నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.
నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు.
ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన.
మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు.
వాళ్లను అలా వదిలేయొద్దు
‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’
:::బాలిక తల్లిదండ్రులు
ఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ?
Comments
Please login to add a commentAdd a comment