ముదిగుబ్బ: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సీనియర్ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించలేకపోయాడు. ఎనుములవారిపల్లికి చెందిన హేమంత్ కుమార్ ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కాపీలు కొడుతూ మాల్‌ప్రాక్టీస్ కింద బుక్ అయ్యాడు.
అనంతరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఆ విద్యార్థికి ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అనుమతి పత్రాన్ని కళాశాలకు ఏప్రిల్ 16న పంపారు. ప్రిన్సిపల్ వాటిని గమనించకుండా విద్యార్థికి అనుమతి పత్రాన్ని మే 12న అందజేసి అనంతపురం ఆర్‌ఐఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించాడు. తీరా ఫీజు కట్టడానికి వెళ్లితే గడువు అయిపోయిందని వెనక్కు పంపారు. ఈ నెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రిన్సిపల్ కారణంగా ఏడాది విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థి వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment