్య. ఈ దారుణంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలి. ఇక, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ తల్లికి వందనం ఏమైంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. ముందుగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Gunshot: చిన్నారులపై అత్యాచారాలు.. బాబుకు కనపడవు, పవన్ కు వినపడవు
-
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో కీలక పరిణామం
-
10 రోజుల తర్వాత గుర్తొచ్చారా.. టీడీపీ మంత్రులపై తిరగబడ్డ జనం
-
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
సాక్షి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. అటవీ ప్రాంతంలో చిన్నారిని హత్య చేశాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. -
బాబు, పవన్.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్ లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదు.రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.హోం మంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదు. హోం మంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయి. బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకాతాయిలపై ప్రయోగించాలి. దిశ చట్టంతో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించారు. 2700 మంది మహిళలను దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదని హోం మంత్రి పదే పదే చెప్పారు. అందుకే దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ‘దిశ’ అనే ఆయుధాన్ని ఆక్టివ్ చెయ్యండి.కేంద్రంలో ‘దిశ’ చట్టం పెండింగ్‌లో ఉంది. చట్టం అమలులోకి వచ్చేలా చూడాలి. కూటమిలో ఉన్న మీరు దిశ చట్టంపై బాధ్యత తీసుకోవాలి. దర్శిని కుటుంబానికి కనీసం ఆర్ధిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. హోం మంత్రి పక్క నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమెకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి లేదంటే వైఎస్సార్సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పని చెయ్యాలి. దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలి’ అంటూ హితవు పలికారు. -
ఆ దారుణంలో ముగ్గురి పిల్లల తల్లిదండ్రుల హస్తం..
-
ముచ్చుమర్రి బాలిక కేసులో నిందితులు చెప్పిన నిజాలు
-
అత్యాచారం తర్వాత..బండరాయి కట్టి విచారణలో విస్తుపోయే నిజాలు..
-
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
ముచ్చుమర్రి బాలిక కేసులో పోలీసుల సీన్ రికన్ స్ట్రక్షన్ తేలిన నిజాలు
-
నిందితులను అరెస్ట్ చేయకుండా ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామా
-
‘అఘాయిత్యాలపై స్పందన.. ఇంత ఆలస్యమా అనితమ్మా?’
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా ఏవో కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక చించేస్తాం.. పొడిచేస్తాం అన్నారు. తీరా అధికారంలో కొలువుదీరి నెల తిరిగేసరికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ఒకవైపు రాజకీయ ప్రతీకార చర్యలతో పాటు మరోవైపు హత్యలు, హత్యాచారాలు, మిస్సింగులు పెరిగిపోయాయి. అయితే వీటిపై ఇటు చంద్రబాబు ప్రభుత్వంగానీ, ఈ తరహా ఘటనలపై గతంలో ఊగిపోయి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌నుగానీ సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపించాయి. ఈ తరుణంలో.. నంద్యాల ముచ్చుమర్రి దారుణ ఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనితను ముచ్చుమర్రి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆమె ఆ గ్రామానికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగి పది రోజులు కావొస్తోంది. గత ఆరు రోజులుగా అధికార యంత్రాంగం ఎడతెరిపి లేకుండా బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. హోం మంత్రి పదవిలో ఉండి కూడా అనిత ఆలస్యంగా స్పందించడం.. తాజాగా ఇవాళ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించిందక్కడ. తాజాగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘‘ముచ్చుమర్రిలో చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. చిన్నారి కోసం ఎన్డీఆర్ బృందాలు వెతికినా మృతదేహాం లభించలేదు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం. మరోవైపు.. విజయనగరంలో ఆరు నెలల పనికందుపై అత్యాచారం చేశారు. తాగిన మైకంలో వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఈ ఘటనలపై సమీక్ష నిర్వహించారు. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు. ముచ్చుమర్రి ఘటన, విజయనగరం ఘటనపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. ముచ్చుమర్రి ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా సీఎం చంద్రబాబు స్పందించింది లేదు. డిప్యూటీ సీఎం పవన్ స్పందించినా అది సరైన రీతిలో లేదనే చర్చా సోషల్ మీడియాలో నడిచింది. మరోవైపు ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కానీ అటువైపు కూడా చూడలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించి హోం మంత్రిని ముచ్చుమర్రికి వెళ్లాలని ఆదేశించారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రభుత్వంపై విసుర్లు విసిరిన ఆమె.. ఇప్పుడు అధికారంలో హోం మంత్రిగా మొక్కుబడిగా ఏదో ప్రకటన చేశారు. మరోవైపు.. ముచ్చమర్రి మైనర్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక అదృశ్యం కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్, జాలర్లతో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నీటి మాటలే!
– తాగు నీటి పేరుతో దిగువకు నీరు – కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది 2 టీఎంసీలు – మూడు రోజులుగా 30 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్న కృష్ణా జలాలు – శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి చేరకముందే జలాలు కాజేసే ఎత్తుగడ – హంద్రీనీవా నీరు సైతం జిల్లాకు అందని పరిస్థితి – ఈ అన్యాయంపై నోరుమెదపనిఅధికారపార్టీ ప్రజాప్రతినిధులు కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన ప్రతి చుక్క నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించి సస్యశ్యామలం చేస్తాం. అప్పటి వరకు దిగువకు చుక్క నీరు తరలించాం. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా కాలువకు వదిలే నీటితో చెరవులన్నీ నింపుతాం. ప్రభుత్వం ఇటీవల చెప్పిన ఈ మాటలకు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదు. ఎప్పటిలాగే తాగునీటి పేరుతో దిగువకు నీటిని తరలిస్తోంది. సీమకు తీరని అన్యాయం చేస్తోంది. సుమారు 11 నెలల తరువాత కృష్ణమ్మ, తుంగభద్ర నదులకు వరద నీరు వచ్చి శ్రీశైలేశుడి చేంతకు చేరుతోంది. కనీస నీటి మట్టానికి కూడా చేరకముందే ప్రాజెక్టులోకి చేరిన నీటిని తాగు నీటి పేరుతో దిగువకు తీసుకపోయేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎత్తుగడ వేశాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు, నల్గొండ తాగు నీటి అవసరాల పేరుతో 2 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకునేందుకు కృష్ణనది యాజమాన్యా బోర్డు అనుమతి తీసుకుంది. ఈ నెల 12 నుంచి 15 వతేది వరకు రోజుకు 6 వేల క్యుసెక్కుల చొప్పున కుడి (3వేల క్యూసెక్కులు), ఎడమ(3 వేల క్యూసెక్కులు) పవర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేయాలని బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు 30 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇదే అదునుగా ఏపీ ప్రభుత్వం సైతం గుట్టుగా సుమారు 4టీఎంసీలను కాజేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తునా్నయి. అందులో భాగంగానే తెలంగాణకు అనుమతి ఇచ్చిన 2 టీఎంసీల కోటా పూర్తి అయినా కూడా నీటి విడుదలను కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. పట్టని సీమ తాగునీటి గోడు రాయలసీమ జిల్లాలో ఇప్పటికీ తాగు నీటి సమస్య ఉంది. పలు చోట్ల దాహం కేకలు వినిపిస్తున్నాయి. అయినా, ప్రభుత్వం కరుణించడం లేదు. నీటిని విడుదల చేయడం లేదు. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా కాలువకు నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కూడా కేవలం ఒక్క మోటార్‌తోనే నీటిని పంప్ చేస్తున్నారు. ఈ నీటితో ముందుగా తాగు నీటి అవసరాలు ఉన్న చోట చెరువులను నింపుకునేందుకు అవకాశం ఉంది. అయితే, ఆ అరకొరనీటిని కూడా అనంతపురం వైపు పంపిస్తున్నారు. అన్యాయంపై గళం విప్పకుంటే...కన్నీటి కష్టాలే ! రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లురు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటికి శ్రీశైలం జలాశయమే ప్రధాన ఆధారం. వీటి పరిధిలో సుమారు 10.22 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. సీమ జిల్లాలకు నీరు రావాలంటే 854 (శ్రీశైలం కనీస నీటి మట్టం) అడుగులు ఉండాలి. ఈ నీటి మట్టానికి చేరకముందే తాగు నీటి పేరుతో దిగువకు జలాలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు 1996లో సీఎంగా ఉన్న సమయంలో రాయల సీమ ప్రాంత ప్రయోజనాలను కాలరాస్తూ శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిసూ జీఓ నెంబరు 69 ఇచ్చారు. ఆ తరువాత దివంగత సీఎం డాక్టర వైఎస్ఆర్ ఈ జీఓను సవరించి 854 అడుగుల మట్టం ఉండేలా 107 జీఓ ఇచ్చారు. గతంలో తను ఇచ్చిన 69 జీఓను సైతం పట్టించుకోకుండా 787 అడుగుల వరకు నీటిని తీసుకుపోయారు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి ఈ నెల 1వతేది 1250 క్యూసెక్కులతో ఇన్‌ఫ్లో మొదలైంది. ప్రస్తుతం 831 అడుగులకు చేరుకొని 50.6 టీఎంసీల సామర్థ్యానికి జలాశయం చేరింది. దిగువకు నీరు విడుదల చేయకుంటే హంద్రీనీవా మాల్యాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నీటిని తోడేందుకు అనుకూలంగా ఉండేది. చంద్రబాబు సర్కారు తాగునీటి పేరుతో దిగువకు తరలించి ఆ పరిస్థితి లేకుండా చేసింది. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించకుంటే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. -
ఆగస్టులోపు ముచ్చుమర్రి పూర్తి
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ముచ్చుమర్రి(పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారయణ అన్నారు. మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామం వద్ద జరిగే ఎత్తిపోతల పనుల పురోభివృద్ధిని కలెక్టర్ శనివారం పరిశీలించారు. పంప్‌హౌస్‌పై నిర్మితమయ్యే పంప్‌ల సెట్టింగ్ పనులను, ప్రాజెక్ట్ డిజైన్ మ్యాప్, నీటి లభ్యత వివరాలు ఈఈ రెడ్డి శేఖర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఎత్తిపోతల పనులు నత్తనడకన సాగుతున్నాయని వేగం పెంచాలని ఆదేశించారు. జూపాడుబంగ్లాలో జరిగిన సంఘటనకు బాధ్యుడైన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు. హంద్రీనీవా కాలువపై వీరాపురం పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని నెహ్రూనగర్‌కు చెందిన పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అర్జీ ఇవ్వాలని సూచించారు. అనంతరం కేసీ కాలువ క్రాస్రెగ్యులేటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో జలవనరులశాఖ ఎస్ఈ నారాయణస్వామి, డీఈ బాలాజీ, ఆదిశేషారెడ్డి, నందికొట్కూరు మార్కెట్‌యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ ప్రసాదరెడ్డి, మండల నోడల్ అధికారి వీరారెడ్డి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓఆర్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మహాప్రభో పంటలను కాపాడండి
- కలెక్టర్‌ను కోరిన ప్రాతకోట గ్రామస్తులు - నెలన్నర తర్వాత మీకోసం - తరలివచ్చిన బాధితులు కల్లూరు (రూరల్): ముచ్చుమర్రి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కేసీ కెనాల్‌కు రెండు పంపుల ద్వారా సాగునీటిని అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామ పెద్దలు అంబటి శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, చిన్న కిష్టన్న, రైతులు శంకర్, పక్కీరప్ప, జలీల్ అహ్మద్, లింగారెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోఉండడంతో నెలన్నరపాటు మీకోసం కార్యక్రమం వాయిదా పడి సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సునయన ఆడిటోరియం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, జేసీ సి హరికిరణ్, జేసీ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతి పత్రాలు స్వీకరించి ఆయా విభాగాలకు రెఫర్ చేశారు. వినతుల్లో కొన్ని – డోన్ మున్సిపల్ టెండర్లను ఏకపక్షంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకుడు కేశన్నగౌడుతో పాటు అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు బీసీ జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి శేషఫణి యాదవ్ ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలం ఉలిందకొండ మజరా గ్రామమైన కొల్లంపల్లి తండాలో రెండు నెలలుగా చుక్క మంచినీరు లేదని ఉన్న రెండు బోర్లలో ఒక్క బోరు పూర్తిగా ఎండిపోయిందని మరోబోరులో చుక్కనీరు రావడం లేదని, పొలాల వెంట వెళ్లి తాగునీటిని ఎత్తుకొచ్చుకుంటున్నామని జేసీ2 రామస్వామితో మొరపెట్టుకున్నారు. మద్దికెర మండలం బూర్జుల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రామనాయక్, లక్కీ నాయక్, లక్ష్మీనాయక్, సుగాలి రెడ్డమ్మ, సుబ్బరాయుడు వినతి పత్రం అందజేశారు. గూడూరు మండలం ఆర్ ఖానాపురం గ్రామంలోని 2వేల ఎకరాల్లోని పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించాలంటూ రైతులు శ్రీనివాసులు, పెద్ద హనుమన్న, సోలోమాన్ కలెక్టర్‌కు విన్నవించారు. మంత్రాలయం ప్రభుత్వ సర్వేయర్ రాజేశ్వరి ప్రైవేట్ సర్వేయర్లను రానివ్వడం లేదని ప్రైవేట్ సర్వేయర్లు జేసీ హరికిరిణ్కు విన్నవించడంతో హాజరు పట్టిక వివరాలను తీసుకురావాలని సమస్యను రాకుండా సమన్వయంతో పని చేయాలని జేసీ సూచించారు. -
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో 3.649 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.874 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.775 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 7,921 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ 164 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల 288 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. మొత్తం జలాశయంలో 37.5560 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.డ్యాం నీటిమట్టం 815.30 అడుగులుగా నమోదైంది. -
నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం !
-ప్రభుత్వానికి నెహ్రూనగర్ రైతుల అల్టిమేటం -పురుగు మందు డబ్బాలతో ఆందోళన -సీఎం, కలెక్టర్, మాండ్ర డౌన్ డౌన్ అంటూ నినాదాలు -చర్చలు జరిపిన ఆరీ్డఓ, సీఐ ముచ్చుమర్రి(పగిడ్యాల): రైతుల పరిస్థితి రోజు రోజుకు దుర్భరంగా మారుతోంది. కళ్లేదుటే నీళ్లున్నా పంటను తడుపుకోలేని పరిస్థితి. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరే కారణమని మండిపడుతున్నారు. కేసీకి తక్షణం నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టారు. పంప్‌హౌస్ వద్ద జరిగే పనులను నిలుపదల చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్చి చివరి వరకు కేసీకి సాగునీరిస్తామని ఆరుతడి పంటలు వేసుకోవాలని సీఎం, కలెక్టర్, మంత్రులు, మాండ్ర శివానందరెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నీరు దిగువన ఉండే పంప్‌హౌస్‌లోకి రాకుండా ఆటంకంగా ఉన్న అడ్డుకట్ట బండరాళ్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జాతికి ఎందుకు అంకితం చేశారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న, మినుము, జొన్న వంటి ఆరుతడి పంటలు ప్రస్తుతం కంకి దశకు చేరుకున్నాయని, ఇప్పుడు నీరు కట్టుకోకపోతే అవి చేతికి రావని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్నా నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి ఎస్ఐలు లక్ష్మీనారాయణ, బాలనరసింహులును వెంటబెట్టుకుని ఆందోళన ప్రదేశానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. జిల్లా స్థాయి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టి సీఐతో విభేదించారు. దీంతో స్పందించిన సీఐ జలవనరులశాఖ ఈఈ, ఎస్ఈ తదితర ఉన్నతాధికారులకు ఫోన్లో సమస్యను వివరించారు. దీంతో ఆర్డీఓ ఉసేన్‌సాహెబ్ హుటాహుటిన పంప్‌హౌస్ ప్రదేశానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పంప్‌హౌస్‌లోకి నీరు వదిలితే ఆయిల్, ట్రాక్టర్ ఇంజిన్ల సాయంతో పంటలకు నీరు పెట్టుకుని కాపాడుకుంటామని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. దీనిపై ఇంజినీర్ల అభిప్రాయం తీసుకొని సాయంత్రంలోగా నిర్ణయం వెల్లడిస్తామని ఆర్డీఓ చెప్పగా వారు ఒప్పుకోలేదు. చివరకు తాను ఈ ప్రాంతవాసినని, పంటలు ఎండనివ్వమని ఆయన రైతులను ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. మూడు పంటలకు నీరిస్తామని ముఖ్యమంత్రి, జిల్లా అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేపోతే ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పారు. -
క్రాస్ రెగ్యులేటర్ గేట్లు తెరచిన ఎమ్మెల్యే
అప్రోచ్ చానెల్లోని అడ్డుకట్ట పరిశీలన ముచ్చుమర్రి(పగిడ్యాల): ముచ్చుమర్రి వద్ద కేసీ కాలువలో ఉండే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బుధవారం నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య తెరచి దిగువకు నీటిని విడుదల చేయించారు. పంప్‌హౌస్‌లోని సీపేజీ వాటర్‌ను ఒక మోటర్ ద్వారా కేసీకి తరలిస్తున్నారు. ఈనీరు దిగువ ప్రాంతమైన పగిడ్యాల, పాములపాడు, జూపాడుబంగ్లా మండలాల వైపునకు తరలించకుండా క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బంద్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ముచ్చుమర్రికి చేరుకున్నారు. దీంతో పగిడ్యాల, బీరవోలు, ప్రాతకోట, ముచ్చుమర్రి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ సమస్యను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి నది లో లెవెల్ నీరు నిలచిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉండే అడ్డుకట్టను పరిశీలించారు. మూడు అడుగుల లోతు వరకు ఉండే బండరాళ్లను తొలగించుకుంటే పుష్కలంగా నీరు పంప్‌హౌస్‌లోకి చేరుకుంటుందని రైతులతో చర్చించారు. గడ్డపారలతో బండరాళ్లను తొలగిద్దామని చెప్పారు. దీనిపై అన్ని గ్రామాలలో దండోరా వేయిస్తామని, తమకు అండగా ఉండాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. రైతుల కోసం ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటానని సీఎం, అధికారులు, టీడీపీ ఇన్చార్జిలు మోసగించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి, నాయకులు వెంకటరెడ్డి, బోయ తిరుపాలు, నరసింహులు, పి. మధు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో 49 టీఎంసీల నీటి నిల్వ
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంతానికి 48.9898 టిఎంసీల నీరు నిల్వగా ఉంది. విద్యదుత్పాదనను ముమ్మరంగా రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 56 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు బుధవారం నుంచి నీటి విడుదలను నిలిపి వేశారు. మంగళవారం నుంచివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.841మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5.129 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 25,402 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 829.50 అడుగులకు చేరుకుంది. -
ఒట్టి సీమ..ముచ్చుమర్రి
- మరో కోన సీమ అంటూ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి - పంప్‌హౌస్‌లో అడుగంటిన నీటి నిల్వలు - ఒక మోటర్‌కు కూడా సరఫరా కాని వైనం - అప్రోచ్ చానెల్ మధ్యలో అడ్డుకట్ట(తండ్) - అడ్డుకట్ట తొలగిస్తేనే పంప్‌హౌస్‌లోకి సరఫరా కానున్న బ్యాక్‌వాటర్ - ఆందోళనలో కేసీ రైతులు పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ మరో కోనసీమగా మారనుందని మూడు పంటలు పండించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మరో సారి మోసం చేశారు. కోస్తాకు పట్టిసీమ అయితే రాయలసీమకు మరో పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల అంటూ నమ్మబలకడంతో రైతులు కేసీ కాలువ కింద మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగు చేసి నిలువునా నష్టపోయారు. ఒక్క పంటకు కూడా నీరివ్వలేని దుస్థితికి చేరుకున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం భవిష్యత్‌లో ఒట్టి సీమగా మారుతుందని అన్నదాత ఆవేదన చెందుతున్నారు. జనవరి 2న జాతికి అంకితమైన ఈ ప్రాజెక్ట్ రైతుల ఆశలకు గండికొట్టింది. నెల రోజులు తిరగక ముందే పంప్‌హౌస్ అడుగంటిపోయి ఒక మోటర్‌కు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆగమేఘాలపై కేసీ కాలువకు సాగునీరు ఇవ్వాలని, రబీ పంటలను కాపాడాలని రెండు పంప్‌లను సిద్ధం చేయించినా విమర్శకుల నోళ్లలో నానాల్సి వస్తోంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో ముఖ్యమంత్రి దిగువన ఉండే నాగార్జునసాగర్‌కు తరలించి జలదోపిడీకి పాల్పడి రాయలసీమ ప్రాంత భూములను ఎడారిగా మార్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది లో లెవెల్ నీరు పంప్‌హౌస్‌లోకి రావాలంటే అప్రోచ్ చానెల్ మధ్యలో ఉండే అడ్డుకట్ట(తండ్)కు అడుగున్నర దిగువకు ఉన్నాయి. ఈ అడ్డుకట్టను తొలగించకపోతే బ్యాక్‌వాటర్ పంప్‌హౌస్ దరికి చేరదు. ఇప్పటికే నీటి తడులు అందక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు రేయింబవళ్లు స్లూయిస్ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. పంప్‌హౌస్ నుంచి కేసీలోకి సరఫరా చేసిన నీటిని స్థానిక క్రాస్ రెగ్యులేటర్లను బంద్ చేసి ఎగువన అల్లూరు వైపుకు మళ్లించి అక్కడి నుంచి కర్నూలు పట్టణానికి తాగునీటికి తరలించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో దిగువకు నీటిని బంద్ చేశారు. దీంతో ముచ్చుమర్రి క్రాస్రెగ్యులేటర్ల వద్ద రైతులు నీటిపారుదల శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళనలు చేశారు. ఎమ్మెల్యే చొరవతోనీటి విడుదల కేసీకి నీటి విడుదల నిలిచిన ప్రతిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వై. ఐజయ్య రైతుల పక్షాన అధికారులతో పోరాడాల్సి వస్తోంది. అందులో భాగంగానే సోమవారం రైతులతో కలిసి ఎమ్మెల్యే వై. ఐజయ్య ముచ్చుమర్రికి చేరుకుని కేసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిపించారు. కృష్ణా జలాలను దిగువకు తరలిస్తున్నందున శ్రీశైలంలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయి. పంప్‌హౌస్ నుంచి సిద్ధేశ్వరం వరకు చేపట్టిన అప్రోచ్ చానెల్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి నీటి సరఫరాకు అడ్డంకిగా తయారైంది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. గోదావరి జలాలలను పట్టిసీమ ద్వారా శ్రీశైలం డ్యాంకు మళ్లిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీశైలం డ్యాం నీటిని దిగువకు ఎందకు పంపిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు: రాంబాబు, ముచ్చుమర్రి రబీ సాగుకు నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రోజున మూడు పంటలకు నీరిస్తామని, ఇప్పుడు రబీలో వేసిన పంటలు చేతికి వచ్చే వరకు నీరిస్తామని చెప్పడంతో మోసపోయాం. నీటి తడులు అందక పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. వాటిని ఎలా తీర్చాలి. కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నాం: నాగలక్ష్మమ్మ, కొత్తముచ్చుమర్రి పంప్‌హౌస్‌లో నీరు అడుగంటిపోయిందని చెబుతున్నారు. మోటార్లకు నీరందడం లేదని మరో గంటకల్లా మోటార్లు బంద్ చేస్తారని తెలిసింది. పంటలకు నీరిందక రేయింబవళ్లు కాలువల వద్ద మడువలు వేసుకోవడానికి పడిగాపులు కాస్తున్నాం. ప్రస్తుతం పైర్లు నెల రోజులకు పైగా అవుతోంది. మినుములు పూత దశలో ఉండి సట్ట పడుతున్నాయి. నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. అడ్డుకట్ట పనులను వెంటనే చేపడతాం: రెడ్డిశేఖర్‌రెడ్డి, జలవనురులశాఖ ఈఈ పంప్‌హౌస్‌లోకి బ్యాక్‌వాటర్ రావడం నిలిచిపోయాయి. అప్రోచ్ చానెల్ కాలువ మధ్యలో అడ్డుకట్ట ఉంది. ఆ పనులను వెంటనే చేపట్టి బ్యాక్‌వాటర్ పంప్‌హౌస్‌లోకి సరఫరా అయ్యేలా చూస్తాం. -
ముచ్చుమర్రి.. ఏమార్చి!
అప్రోచ్ కాలువ తవ్వింది 812 అడుగుల వరకే.. – 798 అడుగుల వరకూ నీటిని తీసుకోవచ్చంటూ ప్రకటనలు – పొంతనలేని సీఎం వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పుడూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకోవచ్చు.’’ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా చెప్పిన మాటలివి. అయితే ముచ్చుమర్రి సాక్షిగా ఆయన అబద్దాలు చెప్పారు. జిల్లా ప్రజలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద శ్రీశైలం రిజర్వాయర్‌లోకి అప్రోచ్ కెనాల్ తవ్వింది కేవలం 812 అడుగుల వరకే. అంటే ఈ మట్టం కంటే నీరు తగ్గితే ముచ్చుమర్రి నుంచి చుక్క నీటిని కూడా తోడే అవకాశం లేదన్నమాట. వాస్తవాలు ఇలా ఉండగా.. ముచ్చుమర్రి నాకు కలలో కూడా వస్తోందని, ఇది సీమ ప్రజలకు జీవనాడి అని సీఎం అబద్దాలు వల్లె వేశారు. తమ హాయాంలోనే ముచ్చుమర్రి పూర్తయ్యిందని పేర్కొంటూ స్థానిక ఎమ్మెల్యే గొంతునొక్కింది ఇందుకేనా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మరోసారి కర్నూలు జిల్లాపై ముఖ్యమంత్రి శీతకన్ను వేశారని అర్థమవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు స్మార్ట్ సిటీ ఇవ్వకుండా, డోన్‌లో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే మోసం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నామినేషన్‌పై పనుల అప్పగింత వాస్తవానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలయ్యాయి. ఇందుకోసం బడ్జెట్లో నిధులను కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పుడు ఎత్తిపోతల పథకానికి అమర్చిన మోటార్లు కూడా 2008లోనే సదరు సంస్థ కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా బిగించింది కూడా ఈ మోటార్లనే. ప్రధాన ఎత్తిపోతల పంప్‌హౌస్ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. పంప్‌హౌస్ వరకూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కాలువ పనులను బెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పనులు చేపట్టలేదనే కారణంగా సుధాకర్‌రావుకు నామినేషన్‌పై రూ.6 కోట్లకు పైగా విలువ చేసే అప్రోచ్ కాలువ పనులను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పగించారు. ఎలాంటి టెండర్ లేకుండానే ఈ పనులను అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా సీఎం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పనులను బాగా చేశారంటూ మెమొంటో ఇచ్చి మరీ అభినందించారు. అయితే, వాస్తవం మాత్రం అప్రోచ్ కాలువ తవ్వింది కేవలం 812 అడుగుల వరకే. అంటే 6.147 కిలోమీటర్ల మేరకు తవ్వాల్సిన అప్రోచ్ కెనాల్‌ను పంప్‌హౌస్ నుంచి 5 కిలోమీటర్ల వరకే తవ్వారు. దీన్ని దాచిబెట్టి 798 అడుగుల వరకూ నీటిని తీసుకోవచ్చంటూ సీఎం ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఇదీ ముచ్చుమర్రి పథకం ఉద్దేశం కర్నూలు–కడప కెనాల్(కేసీ కెనాల్) 0 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 49,440 ఎకరాల ఆయకట్టుకు అవసరమయ్యే సాగునీటి అవసరాలకు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోని బ్యాక్ వాటర్ నుంచి 5 టీఎంసీల నీటిని ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తారు. ఇందుకు దివంగత ముఖ్యమంత్రి 2007లోనే జీఓ 196 ద్వారా పరిపాలన అనుమతి ఇచ్చారు. ఈ జీఓ ఆగస్టుఽ 31, 2007లోనే జారీ అయ్యింది. ఇందుకు అనుగుణంగా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 798 అడుగుల వరకూ నీటిని తీసుకునేందుకు వీలుగా మే 22, 2007లోనే ప్రభుత్వం మెమో (9022/మేజర్ ఇరిగేషన్4/2007–1)ను కూడా జారీచేసింది. ఈ అప్రోచ్ కెనాల్ ద్వారా 7,272 క్యూసెక్కుల నీటిని తోడుకునే అవకాశం ఉంటుంది. అయితే, ముచ్చుమర్రి నుంచి 1000 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్(81.80 కిలోమీటర్లు)కి విడుదల చేస్తారు. -
కేసీ కెనాల్‌కు నీళ్లిచ్చి రైతులను ఆదుకోండి
– నంద్యాల, గోస్పాడు ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయి – జేసీకి వివరించిన కేసి కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి ఎత్తపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను కోరారు. సోమవారం కమిటీ నేతలు బీవీ రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, కేశవరావు, వెంకటరామిరెడ్డి, తిరపతిరెడ్డి తదితరులు జేసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... కాలవకు నీళ్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి కేసీకి నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి జిల్లాలోని నంద్యాల, గోస్పాడు ప్రాంతంలో వివిధ పంటలు సాగు చేశారని, ఉన్నట్టుండి కేసీకి నీళ్లు బంద్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జేసీ స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. -
కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపివేత
పగిడ్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలపివేసినట్లు ఎత్తిపోతల పథకం ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు. మళ్లీ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని శుక్రవారం ఆయన విలేకరులకు వెల్లడించారు. -
ఏప్రిల్ చివరిలోపు ‘ముచ్చుమర్రి’పూర్తి
- ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ - పనుల్లో అలసత్వం ప్రదర్శించ రాదని హెచ్చరిక - కేసీ కాలువకు రెండు పంప్‌ల ద్వారా నీటి విడుదల ముచ్చుమర్రి(పగిడ్యాల): రాయలసీమకు వరదాయిని అయిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఆయన కేసీ కాలువకు రెండు పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పెండింగ్ పనులపై ఆరా తీశారు. హంద్రీనీవా కాలువకు డిజైన్ చేసిన 12 పంప్‌ల పనుల్లో ఆరు పంప్‌లను అమర్చేందుకు అర్త్‌వర్క్ పనులు పూర్తి చేశామని త్వరలోనే మోటర్లను కూర్చోబెట్టుతామని ఎస్ఈ సూర్య నారాయణస్వామి కలెక్టర్‌కు వివరించారు. ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి చేసి 16 పంప్‌లతో ప్రాజెక్ట్ అప్పగించాలని కలెక్టర్ఆదేశించారు. అయితే హంద్రీనీవా కాలువ తవ్వకం పనుల్లో రైతులు బ్రిడ్జిలను నిర్మించాలని, పొలాలకు నీరు కట్టుకునేందుకు అండర్ టన్నెల్ కాలువలు నిర్మించాలని కోరుతున్నారని ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ వాటి నిర్మాణాలకు ఎంత వ్యయం అవుతుందో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నుంచి కేసీ కాలువకు 4 పంప్‌ల ద్వారా 1300 క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. రబీ సీజన్లో కేసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఫిబ్రవరి చివరి వరకు నీరిస్తామన్నారు. సిద్దాపురం పనులు 80 శాతం పూర్తయ్యాయని ఏప్రిల్‌లోపు పెండింగ్ పనులు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జలవనురుల శాఖ ఎస్ఈ సూర్యనారాయణ, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈ బాలాజీ, తహసీల్దార్ కుమారస్వామి, ఆర్ఐ అరుణ, వీఆర్వో వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నీటి మూటలే..!
- నీటి విడుదల ప్రకటనకే పరిమితం - కేసీకి నీరు బంద్ చేసిన ఇంజినీర్లు - ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు కర్నూలు సిటీ: శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. ఒక పంటకే కాదు రెండు, మూడు, నాలుగు పంటలకైనా సాగు నీరు ఇస్తాం. - ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి నుంచి డెల్టాకు ఎంత నీరు తరలించామో.. అంతే మొత్తంలో కేసీకి కృష్ణా జలాలు ఇస్తాం. - నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాని టీడీపీ నేతలు పోటీపడి ప్రకటనలు చేశారు. దీంతో రైతులు..కాల్వల కింద రబీలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. పంటలు కీలక దశకు వచ్చేసరికి సాగునీరు బంద్ చేశారు. నీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యంగా కేసీ కెనాల్ కింద పంటలు సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయకట్టు రైతులతో కలిసి వారం రోజులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఫలితం లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని అధికారులు..నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీ ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టేందుకు.. గ్రామగ్రామాన దండోరా వేయిస్తున్నారు. వేలాది మంది రైతులు ఒక్కటై.. కలెక్టరేట్ ఎదుట, జల మండలి ఎదుట, చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. 28 వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు.. కేసీ కాలువ కింద రబీ సీజన్లో 0 నుంచి 120 కి.మీ వరకు 28 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ పంటలకు నీరు అందించేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వ అనుమతులు లేవని ఇంజినీర్లు చెబుతున్నారు. పంటలకు నీరు ఇస్తామని తాము చెప్పలేదని, మాటిచ్చిన ప్రజాప్రతినిధుల దగ్గరకే వెళ్లండనిని ఇంజినీర్లు సూచిస్తున్నారు. దీంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొరవడిన ముందు చూపు.. హంద్రీనీవా మొదటి పంపు నుంచి రెండు పైపుల ద్వారా కేసీకి నీళ్లు మళ్లించేందుకు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. మల్యాల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసినా..ప్రయోజం లేకుండా పోయింది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయడం లేదు. అలాగే ఎంతో అర్భాటంగా ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీరు బంద్ చేశారు. కేసీకి ముచ్చుమర్రి, మాల్యాల దగ్గర నుంచి నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రెండు చోట్ల నీటిని వినియోగించుకోవాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది. అయితే ఇవేమి పట్టించుకోకుండానే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులకు తాళాలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎండుతున్న ఆశలు!
-కేసీ కెనాల్‌కు నీటి సరఫరా నిలిపి వేత – వాడిపోతున్న చివరి ఆయకట్టు పంటలు మిరప, పత్తి – ఒకతడి నీరు ఇస్తే పంట కాపాడుకుంటామని రైతుల మొర – స్పందించని కేసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చేతికొచ్చిన చివరి ఆయకట్టు పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. కెనాల్‌కు నీరు వదులుతారనే ఆశతో రైతులు ఖరీఫ్‌లో పత్తి, మిరప, వరి పంటలు సాగు చేశారు. తెగుళ్లు సోకకుండా ఎరువులు, మందులు వేసుకుంటూ కంటికి రెప్పలా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకతడి నీరందిస్తే పంట చేతికొస్తుంది. ఉన్నట్టుండి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి నీటి విడుదలను నిలిపివేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు అధికారులు. నీరులేక ఎండిపోతున్న పంటలను ఎలా కాపాడుకోవాలి తెలియక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ప్రారంభించి పదిరోజులు గడకమునుపే ట్రైల్‌రన్ మాత్రమే అంటూ అధికారులు ఎత్తిపోతల పథకం నుండి కేసీకి నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో కేసీ కెనాల్‌కు శాశ్వత నీటి హక్కు లేక వేసుకున్న ఆయకట్టు పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు, కాల్వలకు నీరు లేక అవస్థలు పడ్డ రైతులు రబీ సీజన్లో నదుల్లో నీరు ఉందన్న ధైర్యంతో పంటలు సాగు చేశారు. నంద్యాలరూరల్: నంద్యాల మండలంలో కేసీ కెనాల్ కింద మూలసాగరం, కానాల, చాపిరేవుల, బ్రాహ్మణపల్లె, పుసులూరు, పాండురంగాపురం, మిట్నాల, గుంతనాల, గోస్పాడు మండలంలోని పసురపాడు, గోస్పాడు, జూలేపల్లె, తేళ్లపురి తదితర గ్రామాల్లోని చివరి ఆయకట్టు రైతులు వరి, పత్తి, మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వరి చేతికి వచ్చింది. ఇక పత్తి, మిరపకు ఒక తడి నీరు అవసరం. ఆశలపై నీళ్లు! పత్తి, మిరపను ఆయా గ్రామాల్లో 3500 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎకరా మిరప సాగుకు లక్షరూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో కేసీకి నీటి సరఫరా నిలిపివేయడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే మిరప పంట ఎండిపోతుంది. పత్తి కాయలు పగిలిపోతున్నాయి. కేసీకి సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతన్నలు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించుకుంటున్నారు. అయినా, వారు చలించని పరిస్థితి. ఆదుకోని ముచ్చుమర్రి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి రాయలసీమలో ఎండుతున్న పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పథకం ప్రారంభోత్సవ సమయంలో ప్రకటించారు. అయితే, పట్టుమని పదిరోజులు కూడా కెనాల్‌కు నీరు వదలక ముందే నిలిపివేశారు. ఇదేమిటని అడిగితే ముచ్చుమర్రి పథకం ట్రయల్‌రన్ కోసమే కెనాల్‌కు పదిరోజులు నీరు వదిలామని అధికారులు సమాధానం చెబుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కుందూనది, వాగులు, వంకల్లో ఆయిల్ ఇంజిన్లు పెట్టి కి.మీ మేర అద్దె పైపులతో నీటిని తోడుతున్నారు. పంటలు ఎండుతున్నాయి–అబ్దుల్సుకూర్, మిట్నాల: కౌలుకు తీసుకుని 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో మిరప, 5 ఎకరాలో పత్తి పంట సాగు చేశా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చే సమయంలో కాల్వలకు నీరు బంద్ చేశారు. ఒక తడి నీరు వస్తే దిగుబడి పెరిగి నష్టాల నుంచి బయట పడతాం. పంటలు వేసుకోండి అన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఎలాగైనా కేసీకి నీరు విడుదల చేయించి ఎండుతున్న పంటలు కాపాడాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. ట్రయల్ రన్ కోసం కేసీకి నీరు విడుదల చేశాం–మల్లికార్జునరావు, కేసీ ఈఈ: ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభం కావడంతో జనవరి 25వరకు కేసీకి నీరు విడుదల జరిగింది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి కెనాల్‌కు నీరు విడుదల ట్రయల్‌రన్‌లో భాగమే. ప్రస్తుతం ముచ్చుమర్రి నుంచి నీరు రాదు. ఎండుతున్న పంటల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల
జూపాడుబంగ్లా: కర్నూలు–కడప కాల్వకు 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగు చేసిన పంటలకు మరో తడి నీరు అందితేనే పండుతాయని రైతుల విజ్ఞప్తి మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణాబోర్డు కేసీకి 3 టీఎంసీల నీటి విడుదలకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నీరు వచ్చే వరకు తొందరపడి వరినాట్లు వేసుకోవద్దని మెట్టపంటలను మాత్రమే సాగు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. -
పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల తగ్గింపు
శ్రీశైలం ప్రాజెక్టు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే నీటిపరిమాణాన్ని అధికారులు తగ్గించారు. శుక్రవారం నీటివిడుదల 800 క్యూసెక్కులు ఉండగా, శనివారం 600 క్యూసెక్కులను విడుదల చేశారు. గత నాలుగు రోజుల క్రితం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటివిడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. హంద్రీనివా సుజలస్రవంతికి విడుదల చేసే 2,025 క్యూసెక్కుల నీటిని యథావిథిగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలంకుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన కొనసాగుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.444 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 5.842 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 14,694 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 91.6176 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 854.90 అడుగులు నమోదైంది. -
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరిశీలన
ముచ్చుమర్రి(పగిడ్యాల): మండల పరిధిలోని పాతముచ్చుమర్రిలో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను కృష్ణానది జలాల బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్ నాగ్పురే శనివారం పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణాబోర్డు కమిటీ బృందం సందర్శించి టెలిమెట్రీ డిశ్చార్జ్ మీటర్ల ఏర్పాటుపై జలవనరులశాఖ, కేసీ కాలువ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. అయితే ఆ రోజు చీకటిపడటంతో టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై అవగాహనకు రాలేని బోర్డు చీఫ్ ఇంజినీర్ రెండో విడతగా శనివారం ప్రాజెక్ట్‌ను సందర్శించి క్రాస్ రెగ్యూలేటర్ వద్ద ఉండే డిశ్చార్జ్ పాయింట్‌ను, వాల్వ్ ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో కృష్ణాబోర్డు సభ్యుడు చీఫ్ ఇంజినీర్ ఏ. బాలన్, డిప్యూటీ డైరక్టర్ ఆనంద్‌కుమార్, జలవనరుల శాఖ డీఈ ఆదిశేషారెడ్డి తదితరులు ఉన్నారు. -
హామీలతో ముంచారు!
– సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేసిన ఇంజినీర్లు – రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ నేతల హామీలు – దీంతో పంటలు సాగు చేసిన రైతులు – మల్యాల, ముచ్చుమర్రి నుంచి కేసీకి నీరు బంద్ – నీటి కోసం కార్యాలయల చుట్టూ తిరుగుతున్న ఆయకట్టుదారులు ‘శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉంది. ఒక పంటకే కాదు రెండు పంటలకు సాగునీరు ఇస్తాం. శ్రీశైలం నీటిని ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల పథ«కం ద్వారా కర్నూలు–కడప కాలువకు అందిస్తాం’ అంటూ సీఎం చంద్రబాబునాయుడు నుంచి కిందిస్థాయి టీడీపీ నేత వరకూ హామీలిచ్చారు. దీంతో అన్నదాతలు రబీలో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అయితే పంట కాల్వలకు నీటి విడుదల ఆగిపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు సిటీ : సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేయడంతో ఆయకట్టుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం రెండు తడులకు అయినా నీరు ఇవ్వాలని జలమండలి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నీటి విడుదల విషయంలో తాము ఏ నిర్ణయం తీసుకోలేమని, నీరు ఇస్తామని తాము చెప్పలేదని ఎవరైతై హామీ ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లాలని ఇంజినీర్లు చెబుతుండడంతో ఆయకట్టుదారులు ఎక్కడికెళ్లాలో తెలియక సతమతమవతున్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ దృష్టికి తీసుకపోయినా ప్రయోజనం లేకపోవడంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాగా హెచ్ఎన్ఎస్ఎస్ నీటి కోసం ప్రతిపాదనలు కోరిన సమయంలో ఇంజినీర్లు తమ జిల్లాకు అవసరం లేదనే «నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంతోనే నేడు ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు ఉన్నాయి. కృష్ణా జలాలు బంద్ శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాలను హంద్రీనీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాకు అందిస్తున్నారు. మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంపుల ద్వారా, సీఎం ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీకి మళ్లించేందుకు చేపట్టిన పథకాల నుంచి కూడా వారం క్రితం నుంచి కృష్ణా జలాలను బంద్ చేశారు. దీంతో కేసీ కాలువ 120 కిమీ వరకు సాగు చేసిన 20 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది. అలాగే తెలుగుగంగ కాలువకు నీటిని బంద్ చేయడంతో అక్కడక్కడ వేసిన ఆరుతడి పంటలకు సాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నీటి క్రమబద్దీకరణ ప్రభుత్వం చేతుల్లోకి.. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నీటి క్రమబద్ధీకరణ ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షక ఇంజినీర్లు ప్రభుత్వ అనుమతి తీసుకుని చేసేవారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి ప్రాజెక్టులు, కాల్వలకు నీటిని విడుదల చేసే అధికారాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. కేసీకి నీరు ఇవ్వాలని కోరినా పెద్దలు, అధికారుల చుట్టూ ఆయకట్టుదారులు తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారులెవరూ చెప్పలేదు శ్రీశైలంలో నీరున్నా కూడా ఆయకట్టుకు మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా రబీకి నీరు ఇస్తామని చెప్పలేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలకు మాకెలాంటి సంబంధం లేదు. అవసరమయిన సమయంలో తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ -
‘ముచ్చుమర్రి’ పరిశీలన
పగిడ్యాల (నందికొట్కూరు): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రి డిశ్చార్జ్ మీటర్లను అమర్చుతున్నట్లు కృష్ణా వాటర్ బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్ నాగపురి పేర్కొన్నారు. బుధవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. పంప్‌ల సామర్థ్యాలను జలవనరుల శాఖ ఎస్ఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోర్డు కమిటీ మెంబర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఏ. బాలన్, డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, కేసీ కాలువ నీటిపారుదల శాఖ ఈఈ మల్లికార్జున, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి పాల్గొన్నారు. -
అందం అంటే ముచ్చుమర్రి గిత్తదే
అందం అంటే ముచ్చుమర్రి గిత్తదే - షో ఆఫ్ ది చాంపియన్‌గా ఎంపిక - ముగిసిన ఒంగోలు గిత్తలు, ఆవుల అందాల పోటీలు నెల్లూరు రూరల్ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు నెల్లూరు కనుపర్తిపాడులో నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఆవులు, గిత్తల అందాల ప్రదర్శనలు, బండ లాగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. గిత్తల అందాల పోటీల్లో మన జిల్లాలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కాటం మురళీధర్‌రెడ్డి గిత్త షో ఆఫ్ ది ఛాంపియన్‌గా నిలిచి ఒంగోలు జాతి రాజసాన్ని చాటింది. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో కూడా ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఆవుల విభాగంలో క్వీన్ ఆఫ్ ది షోగా ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పమిడి రాజశేఖర్ పాడి ఆవు ఎంపికైంది. వీరికి ప్రత్యేకంగా కిలో వెండిని బహుమతిగా అందజేశారు. -
ముచ్చుమర్రికి శ్రీశైలం జలాలు విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం 420 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి నీటిని విడుదల ప్రారంభించినప్పటికీ బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతల పథకానికి నీటిని అందిస్తున్నారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే 2వేల క్యూసెక్కుల నుంచి 500 క్యూసెక్కులను తగ్గించి 1500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తగ్గించిన స్థానంలో ముచ్చుమర్రి ఎత్తి పోతలకు 420 క్యూసెక్కులను వదులుతున్నారు. హంద్రీనివా సుజలస్రవంతికి యథావిథిగా 2025 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.664 మిలియన్ యూనిట్లు, తెలంగాణా ప్రాంతంలోని ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.392 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 5,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 102.4060 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 858.80 అడుగులకు చేరుకుంది. -
అంతా బూటకమే!
– సీఎం ముచ్చుమర్రిని ప్రారంభించిన మరుసటి రోజే కేసీకి నీరు బంద్ – ముచ్చుమర్రి, మల్యాల నుంచి నీటి విడుదల నిలిపేసిన ఇంజినీర్లు – ప్రతిపక్ష నేత రాకతో మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల – కరెంటు బిల్లుల చెల్లింపుల్లో కొరవడిన సమన్వయం – ఏ సర్కిల్ నుంచి బిల్లులు చెల్లించాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని ప్రభుత్వం కర్నూలు (సిటీ): రాయలసీమకు ముచ్చుమర్రి ఆయువుపట్టు లాంటిదని, ఈ స్కీముతో సీమను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ ఈనెల 2న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఆయన పథకాన్ని ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే నీటి విడుదల నిలిచిపోయింది. బాబు చెప్పేదంతా బూటకమని కేసీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు – కడప (కేసీ)కాల్వకు సాగునీరు ఇచ్చేందుకు పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. పనులు పూర్తికాకపోయినా కూడా నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సీజన్ మొత్తం రెండు మోటార్ల ద్వారా నీరు విడుదల చేసి పంటలు ఎండకుండా చూస్తామని సీఎం ప్రకటించారు. అయన హామీచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కేసీకి 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. ఈ స్కీమ్ ద్వారా కేసీకి 500 క్యూసెక్కులు, హంద్రీనీవా మొదటి లిఫ్ట్ మల్యాల దగ్గర నుంచి కేసీకి రెండు పంపుల ద్వారా మళ్లించిన నీటిని సైతం బంద్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ నేతలు నోరు మెదపక పోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత రాకతో... రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కేసీకి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీరు బంద్ చేశారని గుర్తు చేయడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో దడ పుట్టింది. వెంటనే ముచ్చుమర్రి స్కీము నుంచి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు మోటార్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. మోటార్లు బంద్ చేసిన విషయాన్ని ప్రతిపక్ష నేత ఎత్తి చూపే వరకు జిల్లా అధికార పార్టీ నేతలు టీడీపీ పెద్దలను ఎదిరించలేక గమ్మున ఉండటంపై రైతులు భగ్గుమంటున్నారు. బాబూ.. ముందుచూపు ఏదీ? రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరిలో తనకున్నంత ముందుచూపు ఏ నేతకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు లేదని పదే పదే గొప్పగా చెబుతుంటారు. ఏ ప్రాజెక్టుకు, ఏ సర్కిల్‌కు అప్పగించాలి, దానిని ఎవరు నిర్వహించాలి అనే విషయంపై ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో కేసీ ఆయకట్టుకు ఒక వైపు మల్యాల నుంచి, మరోవైపు ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల బంద్ అయింది. ఈ రెండు స్కీములకు రోజుకు సుమారు రూ.21 లక్షలు కరెంటు బిల్లు వస్తుండటం, ఆ బిల్లు ఏ సర్కిల్ చెల్లించాలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే కాల్వకు నీరు బంద్ చేసినట్లు కొందరు ఇంజినీర్లు చెబుతున్నారు. -
ముచ్చుమర్రి ఘనత వైఎస్ఆర్దే
- ఈ విషయం చెబితే బాబు జీర్ణించుకోలేకపోతున్నారు - ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు – జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి – జేసీకి ప్రతిపక్ష నేతను గౌరవించే సంస్కారం తెలియదు – విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. ఈ విషయం మరచి టీడీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎంత మభ్య పెట్టినా జిల్లా ప్రజలు నమ్మరని చెప్పారు. జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని అధికారపార్టీకి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతను గౌరవించే కనీస సంస్కారం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలులు గౌరుచరితారెడ్డి, ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధానా కార్యదర్శి బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు. మాట్లాడే హక్కును కాలరాస్తున్నారు ప్రతిపక్షపార్టీ ప్రతినిధుల మాట్లాడే హక్కును చంద్రబాబు కాలరాస్తునా్నరని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. తడకనపల్లిలో నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫలన విషయాలే మాట్లాడాలని తనను కట్టడి చేశారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మైక్ కట్ చేయడం విచారకరమని, ఇది దళితులను అవమానించడమే అవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనప్పుడు జిల్లాకు సంబంధం లేని జేసీ దివాకర్‌రెడ్డితో ఎలా మాట్లాడిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని వాడు–వీడని జేసీ సంభోదించడం తగదన్నారు. జిల్లాలో 14 సీట్లు గెలవాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక దాగి ఉన్న ఆయన స్వార్థాన్ని తెలియజేస్తుందన్నారు. ముచ్చుమర్రి పథకంతో 300 రోజులు నీళ్లొస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజాలు బయట పడతాయని: ఐజయ్య, నందికొట్కూరు శాసన సభ్యుడు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పునాది వేసిన వైఎస్ఆర్ పేరున ఉచ్ఛరిస్తే సీఎం జీర్ణించుకోలేకపోయారని, అందుకే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని నందికొట్కూరు ఎమె్మల్యే ఐజయ్య అన్నారు. రాయలసీమలో వ్యవసాయ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణులతో చర్చించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు. నాలుగు పంపులతో పనిచేయాల్సిన ఈ పథకాన్ని రెండు పంపులతోనే ప్రారంభించడం చంద్రబాబు తొందరపాటు చర్య అని అభివరి్ణంచారు. జిల్లాపై ప్రేమ ఉంటే లింగాల, ఇస్కాల వంటి తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూరి్త చేయాలని కోరారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన జేసీకి ఆ మాత్రం తెలియదా.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా అనంతపురం ఎమ్మెల్యే దివాకర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వడం న్యాయమా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆరుసార్లు, ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయిన దివాకర్‌రెడ్డి సంస్కారం మరచి ప్రతిపక్ష నేతను వాడువీడు అని సంభోదించడం తగదన్నారు. తక్షణమే తమ పార్టీ అధినేతకు క్షమాపణ చెపా్పలని డిమాండ్ చేశారు. అలాగే నోటిదురుసును కూడా తగ్గించుకోవాలని జేసీకి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రైతు విభాగం, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి, పార్టీ నాయకులు చంద్రమౌళి, రవికుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభోత్సవం
-
‘ముచ్చుమర్రి’తో సీమ సస్యశ్యామలం
– సామాజిక, కుటుంబ వికాసానికి ప్రాధాన్యం – తడకనపల్లె గ్రామానికి సీఎం వరాల జల్లు – నాల్గవ విడత జన్మభూమి– మన ఊరు ప్రారంభం – రూ. 1766 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కల్లూరు/కల్లూరు రూరల్ : ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ సర్పంచ్ గంగుల వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన నాల్గో విడత జన్మభూమి– మన ఊరు కార్యక్రమాన్ని సోమవారం తడకనపల్లె గ్రామం నుంచి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా తడకనపల్లె గ్రామ శివారులో రూ. 2 కోట్లతో నిర్మితమైన పశు వసతి కేంద్రాన్ని, ఓర్వకల్లు మండలం గ్రామజ్యోతి ప్రాజెక్టును జెండా ఊపి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించి చెరువు కట్టపై ఏర్పాటుచేసిన జన్మభూమి సభకు చేరుకున్నారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెరువు కట్టమీద ఏర్పాటు చేసిన రూ. 1766 కోట్ల అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. తడకనపల్లె పాలకోవాకు ప్రసిద్ధి గ్రామ సర్పంచ్ అధ్యక్ష నిర్వహించిన సభలో.. చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందిస్తున్నామని, డెల్టాకు వెళ్లాల్సిన నీటిని ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూమి, నీరు, విద్యుత్ పుష్కలంగా ఉంటే పరిశ్రమలు తరలివస్తాయని తెలిపారు. ఇప్పటికే ఓర్వకల్లు మండలంలో వేలాది ఎకరాలను ఏపీఐఐసీకి పరిశ్రమల స్థాపనకు కేటాయించామని తెలిపారు. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పశువుల వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా తడకనపల్లె పాలకోవా రాష్ట్ర ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. తడకనపల్లె, వామ సముద్రం, ఓబుళాపురం, తండ గ్రామాల ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గ్రామంలో 250 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం కింద కూరగాయలు సాగుచేయడం శుభపరిణామం అన్నారు. ప్రతీ కుటుంబానికి ఓ సెల్‌ఫోన్.. కుటుంబ, సామాజిక వికాస సూత్రాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. ఫైబర్ గ్రిడ్ సౌకర్యం అందించి డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. సెల్‌ఫోన్, రూపే కార్డు, ఏటీఎం కార్డులు వినియోగించి 100 శాతం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి కుటుంబానికి ఒక సెల్ ఫోన్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కొక్క సెల్‌ను రూ. 1000 సబ్సిడీ కింద అందించాలన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని, మండల ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పశుసంవర్ధఖ శాఖ ఆధ్వర్యంలో 300 పశువులకు పరిపడే 4 షెడ్లను ఏర్పాటుచేశామని, గ్రామంలోని రైతులు ఈ షెడ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ఎంపీటీసీ సభ్యుడు మర్రి శేఖర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, కేఈ ప్రభాకర్, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎంపీపీ వాకిటి మాధవి, జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతమ్మ, ఎంపీటీ సభ్యుడు మర్రి శేఖర్, ఐఏఎస్ అధికారి జగన్నాథం, పాలడైరీ నిర్వాహకురాలు జుబేదాబీ పాల్గొన్నారు. కార్యక్రమం వాఖ్యాతగా యాగంటీశ్వరప్ప వ్యవహరించారు. -
ముచ్చుమర్రికి ఆద్యుడు వైఎస్ఆర్
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సూటి ప్రశ్న - సభలో మాట్లాడుతుంటే మైక్ కట్ చేయిస్తారా అంటూ మండిపాటు - వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు సినిమా డైలాగులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే.. - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం నెహ్రూనగర్(పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఈ పథకానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం తెలుసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు. సోమవారం నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొన్న తనకు బహిరంగ సమావేశంలో మాట్లాడటానికి అవకాశం కల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన అపర భగీరథుడు అని చెప్పగానే మైక్ కట్ చేయించి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. చివరి దాకా మాట్లాడకుండా మధ్యలోనే మైక్ లాగేసుకుని తనను అవమాన పరిచేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉండి తనను ఈ మీటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం లేదని ఓ దళిత ఎమ్మెల్యేని అవమానించారన్నారు. ప్రొటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం వచ్చినందువల్లే సమావేశానికి హజరయ్యానని.. ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇచ్చేలా ముఖ్యమంత్రే వ్యవహరిస్తే కింది స్థాయి అధికారులు ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఎవరు చేపట్టారని కాదు.. ఎవరు ముగించారన్నది ముఖ్యమని పోకిరి సినిమా డైలాగులను వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2007 ఆగస్టులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు వ్యయం చేసి 90 శాతం పనులు పూర్తి చేయించారని.. మిగిలిన రూ.75 కోట్ల పనిని పూర్తి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు పట్టిందని విమర్శించారు. రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం చేయడంతోనే ముఖ్యమంత్రికి రాయలసీమపై ఎంతో ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. వైఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు విజ్ఞత అనిపించుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రమౌళి, మహబూబ్ బాషా, చాంద్‌బాషా, శేఖర్, రాజు, పి. మధు, శ్రీను, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
నా కలలోనూ ముచ్చుమర్రే...!
గెలిచినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేను – ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు – గుండ్రేవుల అవసరమా? అలోచిద్దామని వ్యాఖ్య – జిల్లాలో ముఠా తగాదాలున్నాయని మండిపాటు – రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో 21వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ రోజూ నా కలలో కూడా ముచ్చుమర్రే గుర్తుకు వస్తోంది. ఇది నా పూర్వజన్మ సుకృతం. ముచ్చుమర్రి పర్యాటక ప్రదేశంగా మారాలి. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా. కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. జిల్లాలోని చెరువులన్నింటినీ నీటితో నింపుతాం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు తడకనపల్లెలో పశువుల హాస్టల్‌ను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో రూ.19 వేల కోట్లతో అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తద్వారా 21వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ నెల రెండు లేదా మూడో వారంలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుందని వివరించారు. నంద్యాలను సీడ్ హబ్ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాలో మొత్తం 27 ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా ఉన్నాయని.. వీటి కోసం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకూ వెచ్చించామన్నారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా 630 ట్యాంకులకు నీళ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముచ్చుమర్రితో కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించామన్నారు. జిల్లాలో రాజకీయ తగాదాలు ఎక్కువగా ఉన్నాయని.. వీటికి స్వస్తి పలకాలని అధికార పార్టీ నేతలకు ఆయన హితవు పలికారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు తెలంగాణ తరహాలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. అయితే, దీనిని అధ్యయనం చేద్దామన్నారు. ఇక కేసీ కెనాల్ వెంట రెయిన్గన్ల ద్వారా వ్యవసాయం చేసేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హమీనిచ్చారు. గుండ్రేవుల అవసరమా? పట్టిసీమ ద్వారా డెల్టాకు గోదావరి నీటిని ఇచ్చి.. శ్రీశైలం నీటిని సీమకు తరలిస్తున్నామని సీఎం వివరించారు. ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలో కూడా నీటిని తోడుకునేందుకు అవకాశం ఉందన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు అంతర్ రాష్ట్ర వివాదాలు ఉన్నాయని.. ఇప్పుడు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అమలు తర్వాత గుండ్రేవుల అవసరం ఉందా? లేదా అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాలకు హంద్రీనీవా నీటిని కాలువల ద్వారా తరలిస్తామన్నారు. ఇందుకోసం ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోందని తెలిపారు. సీమలో ఒకప్పుడు తుపాకులతో ఆడుకునేవారని.. ఇప్పుడు నీటితో జలకాలాటలు ఆడాలని వ్యాఖ్యానించారు. 854 నీటిమట్టం గురించి శ్రీశైలం డ్యామ్ వద్దకు వెళ్లి పోరాటం చేసేవారని.. ఇక మీరు గొడవలు చేసేందుకు అవకాశం లేదని రాజకీయ నేతలను ఉద్దేశించి అన్నారు. ఎస్ఆర్బీసీ, హంద్రీ నీవా, కేసీ కెనాల్ వంటి కాలువలన్నీ అనుసంధానించి ఎక్కడ అవససం ఉంటే అక్కడకు నీరు ఇచ్చేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నా దృష్టిలో ఉన్నది రెండే రెండు కులాలన్నారు. పేద వాళ్ల కులం, డబ్బులున్న వారి కులమని.. తనది పేద వాల్ల కులమన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాను, సాగునీటిశాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని... అయితే, ఇంజనీరింగ్ చదవని ఇంజనీర్ సీఎం చంద్రబాబు అని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ఇది ఒక చరిత్ర అని.. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్‌శాఖ అధికారులతో పాటు మెగా కంపెనీ ప్రతినిధులను సీఎం ప్రశంసించారు. అధికార పార్టీ కార్యక్రమంలా...! వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం ఆనవాయితీ. అయితే, నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్ద జరిగిన కార్యక్రమంలో మాత్రం ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని మైక్ కట్ చేయడం ద్వారా అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను పక్కనపెట్టి ఇన్‌చార్జీకి అవకాశం ఇవ్వడంపై పలువురు మండిపడుతున్నారు. ఇది టీడీపీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే ప్రసంగాన్ని స్వయంగా సీఎంతో పాటు ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యేలు మైక్ గుంజుకుని మరీ అడ్డుతగలడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో పర్యటన పర్యటించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను సీఎం.. జాతికి అంకితం చేయనున్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకనపల్లిలో పశువుల హాస్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇక్కడే నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. -
రాజన్న కల సాకారం
- కేసీకి ప్రత్యామ్నాయ నీటి వనరుగా ముచ్చుమర్రి - 2007లో శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్ - బాబు చేసిన తప్పును సరిచేసిన దివంగత నేత - తొమ్మిదేళ్లకు పూర్తయిన ఎత్తిపోతల పథకం - నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం కర్నూలు సిటీ: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం..దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల. కేసీ కెనాల్ నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం 2007లో ఈ పథకానికి వైఎస్సార్ పురుడు పోశారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ దీనిని పూర్తి చేసింది. సోమవారం ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా..ప్రాజెక్టు రూపకల్పన..పూర్తయిన తీరుపై సమగ్ర కథనం.. కేసీ కెనాల్...జల రవాణా కోసం బ్రిటీష్ హయాంలో(1835లో) నిర్మించారు. రాయల సీమలో డొక్కల కరువు రావడంతో 1884లో దీనిని సాగునీటి కాలువగా మార్చారు. సీమలోనే పెద్ద కాలువగా పేరొందిన దీనికి 1969లో బచావత్ ట్రిబ్యునల్ 39.9 టీఎంసీల తుంగభద్ర నీటి వనరులను కేటాయించింది. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ(సుంకేసుల) ద్వారా నది నీటి ప్రవాహం నుంచి 29.9 టీఎంసీలు, టీబీ డ్యాం నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు వాడుకోవాలనే ఆదేశాలిచ్చింది. ఈ కాల్వ కింద కర్నూలు, కడప జిల్లాలో మొత్తం 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 234 కి.మీ, కడప జిల్లాలో 72 కి.మీ మేర కాల్వ విస్తరించి ఉంది. కేటాయించిన మేరకు ఏ రోజుకు నీరు రాలేదు. ప్రతి ఏటా పంటలు ఎండిపోతూ రైతులు నష్టపోయే వారు. వైఎస్ఆర్ సొంత ఆలోచనే ముచ్చుమర్రి.. ఒకవైపు కేసీ నీరు అందక రైతులు నష్టపోతుంటే.. 2003లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కేసీ వాటాలోని 5 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు జీఓ నంబర్1 జారీ చేశారు. ఆ తరువాత కూడా మరో 5 టీఎంసీలను మళ్లించాలంటూ అందులో మార్పు చేశారు. చంద్రబాబు చేసిన తప్పుతో కేసీ రైతులు పడుతున్న ఇబ్బందులను పాదయాత్ర సమయంలో వైఎస్సార్ చూసి చలించారు. అధికారంలోకి వచ్చాక.. 2006లో కేసీకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శ్రీశైలం జలాలను అందించేందుకు అవకాశాలపై సర్వే చేయాలని నాటి కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా పని చేస్తున్న పి.ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు సర్వే కూడా చేయించారు. ఇందు కోసం 2007 ఆగస్టు 31వ తేదీన రూ. 120 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబరు 196ను జారీ చేశారు. ఇందులో కేసీతోపాటు హంద్రీనీవాకు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. శ్రీశైలం బ్యాక్ బాటర్ ఉంటే ముచ్చుమర్రి దగ్గర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ఏర్పాటు చేసి..అక్కడి నుంచి పైపుల ద్వారా కేసీ ప్రధాన కాలువలోకి నీరు ఎత్తిపోసేందుకు రూ. 75.26 కోట్లు కేటాయించారు. ఇందుకు 2008 జూన్‌లో శంకుస్థాపన చేశారు. పనులను మోగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించారు. శ్రీశైలంలో 790 అడుగుల నీటిమట్టం ఉన్నంత వరకు.. నీటిని తీసుకునేలా డిజైన్ చేశారు. ఈ పథకం ద్వారా 35 వేల ఎకరాలకు సాగు నీరు, కర్నూలు నగర వాసుల తాగు నీరు అందనుంది. కోర్టు ఆదేశాలతో.. కేసీ వాటా నీటి మళ్లింపుపై కొంత మంది ఆయకట్టుదారులు లోకాయుక్త, హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పెండింగ్‌లో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు ఏడాది తిరిగే సరికి పంప్ చేసేంత వరకు చేయగలిగారు. మొత్తం నాలుగు పంప్లకుగాను, మూడింటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి రెండు పంప్‌ల ద్వారానే నీటిని లిఫ్ట్ చేసేందుకు సిద్ధం చేశారు. మరో మెటార్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు.. ఈఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకోని కాంట్రాక్ట్ ఏజేన్సీ అయిన మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ రాత్రింబవళ్లు లైట్లు వేసుకోని పనులు చేసింది. ముచ్చుమర్రి నుంచి మూడు స్టేజీల ద్వారా నీటిని ఆయకట్టుకు అందించనున్నారు. 81 కి.మీ దగ్గర కాలువలోకి వచ్చే చోట, 60, 40 కి.మీ దగ్గర లిఫ్ట్‌లు నిర్మించారు. ఈ నీరు కర్నూలు నగరం వరకు ఇప్పటికే వెనుకటికి వచ్చాయి. మనుముందు ఈ నీరే నగరవాసుల దాహాన్ని తీర్చనున్నాయి. చారిత్రాత్మక ప్రాజెక్టు – రెడ్డి శేఖర్‌రెడ్డి, ఈఈ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చారిత్రత్మాకమైనది. ఇలాంటి ప్రాజెక్టు పనులు చేయిండచంలో నా భాగస్వామ్యం ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేయించాం. ముందుగా అప్రోచ్ కాలువ, పంప్‌హౌస్ పనులు చేశాం. కాంట్రాక్టర్ సైతం చాలా ఉత్సాహకంగా పని చేశారు. ప్రస్తుతం మూడు పంప్‌లు పూర్తి చేశాం. ఈ నెల చివరిలోపు నాల్గోవ పంప్ కూడా సిద్ధం చేస్తాం. కొత్త పద్ధతి ద్వారా రాక్‌ను తొలగించాం – బి.ఉమా మహేశ్వరరెడ్డి, మెగా ఇంజినీరింగ్ కనస్ట్రక్చన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ముచుమర్రి ఎత్తిపోతల పథకం పనులు 2007–08 మొదలు పెట్టాం. వరదల వల్లతో 2009లో పూడిక చేరిపోయింది. తిరిగి 2015 సంవత్సరంలో పనులు మొదలు పెట్టాం. డీ వాటరింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభించి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా రాక్‌ను తొలగించేందుకు నూతన పద్ధతిని వినియోగించాం. రోజుకు 1200 మంది కార్మికులతో 30 వేల క్యుబిక్ మీటర్ల కాంక్రీట్, 2 వేల టన్నుల స్టీల్ పనులు చేశాం. ఈ ఏడాది మార్చి వరకు గడువు ఉంది. హంద్రీనీవాకు12 పంపులు, కేసీకి 4 పంపులు ఏర్పాటు చేస్తున్నాం. కేసీకి ప్రస్తుతానికి మూడు మోటర్లు బిగించాం. రెండు పంప్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఇటీవలే ట్రయల్ రన్ చేశాం. గడువులోపు అన్ని పనులు పూర్తి చేస్తాం. -
రేపు జిల్లాలో సీఎం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారు అయింది. జనవరి 2వ తేదీన ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లాకు చేరుకొని సాయంత్రం 5 గంటల వరకు నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను..ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం తడకనపల్లిలో నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ చేరుకుని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసే స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వివిధ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా కల్లూరు మండలం తడకనపల్లికి చేరుకొని పశువుల హాస్టల్‌ను ప్రారంబిస్తారు. అక్కడ నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో 3 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పాల్గొని.. హెలికాప్టర్లో బయలు దేరి హైదరాబాద్ వెళతారు. -
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ భిక్షే
– అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి – సిద్ధేశ్వరం ప్రాజెక్టుతోనే సీమ సస్యశ్యామలం – బైరెడ్డి రాజశేఖరరెడ్డి నందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భిక్షేనని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో మాజీ సర్పంచు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో టీడీపీ నుంచి ఆర్పీఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైరెడ్డి మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పునాదులు వేసి నిధులు కేటాయించింది వైఎస్ రాజశేఖర్రెడ్డేనన్నారు. ఆ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చే రోజే దీక్షకు దిగుతామన్నారు. కర్ణాటక జల దోపిడీని ఎలా అరికడతారో సమాధానం చెప్పాలన్నారు. అప్పట్లో పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి నీరు అందిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అంటున్నాడని ఏది నిజమో ప్రజలే ఆలోచించాలన్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే నిఖర జలాలతో రాయలసీమంతా సాగునీరు వచ్చి అభివృద్ధి చెందుతుందని కర్ణాటక జలచౌర్యం అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ముందడగు వేయడంలేదని ప్రశ్నించారు. హొస్పేట్ డ్యాం నుంచి కేసీ కెనాల్‌కు రావాల్సిన వాటాకు ఉన్న హక్కులను భంగం కలిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రభుత్వం ప్రకటించి రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కోస్తాపై ప్రేమ ఒలకబోస్తూ సీమపై కక్ష సాధింపునకు పాల్పడడం దారుణమన్నారు. -
దశాబ్దాం నాటి కల సాకారం
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాలు - జిల్లాకు చేయాల్సినంతా చేశా... - స్వీట్లు పంపిణీ చేసిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): ‘‘జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చా. గోదావరి జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేశా. జిల్లా ప్రజలు అభివృద్ధి ఫలాలను అనుభవించే రోజులు వస్తున్నాయి. దశాబ్దం కలను నెరవేర్చాం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చాం.’’ అని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా అధికారులతో ప్రధానంగా అభివృద్ధిపై చర్చించారు. ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాల తరలింపుతో తన కల నేరవేరిందంటూ స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాకు చేయాల్సిందంతా చేశామని.. ఇక చేయాల్సింది ఏమీ లేదని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్ కాలువలకు 300 రోజులు నీరు పారుతుండటం వల్ల రైతులు మూడు పంటలు పండించుకోవచ్చన్నారు. రేయింబవళ్లు పనిచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వేలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. వచ్చే జనవరి నాటికి పత్తికొండ, దేవనకొండ, మండలాల్లోని 65వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. డీలర్లు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశం ఎందుకిచ్చారు.. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి ప్రజాపంపిణీకి తూట్లు పొడిచిన డీలర్లు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత కనీసం మూడు వారాల సమయం వచ్చిందని.. ఆ లోపు వారిని అరెస్ట్ చేయకుండా జాప్యం చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు నోట్స్‌లో పెట్టాలని ఆదేశించారు. నివేదికలు ఇవ్వండి.. ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు తాజా అభివృద్ధిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన 27 అంశాలపై నివేదికలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు -
మార్చిలో ‘ముచ్చుమర్రి’ ప్రారంభోత్సవం
- ట్రయల్ రన్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మార్చిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం నుంచి ట్రయల్ రన్ ద్వారా కేసీ కాలువకు నీటి విడుదలను డిప్యూటీ సీఎంతోపాటు, ఎమ్మెల్యే వై. ఐజయ్య, కలెక్టర్ విజయమోహన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఎత్తిపోతల పథకంలో ఇప్పటికి రెండు పంప్‌లను పూర్తి చేసి ట్రయల్‌రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కేసీ కాలువకు నాలుగు పంప్‌ల ద్వారా నీరు ఇవ్వడం వల్ల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 5 వేల క్యూసెక్కులు నీరు అందించనున్నట్లు తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ సస్యశ్యామం చేయబోతుందని కలెక్టర్ విజయ్‌మోహన్ అన్నారు. సిద్దాపురం, పులికనుమ ప్రాజెక్ట్‌లను కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామని వెల్లడించారు. ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనా«థ్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ ఆశయం నెరవేరింది - ఎమ్మెల్యే ఐజయ్య ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయం నెరవేరిందని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య పేర్కొన్నారు. ఈ పథకం 2006లో పురుడు పోసుకుందని.. 2016 చివరికి ఒక కొలిక్కి రావడం రాయలసీమ ప్రజల అదృష్టమన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ చూపిన కృషిని మరువలేమన్నారు. ప్రస్తుతం రెండు పంప్‌లు ట్రయల్‌రన్‌కు సిద్ధంగా ఉన్నాయని.. మిగిలిన రెండు పంప్‌ల పనులను కూడా పూర్తి చేసి కేసీకాలుకు 4 పంప్‌ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మల్యాల నుంచి కేసీ కాలువలోకి రెండు పంప్‌ల ద్వారా నీటి విడుదల యథాతథంగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేశామని ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించానని.. ఎట్టకేలకు ట్రయల్‌రన్ సక్సెస్ కావడంతో పగిడ్యాల, పాములపాడు, జూపాడుబంగ్లా మండలాలతో పాటు గడివేముల మండలంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వై. ఐజయ్య, కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్, టీడీపీ నియోజకర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. -
రెండో రోజు కొనసాగిన ట్రయల్‌రన్
- సక్సెస్ కావడంతో అధికారుల్లో సంతోషం పగిడ్యాల: జీఓ నంబరు 3కు ప్రత్యామ్నాయంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నికర జలాలను వినియోగించుకునేందుకు ముచ్చుమర్రి వద్ద రూ. 75 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్ రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3, 4 మోటార్లను రన్ చేసి కృష్ణా జలాలను కేసీ కాలువలోకి రప్పించారు. నవంబర్ 30న నిర్వహించాల్సిన ట్రయల్‌రన్ మోటార్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. ఆ లోపాన్ని గుర్తించేందుకు కాంట్రాక్టర్లు దాదాపు పదిహేను రోజులుగా శ్రమించారు. మోటార్లను సరఫరా చేసిన బీహెచ్ఎల్ కంపెనీకి చెందిన టెక్నికల్ ఇంజనీర్లు రోటర్‌లో ఉండే త్రైస్టర్ వైర్ పనిచేయడం లేదని గుర్తించి భోపాల్ నుంచి తెప్పించి అమర్చడంతోనే ట్రయల్‌రన్ సక్సెస్ అయినట్లు ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. అయితే బుధవారం ఎమ్మెల్యే వై. ఐజయ్య పనులు పరిశీలించి వెళ్లడం కొంత వరకు మేలు జరిగిందని సైట్ మేనేజర్ రాముడు తెలిపారు. ట్రయల్‌రన్ నిర్వహణ కోసం అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి బాగా ఒత్తిడికి లోనయ్యామని వరుసగా 3, 4 మోటార్లు పనిచేయడం ఆనందంగా ఉందని అధికారులు, సాంకేతిక సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి, ఏఈలు, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ముచ్చుమర్రి’ని పూర్తి చేయాలి
– వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు ప్రాణప్రదమైన ముచ్చుమర్రి ఎత్తిపోతలపై పాలకులు ప్రసంగాలు చేయడం మినహా ఆచరణలోకి తేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సీమ రైతాంగానికి వెన్నెముకలాంటిదని అభివర్ణించారు. చిత్తశుద్ధితో ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేస్తే కర్నూలు, కడప జిల్లాల లక్షా డెభ్బైఐదు వేల ఎకరాలు (స్థిరీకరించిన ఆయకట్టు) సస్యశ్యామలం అవుతుందన్నారు. -
నవంబర్‌లో ముచ్చుమర్రి నుంచి నీరు విడుదల
-సీఈ జలంధర్ పాతముచ్చుమర్రి (పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకెనాల్‌కు నవంబర్ నెల 15వ తేదీ నుంచి నీరు విడుదల చేస్తామని జలవనరుల శాఖ సీఈ జలంధర్ తెలిపారు. శుక్రవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనుల పురోభివృద్ధిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాత్కాలిక సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన వెంటనే కేసీ కాలువకు, హంద్రీనీవా కాలువకు ఏకకాలంలో నీటి విడుదల చేస్తామన్నారు. కేసీ కాలువకు అనుసంధానం ఉన్న నాలుగు పంప్‌ల పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. హంద్రీనీవా çసుజల స్రవంతి కాలువకు సంబంధించి 8 పంపుల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మరో నాలుగు పంపులు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయినందున పనులు చేపట్టలేకపోయామన్నారు. కేసీ ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి అప్రోచ్ చానెల్‌కు లైనింగ్ పనులు చేసేందుకు రూ. 1300 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కార్యక్రమంలో సీఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈ ఆదిశేషారెడ్డి, ఏఈలు సాంబశివుడు, కిశోర్ తదితరులు ఉన్నారు. -
సా..గుతున్న ‘ముచ్చుమర్రి ’
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంత్రులు, జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు జరుగుతున్న పనులకు చాలా వ్యత్యాసం ఉంది. నవంబర్‌లో మూడు పంపులతో ట్రయల్‌రన్, డిసెంబర్లో ప్రాజెక్టును జాతికి అంకితం ప్రకటన గడువులోపు నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంపుల అమరిక, అప్రోచ్ చానల్ కాలువ పనులు కూడా పూర్తికాలేదు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నికర జలాలను వినియోగంలోకి తీసుకోరావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అకాల మరణంతో పనులు ముందుకు సాగడం లేదు. 16 పంప్‌ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎత్తిపోతల పనులో్ల ప్రస్తుతం 8 పంప్‌లకు సంబంధించిన అర్త్ వర్క్ పనులు తుది దశకు చేరుకోగా మరో నాలుగు పంప్‌ల పనులు అసంపూర్తిగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్ట్ పనుల పురోభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గత ఆగష్టు 15 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అధికారిక ప్రకటన చేశారు. తర్వాత జిల్లా కలెక్టర్ గత నెలలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను పరిశీలించి నవంబర్ పదిహేను నాటికి కేసీ కాలువకు మూడు పంపుల ద్వారా ట్రయల్‌రన్ నిర్వహిస్తామని డెడ్‌లైన్ విధించారు. అంతేకాదు హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు డిసెంబర్ పదిహేను నాటికి 8 పంప్‌లతో నీటిని సరఫరా చేసి ప్రాజెక్ట్‌ను జాతీకి అంకితమివ్వాలని కాంట్రాక్టర్లకు, పర్యవేక్షక నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే ప్రాజెకు్ట పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలంటే మరో ఏడాదికి పైగా పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల్లో కనిపించని పురోగతి ముచ్చుమర్రి పంప్‌హౌస్ నుంచి సిద్ధేశ్వరం వరకు 6 కిలో మీటర్ల పొడువు ఉండే అప్రోచ్ చానెల్ కాలువ పనులు పూర్తి కాలేదు. 2 కిలోమీటర్ల పనులు బ్యాక్‌వాటర్‌లో మిగిలిపోయాయి. ప్రస్తుతం పంప్‌హౌస్ వద్ద పంప్‌ల అమరిక పనులు, 220/33 కేవీ సబ్స్టేషేన్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. నవంబర్‌లో కేసీ కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు కనీసం నాలుగు పంప్‌ల అమరిక కూడా పూర్తి కాలేదు. మూడు పంప్‌లను కూర్చోబెట్టేందుకు అన్ని సిద్ధం చేశామని క్రేయిన్ ద్వారా పంప్‌లను దింపుతామని సైట్ మేనేజర్ కలెక్టర్‌కు భరోసా ఇచ్చారు. అయితే పని ప్రదేశంలో రెండు పంప్‌లకు సంబంధించిన పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇంకా మోటర్లు రాలేదని విశ్వసనీయ సమాచారం. తాత్కాలిక సబ్‌స్టేషన్ పనుల్లో నాణ్యత కరువు: కొణిదేల 11/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌస్ వరకు పంట పొలాల మధ్య స్తంభాల ఏర్పాటులో నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. స్తంభం నాటిన గుంతలో సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర బెడ్ వేయకుండా మట్టితోనే సరిపెడుతున్నారు. భవిష్యత్‌లో గాలివానకు ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కేసీకి నీరు కలే : శ్రీనివాసులు, సర్పంచ్, పాతముచ్చుమర్రి ఈ ఏడాది కేసీ ఆయకట్టు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. నవంబర్ పదిహేనుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంప్‌ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు దగ్గర చూస్తే పనులు ముందుకు సాగడం లేదు. మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. రైతులను మోసం చేస్తున్నారు: పుల్యాల నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు. పగిడ్యాల వచ్చేనెలలో కేసీ కాలువకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల కష్టమే. ఎందుకో మరి అధికారులు అసత్యప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి తుంగభద్ర నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం: రెడ్డిశేఖర్‌రెడ్డి, ఈఈ: కలెక్టర్ ఆదేశాలు మేరకు పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నాం. బిల్డింగ్ కట్టుకోవాలంటేనే దాదాపు ఏడాది కాలం పడుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఏడాదికే పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం. ఇంకా డెలివరీ పనులు జరగాలి, దేని సమస్యలు దానికి ఉన్నాయి. -
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటి విడుదలకు 220కేవీ లైన్
–17 కిలో మీటర్ల లైన్‌కు ప్రత్యేక బృందాలు కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి భూములకు నీళ్లు ఇచ్చేందుకు 220 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చర్యలు చేపట్టారు. నన్నూరు, పూడిచెర్ల, కేతవరం, గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు వరకు 17 కిలో మీటర్ల మేర హైటెన్షన్ లైన్ వేయాల్సి ఉంది. పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో పోల్‌కు 49 చదరపు గజాల స్థలం అవసరమవుతుంది. రైతులను ఒప్పించి భుములను తీసుకునేందుకు కలెక్టర్ తహశీల్దారు, మండల వ్యవసాయాధికారితో బృందాలను ఏర్పాటు చేశారు. పోల్‌కు అవసరమైన 49 చదరపు గజాల స్థలానికి పరిహారం కూడా ఇస్తారు. విద్యుత్ లైన్ వేసిన తర్వాత ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. -
ముచ్చుమర్రి నుంచి రబీకి నీరు
నందికొట్కూరు: కేసీ కెనాల్‌కు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పైపుల ద్వారా రబీకి సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15వ తేదీలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు మూడు పంపుల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యలు ఉన్నా రైతులతో చర్చించి పరిష్కరించామన్నరు. డిసెంబర్ లోపు విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కేసీకి అందించేందుకు రెండు పైపులైన్ల పనులు పూర్తి చేసి ట్రై యిల్రన్ చేసినట్లు తెలిపారు. మరో రెండు పైపులైన్ల పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయని.. 20 రోజులలోపు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. సిద్ధాపురం, గురురాఘవేంద్ర, పులికనుమ పనులు డిసెంబర్‌లోపు పూర్తి చేసి రబీకి సాగునీరు ఇవ్వనునట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీ ఆయకట్టు పంటలను కాపాడండి
– ముచ్చమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయాలి – కలెక్టర్‌ను కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే – సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ రైతు విభాగం ప్రతినిధులు, రైతులతో వచ్చి కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. కేసి కెనాల్‌కు నీటి విడుదలపై చర్చించారు. కేసీ కెనాల్ కింద 75 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, నీరివ్వకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 2016 జూలై 30 నాటికే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే పనులు ఇప్పటికి పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన 2.5 టీఎంసీల నీరుSనెలకు కూడా సరిపోదన్నారు. గత ఏడాది కూడా నీరు విడుదల చేయకపోవడంతో పూర్తిగా నష్టపోయామని, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...15 రోజుల్లో మల్యాల లిప్ట్ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రెండు పైపులు మంజూరు చేస్తామని, వాటిని 15రోజుల్లోగా అమర్చి నీటిని విడుదల చేస్తామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం పట్ల ఎమ్మెల్యే సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
వద్దనుకున్నవే భక్తులకు చేరువ!
– మొత్తం పుష్కర స్నానం చేసింది: 14,85,608 – సగటున రోజుకు పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య: 1,23,800 – అత్యధిక భక్తులు పుష్కర స్నానం చేసిన ఘాట్, సంఖ్య : నెహ్రూ నగర్(3,29,369) – పుష్కర స్నానాలు అధికంగా చేసిన రోజు: 21వ తేదీ (2,83,583) – పిండ ప్రదానాలు చేసిన వారి సంఖ్య: 23 వేలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్కడ పుష్కర ఘాట్లు వద్దనుకున్నారు. మొదట్లో ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం నిర్మాణానికి వెనుకడుగు వేసింది. అయినప్పటికీ పుష్కర భక్తులు అక్కడికే మక్కువ చూపారు. జిల్లాలో నిర్వహించిన కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వం నిర్మించిన ఘాట్ల కంటే ప్రై వేటు ఘాట్ల వైపే ప్రజలు అధిక సంఖ్యలో అడుగులేశారు. ప్రజలకు చేరువలో ఉండటం.. స్నానం చేసేందుకు కూడా అనువుగా ఉండటంతో సామాన్య భక్తులంతా ముచ్చుమర్రి, నెహ్రూనగర్‌లోనే పుణ్యస్నానం చేసేందుకు ఆసక్తి కనపర్చారు. మొత్తం 12 రోజుల పుష్కర భక్తుల తాకిడి లెక్కలను పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం ఇదే. మరోవైపు లింగాలగట్టులోని ఎగువ ఘాట్‌కు భక్తుల తాకిడి ఏమాత్రం లేకపోవడంతో ఆ ఘాటు కాస్తా వెలవెలబోయింది. ఇదే సమయంలో దిగువ ఘాట్ భక్తులతో కళకళలాడింది. మొత్తం మీద కృష్ణా పుష్కరాల్లో జిల్లావ్యాప్తంగా 14,85,608 మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. 144 సెక్షన్ విధించినా... ముచ్చుమర్రిలో సొంత నిధులతో పుష్కర స్నానానికి రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వం 144 సెక్షన్ విధించి పుష్కరస్నానాలు జరగనివ్వబోమని బీష్మించింది. మరోవైపు నెహ్రూనగర్‌లో ఘాటును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఘాటు ఏర్పాటుపై ప్రతిపాదనలను కాస్తా చివరివరకు జలవనరుల శాఖ పంపలేదు. చివర్లో పంపినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన ఘాట్లకే భక్తులు పోటెత్తారు. ఇక్కడ మొత్తం 5,47,243 మంది భక్తులు స్నానం ఆచరించారు. ఘాట్ల వారీగా పుష్కర స్నానాలు(12 రోజుల్లో) లింగాలగట్టు : 3,17,427 పాతాళగంగ : 3,28,558 సంగమేశ్వరం : 2,94,837 నెహ్రూనగర్ : 3,29,369 ముచ్చుమర్రి : 2,17,874 మొత్తం : 14,85,608 -
‘ముచ్చుమర్రి’పై చిత్తశుద్ధి ఏదీ
నెహ్రూనగర్(పగిడ్యాల): శ్రీశైలం బ్యాక్‌వాటర్ నికర జలాలను వినియోగించుకోవడానికి జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరిధిలోని నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానాలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణానది బ్యాక్‌వాటర్‌కు అతి సమీపంలో ఉండే నెహ్రూనగర్‌లో పుష్కర ఘాట్‌ను మంజూరు చేయకుండా కలెక్టర్ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. దీంతో నాయకులే సొంత ఖర్చులతో ఘాట్‌ను నిర్మించుకుని భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం వలన వేలాది మంది భక్తులకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. సీఎం చంద్రబాబు పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాయలసీమ ప్రాంతంలోని వందలాది గ్రామాల రైతులు తమ స్థిరచరాస్తులను త్యాగాలు చేసిన సంగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరువడం విచారకరమన్నారు. కేవలం కోస్తా ప్రాంత ప్రజల అభివద్ధి కోసమే పాటుపడుతూ రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహాం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం కోస్తా ప్రాంతానికే శ్రీశైలం జలాలను తరలించడంలోని ఆంతర్యమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. -
పుష్కర భక్తులను అడ్డుకోవడం సిగ్గుచేటు
– అధికారపార్టీ నేతల తీరుపై ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బైరెడ్డి ఆగ్రహం – అధికారులు నిజాయితీగా పనిచేయాలని హితవు పాతముచ్చుమర్రి(పగిడ్యాల): పాతముచ్చుమర్రిలోని రాయలసీమ కృష్ణా పుష్కర ఘాట్‌కు తరలి వచ్చే భక్తులను అధికారుల సహాయంతో అధికారపార్టీ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. సోమవారం రాయలసీమ పుష్కర ఘాట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘాట్‌కు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించానన్నారు. దీంతో రోజురోజకు పాతముచ్చుమర్రి పుష్కరఘాట్‌కు భక్తుల సంఖ్య పెరుగుతుందని, దీన్ని ఓర్వలేక కొందరు కొణిదేల క్రాస్ రోడ్డు వద్ద దారికాచి ముచ్చుమర్రికి వద్దు నెహ్రూనగర్ ఘాట్‌కు వెళ్లాలని చెప్పడం విచారకరమన్నారు. ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకుంటూ అధికారపార్టీ నాయకుల కొమ్ముకాయవద్దని హితవు పలికారు. భక్తితో వచ్చే భక్తులకు కుళ్లు రాజకీయ ఎత్తుగడలతో మలినం చేయవద్దన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపై ప్రభుత్వానికి తప్పుడు సమాచారం పంపడం, వాట్సాప్ ద్వారా సీఎంకు ఫోటోలు పంపడం ఎవ్వరి మెప్పు కోసమని ప్రశ్నించారు. అంతరాత్మను చంపుకుని పనిచేయవద్దని, ప్రజల అభిమానాన్ని చురగొనాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, సర్పంచ్ శ్రీనివాసులు, సింగిల్‌విండో డైరక్టర్ వెంకటరామిరెడ్డి, ఆర్పీఎస్ నాయకులు కాటం చక్రధర్‌రెడ్డి, నాయుడు, కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చుమర్రిలో 144 సెక్షన్ ఎత్తివేత
– రాయలసీమ పుష్కర ఘాట్‌కు అధికారుల నియామకం పగిడ్యాల: మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామంలో 144 సెక్షన్‌ను ఎత్తివేశారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన రాయలసీమ పుష్కర ఘాట్‌కు 13 మంది అధికారులను నియమించినట్లు కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని నందికొట్కూరు సీఐ శ్రీనాద్‌రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. పాతముచ్చుమర్రిలో పుష్కర ఘాట్ పనులను నిలిపివేయాలని.. గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఈనెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆర్డీవో రఘుబాబు ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో అధికారులు 144 సెక్షన్‌ను తొలగించారు. అంతేకాకుండా ఘాట్ వద్ద అధికారులను నియమించారు. -
ముచ్చుమర్రి వద్దు.. నెహ్రూనగర్ ముద్దు!
అధికార పార్టీ నేతలు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనేందుకు మరో ఉదాహరణ ఇది. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి వద్ద రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సొంత ఖర్చుతో పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తుంటే అధికార యంత్రాంగం ఒంటి కాలిపై లేచింది. 144 సెక్షన్ అంటూ కట్టడి చేసింది. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ పనులను నిలిపివేయించింది. ఇదే నియోజకవర్గంలో.. అదే ప్రాంతానికి సమీపంలో.. అధికార పార్టీ నేత అదే పనికి సిద్ధమయితే.. ఇదే అధికారులు దగ్గరుండి బందోబస్తు కల్పించారు. టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి నెహ్రూనగర్ సమీపంలోని గోకరాజు కుంట వద్ద తాత్కాలిక పుష్కరఘాట్ ఏర్పాటుకు సిద్ధపడగా.. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు బందోబస్తును పర్యవేక్షించడం.. అధికారులు కూడా కిక్కురుమనకపోవడం గమనార్హం. పగిడ్యాల: మండలంలోని నెహ్రూనగర్ గ్రామ సమీపంలోని గోకరాజుకుంట వద్ద తాత్కాలిక పుష్కర ఘాట్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాండ్ర శివానందరెడ్డి సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గ్రామానికి చేరుకుని స్థానిక నాయకులతో చర్చించారు. అదేవిధంగా రోజూ 5వేల మందికి భోజనాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మరో మూడు రోజుల్లో కష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న వేళ మా్రండ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో సంగమేశ్వరం, శ్రీశైలం వద్ద పుష్కర ఘాట్లను అధికారికంగా నిర్మించినప్పటికీ అధికార పార్టీకే చెందిన నేత సొంత ఘాట్ నిర్మాణానికి సిద్ధపడటం గమనార్హం. ఇకపోతే ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పుష్కరాల నిర్వహణ పేరిట ముచ్చుమర్రిలో సొంత ఖర్చుతో ఘాట్ నిర్మాణానికి సిద్ధపడగా.. చివరి నిముషంలో అధికారులతో పాటు పోలీసులు అడ్డుపడ్డారు. చివరకు 144 సెక్షన్ విధించి పనులను నిలిపివేయించారు. అయితే ఇదే నియోజకవర్గంలో అధికార పార్టీ నేత సొంతంగా పుష్కర ఘాట్ నిర్మించేందుకు సిద్ధపడగా అధికారులు నోరు తెరవకపోగా.. పోలీసులు కూడా ఆయనకు బందోబస్తు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. -
అక్కడేమైనా ఫ్యాక్షన్ గొడవలున్నాయా?
– ముచ్చుమర్రిలో 144 సెక్షన్ విధింపుపై బైరెడ్డి ప్రశ్న – పుష్కర నిధుల్లో 90శాతం.. నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణ జూపాడుబంగ్లా: కృష్ణాపుష్కరాలకు సంబంధించి చేపడుతున్న పనులు పూర్తిగా అవినీతి మయమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాలయ నిధులు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా 90శాతం నేతల జేబుల్లోకి వెళ్తుండగా పదిశాతం మాత్రమే పనులకు వెచ్చిస్తున్నారని విమర్శించారు. జూపాడుబంగ్లా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాపుష్కరాలకోసం కేటాయించిన నిధుల్లో అత్యధికం కోస్తాంధ్రకే విడుదల చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో కేవలం కంటి తుడుపు చర్యగా నిధులు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. పనులు నాసీరకంగా చేపట్టడంతో నిర్మించిన వారం రోజులకే కృష్ణార్పణమయ్యాయన్నారు. పుష్కరఘాట్ల నిర్మాణంలో ముందుచూపు లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం, కలెక్టర్ ఇంటి నుంచి తెచ్చినవైతే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. 144 సెక్షన్ ఎందుకు.. ముచ్చుమర్రిలో పుష్కరఘాట్ వద్ద 144 సెక్షన్ విధించడంపై బైరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఏమైనా మతపరమైన గొడవలు ¯ð లకొన్నాయా, ఫ్యాక్షన్ తగాదాలు ఏర్పడ్డాయా అని ప్రశ్నించారు. అలాంటివేమీ లేనప్పుడు 144 సెక్షన్ ఎందుకు విధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆచార వ్యవహారాల జోలికి వస్తే సీఎం చంద్రబాబుకు తగినగుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముచ్చుమర్రి గ్రామంలో ఎవరికి ఏమిజరిగినా అందుకు బాబే బాధ్యుడన్నారు. ఎవ్వరడ్డుకున్నా ఈనెల 12న వెయ్యిమంది ముత్తయిదువులతో గ్రామంలో విగ్రహ ఊరేగింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైఫూద్దీన్, రషీద్మియ్య, ఉసేనయ్య, శ్రీనివాసరెడ్డి, బాలనారాయణ, చెక్కరసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చుమర్రిలో 25వ తేదీ వరకు 144 సెక్షన్
పగిడ్యాల: మండల పరిధిలోని పాతముచ్చుమర్రి గ్రామ శివారులో రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న రాయలసీమ పుష్కర ఘాట్లు వివాదస్పదమయ్యాయి. ఈ పనులను జిల్లా కలెక్టర్ నిలుపుదల చేయాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో రఘుబాబు గ్రామంలో 144వ సెక్షన్ విధిస్తున్నట్లు బుధవారం దండోరా వేయించారు. ఈనెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకూదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించుకుంటున్న పుష్కర ఘాట్ పనులకు అధికారులు అభ్యంతరాలు చెప్పడం వల్ల.. గ్రామస్తులు ప్రభుత్వంపై, జిల్లా కలెక్టర్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లడిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ కుమారస్వామిని ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. -
ఇచ్చినమాట నిలబెట్టుకోండి
– ఆగస్టులోగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తిచేయండి – డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కోరిన ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఆగష్టులోగా పూర్తి చేసి కేసీ కాలువ కింద రెండో పంటకు నీరు విడుదల చేయించి జాతీకి అంకితం చేస్తామన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో భవన సముదాయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈసందర్భంగా నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ముచ్చుమర్రి వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు 30 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగష్టులోగా పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని రైతులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారే తప్పా.. పనుల్లో పురోభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. రాయలసీమ రైతుల అభివృద్ధిని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ, అమరావతి అంటారే తప్పా.. పెండింగ్‌లో ఉండే సిద్ధాపురం, జూపాడుబంగ్లా, సెలిమిల్ల, లింగాల ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ రైతులకు 80 టీఎంసీల నీరు లభిస్తుందని, దీంతో సీమ సస్యశ్యామలంగా మారుతుందని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రమాదేవి, నాయకులు చిట్టిరెడ్డి, డీలర్ నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.