pass marks
-
విద్యార్థి 35 శాతం మార్కులకే సంబరాల్లో కుటుంబం..వీడియో వైరల్
మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023 ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
వైరల్ వీడియో : 35 మార్కులతో జస్ట్ పాస్.. ఈ పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్ మరి!
-
ఏపీ: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులు (మినిమం పాస్ మార్కులు)తో సెకండియర్ (2021–22)లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ సెకండియర్ (2020–2021) పూర్తి చేసిన విద్యార్థులకు.. ►ఐపీఈ మార్చి 2021కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు.. వారి మార్కులు (ఫస్టియర్, సెకండియర్) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ►ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ►ఐపీఈ–మార్చి 2021/అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ► ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు. ►హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావాలి. ►విద్యార్థులంతా నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్), పర్యావరణ విద్య (ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో) క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి. ►ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పిన, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు.. ►2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో చేరి ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్లోకి ప్రమోషన్ ►కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ►ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు. ►ఐపీఈ–2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి. -
సప్లిమెంటరీ విద్యార్థులకు పాస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులం దరికీ కనీస పాస్ మార్కులను ఇవ్వాలని ఇంట ర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జె క్టుల్లో ఫెయిలైన వారు, అపుడు పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్ మార్కులను ఇచ్చి పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. మేలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కరోనా నేప థ్యంలో ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలి సిందే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్మెంటల్లో పాసై నట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. బ్యాక్లాగ్ విద్యార్థులకు కూడా.. ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థుల ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్‌లో (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌చేసేలా చర్యలు చేపట్టింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్ చేయనుంది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారు 1,47,519 మంది విద్యార్థులు ఉండగా, ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్ కలిగిన విద్యార్థులు మరో 20 వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్ మార్కులివ్వనుంది. గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఎంపీసీ 42,427 బైపీసీ 25,292 ఎంఈసీ 7,416 సీఈసీ 56,341 హెచ్ఈసీ 5,581 ఇతరులు 148 మొత్తం 1,47,519 -
కెమిస్ట్రీలో 24 మార్కులే.. ఐఏఎస్ ట్వీట్ వైరల్
గాంధీనగర్: ‘మార్కులే జీవితం కాదు.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులు నిర్ణయించలేవు’ వంటి మాటలు చాలాసార్లు వినే ఉంటాం. కానీ వాస్తవంగా పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సమాజంలో దాదాపు 99శాతం ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, జీవితాన్ని అంచాన వేస్తారు. బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సాధారణంగా ఐఏఎస్ అయ్యాడంటే చాలా తెలివితేటలు.. చదువులో టాప్ అనే భావం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఐఏఎస్‌ను చూస్తే ఆ ఆలోచనలన్ని పటాపంచలవుతాయి. ఎందుకంటే ఈ అధికారి ఇంటర్ రసాయన శాస్త్రంలో కేవలం 24 మార్కులు తెచ్చుకుని జస్ట్ పాసయ్యాడు అంతే. అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్ సంగ్వాన్ తన సీబీఎస్ఈ ఇంటర్ మార్క్స్ మెమోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి. పాస్ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది. అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు. అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.. విమర్శించడానికి కాదు’ అంటూ ట్వీట్ చేశారు నితిన్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. In my 12th exams, I got 24 marks in Chemistry - just 1 mark above passing marks. But that didn't decide what I wanted from my life Don't bog down kids with burden of marks Life is much more than board results Let results be an opportunity for introspection & not for criticism pic.twitter.com/wPNoh9A616 — Nitin Sangwan, IAS (@nitinsangwan) July 13, 2020 -
ఉత్తీర్ణత బాధ్యత ఉపాధ్యాయులదే
టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు తప్పితే చర్యలు ఆర్జేడీ ప్రసన్నకుమార్ కె.కోటపాడు, న్యూస్‌లైన్ : టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులు కావాలని, లేకుంటే ఉపాధ్యాయులనే కారకులుగా గుర్తించాల్సి వస్తుందని పాఠశాల విద్య ఆర్జేడీ(కాకినాడ) ఎం.ప్రసన్నకుమార్ అన్నారు. మండలంలోని ఎ.కోడూరు జెడ్పీ ఉన్నతపాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షల్లో టెన్త్ విద్యార్థులు ఏఏ విభాగాల్లో తక్కువ మార్కులు వచ్చిందీ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలస్థాయిలోనే విద్యార్థులు పాస్‌మార్కులు సాధించలేకపోతే పబ్లిక్ పరీక్షల్లో ఎలా పాసవుతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ దిశగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం టెన్త్ విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పరీక్షల బెంగను విద్యార్థులు విడనాడాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో చదివి పరీక్షలను ఎదుర్కొంటే విజయం సాధ్యమన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. బియ్యం స్టాక్ రూమ్‌ను పరిశీలించి నిర్వాహకుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 815 పాఠశాలల్లో వంట షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఒక్కోదానికి రూ.1.05 లక్షలు కేటాయించామని తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ నిధులతో జిల్లాలో 150 అదనపు తరగతులతో కూడిన భవనాల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. ఎ.కోడూరు హైస్కూల్లో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేస్తామని తెలిపారు. కె.కోటపాడు జెడ్పీ హైస్కూల్లో ఈనెల 25, 26 తేదీల్లో ఐటీఐ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఈ రెండ్రోజుల తరగతులను ప్రభుత్వ సెలవుదినాల్లో నిర్వహించాలని ఎంఈవో కె.వి.రమణకు సూచించారు.