ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | inter supplimentary exams completed | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Published Sun, May 21 2017 1:10 AM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

inter supplimentary exams completed

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌›డ్‌ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శని వారం ముగిశాయి. చివరిరోజు కెమిస్ట్రి, కామర్స్‌ పరీక్షలు నిర్వహి ంచారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,618 మంది విద్యార్థులకుగాను 16,808 మంది హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 16,846 మందికి గాను 16,186 మంది హాజరయ్యారు. 660 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులకు సంబంధించి 772 మందికి గాను 622 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి 3,113 మంది విద్యార్థులకుగాను 2,930 మంది హాజరయ్యారు. 183 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 2687 మందికి గాను 2554 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 426 మందికి గాను 376 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement