సాక్షి, తుమకూరు: ద్వితీయ పీయూసీ చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో కుర్రవాడు నమ్మించి దగ్గరయ్యాడు. దీంతో బాలిక గర్భం దాల్చి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పసిప్రాయం బాలిక ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతోంది. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని హులికుంట సమీపంలోని ఒక గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలు అయిన విద్యార్థిని (17)కాగా, నిందితుడైన యువకుడు భూతేష్ (18) పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టనాయకనహళ్ళి పోలీసులు కుర్రవానిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రేమిస్తున్నానని ఇంటికి వచ్చి
వివరాలు.. బాలిక, భూతేష్ టెన్త్ క్లాస్‌లో కలిసే చదివారు. అప్పటి నుంచి స్నేహంగా ఉన్న అతను బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా గర్భవతి అని, కాన్పు నొప్పులు వస్తున్నాయని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం బాలిక ఆడశిశువుకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, వారికి మెరుగైన వైద్యం ఆందించడానికి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భూతేష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: ఇవే ఆధారాలు.. నైలాన్ తాడు, బంగారు గాజులు
ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక
Published Wed, Mar 18 2020 7:01 AM | Last Updated on Wed, Mar 18 2020 7:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment