సాక్షి, కోదాడ: వచ్చే ఎన్నికల్లో తనకు 50 వేల ఓట్ల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు(శుక్రవారం) సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
దీనిలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కోదాడ నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ కంటే ఒక ఓటు తగ్గిన నేను రాజకీయం తప్పుకుంటా. మాకు పిల్లలు లేరు. కోదాడ నియోజకవర్గ ప్రజలే నా పిల్లలు. అధికారులను ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన టైం వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కోదాడ అభివృద్ధి జరిగింది.కోదాడలో ఇప్పుడు మొత్తం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, కొత్తగా మట్టి ట్యాక్స్ ను ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారు. కోదాడ,హుజుర్ నగర్ లో చెప్పలేని విధంగా పోలీసులు వ్యవస్థ వ్యవహరిస్తోంది. కొంత మంది పనికట్టుకొని నామీద పద్మావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. యాధృచ్ఛికంగా ఎయిర్ పోర్టులో కలిసిన విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీలకు పోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.దీన్ను నేను ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment