puc student
-
బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: దావణగెరెలో గతనెల 23న ఇంటిపైనుంచి పడి మృతి చెందిన పీయూసీ విద్యార్థి మిథున్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. అతను ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందలేదని, బ్లూవేల్ తరహాలో యానిమేషన్ గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ రిష్యంత్ బుధవారం మీడియాకు తెలిపారు. తన చావుకు తానే కారణమంటూ గణితం పుస్తకంలో స్వయంగా రాసి అనంతరం చేతికి గాయం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి అనంతరం ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థి చేతిరాతను తల్లిదండ్రులు నిర్ధారించారన్నారు. అయితే ఆ విద్యార్థి రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అధికారికంగా నిర్ధారణ చేస్తామన్నారు. చదవండి: ('ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది') -
ఘోరం: మృగాళ్లకు బాలిక బలి
రాయచూరు రూరల్: పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం కర్నాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా హుణిసిగిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హుణిసిగిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక (16) అదే పట్టణంలో పీయూసీ చదువుతోంది. కరోనా నేపథ్యంలో కళాశాలకు సెలవు కావడంతో ఇంటివద్దనే ఉంటోంది. ఈనెల 9వ తేదీ ఆదివారం ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బలవంతంగా పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. అయితే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకుని గాలింపు చేపట్టగా పట్టణ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కామాంధుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అదే పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (18) అరెస్ట్ చేశారు. అతడితోపాటు 16, 17 ఏళ్ల వయసున్న బాలురు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు సురపుర సీఐ శివయ్య హిరేమఠ్ తెలిపారు. చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక
సాక్షి, తుమకూరు: ద్వితీయ పీయూసీ చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో కుర్రవాడు నమ్మించి దగ్గరయ్యాడు. దీంతో బాలిక గర్భం దాల్చి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పసిప్రాయం బాలిక ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతోంది. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని హులికుంట సమీపంలోని ఒక గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలు అయిన విద్యార్థిని (17)కాగా, నిందితుడైన యువకుడు భూతేష్ (18) పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టనాయకనహళ్ళి పోలీసులు కుర్రవానిపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రేమిస్తున్నానని ఇంటికి వచ్చి వివరాలు.. బాలిక, భూతేష్ టెన్త్ క్లాస్‌లో కలిసే చదివారు. అప్పటి నుంచి స్నేహంగా ఉన్న అతను బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా గర్భవతి అని, కాన్పు నొప్పులు వస్తున్నాయని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం బాలిక ఆడశిశువుకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, వారికి మెరుగైన వైద్యం ఆందించడానికి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భూతేష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: ఇవే ఆధారాలు.. నైలాన్ తాడు, బంగారు గాజులు -
బాలికను నిర్బంధించి వారం రోజులు దాష్టీకం
బనశంకరి: ఉద్యాననగరి బెంగళూరులో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకమవుతూనే ఉంది. తోడేళ్ల మాదిరిగా మృగాళ్లు కాటేస్తున్నారు. మాయమాటలతో మభ్యపెట్టి అఘాయిత్యాలకు తెగబడడం అతివలను ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని కాడుగోడిలో 17 ఏళ్ల పీయూసీ విద్యార్థినిని రాఘవేంద్ర అనే టీ అంగడి వ్యాపారి లాడ్జిలో నిర్బంధించి వారంరోజులుగా మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. గత నెల 28వ తేదీన బాధిత బాలిక స్నేహితురాలితో పార్టీ ఉందని స్నేహితుడు రాఘవేంద్రకు తెలిసింది. పార్టీ కోసం రాత్రి 8 గంటలకు కాడుగోడికి చేరుకున్న బాలికను రాఘవేంద్ర, అతని స్నేహితుడు సాగర్ ఇద్దరూ కలిసి పార్టీ నిర్వహించే స్థలానికి తీసుకెళతామని నమ్మించారు. లాడ్జిలో దారుణం అనంతరం బాలికను సమీపంలోని క్లాసిక్ లాడ్జికి తీసుకెళ్లి అక్కడ రూమ్ నెంబరు 6లో ఉం డాలని, మీ స్నేహితురాలు ఇక్కడికే వస్తుందని తెలిపారు. కొంతసేపటికి బాలిక ఉన్న గదికి రాఘవేంద్ర, సాగర్ చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం గమనిస్తున్న లాడ్జి నిర్వాహకుడు మనోరాజన్ పండిత్ అనుమానం వచ్చి రాఘవేంద్ర, సాగర్‌ను విచారించాడు. ఈ సంగతిని పోలీసులకు చెప్పవద్దంటూ ఇద్దరూ అతనిడి బ్రతిమాలగా, తరువాత ముగ్గురూ కలిసి బాలికపై మళ్లీ లైంగిక దాడికి ఒడిగట్టారు. రాఘవేంద్ర మిత్రుడు మంజు కూడా అఘాయిత్యం చేశాడు. చివరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 6వ తేదీన బాలికను రక్షించి విచారించారు. మంగళవారం రాత్రి దుండగులను అరెస్టు చేశారు. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ, నాన్న క్షమించండి..
► మీ కలలు నెరవేర్చలేక పోతున్నా..! ► ఇల్లు వదిలి వెళ్లిపోయిన పీయూసీ విద్యార్థిని ► లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం బనశంకరి : ద్వితీయ పీయూసీ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఓ విద్యార్థిని తీవ్రమనస్తాపంతో లేఖ రాసి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఘటన విద్యారణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... విద్యారణ్యపురలోని పీయూ కళాశాల సైన్స్ విభాగంలో చదువుతున్న వాసవి రెండు రోజుల క్రితం విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గణితం మినహా అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులు సాధించింది. గణితంలో కేవలం 30 మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆమె తల్లిదండ్రులకు లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి విధుల నుంచి ఇంటికి చేరుకున్న వాసవి తల్లిదండ్రులు ఇంట్లో టేబుల్‌పై లేఖ చూసి ఆందోళనతో వాసవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇళ్లు వదిలివెళ్లిన వాసవి తన లేఖలో తల్లిదండ్రులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ... మీ కలలను నెరవేర్చడానికి నాకు సాధ్యం కాలేదు దయచేసి క్షమిం చండి, నా కోసం బాధపడొద్దు, మీకు న్యాయం చేయలేకపోతున్నాను, ఆత్మహత్యే నాకు శరణ్యం, లవ్యూ డ్యాడ్, అండ్ మమ్. అంటూ లేఖలో పేర్కొంది.