బాలికను నిర్బంధించి వారం రోజులు దాష్టీకం | Kidnapped, gang-raped by 4 men for 10 days at Bengaluru lodge | Sakshi
Sakshi News home page

బాలికను నిర్బంధించి వారం రోజులు దాష్టీకం

Published Thu, Nov 16 2017 8:45 AM | Last Updated on Thu, Nov 16 2017 11:29 AM

Kidnapped, gang-raped by 4 men for 10 days at Bengaluru lodge - Sakshi

బనశంకరి: ఉద్యాననగరి బెంగళూరులో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకమవుతూనే ఉంది. తోడేళ్ల మాదిరిగా మృగాళ్లు కాటేస్తున్నారు. మాయమాటలతో మభ్యపెట్టి అఘాయిత్యాలకు తెగబడడం అతివలను ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని కాడుగోడిలో 17 ఏళ్ల పీయూసీ విద్యార్థినిని రాఘవేంద్ర అనే టీ అంగడి వ్యాపారి లాడ్జిలో నిర్బంధించి వారంరోజులుగా మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు..

గత నెల 28వ తేదీన బాధిత బాలిక స్నేహితురాలితో పార్టీ ఉందని స్నేహితుడు రాఘవేంద్రకు తెలిసింది. పార్టీ కోసం రాత్రి 8 గంటలకు కాడుగోడికి చేరుకున్న బాలికను రాఘవేంద్ర, అతని స్నేహితుడు సాగర్‌ ఇద్దరూ కలిసి పార్టీ నిర్వహించే స్థలానికి తీసుకెళతామని నమ్మించారు.

లాడ్జిలో దారుణం
అనంతరం బాలికను సమీపంలోని క్లాసిక్‌ లాడ్జికి తీసుకెళ్లి అక్కడ రూమ్‌ నెంబరు 6లో ఉం డాలని, మీ స్నేహితురాలు ఇక్కడికే వస్తుందని తెలిపారు. కొంతసేపటికి బాలిక ఉన్న గదికి రాఘవేంద్ర, సాగర్‌ చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం గమనిస్తున్న లాడ్జి నిర్వాహకుడు మనోరాజన్‌ పండిత్‌ అనుమానం వచ్చి రాఘవేంద్ర, సాగర్‌ను విచారించాడు. ఈ సంగతిని పోలీసులకు చెప్పవద్దంటూ ఇద్దరూ అతనిడి బ్రతిమాలగా, తరువాత ముగ్గురూ కలిసి బాలికపై మళ్లీ లైంగిక దాడికి ఒడిగట్టారు. రాఘవేంద్ర మిత్రుడు మంజు కూడా అఘాయిత్యం చేశాడు. చివరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 6వ తేదీన బాలికను రక్షించి విచారించారు. మంగళవారం రాత్రి దుండగులను అరెస్టు చేశారు. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement