స్థానిక నాయకత్వ లోపాల వల్లే కాంగ్రెస్ ఓటమి: ఉత్తమ్
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణమైన రాష్ట్ర నాయకత్వాన్ని కార్యకర్తలు క్షమించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక రాష్ట్రమిచ్చినప్పటికీ తెలంగాణలో గెలవలేకపోయామని ఆయన ఆన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పటిష్టత సదస్సులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికిచ ఇటీవల కాలంలో మరిణించిన రైతులు, చేనేత కార్మికులకు కూడా టీపీసీసీ సదస్సు సంతాపం తెలిపింది.