ముచ్చుమర్రి ఘనత వైఎస్‌ఆర్‌దే
ముచ్చుమర్రి ఘనత వైఎస్‌ఆర్‌దే
Published Tue, Jan 3 2017 11:16 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
- ఈ విషయం చెబితే బాబు జీర్ణించుకోలేకపోతున్నారు
- ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు
– జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి
– జేసీకి ప్రతిపక్ష నేతను గౌరవించే సంస్కారం తెలియదు
– విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధ్వజం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు. ఈ విషయం మరచి టీడీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎంత మభ్య పెట్టినా జిల్లా ప్రజలు నమ్మరని చెప్పారు. జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని అధికారపార్టీకి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతను గౌరవించే కనీస సంస్కారం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలులు గౌరుచరితారెడ్డి, ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధానా కార్యదర్శి బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు.
మాట్లాడే హక్కును కాలరాస్తున్నారు
ప్రతిపక్షపార్టీ ప్రతినిధుల మాట్లాడే హక్కును చంద్రబాబు కాలరాస్తునా్నరని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. తడకనపల్లిలో నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫలన విషయాలే మాట్లాడాలని తనను కట్టడి చేశారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మైక్ కట్ చేయడం విచారకరమని, ఇది దళితులను అవమానించడమే అవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనప్పుడు జిల్లాకు సంబంధం లేని జేసీ దివాకర్‌రెడ్డితో ఎలా మాట్లాడిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని వాడు–వీడని జేసీ సంభోదించడం తగదన్నారు. జిల్లాలో 14 సీట్లు గెలవాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక దాగి ఉన్న ఆయన స్వార్థాన్ని తెలియజేస్తుందన్నారు. ముచ్చుమర్రి పథకంతో 300 రోజులు నీళ్లొస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిజాలు బయట పడతాయని: ఐజయ్య, నందికొట్కూరు శాసన సభ్యుడు
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పునాది వేసిన వైఎస్‌ఆర్ పేరున ఉచ్ఛరిస్తే సీఎం జీర్ణించుకోలేకపోయారని, అందుకే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని నందికొట్కూరు ఎమె్మల్యే ఐజయ్య అన్నారు. రాయలసీమలో వ్యవసాయ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణులతో చర్చించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు. నాలుగు పంపులతో పనిచేయాల్సిన ఈ పథకాన్ని రెండు పంపులతోనే ప్రారంభించడం చంద్రబాబు తొందరపాటు చర్య అని అభివరి్ణంచారు. జిల్లాపై ప్రేమ ఉంటే లింగాల, ఇస్కాల వంటి తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూరి్త చేయాలని కోరారు.
ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన జేసీకి ఆ మాత్రం తెలియదా..
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా అనంతపురం ఎమ్మెల్యే దివాకర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వడం న్యాయమా అని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆరుసార్లు, ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయిన దివాకర్‌రెడ్డి సంస్కారం మరచి ప్రతిపక్ష నేతను వాడువీడు అని సంభోదించడం తగదన్నారు. తక్షణమే తమ పార్టీ అధినేతకు క్షమాపణ చెపా్పలని డిమాండ్ చేశారు. అలాగే నోటిదురుసును కూడా తగ్గించుకోవాలని జేసీకి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రైతు విభాగం, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి, పార్టీ నాయకులు చంద్రమౌళి, రవికుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement