Minor girl gangraped
-
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
మైనర్‌పై అఘాయిత్యం.. బైక్‌తో సహా సజీవ దహనం చేసిన గ్రామస్తులు
తెలిసిన వ్యక్తే కదా! అని నమ్మి కూతురిని కూడా పంపించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ కీచకుడు.. మరోకరితో కలిసి దాష్టికానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి ఊరు ఊరంతా రగిలిపోయింది. నిందితులకు ‘చావే సరైన శిక్ష’ అనుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇంటి దగ్గర దిగబెడతాం అంటూ మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని.. సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్, గుమ్లాలో జరిగింది. బుధవారం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం.. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆ కుటుంబం పక్క ఊరిలో ఉండే సునీల్ ఉన్‌రావ్ అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. అతని కూడా బైక్ మీద స్నేహితుడు కూడా ఉన్నాడు. బాగా ఆలస్యం అయ్యేట్లు ఉందని, కనీసం అమ్మాయినైనా తమతో పంపించమని అడిగాడు. బాగా దగ్గరి వాడే కదా నమ్మి కూతురిని అని బైక్ మీద పంపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆ తల్లిదండ్రులు ఇంటికి చేరినా.. ఎంతసేపటికి కూతురు మాత్రం రాలేదు. దీంతో సునీల్‌కు ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గాలించారు. ఈలోపు పక్క ఊరి శివారులో ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారం వీళ్లకు అందింది. వెళ్లి చూస్తే.. అది వాళ్ల కూతురే. తనపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది బాధితురాలు. విషయం తెలిసి బాధితురాలి గ్రామస్తులు చిర్రెత్తి పోయారు. పొరుగూరికి వెళ్లి మరీ నిందితులను దొరకబుచ్చుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ తమ ఊరికి లాక్కొచ్చారు. వాళ్ల బైక్‌తో సహా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేసు బుక్ చేసుకున్న పోలీసులు.. ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు. -
అమ్నీషియా పబ్ కేసు: ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ బాలికను కారులో తీసుకెళ్లిన నిందితులు
-
దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం
భోపాల్: భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. వివరాల ప్రకారం.. భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికపై తన మూడేళ్ల తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురిఅయింది. అయితే, అమ్మాయి ప్రవర్తనలో చాలా రోజుల నుంచి మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అను భవిస్తున్న బాధ గురించి చెప్పింది. సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని అక్కడ అప్పటికే ఆమె తాత ఉన్నాడని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు. ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయినట్లు కోలార్ పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ మేనేజర్! -
పూణేలో ఘోరం : లైంగిక దాడితో బాలిక బలి
పూణే : మహారాష్ట్రలో దారుణం చోటుచేసకుంది. మూడు రోజుల కిందట మరో మైనర్ బాలికతో కలిసి ఇద్దరు కామాంధుల చేతిలో లైంగిక దాడికి గురైన 12 ఏళ్ల బాలిక గురువారం పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హింజెవాది ప్రాంతంలో ఆదివారం సామూహిక లైంగిక దాడి ఘఢన జరగ్గా బాధితురాళ్లను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికల్లో కోమాలోకి వెళ్లిన ఓ బాలిక బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల యువకుడితో పాటు ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బాలికలు ఆదివారం దేవాలయానికి వెళ్లగా నిందితులు వారికి చాక్లెట్లు ఇస్తామని చెప్పి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితులు బాలికలను హెచ్చరించారని చెప్పారు. ఇంటికి వెళ్లిన అనంతరం ఓ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించిన మీదట లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. మరో బాలికను విచారించగా మొత్తం ఘటన బయటపడిందని, నిందితులపై పోస్కో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాలిక మరణంతో నిందితులపై హత్యానేరం అభియోగాలు కూడా చేర్చామని చెప్పారు. -
మైనర్ బాలికపై కీచకపర్వం
ఛప్రా: బిహార్‌లోని సరన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై స్కూల్లోని 16 మంది విద్యార్థులతో పాటు పిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాల్ని బెదిరించిన నీచులు 7 నెలల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు తండ్రి సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్సాగఢ్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాధితురాలి(13)పై ముగ్గురు తోటి విద్యార్థులు గతేడాది డిసెంబర్లో వాష్‌రూమ్‌లో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్లో ఉంచుతామని హెచ్చరించారు. ఇలా బెదిరించి బాధితురాలిని పలుమార్లు రేప్‌చేసి ఈ వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో 16 మంది విద్యార్థులు బాలికను రేప్‌చేశారు. చివరికి బాధితురాలు ఈ దారుణంపై పాఠశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా.. ‘నీ కుటుంబం పరువే పోతుంది’ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపాడు. అతనూ బెదిరించి, మరో ఇద్దరు టీచర్లతో కలసి బాధితురాలిని లోబర్చుకుని ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 7 నెలలుగా తండ్రి జైలులో ఉండటంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయిన బాధితురాలు.. ఇటీవల తండ్రి విడుదల కావడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేశారు. ప్రిన్సిపల్, టీచర్, నలుగురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి విద్యార్థుల్ని రిమాండ్ హోమ్‌కు, ప్రిన్సిపల్, టీచర్‌ను జైలుకు పంపారు. -
ఉరే సరి అని తేల్చినా..
సాక్షి, భోపాల్: మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దెవాల్ గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే 15 ఏళ్ల బాలికపై ఆమె నివాసంలో ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఆమెకు నిప్పుంటించి పరారయ్యారు. బాధితురాలిని కాపాడిన ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. బాధితురాలి శరీరానికి 80 శాతంపైగా కాలిన గాయాలయ్యాయని తెలిపారు. బాధితురాలిపై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర సేన్, శుభనం యాదవ్‌లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించిన నిందితులు గురువారం రాత్రి ఆమె నివాసంలోకి చొరబడి ఘాతుకానికి తెగబడ్డారని చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బాలికను నిర్బంధించి వారం రోజులు దాష్టీకం
బనశంకరి: ఉద్యాననగరి బెంగళూరులో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకమవుతూనే ఉంది. తోడేళ్ల మాదిరిగా మృగాళ్లు కాటేస్తున్నారు. మాయమాటలతో మభ్యపెట్టి అఘాయిత్యాలకు తెగబడడం అతివలను ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని కాడుగోడిలో 17 ఏళ్ల పీయూసీ విద్యార్థినిని రాఘవేంద్ర అనే టీ అంగడి వ్యాపారి లాడ్జిలో నిర్బంధించి వారంరోజులుగా మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. గత నెల 28వ తేదీన బాధిత బాలిక స్నేహితురాలితో పార్టీ ఉందని స్నేహితుడు రాఘవేంద్రకు తెలిసింది. పార్టీ కోసం రాత్రి 8 గంటలకు కాడుగోడికి చేరుకున్న బాలికను రాఘవేంద్ర, అతని స్నేహితుడు సాగర్ ఇద్దరూ కలిసి పార్టీ నిర్వహించే స్థలానికి తీసుకెళతామని నమ్మించారు. లాడ్జిలో దారుణం అనంతరం బాలికను సమీపంలోని క్లాసిక్ లాడ్జికి తీసుకెళ్లి అక్కడ రూమ్ నెంబరు 6లో ఉం డాలని, మీ స్నేహితురాలు ఇక్కడికే వస్తుందని తెలిపారు. కొంతసేపటికి బాలిక ఉన్న గదికి రాఘవేంద్ర, సాగర్ చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం గమనిస్తున్న లాడ్జి నిర్వాహకుడు మనోరాజన్ పండిత్ అనుమానం వచ్చి రాఘవేంద్ర, సాగర్‌ను విచారించాడు. ఈ సంగతిని పోలీసులకు చెప్పవద్దంటూ ఇద్దరూ అతనిడి బ్రతిమాలగా, తరువాత ముగ్గురూ కలిసి బాలికపై మళ్లీ లైంగిక దాడికి ఒడిగట్టారు. రాఘవేంద్ర మిత్రుడు మంజు కూడా అఘాయిత్యం చేశాడు. చివరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 6వ తేదీన బాలికను రక్షించి విచారించారు. మంగళవారం రాత్రి దుండగులను అరెస్టు చేశారు. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
జింద్ జిల్లాలోని కుర్ద్ గ్రామంలో 15 ఏళ్ల బాలికపై నిన్న ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారని పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం జిల్లా కేంద్రమైన జింద్‌లో వెల్లడించారు. నిందితలు ముగ్గురు పవన్, నరేందర్, దల్షర్లులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే వారంతా పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. సామూహిక అత్యాచర ఘటన నిన్న చోటు చేసుకుందని చెప్పారు. బహిర్బుమికి వెళ్లిన ఆ బాలికను నిందితులు సమీపంలోని వ్యవసాయ భూమి వైపు బలవంతంగా తీసుకుని వెళ్లారని, అనంతరం ఆ బాలికపై అత్యాచారం జరిపారని పేర్కొన్నారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యాచారం గురైనట్లు వైద్యులు దృవీకరించారన్నారు. నిందితులపై కేసు నమెదు చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.