సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులం దరికీ కనీస పాస్ మార్కులను ఇవ్వాలని ఇంట ర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జె క్టుల్లో ఫెయిలైన వారు, అపుడు పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్ మార్కులను ఇచ్చి పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా..
మేలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కరోనా నేప థ్యంలో ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలి సిందే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్‌మెంటల్‌లో పాసై నట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది.
బ్యాక్‌లాగ్ విద్యార్థులకు కూడా..
ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థుల ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్‌లో (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌చేసేలా చర్యలు చేపట్టింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్ చేయనుంది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారు 1,47,519 మంది విద్యార్థులు ఉండగా, ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్ కలిగిన విద్యార్థులు మరో 20 వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్ మార్కులివ్వనుంది.
గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు
ఎంపీసీ 42,427
బైపీసీ 25,292
ఎంఈసీ 7,416
సీఈసీ 56,341
హెచ్‌ఈసీ 5,581
ఇతరులు 148
మొత్తం 1,47,519
Comments
Please login to add a commentAdd a comment