‘ముచ్చుమర్రి’ పరిశీలన
పగిడ్యాల (నందికొట్కూరు): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రి డిశ్చార్జ్ మీటర్లను అమర్చుతున్నట్లు కృష్ణా వాటర్ బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్ నాగపురి పేర్కొన్నారు. బుధవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. పంప్‌ల సామర్థ్యాలను జలవనరుల శాఖ ఎస్‌ఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోర్డు కమిటీ మెంబర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఏ. బాలన్, డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, కేసీ కాలువ నీటిపారుదల శాఖ ఈఈ మల్లికార్జున, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి పాల్గొన్నారు.