supplimentary exams
-
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యాయి. జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588. టెన్త్ సప్లిమెంటరీ 2023 ఫలితాల్లో.. ఉత్తీర్ణతా శాతం - 63.10% హాజరైన బాలురు- 110210...ఉత్తీర్ణత సాధించిన బాలురు-- 65372 హాజరైన బాలికలు- 77713....ఉత్తీర్ణత సాధించిన బాలికలు- 53216 బాలురు కంటే 9.16% అధికంగా బాలికల ఉత్తీర్ణత అత్యధికంగా ప్రకాశంలో 91.21% ఉత్తీర్ణత అత్యల్పంగా కృష్ణాలో 40.56% ఉత్తీర్ణత ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి -
సప్లిమెంటరీ విద్యార్థులకు పాస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులం దరికీ కనీస పాస్ మార్కులను ఇవ్వాలని ఇంట ర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జె క్టుల్లో ఫెయిలైన వారు, అపుడు పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్ మార్కులను ఇచ్చి పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. మేలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కరోనా నేప థ్యంలో ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలి సిందే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్మెంటల్లో పాసై నట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. బ్యాక్లాగ్ విద్యార్థులకు కూడా.. ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థుల ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్‌లో (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌చేసేలా చర్యలు చేపట్టింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్ చేయనుంది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారు 1,47,519 మంది విద్యార్థులు ఉండగా, ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్ కలిగిన విద్యార్థులు మరో 20 వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్ మార్కులివ్వనుంది. గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఎంపీసీ 42,427 బైపీసీ 25,292 ఎంఈసీ 7,416 సీఈసీ 56,341 హెచ్ఈసీ 5,581 ఇతరులు 148 మొత్తం 1,47,519 -
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థి
ముదిగుబ్బ: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సీనియర్ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించలేకపోయాడు. ఎనుములవారిపల్లికి చెందిన హేమంత్ కుమార్ ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కాపీలు కొడుతూ మాల్‌ప్రాక్టీస్ కింద బుక్ అయ్యాడు. అనంతరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఆ విద్యార్థికి ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. అనుమతి పత్రాన్ని కళాశాలకు ఏప్రిల్ 16న పంపారు. ప్రిన్సిపల్ వాటిని గమనించకుండా విద్యార్థికి అనుమతి పత్రాన్ని మే 12న అందజేసి అనంతపురం ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించాడు. తీరా ఫీజు కట్టడానికి వెళ్లితే గడువు అయిపోయిందని వెనక్కు పంపారు. ఈ నెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రిన్సిపల్ కారణంగా ఏడాది విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థి వాపోతున్నాడు. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శని వారం ముగిశాయి. చివరిరోజు కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలు నిర్వహి ంచారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,618 మంది విద్యార్థులకుగాను 16,808 మంది హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 16,846 మందికి గాను 16,186 మంది హాజరయ్యారు. 660 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 772 మందికి గాను 622 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి 3,113 మంది విద్యార్థులకుగాను 2,930 మంది హాజరయ్యారు. 183 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 2687 మందికి గాను 2554 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 426 మందికి గాను 376 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరయ్యారు.