
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి,బళ్లారి: దావణగెరెలో గతనెల 23న ఇంటిపైనుంచి పడి మృతి చెందిన పీయూసీ విద్యార్థి మిథున్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. అతను ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందలేదని, బ్లూవేల్ తరహాలో యానిమేషన్ గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ రిష్యంత్ బుధవారం మీడియాకు తెలిపారు.
తన చావుకు తానే కారణమంటూ గణితం పుస్తకంలో స్వయంగా రాసి అనంతరం చేతికి గాయం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి అనంతరం ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థి చేతిరాతను తల్లిదండ్రులు నిర్ధారించారన్నారు. అయితే ఆ విద్యార్థి రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అధికారికంగా నిర్ధారణ చేస్తామన్నారు.
చదవండి: ('ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది')
Comments
Please login to add a commentAdd a comment