principle
-
ప్రేమ వ్యవహరం నడుపుతోందని.. మైనర్ బాలికకు ప్రిన్సిపాల్ వేధింపులు
గువాహటి: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడితో ప్రేమ వ్యవహరం నడుపుతోందని ఎనిమిదో తరగతి బాలికను ప్రిన్సిపాల్ వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన.. యువతి పాఠశాలలోని ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డిసెంబరు 24న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక పాఠశాలలోని 13 ఏళ్ల బాలిక, మరో యువకుడిని ప్రేమిస్తోందని కొంత కాలంగా ప్రిన్సిపాల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా బాలిక పట్ల.. యువకుడి తల్లిదండ్రుల ముందే అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన బాధిత బాలిక పాఠశాల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాలికను అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. బాలిక చికిత్స తీసుకుంటూ.. డిసెంబరు 26న ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు ప్రిన్స్‌పాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపాల్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: ఢిల్లీలో పంజాబ్ హీట్.. అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ -
కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్డౌన్ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. వివరాలు.. నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్లైన్ క్లాస్‌ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్‌ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష -
మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. ‘మోడల్’ సారయ్యారు..!
హుజూరాబాద్: పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినా స్నేహితుల ప్రభావమో.. లేక అక్కడి పరిస్థితుల వల్లనో ఇంటర్మీడియెట్‌లో ఫెయిలయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సబ్జెక్టులు తప్పడంతో నిరాశ చెందాడు. ఇక చదువు అబ్బదు.. ఊరిలో వ్యవసాయం చేసుకుందామని ఇంటికి పయనమయ్యే సమయంలో తల్లిదండ్రులు వెన్నుతట్టారు. జీవితంలో ఒడిదొడుకులు సహజం.. నిర్భయంగా మరోసారి పరీక్షలు రాయి తప్పక విజయం సాధిస్తావు అని ప్రోత్సహించడంతో క్రమశిక్షణ, పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని మదిలో నింపుకొని 86శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరగలేదు. 2013లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంపికై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకునే స్థాయికి ఎదిగాడు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం వీణవంక మండలం ఘన్ముక్కుల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ రాషర్ట స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ ఫైయిలైనా.. సడలని పట్టుదలతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వేణుగోపాల్‌రెడ్డి ‘సక్సెస్’ స్టోరీ ఆయన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం.. మా తల్లిదండ్రులు అనుమాండ్ల తిరుపతిరెడ్డి, విజయలక్ష్మి. నేనొక్కడినే కొడుకు. చెల్లెలు ఉంది. నాన్న గుడివాడలో రైల్వే డిపార్ట్మెంట్లో(1983) ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగ రీత్యా కుటుంబం అక్కడే ఉండాల్సి వచ్చింది. కోస్తా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివాను. ‘పది’లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో మా నాన్న విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్లో చేర్చాడు. కళాశాలలో ఉన్న పరిస్థితుల ప్రభావామో లేక స్నేహితుల వల్లనో చదువు మీద కాకుండా ఇతరత్రా విషయాల వైపు దృష్టి మళ్లింది. చదువులు అటకెక్కాయి. ఇంటర్లో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చదువుకు పుల్‌స్టాప్ పెట్టి వ్యవసాయం చేసుకొందామనుకున్నా.. కానీ మా నాన్న దిగాలుగా ఉన్న నన్ను చూసి జీవితంలో ఒడిదొడుకులు సహజం.. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. మరోసారి ట్రై చెయ్యి అని వెన్నుతట్టాడు. అప్పుడు కొండంత బలం వచ్చింది. ఇంటర్ మళ్లీ పరీక్షలు రాయగా 83శాతం మార్కులు వచ్చాయి. ఇక చదువుతాననే ధైర్యం వచ్చింది. అక్కడే లయోల కళాశాలలో బీఎస్సీలో చేరాను. 91శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసి 2013 కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాను. 15ఏళ్లుగా విద్యాబోధన ఇంటర్ ఫెయిలయ్యానని ఇంట్లో కూర్చుండి ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగేవాణ్ని కాదు. 1999 నుంచి 2013 వరకు హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేశాను. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దగలిగాను. వందల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పీహెచ్డీ పూర్తి కాగా నే 2013లో మోడల్ స్కూల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్‌గా వీణవంక మండలంలో ఎంపికయ్యాను. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.. 2017లో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుతోపాటు రూ.10,116 నగదు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. అవార్డు తీసుకునేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. ఇంటర్లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటే ఇలా ఉత్తమ అవార్డును అందుకునే వాడిని కాదు అని ఒక్కసారి నాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. నా శ్రీమతి ఇంటర్ వరకే చదివింది. నా ప్రోద్బలంతో ఎంబీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ చదివించాను. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని కోర్టులో టైపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది. మార్కులు శాశ్వతం కాదు.. ప్రతీ విద్యార్థి లక్ష్యం నిర్ధేశించుకుని లక్ష్య సా«ధనకు ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. విఫలమైతే కుంగిపోవద్దు. మార్కులు శాశ్వతం కాదు.. జీవితం చాలా విలువైనది. ప్రతీ పాఠశాలలో కౌన్సెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించాలి. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలి. మా పాఠశాలలో ఏడో తరగతి నుంచే నెలకోసారి కౌన్సెలింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ఉండాలి. ఫెయిలయ్యానని మా తల్లిదండ్రులు ప్రోత్సహించకుంటే ఇప్పడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదిగేవాడిని కాదు. -
ఇవీ సెక్షన్లు.. తప్పదు యాక్షన్!
సాక్షి, కల్వకుర్తి టౌన్ : అసెంబ్లీ ఎన్నికల సందడి జోరందుకుంది. అభ్యర్ధులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరించినా, ఎన్నికల నియమావళి, నిబంధనలను అతిక్రమించినా శిక్ష తప్పదని చట్టాలు చెబుతున్నాయి. ఆయా సెక్షన్ల ప్రకారం దండనలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇంతకీ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, అసలు ఆ సెక్షన్లు ఏమిటనే విషయాలు మీ కోసం.. ఎన్నికలు.. చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్ధలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీ అభ్యర్ధులు నాయకులు,కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పక్రియలో నామినేషన్ల పక్రియ, పరిశీలన, ఉపసంహారణ అంతా పూర్తయింది. ప్రస్తుతం అంతర్జాలంలో ఎన్నికల చట్టాలు, నిబంధనలను గురించి వెతకటం ప్రారంభించారు. సెక్షన్ 125 జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించటం, ఒత్తిడికి లోను చేస్తే ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125 సెక్షన్ ప్రకారం ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష లేదా జరిమానా, లేదంటే రెండింటినీ విధించవచ్చు. సెక్షన్ 126 ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. సెక్షన్ 128 బహిరంగంగా ఓటు వేస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా. సెక్షన్ 129 ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలీసులు పోటీ చేసే అభ్యర్ధికి సహకరించినా, ప్రభావం కలిగించిన శిక్షార్హులు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 131 పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. రెండు కూడా విధించవచ్చు. సెక్షన్ 133 ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలీంగ్ కేంద్రానికి చేరవేసేందుకు వాహనాలను సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులే. దీనికి గాను మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 132 ఓటరు ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అధికార దుర్వినియోగానికి పాల్పడితే అందుకుగాను శిక్షార్హులే. దీనికి గాను రూ.500 జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంటుగా కానీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే వారు శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. సెక్షన్ 127 ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడినా, పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. దీనికి ఆరునెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 130 పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లోపల ప్రచారం నిర్వహించకూడదు. దీనికి జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 135 పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపరు, ఈవీఎం యంత్రం అపహారిస్తే వారు శిక్షార్హులు. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష,, రూ,500 జరిమానా విధించబడును. సెక్షన్ 134 ఆ పోలీస్స్టేషన్ల పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం శిక్షార్హం. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష రూ.,500 జరిమానా విధిస్తారు. సెక్షన్ 49పీ ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి ఓటు వేస్తే పోలింగ్ అధికారి సదరు ఓటరు 49పీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సెక్షన్ 135 ఈ పోలింగ్ కౌటింగ్ రోజున మద్యం విక్రయించటం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపటం నేరం. దీనికి గాను 6 నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ సాక్షి, కల్వకుర్తి టౌన్ / అచ్చంపేట : సాంకేతిక పెరుగుతున్నా కొద్దీ వయసు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరు సెల్ఫీలపై మోజు పడుతున్నారు. అదే అలవాటులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదని, సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. నిబంధనలను విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును సెక్షన్ 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అయితే, రూల్ నెంబర్ 49 ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకులను వెంట తీసుకువెళ్లొచ్చు. కానీ సహాయకుడు అంధులైన ఓటరు ఓటును బహిరంగ పర్చనని నిబంధన 10లో ధృవీకరించాల్సి ఉంటుంది. -
మైనర్ బాలికపై కీచకపర్వం
ఛప్రా: బిహార్‌లోని సరన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై స్కూల్లోని 16 మంది విద్యార్థులతో పాటు పిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాల్ని బెదిరించిన నీచులు 7 నెలల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు తండ్రి సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్సాగఢ్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాధితురాలి(13)పై ముగ్గురు తోటి విద్యార్థులు గతేడాది డిసెంబర్లో వాష్‌రూమ్‌లో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్లో ఉంచుతామని హెచ్చరించారు. ఇలా బెదిరించి బాధితురాలిని పలుమార్లు రేప్‌చేసి ఈ వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో 16 మంది విద్యార్థులు బాలికను రేప్‌చేశారు. చివరికి బాధితురాలు ఈ దారుణంపై పాఠశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా.. ‘నీ కుటుంబం పరువే పోతుంది’ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపాడు. అతనూ బెదిరించి, మరో ఇద్దరు టీచర్లతో కలసి బాధితురాలిని లోబర్చుకుని ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 7 నెలలుగా తండ్రి జైలులో ఉండటంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయిన బాధితురాలు.. ఇటీవల తండ్రి విడుదల కావడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేశారు. ప్రిన్సిపల్, టీచర్, నలుగురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి విద్యార్థుల్ని రిమాండ్ హోమ్‌కు, ప్రిన్సిపల్, టీచర్‌ను జైలుకు పంపారు. -
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థి
ముదిగుబ్బ: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సీనియర్ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించలేకపోయాడు. ఎనుములవారిపల్లికి చెందిన హేమంత్ కుమార్ ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కాపీలు కొడుతూ మాల్‌ప్రాక్టీస్ కింద బుక్ అయ్యాడు. అనంతరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఆ విద్యార్థికి ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అనుమతి పత్రాన్ని కళాశాలకు ఏప్రిల్ 16న పంపారు. ప్రిన్సిపల్ వాటిని గమనించకుండా విద్యార్థికి అనుమతి పత్రాన్ని మే 12న అందజేసి అనంతపురం ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించాడు. తీరా ఫీజు కట్టడానికి వెళ్లితే గడువు అయిపోయిందని వెనక్కు పంపారు. ఈ నెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రిన్సిపల్ కారణంగా ఏడాది విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థి వాపోతున్నాడు. -
టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్‌టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్వార్నర్ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్‌టీకి హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్‌పై పట్టు వస్తుంది. ఏటీఅండ్‌టీ వైర్లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్‌వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్‌టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి. -
డీన్, ప్రిన్సిపల్ వేధిస్తున్నారు...
కళాశాల వద్ద మహిళ ప్రిన్సిపల్, లెక్చరర్ల ఆందోళన హిమాయత్‌నగర్: నారాయణగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో తమను వేధిస్తున్నారని మహిళా ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు జూనియర్ లెక్చరర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎల్ఎస్, టీఎస్ఎల్, టీసీఈపీఎస్ నాయకులు మద్దతుగా నిలిచి డీన్, ప్రిన్సిపల్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం... నారాయణగూడలోని చైతన్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లుగా ప్రవీణ్, మధు, శ్రీనివాస్, రాజేష్ పని చేస్తున్నారు. వీరిని కొంతకాలంగా డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు పలు రకాలుగా వేధిస్తున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిర్మయిని డీన్ కుమార్, తోటి ప్రిన్సిపల్ స్వామిరావు, ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమెను ఏదో ఒక కారణంతో తరచూ వేరే క్యాంపస్‌లకు బదిలీ చేస్తున్నారు. వారం క్రితం కెమిస్ట్రీ లెక్చరర్ ప్రవీణ్‌కు కుమారుడు పుట్టడంతో యాజమాన్యం అనుమతితో మూడు రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. నాలుగో రోజు కళాశాలకు వచ్చిన ప్రవీణ్‌ను ప్రిన్సిపల్ స్వామిరావు.. ‘ఎందుకు వచ్చావ్..కాలేజీ నుంచి పొమ్మని’ దుర్భాషలాడాడు. దీంతో బాధితుడు టీఆర్ఎల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, టీసీపీఎఫ్ చైర్మన్ సునీల్‌కుమార్, టీఎల్ఎస్ అధ్యక్షుడు మహేందర్లను ఆశ్రయించాడు. దీంతో బాధిత లెక్చరర్లకు మద్దతుగా వీరంతా శుక్రవారం కళాశాలలో ఆందోళన చేపట్టారు. సుమారు గంటన్నరపాటు కళాశాల యాజమాన్యానికి వీరికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లు తమపై చేసిన ఆరోపణలను డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు ఖండించారు. తాము ఎవరినీ ఏ విధంగా వేధించడంలేదన్నారు. పర్మిషన్ తీసుకుండా సెలవులు తీసుకోవడంపై ప్రశ్నించినందుకు తమపై తప్పుడు ఆరోపణలు, చేసి దాడికి యత్నించారన్నారు. -
'మహాత్ముడి సిద్ధాంతం ఆదర్శం కావాలి'
హైదరాబాద్: మతాల మధ్య విద్వేషాలు ఉండరాదన్న మహాత్మాగాంధీ సిద్ధాంతం పాలకులకు ఆదర్శం కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయస్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పారు. గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
కెవ్వు కేక
-
ఆ ప్రిన్సిపాల్ ఉంటే న్యాయం జరగదు.. తొలగించాలి
గుంటూరు: తమ కూతురు ఆత్మహత్యపై నియమించిన నిజనిర్దారణ కమిటీపై తమకు ఏమాత్రం నమ్మకంలేదని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య విచారణకు యూనివర్సిటీ వేసిన నిజనిర్దారణ కమిటీపై తొలిసారి సాక్షితో మాట్లాడిన పేరెంట్స్ మురళీకృష్ణ, దుర్గాభాయి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటే ఇంకేం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సమాజ సేవకులు, విద్యార్థులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లను కమిటీలో వేయాలని వారు డిమాండ్ చేశారు. ముందు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఆయన ఉద్యోగంలో ఉంటే తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఏడాది నుంచి తాము కాలేజీకి వస్తున్నా ఇంతవరకు హాస్టల్ వార్డెన్ ఎవరో కూడా తమకు తెలియదని, ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదని చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమె కనిపించలేదని అన్నారు. అంతా అయిపోయాక హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెడతామంటే ఏం లాభమని ప్రశ్నించారు.