
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment