మైనర్‌ బాలికపై కీచకపర్వం | Bihar girl says she was raped by principal, 2 teachers, 15 school students | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై కీచకపర్వం

Published Sun, Jul 8 2018 1:13 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

Bihar girl says she was raped by principal, 2 teachers, 15 school students - Sakshi

ఛప్రా: బిహార్‌లోని సరన్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై స్కూల్‌లోని 16 మంది విద్యార్థులతో పాటు పిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాల్ని బెదిరించిన నీచులు 7 నెలల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు తండ్రి సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పర్సాగఢ్‌ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాధితురాలి(13)పై ముగ్గురు తోటి విద్యార్థులు గతేడాది డిసెంబర్‌లో వాష్‌రూమ్‌లో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

ఈ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో ఉంచుతామని హెచ్చరించారు. ఇలా బెదిరించి బాధితురాలిని పలుమార్లు  రేప్‌చేసి ఈ వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో 16 మంది విద్యార్థులు బాలికను రేప్‌చేశారు. చివరికి బాధితురాలు ఈ దారుణంపై పాఠశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా..  ‘నీ కుటుంబం పరువే పోతుంది’ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపాడు.

అతనూ బెదిరించి, మరో ఇద్దరు టీచర్లతో కలసి బాధితురాలిని లోబర్చుకుని ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 7 నెలలుగా తండ్రి జైలులో ఉండటంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయిన బాధితురాలు.. ఇటీవల తండ్రి విడుదల కావడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటుచేశారు. ప్రిన్సిపల్, టీచర్, నలుగురు విద్యార్థుల్ని అరెస్ట్‌ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి విద్యార్థుల్ని రిమాండ్‌ హోమ్‌కు, ప్రిన్సిపల్, టీచర్‌ను జైలుకు పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement