మతాల మధ్య విద్వేషాలు ఉండరాదన్న మహాత్మాగాంధీ సిద్ధాంతం పాలకులకు ఆదర్శం కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మతాల మధ్య విద్వేషాలు ఉండరాదన్న మహాత్మాగాంధీ సిద్ధాంతం పాలకులకు ఆదర్శం కావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయస్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పారు. గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.