అత్తారింటికి ఆర్టీసీ బస్సు.. నంద్యాలలో సూపర్‌ ట్విస్ట్‌ | Andhra Pradesh Nandyal Man Take Away RTC Bus Over Irritation | Sakshi
Sakshi News home page

అత్తారింటికి ఆర్టీసీ బస్సు.. నంద్యాలలో సూపర్‌ ట్విస్ట్‌

Published Sat, Jul 27 2024 11:03 AM | Last Updated on Sat, Jul 27 2024 12:25 PM

Andhra Pradesh Nandyal Man Take Away RTC Bus Over Irritation

నంద్యాల, సాక్షి: సంచలన ఉదంతంతో ఈ మధ్య పేపర్‌లలో పతాక శీర్షికల్లో కనిపించిన ముచ్చుమర్రి గ్రామం.. ఈసారి చిత్రమైన ఘటనతో వార్తల్లోకి ఎక్కింది. అత్తారింటికి దర్జాగా ఆర్టీసీ బస్సు వేసుకెళ్లిన అల్లుడు.. తన అవసరం తీరాక ఆ బస్సును నేరుగా పోలీసులకే అప్పగించాడు.  

వెంటాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య.. ముచ్చుమర్రిలోని తన అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆత్మకూరులో బస్సు కోసం ఎంతసేపు ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో విసుగుచెందిన అతను పక్కనే పెట్రోల​ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేసుకుని వెళ్లిపోయాడు. అయితే గ్రామస్తులు.. బంధువులు వారించడంతో కేసు అవుతుందని భయపడ్డాడో ఏమో.. అక్కడి నుంచి బస్సును పీఎస్‌కు తీసుకెళ్లాడు. 

తాను ఏ పరిస్థితుల్లో బస్సును తీసుకుని రావాల్సి వచ్చిందో పోలీసులకు వివరించాడు. అది ఆర్టీసీ హైక్‌ చేసుకున్న ప్రైవేట్‌ బస్సు కావడం, బస్సు పోయిందని ఫిర్యాదు ఏమీ రాకపోవడంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. దుర్గయ్యను మందలించి.. బస్సును ఆత్మకూరు డిపోకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement