సాక్షి, నంద్యాల జిల్లా: ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు.
బాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదు: విరూపాక్షి
ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మహిళలపై అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు. ముచ్చుమర్రి బాలిక ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ విరుపాక్షి ప్రశ్నించారు.
హోంమంత్రికి ఈ ఘటనలు కనబడవా?: ఇషాక్ బాషా
ముచ్చుమర్రి బాలిక లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని.. నాలుగు నెలలు గడిచిన ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు బెయిల్ వచ్చింది. రాష్ట్ర హోంమంత్రికి ఈ ఘటనలు కనబడుతున్నాయా?. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని ఇషాక్ బాషా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment